10న లండన్‌కు సీఆర్‌డీఏ బృందం | CRDA team to London on 10th | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 8 2017 1:44 AM | Last Updated on Sun, Oct 8 2017 1:44 AM

సాక్షి, అమరావతి: రాజధాని డిజైన్లపై చర్చించేందుకు లండన్‌లో ఏర్పాటుచేసిన వర్క్‌షాప్‌కు హాజరయ్యేందుకు సీఆర్‌డీఏ అధికారుల బృందం ఈ నెల 10న బయలుదేరి వెళ్లనుంది. దీనికి ప్రభుత్వ సీఎస్‌ దినేశ్‌కుమార్‌ శనివారం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్, అదనపు కమిషనర్‌ షాన్‌మోహన్‌తోపాటు ప్రభుత్వ కార్యదర్శి నాగుపల్లి శ్రీకాంత్‌ ఈ వర్క్‌షాప్‌కు హాజరుకానున్నారు. మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థ 11, 12, 13 తేదీల్లో ఈ వర్క్‌షాప్‌ నిర్వహిస్తోంది.  

శ్రీకాంత్‌ ఈ పర్యటనకు వెళుతుండటంతో ఆయన స్థానంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు సినీ దర్శకుడు రాజమౌళిని కూడా సీఆర్‌డీఏ అధికారులు లండన్‌ తీసుకెళుతున్నారు. అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లపై ఆయన ఫోస్టర్‌ సంస్థకు సలహాలివ్వనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement