Capital Design
-
నీటి కొలనులో అసెంబ్లీ
సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరం లో అసెంబ్లీ భవనానికి టవర్ డిజైన్‌ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. నీటి కొలను మధ్యలో 250 మీటర్ల వెడల్పు, 250 మీటర్ల పొడవుతో అసెంబ్లీ డిజైన్‌ను నార్మన్ ఫోస్టర్స్ సంస్థ రూపొందించింది. శనివారం రాత్రి వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఫోస్టర్స్ సంస్థ ప్రతినిధులు టవర్ డిజైన్‌తోపాటు వజ్రం డిజైన్‌పై ప్రజెంటేషన్ ఇచ్చారు. టవర్ ఆకృతికే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 125 ఎకరాల విస్తీర్ణంలో కొలను 250 మీటర్ల ఎత్తులో టవర్ ఆకారంలో నిర్మించే ఈ అసెంబ్లీ భవనం నాలుగు అంతస్తుల్లో ఉంటుంది. టవర్‌పైకి 40 మీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి 217 చదరపు కిలోమీటర్ల రాజధాని నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు. 70 మంది సందర్శకులు ఒకేసారి వ్యూపాయింట్‌కు వెళ్లి రాజధాని నగరాన్ని చూడొచ్చు. ఈ భవనాన్ని నీటి కొలనులో నిర్మిస్తారు. ఈ కొలను 125 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. టవర్ ప్రతిబింబం ఈ నీటిలో పడేలా డిజైన్ చేశారు. టవర్ కింది భాగంలో శాసనసభ, శాసనమండలి, సెంట్రల్ హాల్, పరిపాలనా కేంద్రాల భవనాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. అసెంబ్లీ భవనం మొత్తం 87 వేల చదరపు మీటర్ల ప్రాంతంలో ఉంటుండగా, నిర్మిత ప్రాంతం 7.8 లక్షల చదరపు అడుగుల్లో ఉంటుంది. ఈ భవనంపై పునరుత్పాదక విద్యుదుత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. సూర్యకాంతి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వ్యవస్థను కూడా నెలకొల్పుతారు. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ టవర్ డిజైన్‌ను గురించి మంత్రులకు వివరించి అభిప్రాయాలు అడిగారు. అయితే చిత్రాల్లో డిజైన్ అంత ఆకర్శణీయంగా లేదని, పెద్ద చిత్రాలను చూపించాలని మంత్రులు కోరారు. డిజైన్లపై సోషల్ మీడియాలో అప్పుడే వ్యతిరేక ప్రచారం కూడా జరుగుతోందని, దీనిపై దృష్టి పెట్టి అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. డిజైన్లపై మంత్రి నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పూర్తిస్థాయి స్ట్రక్చరల్ డిజైన్లు ఇచ్చేందుకు ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని ఫోస్టర్స్ ప్రతినిధులు చెప్పినట్లు తెలిపారు. ఈ డిజైన్లు రాగానే టెండర్లు పిలిచి నిర్మాణ పనులు చేపడతామన్నారు. -
టవర్ ఆకారంలో అసెంబ్లీ!
సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరంలో అసెంబ్లీ భవనాన్ని టవర్ ఆకారంలో నిర్మించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. కింది భాగంలో 250 మీటర్ల వెడల్పుతో ప్రారంభించి అక్కడి నుంచి సెల్‌ఫోన్ టవర్లా 70 మీటర్ల ఎత్తు అయిన అసెంబ్లీ భవనం డిజైన్‌ను నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించింది. ఈ డిజైన్ ప్రకారం భవంతి కింది భాగంలో శాసనసభ, పైన ప్రజలు సందర్శించేందుకు అనువుగా వ్యూయింగ్ పాయింట్ ఉంటుంది. సుమారు 70 అంతస్తుల టవర్ నిర్మించాలని ఫోస్టర్ సంస్థ ప్రతిపాదించింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ 13వ అథారిటీ సమావేశంలో పరిపాలనా నగరంలోని ముఖ్య భవనాల డిజైన్లపై చర్చ జరిగింది. టవర్ డిజైన్‌తోపాటు ఫోస్టర్ సంస్థ ఇచ్చిన వజ్రం తరహా డిజైన్‌ను కూడా సమావేశంలో పరిశీలించారు. మొదటి నుంచి అనుకుంటున్నట్లే టవర్ డిజైన్‌వైపే ముఖ్యమంత్రితో పాటు అందరూ మొగ్గు చూపారు. అయితే ఈ రెండింటిపైనా ప్రజల అభిప్రాయాలు సేకరించాలని, వెంటనే వాటిని సోషల్ మీడియాలో పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గురువారం సాయంత్రం వరకూ వచ్చిన అభిప్రాయాల ప్రకారం ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంపిక చేయడానికి నిర్ణయించారు. ఇందుకోసం గురువారం సాయంత్రం మరోసారి సీఆర్డీఏ సమావేశం నిర్వహించనున్నారు. ప్రజల అభిప్రాయం అని చెబుతున్నా.. ప్రభుత్వం టవర్ డిజైన్‌నే ఖరారు చేయనున్నట్లు తెలిసింది. హైకోర్టు కోసం గతంలో ప్రతిపాదించిన బౌద్ధ స్థూపాకారపు డిజైన్‌కే కొన్ని మార్పులు చేసిన ఫోస్టర్ సంస్థ ఈ సమావేశంలో ప్రదర్శించగా దాన్ని దాదాపు ఖరారు చేశారు. రాజమౌళి సూచనలకు తిరస్కారం: రాజధాని కోసం సినీ దర్శకుడు రాజమౌళి ప్రతిపాదించిన డిజైన్లకు ఆమోదం లభించలేదు. సమావేశంలో పాల్గొన్న ఆయన పలు సూచనలు చేశారు. రాజమౌళి అందించిన త్రీ డైమెన్షన్ చిత్రాలతో కూడిన చతురస్రాకారపు రెండో డిజైన్‌ను కూడా పరిశీలించారు. ఈ డిజైన్ కంటే టవర్ డిజైన్‌కే ఎక్కువ మంది ఓటేశారు. కాగా నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇచ్చిన రెండు డిజైన్లపై ప్రజాభిప్రాయం తీసుకుని దాని ప్రకారం గురువారం ఒకదాన్ని ఎంపిక చేస్తామని మీడియాతో మంత్రి నారాయణ తెలిపారు. నా డిజైన్లు ఆమోదం పొందలేదు రాజధాని కోసం తాను ప్రతిపాదించిన డిజైన్లు ఆమోదం పొందలేదని సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చెప్పారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థూపం డిజైన్‌కు తాను కొన్ని మార్పులు సూచించానని, నార్మన్ ఫోస్టర్ సంస్థ అడిగిన కొన్ని చిత్రాలు సేకరించి ఇచ్చానని తెలిపారు. తెలుగు సంస్కృతి, చరిత్ర, వారసత్వం ప్రతిబింబించేలా డిజైన్ల ఎంపికకు సహకరించాలని సీఎం కోరారని, అందుకనుగుణంగా తాను కొన్ని సూచనలు చేశానని తెలిపారు. స్థూపాకృతిలో ఉండే సెంట్రల్ హాలులో తెలుగుతల్లి విగ్రహం ఏర్పాటుచేసి దానిపై సూర్యకిరణాలు పడేలా తాను మార్పులు చెప్పానన్నారు. కానీ ఆ డిజైన్ ఆమోదం పొందలేదన్నారు. -
10న లండన్‌కు సీఆర్డీఏ బృందం
సాక్షి, అమరావతి: రాజధాని డిజైన్లపై చర్చించేందుకు లండన్‌లో ఏర్పాటుచేసిన వర్క్‌షాప్‌కు హాజరయ్యేందుకు సీఆర్డీఏ అధికారుల బృందం ఈ నెల 10న బయలుదేరి వెళ్లనుంది. దీనికి ప్రభుత్వ సీఎస్ దినేశ్‌కుమార్ శనివారం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, అదనపు కమిషనర్ షాన్మోహన్తోపాటు ప్రభుత్వ కార్యదర్శి నాగుపల్లి శ్రీకాంత్ ఈ వర్క్‌షాప్‌కు హాజరుకానున్నారు. మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్స్ సంస్థ 11, 12, 13 తేదీల్లో ఈ వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. శ్రీకాంత్ ఈ పర్యటనకు వెళుతుండటంతో ఆయన స్థానంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు సినీ దర్శకుడు రాజమౌళిని కూడా సీఆర్డీఏ అధికారులు లండన్ తీసుకెళుతున్నారు. అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లపై ఆయన ఫోస్టర్ సంస్థకు సలహాలివ్వనున్నారు. -
కడతారా లేదా ?
