censorship
-
China: బూతు బొమ్మలతో ఉక్కు పాదం!
బీజింగ్: సోషల్ మీడియా కాలంలో ఉద్యమాల్ని అణచివేయడం అంత తేలికనా?.. అవునని నిరూపిస్తోంది చైనా. కోవిడ్ కట్టడి పేరుతో అక్కడ అమలు అవుతున్న కఠోర లాక్డౌన్ ఇక తమ వల్ల కాదంటూ ఎదురు తిరిగిన ప్రజావేశాన్ని తొక్కిపెట్టేందుకు దుర్మార్గమైన ఆలోచనలను అమలు చేస్తోంది జిన్‌పింగ్ నేతృత్వంలోని సర్కార్. బోట్ పోలీస్, సెక్స్ బోట్స్.. ఇప్పుడు నిరసనల గురించి బయటి ప్రపంచానికి తెలియకుండా చైనా ప్రభుత్వం ఉపయోగించుకుంటున్న ఆయుధాలు. ప్రపంచమంతా కరోనా స్వేచ్ఛ వాయువుల్ని పీలుస్తున్న వేళ.. చైనా మాత్రం ఇంకా వైరస్ టెన్షన్‌తోనే వణికిపోతోంది. రోజుకు 30వేలకు పైగా కేసుల నమోదుతో.. జీరో కొవిడ్ పాలసీని.. అదీ అతికఠినంగా అమలు చేస్తుండడంతో జనం సహనం కోల్పోతున్నారు. చైనాలోని పదుల సంఖ్యలో నగరాల్లో.. కొవిడ్ ఆంక్షల వ్యతిరేక నిరసనలు తారాస్థాయికి చేరాయి. తమ గళాన్ని బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు సోషల్ మీడియా ఆయుధాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ, ఆ ఆన్లైన్ నిరసనలను అంతే సమర్థవంతంగా అణచివేస్తోంది కమ్యూనిస్ట్ ప్రభుత్వం. చైనాలో పాపులర్ సోషల్ మీడియా అకౌంట్లలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను సెన్సార్ చేస్తున్నారు అధికారులు. నిరసన, బీజింగ్, అల్లర్లు.. ఇలాంటి పదాలతో కూడిన పోస్టులు చేయకుండా.. పూర్తిగా బ్యాన్ చేసింది. ఇందు కోసం పోలీస్ బోట్లను ఉపయోగించుకుంటోంది. అదే సమయంలో.. బయటి ప్లాట్‌ఫామ్‌ల పరిస్థితి కూడా అలాగే ఉంటోంది. ట్విటర్లో అయితే నిరసనల ప్రదర్శనల ఊసు లేకుండా చేస్తోంది. ట్విటర్ సెర్చింగ్‌లో.. చైనా నిరసనలు, బీజింగ్, ఇతర ప్రముఖల నగరాల కోసం వెతికితే.. ఆ ప్లేస్‌లో అందమైన మోడల్స్ ఫొటోలు, అశ్లీల వీడియోలు, బూతు బొమ్మలు, అడ్వర్టైజ్మెంట్లు దర్శనమిస్తున్నాయి. చైనీస్(మాండరిన్) భాషలో.. అదీ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఆ పోస్టులు ట్రెండ్ అవుతుండడం గమనార్హం. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. అధికార కమ్యూనిస్ట్ పార్టీ 2009లో ట్విటర్‌ను చైనా వ్యాప్తంగా బ్లాక్ చేసింది. అయితే కొందరు యూజర్లు వీపీఎన్, వెబ్సైట్ ప్రాక్సీ సర్వీసుల ద్వారా అక్కడి పరిస్థితిని తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. కానీ, ట్విటర్లో ఇప్పుడు పెయిడ్ యాడ్స్ కనిపిస్తున్నాయి. అదీ పోర్న్ నుంచి వ్యభిచారం సంబంధించినవి ట్రెండ్ అవుతుండడం గమనార్హం. వీఛాట్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఇదే పరిస్థితి. నిబంధన ఉల్లంఘన పేరుతో నిరసనల పోస్టులకు అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక సమాచారం ఏదైనా సరే.. ‘తప్పుడు సమాచారం’గా పేర్కొంటూ అణచివేత ధోరణి ప్రదర్శిస్తోంది. తాజాగా.. గురువారం ఉరుమ్‌ఖ్వీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తర్వాత ఈ నిఘా ఎక్కువైంది. అగ్ని ప్రమాద సమయంలో కరోనా లాక్డౌన్, బారికేడ్లు, వాహనాల అడ్డగింత ద్వారా సహాయక చర్యలు