CD piracy
-
ఆయన మంత్రి కాదు.. సీడీల బాబా.. అనేక మంది రాసలీలల..
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న మంత్రి మురుగేశ్ నిరాణి వద్ద ఐదు వందల సీడీలు ఉన్నట్లు సామాజిక కార్యకర్త ఆలం పాషా ఆరోపించారు. ఆయన మంగళవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. మురుగేశ్ నిరాణి వద్ద ఐదు వందల సీడీలున్నాయి. అందులో ఎవరివైనా ఉండవచ్చన్నారు. మురుగేశ్‌ను సీడీ బాబా అని వర్ణిస్తూ అనేక మంది రాసలీల సీడీలు ఆయన వద్ద ఉన్నాయన్నారు. నకిలీ పేర్లతో ఆయన బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నారని అన్నారు. -
కాణిపాకం కేంద్రంగా పైరసీ సీడీల తయారీ
పోలీసుల అదుపులో నిందితులు...? సెల్, కంప్యూటర్ దుకాణదారులే సూత్రదారులు వివరాలు గోప్యంగా ఉంచి విచారణ చేస్తున్న పోలీసులు కాణిపాకం(ఐరాల): కాణిపాకం కేంద్రంగా పైరసీ సీడీలను తయారు చేస్తున్నట్టు ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. నిందితులను కాణిపాకం, స్పెషల్ పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి సీడీలను చిత్తూరు, తిరుపతికి సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు నుంచి సీడీల దిగుమతి కాణిపాకం అటు తమిళనాడుకు ఇరవై కిలోమీటర్లు, కర్ణాటకకు యాభై కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడున్న సెల్, కంప్యూటర్ దుకాణదారులు సీడీలను చెన్నై, బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. చిత్తూరుతోపాటు, కాణిపాకానికి కొత్త సినిమా వచ్చిన గంటల వ్యవధిలోనే వాటి ప్రింట్లు సెల్ షాపు, కేఫ్ల్లోకి చేరిపోతున్నాయి. ఇక్కడి నుంచి మెయిల్, వాట్సప్, ఫేస్‌బుక్‌ల ద్వారా జిల్లా, రాష్ట్రం నలుమూలలకు క్షణాల్లో చేరిపోతున్నాయి. అలాగే సీడీలు, డీవీడీలుగా మార్చి చిత్తూరు, తిరుపతి, పలమనేరు పట్టణాలకు చేరవేస్తున్నారు. థియేటర్ సిబ్బందితో సత్సంబందాలు కాణిపాకం, చిత్తూరుకు చెందిన థియేటర్ సిబ్బందితో సంబందాలు కలిగిన కొందరు వ్యక్తులు కొత్త సినిమా వచ్చిన వెంటనే పైరసీ తయారీ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అలా తీసిన ప్రింట్‌ను నాణ్యతను బట్టి రూ.5వేల నుంచి రూ.10 వేల వరకు పైరసీ తయారీదారులకు విక్రయిస్తున్నారు. ఫ్యాన్స్ చేతికి చిక్కిన సందర్బాలు ఉన్నాయి కాణిపాకం సినిమా థియేటర్లో ఇటీవల కొందరు వ్యక్తులు సెల్ కెమెరాల్లో కొత్త సినిమా రికార్డు చేస్తుండగా ఫ్యాన్స్ పట్టుకున్నారు. వారిని థియేటర్ యజమానులు అదుపులోకి తీసుకొని వారించి పంపేశారు. అలాగే మొబైల్స్‌ను తీసుకొని సినిమా విజువల్స్‌ను తొలగించిన సందర్భాలూ ఉన్నాయి. వీటిపై ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైరసీ చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు పైరసీ చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు. సినిమా చట్టం ప్రకారం పైరసీ సీడీలు, డీవీడీలను తయారు చేసిన వా రు, కొనుగోలు చేసిన వారు కూడా శిక్షార్హులే. వారిని ఉపేక్షించేది లేదు. అభిమానులు ఎవరైనా పోలీసులకు సమాచారం ఇవ్వచ్చు. సెల్ షాపులు, కంప్యూటర్ కేంద్రాలపై నిఘా పెంచుతాం. – ఆదినారాయణ, చిత్తూరు వెస్ట్ సీఐ -
విజయవాడలో పైరసీ రక్కసి
రిలీజైన 24 గంటల్లోపే కొత్త సినిమాల సీడీలు లభ్యం విజయవాడ(చిట్టినగర్): పంజా సెంటర్లోని ఇస్లాంపేట డ్రైన్ వీధిలోని ఓ భవనంలో కొద్ది రోజులుగా సాగుతున్న పైరసీ సీడీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. 15 వేల ఖాళీ సీడీలతో పాటు 5 వందలకుపైగా కొత్త సినిమా సీడీలు, కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఇస్లాంపేటలోని ఓ భవనంలో పైరసీ సీడీలను తయారు చేస్తున్నారని టాస్క్‌ఫోర్స్ పోలీసులకు గురువారం రాత్రి సమాచారం అందింది. కొత్తపేట స్టేషన్ సిబ్బంది సహకారంతో ఆ భవనంపై నిఘా పెట్టారు. శుక్రవారం ఉదయం టాస్క్‌ఫోర్స్ ఏసీపీ పీ మురళీధర్, ఎస్ఐ సురేష్‌రెడి ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడి చేశారు. అక్కడ సీడీ రైడర్లు సహా నిందితుడు తలశిల సురేష్ దొరికిపోయూడు. అతని సహాయకునిగా ఉన్న గర్రె సురేష్‌నూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పైరసీ సీడీని చెన్నె, ఖాళీ సీడీలను హైదరాబాద్‌లో కొనుగోలు చేసి కొత్త సినిమాలను ఎక్కిస్తున్నామని నిందితుడు తెలిపాడు. గురువారం రిలీజైన సౌఖ్యం సినిమాతో పాటు శుక్రవారం రిలీజైన జత కలిసే సినిమాలతో కూడిన సీడీ కవర్లు, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్నీ కొత్త సినిమాలే.... సౌఖ్యం, జత కలిసే, బెంగాల్ టైగర్, నవ మన్మధుడు, లోఫర్, హిందీ సినిమాలు బాజీరావు మస్తానీ, దిల్వాలేలతో పాటు పలు సూపర్ హిట్ సినిమా సీడీలను పోలీసులు గుర్తించారు. ఈ కేంద్రాన్ని నెల క్రితం ఏర్పాటు చేసినట్లు నిందితుడు పేర్కొంటున్నాడు. ఘటన స్థలాన్ని కొత్తపేట ఎస్ఐ సుబ్బారావు , సిబ్బంది పరిశీలించారు.