career end
-
వెక్కి వెక్కి ఏడ్చిన నెయ్మర్.. కథ ముగిసినట్లే!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో శుక్రవారం ఫుట్‌బాల్ అభిమానుల గుండెలు బరువెక్కాయి. టైటిల్ ఫెవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన బ్రెజిల్ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయం 1-1తో డ్రాగా ముగిసింది. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్లో క్రొయేషియా 4-3 తేడాతో బ్రెజిల్‌ను ఓడించింది. అంతే అంతవరకు నెయ్మర్.. నెయ్మర్ అంటూ మారుమోగిన స్టేడియం ఒక్కసారిగా నిశబ్దంగా మారిపోయింది. ఒకపక్క క్రొయేషియా సంబరాలు జరుపుకుంటుంటే.. బ్రెజిల్ ఆటగాళ్లు మాత్రం నిరాశలో మునిగిపోయారు. బ్రెజిల్ గుండెబలం అయిన నెయ్మర్ ఓటమి బాధతో ఒక్కక్షణం చిన్నపిల్లాడిలా మారిపోయాడు. మ్యాచ్ ఓటమితో మైదానంలోనే కూలబడిన నెయ్మర్ వెక్కి వెక్కి ఏడుస్తుంటే.. స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు కూడా కంటతడి పెట్టారు. తమ అభిమాన ఆటగాడు అలా ఏడుస్తుంటే ఎవరు మాత్రం తట్టుకుంటారు చెప్పండి. పీలే, రొనాల్డో, రొనాల్డినో తర్వాత బ్రెజిల్ ఫుట్‌బాల్‌లో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నెయ్మర్ ఈ మ్యాచ్‌లో గోల్ కొట్టడం ద్వారా దిగ్గజం పీలే రికార్డును సమం చేశాడు. ఇప్పటివరకు నెయ్మర్ బ్రెజిల్ తరపున 77 గోల్స్ చేశాడు. ఈ ఆనందం అతనికి ఎక్కువసేపు కూడా నిలవకుండా పోయింది. మరి నెయ్మర్ వెక్కి వెక్కి ఏడ్వడం వెనుక ఒక కారణం ఉంది. ప్రస్తుతం అతని వయస్సు 30 ఏళ్లు. మరో ఫిఫా వరల్డ్‌కప్ ఆడే అవకాశం ఉన్నప్పటికి అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. ఇప్పటికే తరచూ గాయాల బారిన పడుతూ ఆటకు దూరమవుతున్న నెయ్మర్ మరో నాలుగేళ్లు ఇదే ఫిట్నెస్తో ఉంటాడా అంటే చెప్పలేం. ఇక గాయం కారణంగా 2014 ఫిఫా వరల్డ్‌కప్‌కు నెయ్మర్ పూర్తిగా దూరమయ్యాడు. ఆ తర్వాత 2015లో కోపా అమెరికా కప్ ఆడకుండా నిషేధం, 2018లో సెమీస్‌లో ఇంటిబాట పట్టడం, 2019 కోపా అమెరికా కప్‌ను బ్రెజిల్ తృటిలో మిస్ చేసుకుంది. తాజాగా తొలి మ్యాచ్‌లో గాయపడిన నెయ్మర్.. రౌండ్ ఆఫ్ 16 ద్వారా రీఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. అతని ఆటతీరు చూసి బ్రెజిల్ మరోసారి ఛాంపియన్ అవుతుందని అంతా భావించారు. ఇక క్వార్టర్ ఫైనల్లోనూ నెయ్మర్ అదే దూకుడు కనబరిచాడు. కానీ దురదృష్టం అతన్ని వెంటాడింది. పెనాల్టీ షూటౌట్లో బ్రెజిల్‌కు ఓటమి తప్పలేదు. ఇప్పుడున్న గాయాలతో చాలా ఇబ్బంది పడుతున్న నెయ్మర్ వచ్చే వరల్డ్‌కప్ ఆడుతానో లేదో అన్న సందేహం అతనిలో ఉంది. అందుకే చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. ఇక నెయ్మర్ కథ దాదాపు ముగిసినట్లే. ఫుట్‌బాల్ చరిత్రలో ఐదుసార్లు ఛాంపియన్ అయిన బ్రెజిల్ 2002లో చివరిసారి ఫిఫా వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. అప్పటినుంచి ఒక్కసారి కూడా ఛాంపియన్ కాలేకపోయింది. 2014లో సెమీఫైనల్లో ఇంటిబాట పట్టిన బ్రెజిల్.. మిగతా మూడుసార్లు క్వార్టర్స్‌కే పరిమితమైంది. Million heart brokes neymar crying 💔💔 #FIFAWorldCup #Neymar pic.twitter.com/ENHlraFJJG — Henry 🇧🇩 (@shoaibA21211051) December 9, 2022 -
Moonlighting: మూన్‌లైటింగ్... తప్పా, ఒప్పా?