ఆలస్యం అయ్యాయి. ఫలితంగా ప్రాణ నష్టం సంభవించగా.. కఠోర నిబంధనల అమలుపై ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. Chinese netizens filling WeChat with angry messages condemning deadly fire in Urumqi (rescue possibly delayed by covid measures) and zerocovid policy. As messages are censored, netizens post articles only using ‘safe’ words: OK OK OK, agree agree agree, support support support pic.twitter.com/Bv4x6VIXN0 — leen vervaeke (@leenvervaeke) November 25, 2022 షుయిమోగావో జిల్లాలో ఓ యువకుడు సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడితే.. అతన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నాడంటూ పదిరోజుల పాటు అదుపులోకి తీసుకున్నారు చైనా అధికారులు. అదే సమయంలో నిరసనకారులపై వ్యతిరేక పోస్టులను, ప్రభుత్వ అనుకూల పోస్టులకు అన్ని ఫ్లాట్‌ఫామ్‌ల్లోనూ అనుమతి లభిస్తోంది. తాజాగా చైనా విదేశాంగ మంత్రి హావో లిజియన్ భార్య.. నిరసన కారులపై ఆగ్రహంతో చేసిన ఓ పోస్టు విపరీతంగా ట్రెండ్ అయ్యింది. -
వీడియోలకు కత్తెర! అమెరికాను దాటేసి ప్రథమ స్థానంలో భారత్
సాక్షి, అమరావతి: యూట్యూబ్‌లో సెన్సారింగ్ భారీగానే జరుగుతోంది. విచిత్రమేంటంటే ఇలా కత్తెర వేటుకు గురైన వీడియోల సంఖ్యలో భారతదేశం అమెరికాను మించిపోయింది. మార్గదర్శకాలను పాటించని కారణంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పెద్దగా ఎవరూ చూడకముందే ఇండియాలో 11,75,859 వీడియోలను బ్లాక్ చేసినట్లు యూట్యూబ్ వెల్లడించింది. వీటిల్లో ఎక్కువగా పిల్లల భద్రత, హింసాత్మక కంటెంట్, అశ్లీల వీడియోలు ఉన్నట్లు సంస్థ తెలియజేసింది. ఇటీవల యూట్యూబ్ సంస్థ కమ్యూనిటీ మార్గదర్శకాల ఎన్ఫోర్స్మెంట్ నివేదికను విడుదల చేసింది. ఇందులో 2022 తొలి త్రైమాసికం (జనవరి–మార్చి)లో ప్రపంచ వ్యాప్తంగా 38.82 లక్షల వీడియోలను బ్లాక్చేస్తే అందులో అగ్రరాజ్యం అమెరికా కంటే అధికంగా భారత్ ప్రథమ స్థానంలో ఉండడం గమనార్హం. అదనంగా 2,58,088 వీడియోలను తొలగింపు వాస్తవానికి గ్లోబల్ కమ్యూనిటీ నివేదిక కంటే దేశంలో తొలగించిన వీడియోల సంఖ్య ఎక్కువగానే ఉంది. నివేదికలో కమ్యూనిటీ మార్గదర్శకాల ప్రకారం సొంత మోడరేటర్లు, విశ్వసనీయ ఫ్లాగర్లు, ఆటోమేటెడ్ అల్గారిథమ్‌లు వంటి సాంకేతికత ద్వారా తొలగించిన వీడియోల సంఖ్యను మాత్రమే చూపిస్తారు. అయితే, దేశ ఐటీ రూల్స్–2021 ప్రకారం.. యూట్యూబ్‌కు ఫిర్యాదులు పరిష్కారించే అధికారులున్నారు. వీరికి దేశవ్యాప్తంగా యూజర్లు, ఎన్జీఓలు, ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా 95వేల ఫిర్యాదులు అందాయి. వాటి ఆధారంగా 2,58,088 వీడియోలను అదనంగా తీసేశారు. దీంతో దేశంలో మొత్తం 14,33,947 వీడియోలను తొలగించినట్లయింది. ఇందులో అధికంగా పిల్లల భద్రతకు సంబంధించి 24.9 శాతం, హింసాత్మక కంటెంట్ 21.2 శాతం, అశ్లీల కంటెంట్ వీడియోలు 16.9 శాతం ఉన్నాయి. యూట్యూబ్ అనుచిత, అశ్లీల, అతివాద కంటెంట్, సైబర్ బెదిరింపులు, తప్పుదారి పట్టించే, తప్పుడు సమాచార (స్పామ్) వీడియోలను తొలగించడానికి 91 శాతం ఆటోమేటెడ్ అల్గారిథమ్ సహాయపడింది. గడిచిన రెండేళ్లుగా.. ఇక యూట్యూబ్ ఎక్కువ వీడియోలను తొలగిస్తున్న దేశాల జాబితాలో భారత్ గడిచిన రెండేళ్లుగా అగ్రస్థానంలో ఉంటోంది. 