హైదరాబాద్: మల్కాజ్గిరిలో ఫెడరల్ బ్యాంక్ చోరీ కేసు విచారణ ప్రారంభించినట్లు డీసీపీ రమారాజేశ్వరి మంగళవారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. విచారణలో భాగంగా బ్యాంక్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. అయితే దుండగులు కేజీ బంగారం, రూ. 1.25 లక్షల బంగారం చోరీ చేశారని వివరించారు.
బ్యాంక్లోని రెండు లాకర్లు మాత్రమే తెరిచారని వివరించారు. ఒకే వ్యక్తి మాత్రమే లోపలకు చొరబడినట్లు సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలనలో గుర్తించినట్లు రమారాజేశ్వరి తెలిపారు. ఫెడరల్ బ్యాంక్లో చోరీ చేసిన దుండగులు గ్రిల్స్ కట్ చేసి నగదు, నగలు దొంగిలించారని చెప్పారు.