CEO Gopinathan
-
టీసీఎస్ కొత్త సీఈవో ట్రాక్ రికార్డ్, జీతం ఎలా ఉన్నాయంటే?
సాక్షి, ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఎండీ రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో కంపెనీ వెటరన్ కె. కృతివాసన్ కొత్త సీఈవోగా నియమితులయ్యారు.సంస్థ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (BFSI) బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్‌గా ఉన్న కృతివాసన్ కొత్త సీఈవోగా మార్చి 16న బాధ్యతలు చేపట్టారు. (గాల్లో తేలినట్టుంది..నెక్ట్స్ ఏంటి? టీసీఎస్ గోపీనాథన్ కీలక వ్యాఖ్యలు) చెన్నై నుంచి ముంబైక షిప్ట్ అవ్వడమే పెద్ద చాలెంజ్ టీసీఎస్ సీఈవోగా కంటే, చెన్నై వదిలి ముంబైకి మారడమే పెద్ద సవాల్ అని సీఈవోగా ఎంపికైన తరువాత తొలిసారి నిర్వహించిన శుక్రవారం నాటి మీడియా మీట్లో కృతివాసన్ చమత్కరించారు. మార్కెట్లో వచ్చే ప్రతి సవాల్ ఒక కొత్త అవకాశమని పేర్కొన్నారు. టాప్ఇండియన్ ఐటీ కంపెనీల సహచరులతో పోలిస్తే చాలా ఆలస్యంగా 58 ఏళ్లకు కీలక పదవికి ఎంపికయ్యారు అనేది నిపుణుల మాట. కాగా కీలక సమయంలో గత ఆరేళ్లుగా కంపెనీకి సీఎండీగా ఉన్న గోపీనాథన్, కంపెనీ చరిత్రలోనే తొలిసారి నాలుగేళ్ల ముందే కంపెనీని వీడారు. అయితే కృతివాసన్‌కు బాధ్యతల అప్పగింతల్లో భాగంగా గోపీనాథన్ సెప్టెంబర్ 15 దాకా కంపెనీలో కొనసాగుతారు. తాజాగా కొత్త సీఈవో కృతివాసన్ సీఈవో, చదువు తదితర అంశాలపై భారీ ఆసక్తి నెలకొంది. అయితే కొత్త సీఈవో కృతివాసన్ సీఈవో, చదువు తదితర అంశాలపై భారీ ఆసక్తి నెలకొంది. అత్యధిక వేతనం పొందుతున్న ఐటీ దిగ్గజాల సీఈవోల జాబితాలో గోపీనాథన్ ఐదో స్థానంలో ఉన్నారు. 2021-22 లో రూ. 25.75 కోట్లగా ఉన్న జీవితం 2023-23లో 26.6 శాతం పెరిగింది. దీంతో కృతివాసన్ ఎంత వేతనం పొందనున్నారనేది హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఎవరీ కృతివాసన్ చెన్నైకి చెందిన కృతివాసన్ 1989లో టీసీఎస్‌లో చేరారు. 34 సంవత్సరాలకు పైగా కంపెనీకి సేవలందిస్తున్నారు. హంబుల్‌గా, ప్రేమగా ఉండే కృతివాసన్‌కి అంతర్గతంగా మంచి గుర్తింపు ఉందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని, ఐఐటీ కాన్పూర్ నుండి ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. టీసీఎస్‌లో కీర్తివాసన్ డెలివరీ, కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్మెంట్, లార్జ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ మరియు సేల్స్‌లో వివిధ బాధ్యతలు, ఇతర రోల్స్ నిర్వహించారు. అలాగే టీసీఎస్ Iberoamerica , ఐర్లాండ్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడుగాను, టీసీఎస్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఏజీ పర్యవేక్షక బోర్డు. సభ్యుడుగాను ఉన్నారు. కృతివాసన్ శాలరీ అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగులలో ఒకరైన కె. కృతివాసన్ 2018-19లో రూ. 4.3 కోట్ల జీతం తీసుకున్నారు. తాజా పదోన్నతితో ఎంత ప్యాకేజీ, ఇతర ప్రయోజనలు లభించనున్నాయనేది ప్రస్తుతానికి సస్పెన్సే. -