-
రాజధాని డిజైన్లకు సీఎం మళ్లీ సూచనలు
-
రాజధాని డిజైన్లకు సీఎం మళ్లీ సూచనలు
- రెండు వారాల్లో ఇస్తామన్న నార్మన్ ఫోస్టర్ సంస్థ - హైకోర్టు భవనాన్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్దాలని సూచన - పరిపాలనా నగరానికి ఉత్తరం వైపు ఎన్టీఆర్, దక్షిణం వైపు అంబేడ్కర్ విగ్రహాలు - రెండింటి మధ్యలో భారీ టవర్ ..న్యాయ నగరం పక్కనే మరో నగరం సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరం తుది డిజైన్లు ఇంకా ఖరారు కాలేదు. లండన్ ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్ సంస్థ మార్చి ఇచ్చిన డిజైన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరిన్ని మార్పులు సూచించారు. అందుకు రెండు వారాల సమయం కావాలని, అప్పుడు తుది డిజైన్లు ఇస్తామని ఫోస్టర్ సంస్థ ప్రతినిధులు కోరారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ రాజధాని డిజైన్లను ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసంలో సోమవారం ఆయనకు చూపించారు. మూడు రకాల డిజైన్లను వారు చూపించగా.. వాటికి ఇంకా హంగులు కావాలని సీఎం సూచించారు. తాజా డిజైన్‌లో చూపించిన హైకోర్టు భవనం అంతగా ఆకట్టుకోవడంలేదని దాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలని కోరారు. పరిపాలనా నగరానికి ఉత్తరం వైపు ఎన్టీఆర్ విగ్రహం, దక్షిణం వైపు అంబేద్కర్ విగ్రహం ఉండేలా డిజైన్లు మార్చాలని సూచించారు. ఈ రెండింటి మధ్యలో అమరావతి నగరమంతా కనపడేలా అత్యంత ఎత్తయిన టవర్ నిర్మించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సచివాలయం, హెచ్ఓడీల కార్యాలయాలు పక్కపక్కనే ఉండాలని చెప్పారు. వాటికి ఎదురుగా నివాస సముదాయాలు రావాలన్నారు. శాసనసభ, శాసనమండలికి మధ్యలో సెంట్రల్ హాలు ఉండాలని సూచించారు. నగరానికి రెండు వైపులా అతి పెద్ద పార్కులను ఏర్పాటు చేయాలని కోరారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులు బీఆర్టీఎస్, ఎంఆర్టీఎస్ బస్ బేల గురించి వివరించారు. ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు ఎలా ఉండాలనే దానిపై చర్చించారు. రాజ్‌భవన్ సమీపంలోనే ముఖ్యమంత్రి నివాసం ఉంటుందని ఫోస్టర్ సంస్థ తెలిపింది. ఈ మార్పులన్నీ చేయడానికి తగిన సమయం కావాలని ఫోస్టర్ ప్రతినిధులు కోరారు. తొలుత వెలగపూడి సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులకు ఫోస్టర్ సంస్థ ప్రతినిధులు ఈ డిజైన్లు చూపించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పోలవరం పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఉండవల్లిలో ఆయన కోసం ప్రత్యేకంగా డిజైన్లను ప్రదర్శించారు. ఈ సమావేశాల్లో మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తదితరులున్నారు. -
