ceo vijay kumar
-
హెచ్‌సీఎల్ టెక్ లాభం జూమ్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల రంగ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం హైజంప్ చేసి రూ. 3,593 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 1,102 కోట్లు ఆర్జించింది. ఇందుకు వివిధ విభాగాలు, సర్వీసులకు నెలకొన్న భారీ డిమాండ్ సహకరించినట్లు కంపెనీ పేర్కొంది. త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే ఇది 4.4 శాతం అధికంకాగా.. వార్షికంగా మొత్తం ఆదాయం 15 శాతం ఎగసి రూ. 22,957 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 575 కోట్లు వన్‌టైమ్ బోనస్, రూ. 1,222 కోట్లమేర వాయిదాపడిన పన్ను చెల్లింపులు ప్రభావం చూపినట్లు కంపెనీ ప్రస్తావించింది. వీటిని పరిగణిస్తే ప్రస్తుత సమీక్షా కాలంలో నికర లాభం 24 శాతం పుంజుకున్నట్లు తెలియజేసింది. ఇతర హైలైట్స్ ► స్థిర కరెన్సీ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) ఆదాయంలో 12–14 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. ► వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ► గతేడాది 40,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంది. సిబ్బంది సంఖ్య 2,08,877కు చేరింది. ► క్యూ4లో నికరంగా 11,100 మందికి ఉపాధిని కల్పించింది. ► మార్చికల్లా ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 21.9 శాతంగా నమోదు. ► క్యూ4లో 226 కోట్ల డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులను కుదుర్చుకుంది. ► పూర్తి ఏడాదికి నికర లాభం 11,145 కోట్ల నుంచి రూ. 13,499 కోట్లకు ఎగసింది. ► 2021–22లో మొత్తం ఆదాయం రూ. 75,379 కోట్ల నుంచి రూ. 85,651 కోట్లకు పెరిగింది. ప్రోత్సాహకరంగా.. మార్కెట్ వాతావరణం అత్యంత ప్రోత్సాహకరంగా ఉంది. వివిధ విభాగాలు, సర్వీసులకు పటిష్ట డిమాండ్ కనిపిస్తోంది. వెరసి సర్వీసుల బిజినెస్‌లో మరోసారి అత్యుత్తమ త్రైమాసిక ఫలితాలను సాధించాం. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయంలో 17.5% వృద్ధిని అందుకున్నాం. – సి.విజయ్ కుమార్, సీఈవో, ఎండీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్. ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ షేరు 1.2% బలపడి రూ. 1,102 వద్ద ముగిసింది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 18% అప్
న్యూఢిల్లీ: వివిధ వ్యాపార విభాగాలు మెరుగైన పనితీరు కనపర్చడంతో జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం 18.5 శాతం వృద్ధి చెందింది. రూ. 3,142 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 2,651 కోట్లు. మరోవైపు, ఆదాయం 6 శాతం పెరిగి రూ. 17,528 కోట్ల నుంచి రూ. 18,594 కోట్లకు చేరింది. షేరు ఒక్కింటికి రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ‘కొత్త ఆర్డర్లు భారీగా వచ్చాయి. గత క్వార్టర్‌తో పోలిస్తే 35 శాతం పెరిగాయి‘ అని సంస్థ సీఈవో సీ విజయకుమార్ వెల్లడించారు. త్రైమాసికాలవారీగా చూస్తే ఒప్పందాల సంఖ్య ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో నమోదైందని వివరించారు. జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్, కెనడా తదితర మార్కెట్లలో పెట్టుబడులను పెంచనున్నట్లు విజయకుమార్ చెప్పారు. మూడు, నాలుగో త్రైమాసికాల్లో ఆదాయ వృద్ధి సగటున 1.5–2.5 శాతం ఉండగలదని హెచ్‌సీఎల్ టెక్ గైడెన్స్ ఇచ్చింది. హెచ్–1బీ వీసాలపై అమెరికా ప్రభుత్వ ఆంక్షల అంశం మీద స్పందిస్తూ తమ ఉద్యోగుల్లో మూడింట రెండొంతుల మంది స్థానికులే ఉన్నారని విజయకుమార్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యయాలపరంగా తమపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని, వచ్చే ఏడాది మాత్రం కొంత ఉండవచ్చని తెలిపారు. షేరు డౌన్..: లాభాల స్వీకరణతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు దాదాపు 4 శాతం తగ్గింది. బీఎస్ఈలో ఒక దశలో 4.47% క్షీణించి రూ. 