case interrogation
-
సీబీఐ జేడీ బదిలీ.. వెంటనే నిలిపివేత
న్యూఢిల్లీ: ఉన్నతాధికారుల అవినీతి ఆరోపణలతో పరువు పోగొట్టుకున్న సీబీఐ..శుక్రవారం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాపై తీవ్ర అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న జాయింట్ డైరెక్టర్ వి.మురుగేశన్‌ను మరో కేసు దర్యాప్తునకు బదిలీ చేస్తూ శుక్రవారం సీబీఐ అంతర్గత ఉత్తర్వు జారీ చేసింది. అనంతరం కొన్ని నిమిషాల్లోనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. మురుగేశన్‌ను అవినీతి వ్యతిరేక విభాగం నుంచి ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేస్తున్నట్లు సీబీఐ ఇన్చార్జి డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు వెలువరించిన ఉత్తర్వు మీడియాకు లీకైంది. బొగ్గు కుంభకోణం కేసుల దర్యాప్తును వేగవంత చేయటానికి గాను ఆయన్ను ఆ విభాగానికి మార్చుతున్నట్లు అందులో పేర్కొన్నారు. -
10న ‘అయోధ్య’ విచారణ తేదీ ఖరారు
న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసుల విచారణ తేదీని తాము ఏర్పాటు చేయబోయే ధర్మాసనం ఈ నెల 10వ తేదీన నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్ల ధర్మాసనం ఈ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టింది. వివిధ పక్షాల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, రాజీవ్ ధన్వాన్ తమ వాదనలు వినిపించకుండానే కేవలం 30 సెకన్లలోనే ధర్మాసనం ఈ నిర్ణయం వెలువరించింది. -
'ఫెడరల్ బ్యాంక్ సిబ్బందిని విచారిస్తున్నాం'
హైదరాబాద్: మల్కాజ్‌గిరిలో ఫెడరల్ బ్యాంక్ చోరీ కేసు విచారణ ప్రారంభించినట్లు డీసీపీ రమారాజేశ్వరి మంగళవారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. విచారణలో భాగంగా బ్యాంక్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. అయితే దుండగులు కేజీ బంగారం, రూ. 1.25 లక్షల బంగారం చోరీ చేశారని వివరించారు. బ్యాంక్‌లోని రెండు లాకర్లు మాత్రమే తెరిచారని వివరించారు. ఒకే వ్యక్తి మాత్రమే లోపలకు చొరబడినట్లు సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలనలో గుర్తించినట్లు రమారాజేశ్వరి తెలిపారు. ఫెడరల్ బ్యాంక్‌లో చోరీ చేసిన దుండగులు గ్రిల్స్ కట్ చేసి నగదు, నగలు దొంగిలించారని చెప్పారు.