రాజధాని డిజైన్లపై సలహాలివ్వండి
-
డిజైన్లపై సలహాలివ్వండి
రాజధానిపై సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: రాజధాని కోసం తీసుకున్న 33 వేల ఎకరాలు కొనాలంటే మామూలుగా అయితే రూ.40 వేల కోట్లు ఖర్చయ్యేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఒకవేళ అంత ఖర్చు పెట్టినా భూములిచ్చేవారు కాదన్నారు. వెలగపూడి అసెంబ్లీలోని కమిటీ హాలులో శనివారం రాజధాని పరిపాలనా నగరం డిజైన్లపై మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ సంస్థ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. రాజధాని భూములకు మంచి విలువ వస్తుందన్నారు. ఎమ్మెల్యేలు మంచి ఐడియాలు ఇవ్వాలని.. అప్పుడే మంచి కంపెనీలు వస్తాయన్నారు. ప్రపంచ బ్యాంకు రుణంతో నిర్మించే ఏడు కీలక రోడ్లకు ముఖ్యమంత్రి ఉగాది రోజున శంకుస్థాపన చేస్తారని సీఆర్డీఏ కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని 6.9 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని సింగపూర్ కన్సార్టియంకు స్విస్ చాలెంజ్ విధానంలో ఇవ్వనున్నట్లు చెప్పారు. నదీముఖంగా పరిపాలనా నగరం: నార్మన్ ఫోస్టర్ సంస్థ డిజైన్ విశ్లేషకుడు హర్ష థాపర్ తమ వ్యూహ డిజైన్లపై ప్రజెంటేషన్ ఇస్తూ... పరిపాలనా నగరం దక్షిణం నుంచి ఉత్తరం వైపు నదీముఖంగా ఉంటుందని... పది శాతం జల వనరులు, 51 శాతం పచ్చదనంతో నిండి ఉంటుందని తెలిపారు. ఉత్తరం వైపున బయో పార్క్ ఉంటుందని, తిరుపతిలోని కోనేరు, లండన్‌లోని ట్రఫాల్గర్ స్క్వేర్ తరహాలో ఒక సిటీ స్క్వేర్ను ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. నగరంలో 50, 24, 16 మీటర్ల వెడల్పు రోడ్లతోపాటు నడక కోసం తొమ్మిది మీటర్ల వెడల్పు రోడ్లను డిజైన్ చేశామన్నారు. నగరానికి నాలుగు గేట్వేలు ఉంటాయని, అసెంబ్లీకి ఎదురుగా కల్చరల్ సెంటర్ ఉంటుందని చెప్పారు. మెట్రో రైలు వ్యవస్థతోపాటు డ్రైవర్లు లేని వాహనాలుంటాయన్నారు. అసెంబ్లీకి, ఎమ్మెల్యే క్వార్టర్లకు ఎంత దూరం ఉంటుందని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు. పరిపాలనా నగరం నాలుగు బ్లాకులుగా ఉంటుందని, కార్యాలయాలు, నివాసాల మధ్య ఒక కిలోమీటరు దూరం మాత్రమే ఉంటుందని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. మొత్తం తొమ్మిది నగరాల్లో 27 టౌన్‌షిప్‌లు ఉంటాయన్నారు. -
రాజధాని డిజైన్ మళ్లీ మొదటికి..!