2019 మూడో త్రైమాసికంలో 5వ స్థానంలో ఉండగా 2020 తొలి త్రైమాసికానికి వచ్చేసరికి రెండో స్థానంలోనూ, అదే ఏడాది మూడో త్రైమాసికం నుంచి ఇప్పటివరకు మొదటి స్థానంలో కొనసాగుతోంది. 44 లక్షల చానెళ్లు నిలిపివేత ఈ ఏడాది తొలి మూడునెలల్లో ప్రపంచ వ్యాప్తంగా 44 లక్షల చానెళ్లను నిలిపివేసినట్లు కంపెనీ ప్రకటించింది. 90 రోజుల వ్యవధిలో కంపెనీ మార్గదర్శకాలను మూడుసార్లు ఉల్లంఘిస్తే సదరు చానెల్‌ను అందులోని వీడియోలను తొలగించనున్నట్లు వివరించింది. -
సెన్సార్ చిక్కులు.. రూ.40 వేల కోట్ల నష్టం!!
సెన్సార్ చిక్కులు సాధారణంగా ఈ మాటను తరచూ సినీ పరిశ్రమలో వింటుంటాం. అయితే వెబ్ కంటెంట్ విషయంలో ఆ చిక్కులు తక్కువే!. అందుకే ఫిల్మ్ మేకర్స్ డిజిటల్ కంటెంట్‌కు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కానీ, ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ కంటెంట్‌కూ కోతలు తప్పడం లేదు. దీనివల్ల గ్లోబల్ ఎకానమీకి వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఇంటర్నెట్ సెన్సార్షిప్ వల్ల పోయినేడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. డిజిటల్ సెక్యూరిటీ & రైట్స్ గ్రూప్ ‘టాప్10వీపీఎన్’ నివేదిక ప్రకారం.. ఈ నష్టం మొత్తంగా 5.5 బిలియన్ డాలర్లకు(సుమారు 40 వేల కోట్ల రూపాయలకు పైనే) ఉందని తెలుస్తోంది. 2021లో ఇంటర్నెట్-సోషల్ మీడియాపై ఆంక్షలు, ఇంటర్నెట్ అంతరాయం(షట్‌డౌన్), సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ప్రభుత్వాల ఆధిపత్యం-కఠిన చట్టాల అమలు, వెబ్ కంటెంట్‌పై ఉక్కుపాదం.. తదితర కారణాల వల్ల ఈ మేర నష్టం వాటిల్లినట్లు నివేదిక పేర్కొంది. ►ఎక్కువ నష్టపోయింది మయన్మార్ దేశం. సుమారు 2.8 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో 18 వేల కోట్ల రూపాయలపైనే) నష్టపోయింది. మిలిటరీ చర్యల వల్లే ఈ నష్టం కలిగినట్లు తెలుస్తోంది. ఇక నైజీరియా ఈ లిస్ట్‌లో రెండో ప్లేస్‌లో ఉంది. జూన్‌లో ట్విటర్‌ను బ్లాక్ చేయడం తదితర పరిణామాల వల్ల నైజీరియా 1.5 బిలియన్ డాలర్ల నష్టం చవిచూసినట్లు తెలుస్తోంది. ►భారత్‌లో కొత్త ఐటీ రూల్స్ వల్ల ఈ నష్టం ప్రధానంగా వాటిల్లింది. దీనికి తోడు పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్పై నిషేధం-ఆంక్షలు, ఓటీటీ కంటెంట్‌పై ఉక్కుపాదం(పూర్తిస్థాయి సెన్సార్షిప్ రాలేదింకా), కరోనాపై ఫేక్- అశ్లీల కంటెంట్, ఇతర కథనాల నియంత్రణ తదితర కారణాలు ఉన్నాయి. (లెక్కపై స్పష్టత రావాల్సి ఉంది). ►2021 ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆంక్షలతో 486 మిలియన్ ప్రజలు ఇబ్బందిపడగా.. 