central Jails
-
బిరియాని వండుకుని తింటూ.. లగ్జరీ జీవితం.. హత్య
పేరుకే సెంట్రల్ జైళ్లు. అక్కడ ఖైదీలకు సకల సౌకర్యాలు అందుతున్నాయి. దీనిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు శుక్రవారం చెన్నై పుళల్ సహా రాష్ట్రంలోని తొమ్మిది సెంట్రల్ జైళ్లలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సెల్ఫోన్లతో పాటు మారణాయుధాలు, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై : అడగాలేగాని జైళ్లలోని ఖైదీలకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇందుకు నిదర్శనంగా కొన్నేళ్ల క్రితం పుళల్ జైలులో ఖైదీలు బిరియాని వండుకుని తింటూ లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్న వైనం ఫొటోలతో సహా బయటకు వచ్చింది. ఇటీవల తిరునెల్వేలి జైలులో ముత్తుమనో అనే ఖైదీ తోటి ఖైదీల చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనతో జైళ్లలోకి మారణాయుధాలు ఎలా వచ్చాయనే అనుమానంతో అప్పట్లో తనిఖీలు చేపట్టగా మారణాయుధాలు, నిషేధిత మాదకద్రవ్యాలు దొరికాయి. ఆనాటి నుంచి అడపాదడపా అధికారులు జైళ్లను తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజాము 5 గంటల ప్రాంతంలో ఏకకాలంలో రాష్ట్రంలోని 9 సెంట్రల్ జైళ్లను పోలీసు అధికారులు తనిఖీ చేపట్టారు. చెన్నై పుళల్ జైలులో విచారణ ఖైదీలు, శిక్ష పడిన ఖైదీలకు వేర్వేరుగా రెండు కేంద్ర కారాగారాలున్నాయి. అక్కడి ఖైదీలకు మారణాయుధాలు, నిషేధిత మాదకద్రవ్యాలు బయటి నుంచి సరఫరా అవుతున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. మాధవరం అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సుందరవదనం నేతృత్వంలో పది మంది ఇన్స్పెక్టర్లు సహా 150 మంది పోలీసులు రెండు జైళ్లలోకి ప్రవేశించి 8.30 గంటల వరకు సోదాలు నిర్వహించారు. చెన్నై పుళల్ జైలులో నిషేధిత వస్తువులు దొరకలేదని ఏసీ సుందరవదనం తెలిపారు. కడలూరు, కోయంబత్తూరు, పాళయంగోట్టై, వేలూరు, సేలం, తిరునెల్వేలి, తిరుచ్చిరాపల్లి, మదురై సెంట్రల్ జైళ్లలో సైతం తనిఖీలు చేపట్టారు. కొన్ని జైళ్ల నుంచి సెల్ఫోన్లు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అన్నాడీఎంకే నేత ఇంట్లో ఏసీబీ తనిఖీలు రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన అన్నాడీఎంకేలో సీనియర్ నేత నాగనాథన్ (58) ఇంటిలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయన 2011–16లో పోగలూరు యూనియన్ పంచాయతీ చైర్మన్గా వ్యవహరించారు. ప్రస్తుతం రామనాథపురం జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాంస్కృతిక ప్రదర్శన మండపాలు, రోడ్ల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్ప డినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో రామనాథపురం జిల్లా న్యాయమూర్తి అనుమతితో ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం 7 గంటలకు నాగనాథన్ ఇంటిలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. రూ.15 లక్షల నగదు, ఆస్తిపత్రాలు దొరికినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. -
సెంట్రల్ జైళ్లు.. పరిమితికి మించి ఖైదీలు
