cancelled fight
-
9/11 తర్వాత మళ్లీ ఇప్పుడే!
వాషింగ్టన్: ఒక చిన్న సాంకేతిక సమస్య తలెత్తడంతో.. కనివినీ ఎరుగని రీతిలో అగ్రరాజ్యంలో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం ఉదయం ఏకంగా 5,400 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరో 900 విమానాలు రద్దు అయినట్లు తెలుస్తోంది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్అవేర్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. కంప్యూటర్ సిస్టమ్‌లో తలెత్తిన సమస్య ఈ గందరగోళానికి కారణమైంది. ఎయిర్ మిషన్స్ సిస్టమ్(NOTAM)లో సమస్యను గుర్తించిన వెంటనే గ్రౌండ్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. నోటామ్.. విమానాలు తిరిగే మార్గాల్లో మార్పులు చేర్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ప్రమాదాల గురించి విమాన సిబ్బందిని అప్రమత్తం చేయడానికి పని చేస్తోంది. దీంతో.. విమానాలన్నీ ఎక్కడికక్కడే రన్‌వేపై ల్యాండ్ అయ్యాయి. హవాయ్ నుంచి వాషింగ్టన్, టెక్సాస్ నుంచి పెన్సిల్వేనియా రూట్లలో విపరీతమైన ప్రయాణికుల తాకిడి ఉంటుంది. విమానాల రాకపోకల నిలిపివేత, ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 9/11 అమెరికా దాడుల తర్వాత.. ఈ స్థాయిలో విమాన సర్వీసుల ఇబ్బందులు తలెత్తడం ఇదేనని పౌరవిమానయాన నిపుణులు పర్వేజ్ దామానియా తెలిపారు. ఈ పరిణామం నమ్మశక్యంగా లేదని, దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఇక విమాన సేవలకు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. గంటల తరబడి పడిగాపులు గాస్తున్నామని, అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే.. క్రమక్రమంగా సర్వీసులను పునరుద్ధరించినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్. మరోవైపు దేశీయ విమాన సర్వీసులను రెండు గంటలపాటు ఎక్కడికక్కడే నిలిపివేశారు. సమస్యను ఇంకా గుర్తించలేదని, మరోసారి ఇలాంటి సమస్య తలెత్తకుండా చూస్తామని ఎఫ్ఏఏ తాజాగా ప్రకటించింది. Update 6: We are continuing a thorough review to determine the root cause of the Notice to Air Missions (NOTAM) system outage. Our preliminary work has traced the outage to a damaged database file. At this time, there is no evidence of a cyber attack. (1/2) — The FAA ✈️ (@FAANews) January 11, 2023 -
ఇండిగోకు ఏమైంది? మరో 32 విమానాలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఏకంగా32 విమానాలను రద్దు చేసింది.పైలట్ల కొరత కారణంగా ఈ సమస్య ఏర్పడిందని విమాన్రాశయ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ, కోలకతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌నుంచి బయలు దేరాల్సిన విమానాలను రద్దు చేసింది. శనివారం15, ఆదివారం 7విమానాలను రద్దు చేయగా, సోమవారం 32 విమాన సర్వీసులను రద్దు చేసిందని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. అయితే దీనిపై ఇండిగో వాదన మరోలా ఉంది. ఉత్తర ఇండియాలో సంభవించిన తీవ్ర వడగళ్లవానతో ఫిబ్రవరి 7,11 తేదీల్లో అనేక విమాన సర్వీసులను దారిమళ్లించాల్సి వచ్చిందని దీంతో సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని ఇండిగో ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే షెడ్యూల్‌ను పునరుద్ధరించడం, సిబ్బందిని సర్దుబాటు చేసే క్రమంలో కొన్ని విమానాలను రద్దు చేయాల్సివచ్చిందని తెలిపింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. మరోవైపు హైదరాబాద్ నుంచి పుణే వెళ్లవలసిన ఇండిగో విమానం శనివారం అయిదు గంటలకుపైగా ఆలస్యంగా బయలుదేరింది. పైలెట్ విధులకు హాజరు కాకపోవడంతో తెల్లవారుఝామున 4గంటల బయలు దేరాల్సిన విమానం ఉదయం 9.30 నిమిషాలకు బయలుదేరింది. మరో విమానం కోసం గంటముందు విధులకు హాజరైన పైలెట్‌ను సర్దుబాటు చేశారు. దీంతో హైదారాబాద్ విమానాశ్రయంలో180 మందికి పైగా ప్రయాణికులు ఇండిగో విమానంలో పడిగాపులు కాచారు. అటు సంక్షోభంలో చిక్కుకున్న ఎయిర్‌లైన్స్ జెట్ ఎయిర్వేస్ కూడా ఆదివారం 10 విమానాలను రద్దు చేసింది. నిర్వాహణ వ్యవహారాల కారణంగా వీటిని నిలిపివేస్తున్నట్టు జెట్ ఎయిర్వేస్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఒక్క ముంబై విమానాశ్రయం నుంచే దాదాపు 10 సర్వీసులను రద్దు చేసినట్టు సమాచారం. దీంతో ప్రయాణికుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. -
దివీస్ రద్దు వరకూ ఉద్యమించాలి
పౌరహక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబాబు తొండంగి : కోన ప్రాంతంలో కాలుష్య కారక దివీస్ ల్యాబొరేటరీస్‌ను ప్రభుత్వం రద్దు చేసేవరకూ బాధిత గ్రామాల ప్రజలు ఉధృతంగా ఉద్యమించాలని పౌరహక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబు అన్నారు. బాధిత గ్రామాలైన పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం, నర్శిపేట గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. దివీస్ రద్దు, అక్రమకేసుల ఎత్తివేత, తదితర డిమాండ్లతో కూడిన కరపత్రాలు విడుదల చేశారు. దివీస్‌ను వ్యతిరేకిస్తూ బాధిత గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా ప్రభుత్వం బలప్రయోగానికి దిగడం విచారకరమన్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా భూసేకరణ చేస్తుండడంతో చిన్న, సన్న కారు, పాడిరైతులు, వ్యవసాయ కూలీలు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులకు నష్టపోతున్నారని విమర్శించారు. ఈ ప్రాంతంలో 144 సెక్ష¯ŒSను ఆరునెలలుగా అమలు చేయడం, అక్రమకేసులు పెట్టారని, కోర్టులను ఆశ్రయించిన బాధిత రైతు భూముల్లోనూ తోటలను నరికించడం చట్టవిరుద్దమన్నారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా బాధిత గ్రామాల ప్రజలు సమష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దివీస్‌ను రద్దు చేయడంతోపాటు ప్రజలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పౌరహక్కుల సంఘం జిల్లా వైస్‌ప్రెసిడెంట్ ఎ.బాబూరావు, కార్యదర్శి జె.మనోహర్ తదితరులు పాల్గొన్నారు.