2020లో 268 మిలియన్ ప్రజలు ఇబ్బందిపడ్డారు. అంటే 81 శాతం పెరిగిందన్నమాట. కేవలం ప్రభుత్వాల ఆంక్షలు-నిషేధాజ్ఞల కారణంగా వాటిల్లిన నష్టం 36 శాతానికి(2020తో పోలిస్తే) పెరిగింది. ఎలాగంటే.. ఇంటర్నెట్ షట్‌డౌన్, కఠిన ఆంక్షల వల్ల ఈమేర నష్టం వాటిల్లితే.. ఒకవేళ మొత్తంగా ఇంటర్నెట్ ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో కదా!. అసలు నష్టం ఎందుకు వాటిల్లుతుందంటే.. ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఇతరత్ర సేవలు, అడ్వర్టైజింగ్, కస్టమర్ సపోర్ట్ సేవలకు విఘాతం, ప్రత్యేకించి సోషల్ మీడియా ఆగిపోవడం వల్ల ఆదాయానికి భారీ గండిపడుతుంది. 2022లో మొదలైంది.. ఇక ఈ ఏడాదిలోనూ ఇంటర్నెట్ స్వేచ్ఛకు అడ్డుకట్ట పడడం ఇప్పటికే మొదలైంది. కజకస్తాన్(మధ్య ఆసియా దేశం), సూడాన్‌లలో నెలకొన్న సంక్షోభాల దృష్ట్యా ఇంటర్నెట్ షట్‌డౌన్ కొనసాగుతోంది. వీటి నష్టం వివరాలు ఇప్పట్లో చెప్పడం కష్టం. చదవండి: భారత్‌లో ఇక ఏరకంగానూ పోర్న్ వీడియోల వీక్షణ కుదరదు! -
చైనా ఫోన్లు కనిపిస్తే విసిరి కొట్టండి, ఆదేశాలు జారీ చేసిన రక్షణ శాఖ
దేశంలో చైనా స్మార్ట్ ఫోన్ లు కనిపిస్తే చాలు విసిరికొట్టండి. వాటిని వినియోగించడానికి వీల్లేదంటూ ఓ దేశానికి చెందిన రక్షణ శాఖ ఆ దేశ ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. చైనా ఫోన్లతో పాటు షావోమీ, హువావే ఫోన్ల వినియోగం నిలిపివేయాలని స్పష్టం చేసింది. అందుకు కారణం ఏదైనా..ఆదేశ ప్రభుత్వ నిర్ణయం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలోని పలు దేశాలు చైనా చేస్తున్న కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ సైతం చైనా ప్రాడక్ట్‌లకు వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే చైనాకు చెందిన యాప్‌లపై కేంద్రం నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్‌తో పాటు యూరప్ దేశాలకు చెందిన లుథువేనియా సైతం చైనాపై ఎదురు దాడికి దిగుతున్నాయి. చైనా తయారు చేసిన స్మార్ట్ ఫోన్లలో సెన్సార్ షిప్ ఉందంటూ లుథువేనియా రక్షణశాఖ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ సెన్సార్ షిప్ వల్ల చైనా స్మార్ట్ ఫోన్లలో దేశానికి చెందిన 449 పదాలు అవుతున్నాయని ఆరోపించింది.ఫ్రీ టిబెట్, లాంగ్ లివ్ తైవాన్ ఇండిపెండెన్స్, డెమొక్రసీ మూవ్మెంట్ పదాల్ని బ్లాక్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా ఫోన్లతో పాటు షియోమీ ఫ్లాగ్షిప్ మోడల్ ఎంఐ 10టీ 5జీ ఫోన్లోనూ ఈ సెన్సార్షిప్ ఉందని ఆదేశ రక్షణశాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆ దేశాదినేతలు చైనాతో పాటు పలు స్మార్ట్ ఫోన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సెన్సార్ షిప్ ఉన్న స్మార్ట్ ఫోన్ లను విసిరి పడేయండి' అని లిథుయేనియా రక్షణ శాఖ సహాయ మంత్రి మార్గిరిస్ అబుకెవిసియస్ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే లిథుయేనియా ఆరోపణలపై షియోమీ సంస్థ ఖండించింది.తమ ఫోన్లలో అలాంటి సెన్సార్షిప్ లేదని స్పష్టం చేసింది. చదవండి: తస్మాత్ జాగ్రత్త..ఈ స్మార్ట్ ఫోన్లు వారిని కనిపెట్టేస్తాయ్ -
11,500 పాయింట్ల దిగువకు నిఫ్టీ