డిజైన్‌ను పూర్తిగా మార్చాలని నిర్ణయించిన ప్రభుత్వం సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానిలో ప్రభుత్వ భవనాల సముదాయాలకు జపాన్ రూపొందిం చిన డిజైన్‌పై విమర్శలతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. జపాన్ కంపెనీతోనే మళ్లీ కొత్తగా డిజైన్ తయారు చేయించాలని నిర్ణయించింది. డిజైన్ వ్యవహారం మళ్లీ మొదటికే రావడంతో 2017 ఏప్రిల్ నాటికి పూర్తిస్థాయి డిజైన్లు రూపొందించి 2018 కల్లా నిర్మాణం పూర్తయ్యేలా చూడాలనే ప్రభుత్వ ప్రయత్నం ఫలించేలా కనిపించడం లేదు. ఈ డిజైన్ కోసం సీఆర్డీఏ మూడు నెలల పాటు కసరత్తు చేసింది. అంతర్జాతీయ ఆర్కిటెక్ట్‌ల మధ్య పోటీ పెట్టింది. 900 ఎకరాల్లో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, రాజ్‌భవన్, శాఖాధిపతుల కార్యాలయాలు, వీఐపీల నివాసాలు, ఉద్యోగుల క్వార్టర్లు, ఆయా ప్రదేశాల్లో గ్రీనరీ (పచ్చదనం) ఉండేలా అంతర్జాతీయ స్థాయిలో డిజైన్ చేయాలని సూచించింది. అసెంబ్లీ, హైకోర్టు భవనాలను ఐకానిక్ భవనాలుగా అత్యద్భుతంగా ఉండాలని సచివాలయం అదేస్థాయిలో ఉండాలని పేర్కొంది. ఉత్తమ డిజైన్ ఎంపికకు ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ క్రిస్టోఫర్ బెనిగర్ నేతృత్వంలో దేశ, విదేశీ ఆర్కిటెక్ట్‌లతో ఒక జ్యూరీని ఏర్పాటు చేసింది. పలు జాతీయ, అంతర్జాతీయ ఆర్కిటెక్ట్‌లు డిజైన్లు రూపొందించగా అంతిమంగా జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్, లండన్‌కు చెందిన రిచర్డ్ రోజర్స్, భారత్‌కు చెందిన వాస్తు శిల్ప కన్సల్టెంట్స్ డిజైన్లను తుదిపోటీకి ఎంపిక చేసింది. గత నెలలో ఈ మూడు డిజైన్లను పరిశీలించిన జ్యూరీ చివరకు జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్ డిజైన్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. -
'జపాన్‌తోనూ రాజధాని నిర్మాణంపై చర్చిస్తాం'
హైదరాబాద్: రైతుల డిమాండ్లపై పరిశీలన చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో నియమ నిబంధనలపై అధికారులతో తాము చర్చించామని ఆయన అన్నారు. ఈ విషయమై వారం రోజుల్లో ఖరారుచేస్తామని అధికారులు చెప్పినట్టు తెలిపారు. సీఆర్డీఏకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, సీఆర్డీఏపై ఆర్డినెన్స్ ఆలోచన చేస్తున్నామన్నారు. సింగపూర్‌లో రాజధానిపై ప్రత్యేక చర్చ చేశామన్నారు. రాజధాని డిజైన్‌ను ఇవ్వాలని సింగపూర్‌ను చంద్రబాబు కోరినట్టు మంత్రి నారాయణ చెప్పారు. రాజధానిపై సింగపూర్ చాలా పాజిటివ్‌గా ఉందన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా అక్కడ కూడా రాజధాని నిర్మాణం అంశాన్ని చర్చిస్తామన్నారు. జపాన్‌తో కలిసి పనిచేయడానికి సింగపూర్ కూడా ఆస్తకి చూపిందని ఆయన తెలిపారు. రాజధాని పరిధిలో మొత్తం మూడు రింగ్స్ వస్తాయని చెప్పారు. మొదటి రింగ్ 75కిలోమీటర్లు, రెండో రింగ్ 125 కిలోమీటర్లు, మూడో రింగ్ 225 కిలీమీటర్లు ఉంటుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.