central home secretary
-
ఆస్తుల పంపిణీపై క్లారిటీ ఇచ్చిన హోంశాఖ
న్యూఢిల్లీ: ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపిణీపై కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. విభజన చట్టంలోని సెక్షన్ 48 (1) ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని స్థిర, చర ఆస్తుల పంపిణీ, సెక్షన్ 49 ప్రకారం జనాభా నిష్పత్తిలో నగదు పంచుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో తాజా ఆదేశాల ప్రకారం ఏ రాష్ట్రంలోని ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందనున్నాయి. అలాగే నగదు 52:48 నిష్పత్రిలో రెండు రాష్ట్రాలు పంపిణీ చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తే అక్కడే కొనసాగాలని పేర్కొంది. షెడ్యూల్ 9,10లోని అన్ని సంస్థలకు ఇవే ఆదేశాలు వర్తిస్తాయని హోంశాఖ స్పష్టం చేసింది. కాగా ఉమ్మడి రాష్ట్రం నాటి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి చెందిన ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఉద్యోగులు, ఉపకరణాలు, అప్పులను ఇరు రాష్ట్రాల సమ్మతితో జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ జరపాలని సుప్రీంకోర్టు మార్చి 18న తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు పలుసార్లు సమావేశం అయ్యారు. దీంతో ఇరు రాష్ట్రాల అభిప్రాయం అనంతరం ఆస్తుల పంపకాలపై తుది నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి ఆదేశాలు పంపారు. -
సానుకూల దృక్పథంలో ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు!
-
సానుకూల దృక్పథంలో ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు!
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న ఉద్యోగుల విభజన అంశం కొలిక్కి వచ్చినట్లు కనబడుతోంది. దీనిలో భాగంగానే శుక్రవారం ఇరు రాష్ట్రాల సీఎస్ లు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మ లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో సమావేశమయ్యారు. ప్రధానంగా పునర్ విభజన చట్టం వివాదాలపై వారి మధ్య చర్చ జరిగింది. ఈ సమావేశం అనంతరం ఇరు రాష్ట్రాల సీఎస్ లు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల విభజనపై రెండు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ సీఎస్ కృష్ణారావు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని వివాదాలపై కేంద్రాన్ని పరిష్కారం ఇవ్వమని కోరినట్లు ఆయన తెలిపారు. కాగా, కమల్ నాధన్ కమిటీ కార్యకలాపాలు హైదరాబాద్ లో సాగేందుకు అనుమతి కోరినట్లు తెలంగాణ రాష్ట్ర సీఎస్ రాజీవ్ శర్మ తెలిపారు. విభజన చట్టంలోని అంశాలపై ఇరు రాష్ట్రాలకు వేర్వేరు అభిప్రాయాలున్నట్లు ఆయన తెలిపారు. వీటిపై కేంద్రాన్ని న్యాయ సలహా కోరామన్నారు. అందరికీ అనుకూలంగా ఉండే విధానాన్ని అనుసరించాలని ప్రత్యూష్ సిన్హాను కోరామన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు సానుకూల దృక్పథంలో సాగుతున్నాయని రాజీవ్ శర్మ తెలిపారు. -
కేంద్ర హోంశాఖ కార్యదర్శితో రెండు రాష్ట్రాల సీఎస్‌లు భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మ శుక్రవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. పునర్ విభజన చట్టం వివాదాలపై వారి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. అయితే గవర్నర్‌కు శాంతిభద్రతలు, హైదరాబాద్‌లో ప్రభుత్వ సంస్థల అంశాలను ఏపీ సీఎస్ లేవనెత్తారు. పునర్విభజన చట్టాలను ఏపీ సర్కారు గౌరవించడం లేదని తెలంగాణ సీఎస్ అనిల్ గోస్వామికి ఫిర్యాదు చేశారు.