రెండు రోజుల రికార్డ్ లాభాల నేపథ్యంలో మంగళవారం ఆరంభమైన లాభాల స్వీకరణ బుధవారం కూడా కొనసాగింది. వృద్ధిని మరింతగా కుంటుపరిచేలా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులు చోటు చేసుకోవడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌పై అభిశంసన విచారణ మొదలు కావడంతో ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. వీటికి తోడు మన వృద్ధి అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) కోత కోయడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం కూడా తోడవడంతో బుధవారం స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 39,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,500 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ముడి చమురు ధరలు 1.6 శాతం పతనమైనా, మన మార్కెట్ పతనబాటలోనే కొనసాగింది. సెన్సెక్స్ 504 పాయింట్లు నష్టపోయి 38,594 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 148 పాయింట్లు పతనమై 11,440 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నిప్టీ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు చెరో 2% పతనమయ్యాయి. ఒడిదుడుకులు కొనసాగుతాయ్... అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అభిశంసన ప్రతిపాదన కారణంగా అమెరికాలో రాజకీయ దుమారం చెలరేగడంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు. దీని ప్రభావం స్వల్పకాలికంగానే ఉండనున్నదని ఆయన భావిస్తున్నారు. మొండి బకాయిలకు సంబంధించి తాజా సమస్యలు, సెప్టెంబర్ వాహన అమ్మకాలు బలహీనంగా ఉండే అవకాశాలు, ఈ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రోజులో ముగియనుండటం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని వివరించారు. సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు నేడు(గురువారం) ముగియనుండటంతో ఒడిదుడుకులు కొనసాగుతాయని నిపుణులంటున్నారు. వచ్చే నెల 4న ఆర్బీఐ పాలసీ, క్యూ2 ఫలితాలను బట్టి మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని వారంటున్నారు. రూ.1.84 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.1.84 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,84,484 కోట్లు తగ్గి రూ.1,46,88,764 కోట్లకు పడిపోయింది. పతనానికి ప్రధాన కారణాలు లాభాల స్వీకరణ డొనాల్ట్ ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియ ట్రంప్ చైనా వ్యతిరేక వ్యాఖ్యలు పతనమైన ప్రపంచ మార్కెట్లు వృద్ధి అంచనాలను తగ్గించిన ఏడీబీ రూపాయి పతనం మార్కెట్ భారీగా నష్టపోయినా, ఇండియామార్ట్ ఇంటర్మెష్ షేర్ మెరుపులు మెరిపించింది. దేశంలోనే అతి పెద్ద బీ2బీ కంపెనీ అయిన ఇండియామార్ట్ ఇంటర్మెష్ షేర్ ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.1,970ను తాకింది. చివరకు స్వల్ప లాభంతో రూ. 1,874 వద్ద ముగిసింది. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో లిస్టయిన ఈ కంపెనీ ఇష్యూ ధర, రూ.973తో పోల్చితే దాదాపు రెట్టింపైంది. గత నెల కాలంలోనే ఈ కంపెనీ షేర్ 70 శాతానికి పైగా పెరగడం విశేషం. -
అశ్లీలత.. బీప్ లేకుండా బూతు డైలాగులు!