గాల్లో తేలినట్టుంది..నెక్ట్స్ ఏంటి? టీసీఎస్ గోపీనాథన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు అనూహ్యంగా గుడ్‌బై చెప్పిన సీఈవో గోపీనాథన్ తన నిష్క్రమణపై కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుకోవడానికి ఇంతకంటే మంచి సమయం లేదని తాను భావించాననీ, సంతోషంగా, మనసంతా ఎంత తేలిగ్గా ఉందో చెప్పలేను..రీసెటింగ్కి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను అంటూ గోపీనాథన్ వ్యాఖ్యానించారు. పదవీకాలం ఇంకా నాలుగేళ్లు మిగిలి ఉండగానే (ఫిబ్రవరి 21, 2027 వరకు) తన పదవికి రాజీనామా చేయడం టెక్ వర్గాల్లో చర్చకు దారితీసింది. అదీ కంపెనీ చరిత్రలో ఒక సీఈవో సమయానికి ముందే తమ రాజీనామాను చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. టీసీఎస్‌లో 22 ఏళ్ల సుదీర్ఘ కరియర్‌కు గుడ్‌బై చెబుతూ గోపీనాథన్ గురువారం రాజీనామా ప్రకటించారు. సాధారణంగా సిగ్గుపడే గోపీనాథన్ శుక్రవారం ఉదయం మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏక్షణమైతే ఆసక్తిపోతుందో.. ఆక్షణమే తప్పుకోవాలి (జిస్ దిన్ మన్ ఉడ్ జాయే, ఉఎస్ దిన్ నికల్ జానే కా!) గత 48 గంటలుగా చాలా స్వేచ్ఛగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే తన భవిష్యత్తు ప్లాన్ల గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా టీసీఎస్ భవిష్యత్తు గురించి ఆలోచించి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే తన ప్లేస్లోమరొకరు ఉండటం సముచితమని భావించానన్నారు. ఈ సందర్బంగా కృతివాసన్ సామర్థ్యంపై సంతృప్తిం వ్యక్తం చేశారు. అలాగే తన రాజీనామాపై టాటా సన్స్ ఛైర్మన్, టీసీఎస్ మాజీ సీఎండీ చంద్రశేఖరన్‌తో చర్చించి, వారం క్రితమే ఈనిర్ణయం తీసుకున్నట్లు గోపీనాథన్ వివరించారు టీసీఎస్‌లో ప్రతీ నిమిషం ఆస్వాదించానని చెప్పుకొచ్చారు. కానీ కొన్నిసార్లు కీలక మైలురాళ్లను చేరుకున్నప్పుడు, ఆలోచన మొదలవుతుంది. నెక్ట్స్ ఏమిటి? అనేది కచ్చితంగా పెద్ద ట్రిగ్గర్ పాయింటే.. కానీ ప్రస్తుతానికి ఎలాంటి క్లూ లేదు అని చెప్పారు. కాగా గోపీనాథన్ రాజీనామా ఇచ్చినప్పటికీ ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు గోపీనాథన్ టీసీఎస్‌తోనే కొనసాగనున్నారు. అలాగూ కొత్త సీఈవోగా (డిజిగ్నేట్) బీఎఫ్ఎస్ఐ డివిజన్ గ్లోబల్ హెడ్‌గా ఉన్న కే కృతివాసన్‌ను నియమించినట్టు కంపెనీ ప్రకటించింది. 2001లో టాటా ఇండస్ట్రీస్ నుంచి టీసీఎస్‌లో చేరారు గోపీనాథన్ 20013లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా, 2017లో సీఎండీగా ఎంపికయ్యారు. -
ఐదేళ్ల తర్వాత కూడా టీసీఎస్....
న్యూఢిల్లీ : టాప్-3 ప్రపంచ ఐటీ బ్రాండ్సులో చోటు దక్కించుకున్న ఐటీ దిగ్గజం టీసీఎస్ దేశీయ మార్కెట్లో తన లీడర్ షిప్ పొజిటిష్పై పూర్తి విశ్వాసం వ్యక్తంచేస్తోంది. ఐదేళ్ల తర్వాత కూడా కంపెనీ మరింత స్ట్రాంగ్ గానే మారుతుందని టీసీఎస్ కొత్త సీఈవో రాజేష్ గోపినాథన్ భరోసా వ్యక్తంచేస్తున్నారు. ప్రైవేట్, పబ్లిక్ రంగంలో సాంకేతికను అందిపుచ్చుకోవడంతో తాము ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పారు. ఇండియాలో తామెప్పుడూ లీడర్లమేనని రాజేష్ గోపినాథన్ పేర్కొన్నారు. మరే ఇతర ఐటీ కంపెనీలకు రాని రెవెన్యూలను తమకు వస్తున్నాయని, రెవెన్యూల్లో తామే అతిపెద్ద షేర్‌ను ఆర్జిస్తున్నట్టు తెలిపారు. ముంబాయి ప్రధాన కార్యలయంగా నడుస్తున్న ఈ కంపెనీ పొందే 6 శాతం గ్లోబల్ రెవెన్యూలో ఎక్కువ శాతం ఇండియా నుంచే వస్తున్నట్టు తెలిపారు. ఐదేళ్ల తర్వాత కూడా టీసీఎస్ ప్రస్తుతమున్న దానికంటే మరింత స్ట్రాంగ్‌గానే మారుతుందని గోపినాథ్ తన విజన్‌ను వివరించారు. దేశంలో డిజిటల్ సదుపాయాలను మరింత విస్తరించడానికే కంపెనీ ముందంజలో ఉంటుందని చెప్పారు. కంపెనీ ముందున్న అతిపెద్ద సవాళ్లలో డిజిటల్ ఒకటని పేర్కొన్నారు.