సాక్షి, అమరావతి : సెంట్రల్ జైళ్లలో పరిమితికి మించి ఖైదీలను ఉంచాల్సి రావడం సమస్యగా పరిణమిస్తోందని జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ)–2017 నివేదిక తేల్చింది. దీనివల్ల జైళ్లలో మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వాలకు భారంగా మారుతోంది. దేశంలో అత్యధిక జైళ్లున్న రాష్ట్రాల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో తమిళనాడు, రాజస్తాన్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాల్లో అన్నిరకాల జైళ్లు కలిపి మొత్తం 105 ఉన్నాయి. వీటిలోని సౌకర్యాలు, బ్యారక్ల సామర్థ్యాన్ని బట్టి నిబంధనల ప్రకారమే ఖైదీలుండాలి. విశాఖ, రాజమహేంద్రవరం, నెల్లూరు, కడప కేంద్ర కారాగారాలు 3,814 మంది ఖైదీల సామర్థ్యంతో ఉండగా.. వాటిలో ప్రస్తుతం 4,700 మంది ఖైదీలు ఉన్నారు. మొత్తంగా 123 శాతం ఖైదీలు ఉండటం గమనార్హం. 8 జిల్లా జైళ్లలో 92 శాతం మంది ఖైదీలుండగా, 91 సబ్ జైళ్లలో 72 శాతం ఉన్నారు. మొత్తం ఖైదీల్లో 101 శాతం పురుషులు, 58 శాతం మహిళలు ఉన్నారు. తీవ్రమైన నేరాలు చేసి సెంట్రల్ జైళ్లలో దోషులుగా, నిందితులుగా ఉన్న వారి సంఖ్య అధికంగా ఉండటంతో వారి పర్యవేక్షణ కష్టంగా మారుతోందని ఎన్సీఆర్బీ గుర్తించింది. జైళ్లల్లో నిఘా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ తాజాగా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని జైళ్ల పరిస్థితిపై కూడా ఎన్సీఆర్బీ–2017 నివేదిక నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పలు సూచనలు చేసింది. కేంద్ర హోం శాఖ ఆదేశాలు ఇవీ జైళ్లల్లో పటిష్ట బందోబస్తు పెంచడంతోపాటు ఖైదీల ప్రవర్తన, కదలికలపై నిరంతర నిఘా ఉంచాలి. నేరాల వారీగా ఖైదీలను విభజన చేసి ప్రత్యేక బ్యారక్లలో ఉంచాలి. తీవ్రమైన నేరాలు చేసి శిక్షలు పడిన వారంతా ఒకచోట కలిసే అవకాశం లేకుండా చూడాలి. అలా కలిస్తే వాళ్లు మరింత తీవ్రమైన నేరాలకు పథక రచన చేసే ప్రమాదం ఉందని గమనించాలి. ఇలాంటి వారిని ఉంచేందుకు హై సెక్యూరిటీ జైళ్లు ఏర్పాటు చేయాలి. జైలు నుంచి విడుదలవుతున్న వారిలో సత్ప్రవర్తనతో మెలుగుతున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. అందువల్ల నేరం చేసి జైలుకు వచ్చిన వారు మళ్లీ నేరాలవైపు మళ్లకుండా ఉండేలా ప్రత్యేక దృష్టి పెట్టాలి. జైలు నుంచి బయటకు వచ్చాక మంచి జీవితాన్ని గడిపేలా ఖైదీల్లో మార్పు కోసం జైలు గదుల నుంచే గట్టి ప్రయత్నాలు జరగాలి. అందుకు కౌన్సెలింగ్, తదితర మార్గాలను జైలు అధికారులు అనుసరించాలి. ఖైదీలు మానసిక వేదనతో కుంగిపోకుండా తగిన వృత్తులు, వ్యాపకాలను జైలులో నిర్వహించుకునేలా ఎప్పటికప్పుడు జైలు ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. -
రోజులు లెక్కపెట్టుకోండి..
'జైళ్లలో దురాగతాలు ఎక్కువైపోయాయి. ఖైదీల కష్టాలు పెరిగాయి. మీ ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుంది. కోర్టులు పట్టనట్టే వ్యవహరిస్తున్నాయి. ఇక కాచుకోండి.. మా మిషన్ మొదలైంది.. రోజులు లెక్కపెట్టుకోండి' అంటూ అల్- ఖాయిదా పేరుతో పలువురు జైలు సూపరింటెండ్ లకు బెదిరింపు లేఖలు పంపిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ మేరకు కోయంబత్తూరు, తిరుచ్చి, మధురై, వేలూరు జైళ్ల సూపరింటెండ్లకు చేరిన లేఖలపై తమిళనాడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమది అల్ ఖాయిదా అనుబంధ 'ది బేస్ మూమెంట్' సంస్థ అని పేర్కొంటూ భారతదేశ అసంపూర్ణ చిత్రపటం, కింద ఒసామా బిన్ లాడెన్ ఫొటోతో లేఖను పంపారు. అన్ని లేఖలూ ఇలానే ఉండటం గమనార్హం. పోలీసుల దర్యాప్తులో ఫ్రమ్ అడ్రస్ లు తప్పుడువని తేలిసింది. కాగా, కోయంబత్తూరు పేళుళ్ల కేసులో ప్రధాన నిందితులైన అల్ ఉమా తీవ్రవాదులు పన్నా ఇస్మాయిల్, పోలీస్ ఫక్రుద్దీన్, మున్నా సహా మరో ముగ్గురిని ఇటీవలే ఈ జైళ్లకు తరలించారు. గతంలో వారు పుళల్ సెంట్రల్ జైలులో ఉండగా.. సిబ్బంది నుంచి ఆయుధాలు లాక్కొని వారిపై దాడిచేసి గాయపర్చారు. దీంతో నిందితులను వేర్వేరు జైళ్లకు మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు బెదిరింపు లేఖలు కూడా అవే జైళ్లకు రావడంతో అధికారుల్లో కలవరం మొదలైంది.