సెన్సార్ కష్టాలు త్వరలో వెబ్ సిరీస్‌లను కూడా చుట్టుముట్టబోతున్నాయి. ఇప్పటిదాకా బుల్లితెర, వెండితెరలకు మాత్రమే పరిమితమైన సెన్సార్ కత్తెరలను త్వరలో వెబ్ సిరీస్‌కు కూడా వర్తింపజేయాలని ప్రసార శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కఠినతరమైన నిబంధనలను రూపొందించబోతున్నట్లు సమాచార సాంకేతిక మరియు ప్రసారాలశాఖ ప్రకటించింది. ‘మార్గదర్శకాలు ఇప్పటికైతే ఓ కొలిక్కి రాలేదు. కానీ, వాటిని రూపొందించి వీలైనంత త్వరగా అన్వయింపజేస్తాం’ అని మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ‘టీవీల్లో ప్రసారం అయ్యే వాటికి ఇప్పటిదాకా నిబంధనలు వర్తిస్తున్నాయి. కానీ, ఇంటర్నెట్ కంటెంట్‌పై ఎలాంటి నియంత్రణ లేదు. అడ్డు అదుపులేకుండా మేకర్లు హింస, అశ్లీలతను చూపించేస్తున్నారు. ఇది మాములు మోతాదులో ఉంటే పర్వాలేదు. కానీ, శృతి మించిపోతోంది. బీప్ లేకుండా బూతు డైలాగులను వాడేస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం. అయితే నియంత్రణ పేరిట.. స్వేచ్ఛను మాత్రం హరించే ఉద్దేశం మాత్రం మాకు లేదు’ అని అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ ఏప్రిల్ నెలలో మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో 10 మందితో కూడిన ఓ కమిటీని మార్గకదర్శకాల రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆన్లైన్ స్ట్రీమింగ్ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’ తొలిసారిగా పూర్తి భారతీయ చిత్ర కథాంశంతో తెరకెక్కించిన ‘సాక్రెడ్ గేమ్స్’ విడుదలై.. వివాదాస్పదమైంది. నేర ప్రపంచం.. రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో ఓచోట మాజీ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీని అసభ్య పదజాలంతో దూషించారని, ఆయన పాలన కాలంలో జరిగిన అంశాలను వక్రీకరించారని కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయటం, కాంగ్రెస్ కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయటం తెలిసిందే. విక్రమ్ చంద్రా నవల ‘సాక్రెడ్ గేమ్స్’ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో సైఫ్ అలీఖాన్, రాధికా ఆప్టే, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటించగా.. అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానీ రూపొందించారు. -
నెట్ కు లేనిది.. సినిమాకు ఎందుకు?
న్యూఢిల్లీ: భారత్ లో సెన్సార్ షిప్ చట్టాలను మార్చాలంటూ నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత 47 సంవత్సరాలుగా సెన్సార్ షిప్ ను ఎవరూ ప్రశ్నించలేదని.. మారుతున్న కాలంతో పాటు అందులోని నిబంధనలు కూడా మారాలని పాలేకర్ అన్నారు. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో ఎక్కువ మొత్తం కట్స్ లో పోతున్నాయని, కొన్ని సినిమాలైతే సర్టిఫికేషన్ కు నోచుకోవడం లేదని గుర్తు చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ను ఎక్కువగా ఇవ్వమని కోరడం లేదని అయితే సాంకేతిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుత కాలంలో మాస్ మీడియా పలు రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటోందని చెప్పుకొచ్చిన ఆయన.. నిబంధనలు కూడా ప్రజల అవసరాలకు తగిన విధంగా ఉండాలన్నారు. కాగా టీవీలు, ఇంటర్నెట్ లో కంటెంట్ పై సెన్సార్ షిప్ లేదని.. అదే సమాచారంతో రూపొందే సినిమా దగ్గరకు వచ్చేసరికే మాత్రం సెన్సార్ షిప్ పేరుతో కట్స్ ఎక్కువగా చేస్తున్నారని పిటిషన్ లో పాలేకర్ వాదించారు. ఈ మధ్య కాలంలో విడుదల కోసం తిప్పలు పడిన సినిమాలను గురించి పిటిషన్ లో వివరించారు. జాలీ ఎల్ఎల్బీ2 సినిమాలో కట్స్ విధించాలంటూ అలహాబాద్ హైకోర్టు చేసిన డిమాండ్ ను కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. సినిమాలపై శ్యాం బెనగల్ కమిటీ సూచనలను అమలయ్యేలా చూడాలని పిటిషన్ లో కోరారు. -
'బ్రా'లో వల్గర్ ఏముంది: కంగనా
న్యూఢిల్లీ: ఉడ్తా పంజాబ్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో చెలరేగిన వివాదంపై నటి కంగనా రనౌత్ స్పందించింది. దేశం ఏం చూడాలో కొద్దిమంది వ్యక్తులు నిర్ణయించలేరని తెలిపింది. మూడుసార్లు జాతీయస్థాయిలో ఉత్తమనటిగా అవార్డు అందుకున్న కంగనా ఉడ్తా పంజాబ్ చిత్ర టీమ్‌కు మద్దతుగా నిలిచింది. ఆ సినిమాకు సెన్సార్ బోర్డు వాళ్లు ఏకంగా దాదాపు 90 కట్లు చెప్పడాన్ని విమర్శించింది. 'నేను డైరెక్టర్‌ను కాదు, దర్శక విభాగం గురించి ఎక్కువగా అవగాహన కూడా లేదు. కానీ వృత్తిలో భాగంగా వారిని చాలా దగ్గర నుంచి చూస్తుంటాను. ప్రస్తుత పరిణామాలు వారికి చాలా విసుగు తెప్పించేవిలా ఉన్నాయి' అని కంగనా అన్నారు. క్వీన్ చిత్ర విడుదల సమయంలో డైరెక్ట్ వికాస్ బహల్ తన వద్దకు వచ్చి ఓ సన్నివేశంలోని 'బ్రా'ను బ్లర్ చేస్తున్నట్టుగా చెప్పాడని కంగనా తెలిపింది. సెన్సార్ బోర్డు సభ్యులు ఆ సన్నివేశంలో ధరించకుండానే ఉన్న 'బ్రా'ను వల్గర్‌గా ఉందని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బ్లర్ చేయాల్సి వచ్చిందట. ధరించకుండానే ఉన్న మామూలు 'బ్రా'వల్ల సొసైటీకి ఎలాంటి హాని జరగదని.. మహిళల 'బ్రా'లో వల్గర్ ఏముంటుందని సెన్సార్ బోర్డు పై కంగనా మండిపడింది. -
క్రీస్తుపూర్వమే సెన్సార్షిప్
ప్రజలు ఏది చూడాలో, ఏది చదవాలో, ఏది వినాలో ప్రభుత్వాలు నిర్ణయించే పద్ధతి ఈనాటిది. రోమన్ సామ్రాజ్యంలో క్రీస్తుకు శతాబ్దాల పూర్వమే ఇలాంటి పద్ధతి ఉండేది. ప్రజల నైతిక వర్తనను నియంత్రించేందుకు రోమన్ ప్రభుత్వం సెన్సార్ అధికారులను నియమించేది. వారికి ఒక ప్రత్యేక విభాగమే ఉండేది. రోమన్ రాజ్యంలో ఆ విభాగం క్రీస్తుపూర్వం 443 నుంచి క్రీస్తుపూర్వం 22 వరకు పనిచేసినట్లు ఆధారాలు ఉన్నాయి. రోమన్ రాజ్యానికి చేరువలోనే ఉన్న గ్రీకు సామ్రాజ్యంలోనూ క్రీస్తుపూర్వం 399 నాటి నుంచి సెన్సార్షిప్ అమలులోకి వచ్చింది. యువకులను చెడగొడుతున్నాడనే నెపంతో సోక్రటీసును విషమిచ్చి చంపేసిన తర్వాత, సాక్షాత్తు సోక్రటీసు శిష్యుడైన ప్లాటోనే సెన్సార్‌షిప్‌కు సానుకూల సిద్ధాంతాన్ని తెర మీదకు తెచ్చాడు. పిల్లలు ఏది చూడాలో, ఏది వినాలో, ఏది చదవాలో నియంత్రించడం సమాజానికి గల నైతిక బాధ్యత అని తన గ్రంథం ‘ద రిపబ్లిక్’లో ప్రకటించాడు. ఇక క్రీస్తుపూర్వం 213లో చైనా చక్రవర్తి కిన్ షి హువాంగ్ కఠినాతి కఠినమైన సెన్సార్షిప్ను అమలులోకి తెచ్చాడు. వ్యవసాయం, వైద్యం, మతబోధనలు మినహా మరే రకమైన పుస్తకాలను ప్రజలు చదవరాదని శాసించాడు. అంతటితో ఆగకుండా మిగిలిన పుస్తకాలన్నింటినీ వెతికించి మరీ తగులబెట్టించాడు. అంతటి దారుణమైన పరిస్థితుల్లోనూ కన్ఫూషియస్ అనుయాయులు కొందరు వీలైనంత వరకు ఆయన రచనలు నాశనం కాకుండా కాపాడగలిగారు. దురదృష్టమేమిటంటే, ప్రజాస్వామిక యుగం ఆవిర్భవించిన తర్వాత కూడా చాలా దేశాల్లో సర్కారీ సెన్సార్షిప్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కూర్పు: పన్యాల జగన్నాథ దాసు