పొగమంచుతో విమాన రాకపోక లకు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: పొగమంచు కారణంగా ఇక్కడి శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు శుక్రవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా టేకాఫ్ తీసుకున్నాయి. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విశాఖపట్నం వెళ్లాల్సి న ఎయిర్ ఇండియా ఏఐ 952 విమానం ఉద యం 7 గంటలకు బదులుగా 8.50 గంట లకు బయల్దేరింది. కాగా ఉదయం 6 గంటలకు బెంగళూరు వెళ్లాల్సిన ఎస్జీ 1031 విమానం, ఉదయం 7 గంటలకు బయల్దేరాల్సిన విజయవాడ, తిరుపతి విమానాలు రద్దయ్యాయి. మరోవైపు బెంగళూరు, విజయవాడ, తిరుపతి నుంచి శంషాబాద్ రావాల్సిన విమానాలూ రద్దయ్యాయి.