మూన్‌లైటింగ్. ఇటీవలి కాలంలో అందరి నోళ్లలోనూ బాగా నానుతున్న పేరు. విప్రో సంస్థ ఇటీవల ఏకంగా 300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడంతో మరోసారి ఈ పేరు బాగా తెరపైకి వచ్చింది. మూన్‌లైటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలుంటాయంటూ మరో బడా ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగులకు హెచ్చరిక మెయిల్స్ పంపింది. మూన్‌లైటింగ్ అనైతికమని, దీన్ని సుతరామూ ఆమోదించబోమని అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం కూడా స్పష్టం చేసింది. స్వల్ప లాభాల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడే ఉద్యోగులు కెరీర్‌నే రిస్కులో పెట్టుకుంటున్నారంటూ టీసీఎస్ కూడా పేర్కొంది. బడా ఐటీ సంస్థలను ఇంతగా ప్రభావితం చేస్తున్న మూన్‌లైటింగ్ తప్పా, ఒప్పా అంటూ ఇప్పుడు బాగా చర్చ జరుగుతోంది... అనైతికమా? ఒక సంస్థలో పర్మనెంట్ ఉద్యోగిగా ఉంటూ ఖాళీ సమయాల్లో, వారాంతాల్లో ఇతర సంస్థలకు పని చేయడాన్ని మూన్‌లైటింగ్‌గా పిలుస్తున్నారు. నిజానికి అదనపు ఆదాయం కోసం పని వేళల తర్వాత చాలామంది ఇతర పనులు చేయడం కొత్తేమీ కాదు. బడుగు జీవులు వేతనం చాలక ఇలా చేస్తే ఏమో గానీ భారీ జీతాలు తీసుకునే ఐటీ ఉద్యోగులు మాత్రం ఇతర సంస్థలకు, అదీ తమ ప్రత్యర్థులకు పని చేయడం అనైతికమన్నది ఐటీ సంస్థల వాదన. బెంగళూరులో ఓ ఐటీ సంస్థ ఉద్యోగికి ఏకంగా ఏడు పీఎఫ్ ఖాతాలున్నట్టు తేలడం సంచలనం సృష్టించింది. చిన్నాదా, పెద్దదా అన్నదానితో నిమిత్తం లేకుండా ఇప్పుడు ఏ ఉద్యోగానికైనా పీఎఫ్ ఖాతా తప్పనిసరి కావడం తెలిసిందే. విప్రో కూడా మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్న తమ ఉద్యోగులను పీఎఫ్ ఖాతాల ద్వారానే గుర్తించిందని స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్ రాజీవ్ మెహతా చెప్పడం సంచలనంగా మారింది. ఈ ఒరవడి మనకు కాస్త కొత్తగా అన్పించినా అమెరికాలో మాత్రం 2018లోనే బహుళ ఉద్యోగాలు చేసేవారి సంఖ్య 7.2 శాతం పెరిగిందట. అక్కడ మహిళలు అధికంగా మూన్‌లైటింగ్ చేస్తున్నట్టు తేలింది. సమర్థకులే ఎక్కువ... మూన్‌లైటింగ్‌పై ఐటీ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అనైతికమే గాక సంస్థ పట్ల పచ్చి మోసమేనంటారు విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ. టీసీఎస్ అధిపతి గణపతి సుబ్రమణ్యం దీన్ని నైతిక సమస్యగా అభివర్ణించారు. ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్‌పాయ్ మాత్రం ఇందులో మోసమేముందని ప్రశ్నస్తున్నారు. ‘‘నిర్ణీత సమయం పాటు సంస్థలో పని చేస్తానంటూ ఉద్యోగి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత అతను ఏ పని చేస్తే సంస్థకేంటి?’’ అన్నది ఆ్న ప్రశ్న. టెక్‌మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీ అయితే ఓ అడుగు ముందుకేసి తమ ఉద్యోగులు పనివేళల తర్వాత ఇతర ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుగా ఓ విధానమే రూపొందిస్తామని ప్రకటించారు. మూన్‌లైటింగ్‌కు అనుమతించిన తొలి సంస్థగా ఆన్లైన్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ నిలిచింది. ఫిన్‌టెక్, యూనికార్న్, క్రెడ్ సంస్థలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా మూన్‌లైటింగ్‌ను సమర్థించారు. మింట్ సర్వేలో 64.5 శాతం మూన్‌లైటింగ్‌ను సమర్థించారు. అనైతికమన్న వారి సంఖ్య కేవలం 23.4 శాతమే. -దొడ్డ శ్రీనివాసరెడ్డి -
పీటర్సన్‌ను బలవంతంగా సాగనంపారు!
లండన్: ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ కెరీర్ అనూహ్యంగా ముగింపు దశకు చేరుకుంది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చర్య కెవిన్‌ను బలవంతంగా సాగనంపేలా చేసింది. వెస్టిండీస్ పర్యటనతో పాటు టి-20 ప్రపంచ కప్‌కు బోర్డు కెవిన్‌పై వేటు వేసింది. జట్టులో చోటు దక్కకపోవడంతో 33 ఏళ్ల పీటర్సన్ కెరీర్ కొనసాగించని పరిస్థితి ఏర్పడింది. యాషెస్ సిరీస్‌లో వైఫల్యం.. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్‌కు జట్టును సన్నద్ధం చేసే ప్రక్రియలో భాగంగా ఈసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. అనంతరం బోర్డు, కెవిన్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 'ఇంగ్లండ్ తరపున క్రికెట్ ఆడటాన్ని గౌరవంగా భావిస్తున్నా. జట్టుగా మేం సాధించిన విజయాలకు గర్వంగా ఉంది. అయితే నా కెరీర్ ముగింపు దశకు చేరుకున్నందుకు బాధగా ఉంది. ఇంగ్లండ్ క్రికెట్ సాధించిన అద్భుత విజయాల్లో భాగస్వామిగా ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నా. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. భవిష్యత్‌లో జట్టు విజయపథంలో పయనించాలని ఆకాంక్షిస్తున్నా. క్రికెటర్‌గా ఇప్పటికీ అత్యుత్తమంగా ఆడగలనని భావిస్తున్నా. క్రికెట్ ఆడుతా కానీ ఇంగ్లండ్ తరపున ఆడనందుకు విచారంగా ఉంది' అని కెవిన్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ సందర్భంగా సహచర ఆటగాళ్లను కించపరిచేలా కెవిన్ మెసేజ్‌లు పంపి బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు. ఇంగ్లండ్ తరపున కెవిన్ 104 టెస్టులు, 136 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 8181 పరుగులు, వన్డేల్లో 4440 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ సందర్భంగా సహచర ఆటగాళ్లను కించపరిచేలా కెవిన్ మెసేజ్‌లు పంపి బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు.