Certificates issued
-
21 లక్షల మందికి.. ఒక్కరోజులోనే 'కుల ధ్రువీకరణ పత్రాలు'
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంస్కరణలు ప్రజలకు ఎంతో మేలుచేస్తున్నాయి. ముఖ్యంగా కుల వీకరణ పత్రాల జారీలో సర్కారు తీసుకొచ్చిన కొత్త విధానం వారి కష్టాలు తీరుస్తోంది. ఎందుకంటే.. ఈ పత్రాల జారీని ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. గతంలో ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే గరిష్టంగా 30 రోజుల్లోగానీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యేవి కావు. ఆ తర్వాత ఏదేని కారణంతో మళ్లీ అవసరమైనా మరోసారి 30రోజులు నిరీక్షించాల్సిందే. ఈ ఇబ్బందుల్ని పసిగట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అలాంటి వారికి సాంత్వన చేకూర్చే నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం.. కుల ధృవీకరణ పత్రం పొందిన వారికి, మళ్లీ దాని అవసరం ఎప్పుడైనా ఏర్పడితే కొత్తగా తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేకుండా అంతకుముందు తీసుకున్న వివరాల ప్రకారం అడిగిన రోజునే గ్రామ, వార్డు సచివాలయాల్లో మరోసారి ఆ పత్రాలిచ్చే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2022 ఆగస్టు నుంచి అమలుచేస్తోంది. దీని ద్వారా గత ఏడాది కాలంలో రాష్ట్రంలో 21,00,888 మంది దరఖాస్తు చేసుకున్న రోజునే కుల ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు. గతంలో ఒకసారి తీసుకున్న వారికి.. సాధరణంగా.. విద్యార్థుల స్కూళ్లలో లేదంటే కాలేజీల్లో చేరే సమయంలోనూ.. వివిధ ఉద్యోగ నోటిఫికేషన్ల సమయంలో నిరుద్యోగ యువతకు.. వివిధ సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారులకు కుల ధ్రువీకరణ పత్రాల అవసరం ఎక్కువగా ఉంటుంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో అమలులో ఉన్న నిబంధన ప్రకారం ఈ కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి గరిష్టంగా 30 రోజుల్లో సంబంధిత మండల తహసీల్దార్ దానిని జారీచేయాల్సి ఉంటుంది. అయితే, చాలామంది గతంలో ఒకసారి తీసుకున్నా.. సరిగ్గా కాలేజీల ప్రవేశాలు, ఉద్యోగ నోటిఫికేషన్ల సమయంలో వివిధ కారణాలతో మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకుంటుంటారు. ఇలాంటి వారికి సైతం ఏడాది క్రితం వరకు గరిష్టంగా 30 రోజులకు గానీ అవి జారీ అయ్యేవి కావు. ఫలితంగా సకాలంలో అవి అందక అక్కడక్కడ కొందరు తమ అవకాశాలను కోల్పోయేవారు. అయితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022 ఆగస్టులో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అలాంటి వారికి అప్పటికప్పుడే సర్టిఫికెట్ల జారీచేయాలని సంకల్పించింది. విద్యార్థులు, నిరుద్యోగ యువత, వివిధ పథకాల లబ్ధిదారులు కీలక సమయాల్లో రెండోసారి అవసరమైతే దరఖాస్తు చేసుకున్న రోజునే ఆ పత్రాలు అందించేలా వీలు కల్పించింది. భవిష్యత్తులోనూ కోటి మందికి అడిగిన రోజునే.. మీ–సేవా కేంద్రాల ద్వారా 2011 నుంచి ఇప్పటివరకు దాదాపు నాలుగున్నర కోట్ల కుల ధృవీకరణ పత్రాలు జారీ అయ్యాయి. అందులో కొందరు నాలుగైదుసార్లు కూడా వాటిని పొంది ఉండొచ్చని.. అయితే, వాటిని ఆధార్ వివరాలతో సరిపోల్చినప్పుడు దాదాపు 75 లక్షల మంది ఆ సర్టిఫికెట్లు తీసుకున్నట్లుగా తాము గుర్తించామని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అంటే.. 