821 స్థాయిని కూడా తాకింది. చివరికి 3.76 శాతం క్షీణతతో రూ. 827.10 వద్ద క్లోజయ్యింది. బీఎస్ఈ 30లో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. ఎన్ఎస్ఈలో 3.48 శాతం తగ్గి రూ. 830.05 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 7.23 లక్షలు, ఎన్ఎస్ఈలో 2.89 కోట్ల షేర్లు చేతులు మారాయి. వేతనాల పెంపు.. అక్టోబర్ 1, జనవరి 1 నుంచి వర్తించేలా దశలవారీగా వివిధ స్థాయిల ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు విజయకుమార్ చెప్పారు. కరోనా వైరస్ పరిణామాల కారణంగా వేతనాల పెంపు గతంలో వాయిదా పడింది. దేశీయంగా ఉన్న ఉద్యోగులకు గతేడాది తరహాలోనే సగటున 6 శాతం స్థాయిలో పెంపు ఉండొచ్చని అంచనా. సెప్టెంబర్ ఆఖరు నాటికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 1,53,085గా ఉంది. ఐటీ సేవల విభాగంలో అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) 12.2 శాతంగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 1,500 పైచిలుకు ఫ్రెషర్స్‌ను కంపెనీ రిక్రూట్ చేసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో సుమారు 7,000 నుంచి 9,000 వేల మంది దాకా ఫ్రెషర్లను తీసుకోవాలని యోచిస్తున్నట్లు హెచ్‌సీఎల్ టెక్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ అప్పారావు వీ తెలిపారు. క్యూ1, క్యూ2లో 3,000 మంది దాకా ఫ్రెషర్లను తీసుకున్నట్లు వివరించారు. -
పెట్టుబడి లేని వ్యవసాయానికి పెద్దపీట
అనంతపురం అగ్రికల్చర్ : పెట్టుబడి లేని వ్యవసాయానికి (జీరో బేస్డ్ నాచురల్ ఫార్మింగ్–జెడ్బీఎన్ఎఫ్) పెద్దపీట వేస్తున్నందున జిల్లాలో ఈ తరహా వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, డైరెక్టర్ కె.ధనుంజయరెడ్డి, సీఈఓ టి.విజయకుమార్ ఆదేశించారు. మంగళవారం వారు గుంటూరు నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెట్ట వ్యవసాయం, వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించడంపై దృష్టి పెట్టాలన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి, పురుగు మందులు లేని వ్యవసాయం(ఎన్‌పీఎం) లాంటి పెట్టుబడి లేని వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తుండటంతో 'అనంత' లాంటి జిల్లాల్లో రైతుల దృష్టిని మళ్లించాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో 8 మండలాలు, 10 క్లస్టర్లు, 54 గ్రామాల్లో పరిధిలో అమలు చేస్తున్న జెడ్బీఎన్ఎఫ్ కార్యక్రమాల అమలు గురించి ఆరా తీశారు. పశువుల ఎరువు, గోమూత్రం ద్వారా కషాయాలు వాడి పంటలను సాగు చేయించాలన్నారు. వచ్చే ఏడాది పెద్ద ఎత్తున అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. ఇన్పుట్ సబ్సిడీ, రబీ పంటల ప్రణాళిక, విత్తన వేరుశనగ పంపిణీ, ప్రధానంగా మట్టి పరీక్షల సేకరణ, విశ్లేషణ, ఇతర వ్యవసాయ పథకాల అమలు గురించి తెలుసుకున్నారు. స్థానిక పెన్నార్ భవన్ సమావేశ మందిరంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జేడీఏ పీవీ శ్రీరామమూర్తి, డీడీఏలు, డివిజన్ ఏడీలు, టెక్నికల్ ఏఓలు పాల్గొన్నారు.