cell number
-
పబ్లిక్ టాయ్‌లెట్ గోడపై యువతి సెల్ నంబర్
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): క్యాబ్ చార్జీ ఎక్కువ ఇవ్వనందుకు ప్రయాణికురాలి సెల్‌నంబర్‌ను పబ్లిక్ టాయ్‌లెట్ గోడపై రాసి వేధింపులకు కారణమైన డ్రైవర్‌ను సైబరాబాద్ షీ బృందాలు అరెస్టు చేశాయి. ఓ మహిళ కోకాపేట్ నుంచి మాదాపూర్‌కు క్యాబ్ బుక్ చేసిన సమయంలో ప్రయాణ చార్జీ రూ.200 చూపించగా డ్రైవర్ ఇతర మార్గాల్లో తిప్పి రూ.800 చార్జీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు అంగీకరించని ఆమె రూ.200 మాత్రమే ఇచ్చింది. దీనిని మనస్సులో పెట్టుకున్న డ్రైవర్ ఆమె సెల్‌ఫోన్ నంబర్‌ను పబ్లిక్‌టాయ్‌లెట్ గోడపై రాయడంతో బాధితురాలికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి. దీంతో బాధితురాలు డ్రైవర్‌పై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అతను నేరం అంగీకరించాడు. కరాటే శిక్షణ కోసం వెళ్లిన తన కుమార్తెకు మాస్టర్ అశ్లీల దృశ్యాలు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడంటూ వాట్సాప్ ద్వారా ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో షీ బృందాలు నిందితుడిని పట్టుకున్నాయి. గత రెండు వారాల్లో 47 మంది ఈవ్‌టీజర్లపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశాయి. సైబరాబాద్ షీ టీమ్ ఇన్చార్జ్ అనసూయ ఈవ్‌టీజర్లకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. సామాజిక మాధ్యమాల ద్వారా 64 ఫిర్యాదులు అందగా 47 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. -
ఇక ఠంచన్‌గా పింఛన్
రాయగిరి గ్రామానికి చెందిన ‘ఆసరా’లబ్ధిదారులు పింఛన్ డబ్బుల కోసం మండల కేంద్రంలోని పోస్టాఫీసుకు వచ్చారు. తీరా అక్కడి సిబ్బంది డబ్బు లేదన్నారు. చేసేది లేక వారంతా వెనుదిరిగారు. మరుసటి రోజు మళ్లీ వచ్చారు. గంటల తరబడి నిరీక్షిస్తే కానీ, పింఛన్ల పంపిణీ మొదలుపెట్టలేదు. ఉన్న కొద్దిపాటి నగదు కొందరికే వచ్చింది. దీంతో మిగిలిన వారు నిరాశతో ఇంటిముఖం పట్టారు... ఇలా పింఛన్ డబ్బుల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పడుతున్న కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. ఈ నెల నుంచి బ్యాంకుల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి. సాక్షి, యాదాద్రి : ఆసరా పథకం ద్వారా పింఛన్ పొందుతున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువుల కష్టాలు తీరే రోజులు వచ్చాయి. తపాలా కా ర్యాలయాల ద్వారా కాకుండా లబ్ధిదారుల బ్యాం కు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. దీనికి సంబంధించి కొన్నాళ్ల క్రితమే ఆదేశాలు వచ్చినప్పటికీ ఈ నెలనుంచే అమలు చేసేం దుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎందుకంటే.. ఆసరా లబ్ధిదారులకు ప్రతి నెలా మొదటి వారంలోనే పింఛన్ డబ్బులు చేతికందాలి. ఈ డబ్బును ప్రస్తుతం తపాలా కార్యాలయాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. పోస్టాఫీస్‌లకు బ్యాంకుల నుంచి డ బ్బు వస్తే తప్ప పంపిణీ చేయలేని పరిస్థితి. కానీ, బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా పోస్టాఫీస్ లకు డబ్బు చేరడం లేదు. దీంతో ఒక్కోసారి రెం డు నెలలు కూడా పింఛన్ అందడం లేదు. పింఛన్ కోసం లబ్ధిదారులు పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంటల తరబడి క్యూలో నిలబడడం, తెల్లవారుజాము నుంచి పడిగాపులు గాయడం జరుగుతుంది. వీటికి తోడు ఇంటర్నెట్ సిగ్నల్స్ అందకపోవడం కూడా ప్రధాన సమస్యగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో సిగ్నల్స్ కోసం భవనాలపైకి, ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లక తప్పడం లేదు. ఇలాంటి తరుణంలో ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిని నివారించేందుకు లబ్ధిదారుల ఖాతాల్లోనే పింఛన్ డబ్బు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు అదేశాలు అందాయి. వచ్చే నెల నుంచి అమలు చేయడానికి చర్యలు చేపట్టారు. ఆధార్, మొబైల్ నంబర్ తప్పనిసరి జిల్లా వ్యాప్తంగా ఆసరా పింఛన్‌దారులు 92,934 మంది ఉన్నారు. వీరందరికీ పోస్టాఫీసుల ద్వారా ప్రతి నెలా రూ.11కోట్లు పంపిణీ చేస్తున్నారు. వచ్చే నెల నుంచి పోస్టాఫీసుల్లో పింఛన్లు పంపిణీ చేయకుండా లబ్ధిదారులు ఖాతాల్లో వేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఇప్పటికే పలువురు లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. లేని వారికి జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలు తెరవాలని కలెక్టర్ అనితారామచంద్రన్ బ్యాంకు అధికారులను ఇటీవల ఆదేశించారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం, లబ్ధిదారులు సెల్‌ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. దీంతో బ్యాంకుల్లో పింఛన్ జమ కాగానే ఆసమాచారం లబ్ధిదారుల సెల్‌కు మెసేజ్ వస్తుంది. దీని వల్ల పింఛన్‌దారుల కష్టాలను గట్టెక్కించడానికి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. -
వరుడి పేరుతో మోసం.. సెల్‌ఫోన్ పట్టించింది..!
సాక్షి, అన్నానగర్: చెన్నై సమీపం మాధవరంలో తన కూతురుకి వరుడు కావాలని ఇంటికి వచ్చి నగదు చోరీ చేసుకుని పరారైన వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. పొన్నిఅమ్మన్ మేడుస్వామి నగరానికి చెందిన సుబ్రమణి(64). ఇతని భార్య కమలం. ఇంజినీర్‌గా పని చేస్తూ వస్తున్న తన కుమారుడికి సుబ్రమణి వరన్‌ను వెతికాడు. 13వ తేదీన 55 ఏళ్ల ఓ వ్యక్తి ఇతని ఇంటికి వచ్చాడు. అతను తిరువరంగడమ్కి చెందిన సంతాన గోపాలన్గా వారికి పరిచయం చేసుకున్నాడు. తరువాత సంతాన గోపాలన్ తన కుమార్తెకి వరుడిని చూస్తున్నానని వారిని నమ్మించాడు. దీంతో వారు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లమని తెలిపారు. సాయంత్రం ఇంటికి వెళ్తానన్న అతనికి స్వీట్‌బాక్స్ ఇచ్చి పంపారు. కాగా మరుసటిరోజు కుమారుడి వివాహం కోసం బీరువాలో ఉంచిన రూ.1,85,000 నగదు కనిపించలేదు. సుబ్రమణికి సంతాన గోపాల్ మీద అనుమానంతో మాధవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ నెంబర్ పట్టించింది.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. సంతానగోపాలన్ మరచిపోయి సుబ్రమణికి ఇచ్చిన సెల్‌ఫోన్ నెంబర్ ఆధారంగా అతని అడ్రస్ కనిపెట్టారు. మంగళవారం తిరువరంగం వలైందాన్ వీధిలోని అతని ప్రత్యేక పోలీసులు పట్టుకుని చెన్నైకి తీసుకుని వచ్చారు. విచారణలో సుబ్రమణి ఇంట్లోని నగదు చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు అతని దగ్గర ఉన్న రూ.1,75,000 నగదుకు స్వాధీనం చేసుకున్నారు. -
ఫోన్ కాల్ అంటేనే భయపడుతున్న.. మంత్రి!
హైదరాబాద్ : వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రూపంలో తలనొప్పి వచ్చి పడింది. ప్రభుత్వం రైతు రుణ విముక్తి పథకం గురించి గొప్పగా చెప్పుకుంటోందని, ఆ పథకం కేవలం డొల్ల మాత్రమేనని విమర్శించిన రఘువీరారెడ్డి ఈ పథకంపై ఏమైనా సందేహాలుంటే నేరుగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఫోన్ చేయాలని నేరుగా మంత్రి సెల్‌ఫోన్ నంబరు వెల్లడించారు. దీంతో మంత్రికి క్షణం తీరిక లేకుండా వరుసగా ఫోన్లు శర పరంపరగా వస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వరుసగా వస్తున్న ఫోన్లతో ఆయనకు క్షణం కూడా తీరిక లేకుండా పోతోందట. రుణాల మాఫీ సంగతేంటంటూ ప్రతి ఒక్కరూ ఫోన్ చేయడమే కాకుండా కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు మాట్లాడుతున్నారట. రైతు సమాచారం కోరుతూ మాట్లాడే సమయంలో మధ్యలోనే కట్ చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయన్న భయంతో కొన్ని ఫోన్లు మాట్లాడారట. ఇక లాభం లేదనుకున్న మంత్రివర్యులు ఫోన్లకు సమాధానం చెప్పేందుకు ప్రత్యేకంగా పీఏను కేటాయించారు. ఆయన అదే పనిలో నిమగ్నమై ఉన్నా సందేహాలు తీర్చుకునేందుకు ఫోన్ చేసిన రైతులు పీఏ చెప్పిందంతా విన్న తరువాత మీరెవరని ప్రశ్నించి.. పీఏ అన్న సమాధానం రాగానే రైతులు మంత్రిగారేమయ్యారంటూ నిట్టూరుస్తున్నారట. ఈ విషయం ఆయనే మీడియాకు చెప్పుకోగా, అది విన్న టీడీపీ సహచరుడొకరు విరుగుడు మంత్రం బోధించారు.. మంత్రిగారికెందుకు తంటాలు..! అదేదో ముఖ్యమంత్రి ఫోన్ నంబర్ ఇస్తే పోలే..!