2020 జనవరి 26 నుంచి ఇంకో కోటిన్నర మందికి ఈ పత్రాలు జారీ అయినట్లు వారు తెలిపారు. ఈ పత్రాలను కూడా ఆధార్ వివరాలతో సరిపోల్చినప్పుడు 75 లక్షల మంది వివరాలను గుర్తించామన్నారు. ఇలా మీ–సేవ కేంద్రాల ద్వారా జారీ అయిన కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన 75 లక్షల మంది.. గ్రామ సచివాలయాల ద్వారా వాటిని పొందిన 75 లక్షల మంది కలిపి కోటిన్నర దాకా ఉన్నా, కొంతమంది రెండుచోట్ల తీసుకుని ఉండొచ్చన్న భావనతో కనీసం కోటి మంది కుల ధృవీకరణ పత్రాలు తీసుకున్న వారి సమాచారం గ్రామ, వార్డు సచివాలయాల అన్లైన్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరందరికీ భవిష్యత్‌లో వీటి అవసరం ఎప్పుడు ఏర్పడినా, గతంలో మాదిరిగా 30రోజులు వేచి ఉండే పరిస్థితి లేకుండా దరఖాస్తు చేసుకున్న రోజే వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో కుల ధృవీకరణ పత్రం జారీచేసే అవకాశం ఉంటుందన్నారు. -
‘ఈడబ్ల్యూఎస్’ సర్టిఫికెట్ల జారీపై ఈనాడు తప్పుడు కథనాలు..
సాక్షి, అమరావతి: ఏడాది వ్యవధిలో జారీ చేసిన దాదాపు లక్ష సరిఫికెట్లు కళ్లెదుటే కనిపిస్తున్నా కబోదుల్లా నటిస్తూ మభ్యపుచ్చే కథనాలు ప్రచురించే వారిని ఏమనాలి? అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో జారీ చేసిన ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రాల సంఖ్య ఇదీ! రాష్ట్రవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు సజావుగా జారీ అవుతుంటే అసలు ప్రొఫార్మా సైతం రెవెన్యూ కార్యాలయాలు, సచివాలయాలకు చేరలేదంటూ ‘ఈనాడు’ యథావిధిగా తనకు అలవాటైన రీతిలో పచ్చి అబద్ధాలను వండి వార్చింది. సర్టిఫికెట్లు జారీ చేయకపోవడం వల్ల పోలీసు నియామకాలకు దరఖాస్తు చేసుకున్న వారు ఈడబ్ల్యూఎస్ సదుపాయాన్ని వినియోగించుకోగలమా? అని మథనపడుతున్నట్లు శోకాలు పెట్టింది. జనవరి నుంచే జారీ ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను ప్రభుత్వం జారీ చేస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చేసిన చట్టానికి అనుగుణంగా వీటిని జారీ చేస్తున్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో వీటికోసం దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని జనవరి ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. జనవరి నుంచి ఈ ఏడాది డిసెంబర్ 12వ తేదీ వరకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల కోసం 1,04,961 లక్షల మంది సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోగా 93,348 జారీ అయ్యాయి. 7,608 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 4,005 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. మరి ప్రొఫార్మాలే రెవెన్యూ కార్యాలయాలకు చేరకుంటే ఇన్ని లక్షల సర్టిఫికెట్లు ఎలా జారీ అయ్యాయి? ఇదీ ప్రక్రియ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే డిజిటల్ అసిస్టెంట్ వద్దకు వెళుతుంది. అక్కడి నుంచి వీఆర్వో, ఆర్ఐ ద్వారా తహసీల్దార్ వద్దకు చేరుతుంది. ఇందుకోసం రూ.50 సర్వీస్ చార్జీ చెల్లించాలి. దరఖాస్తుతోపాటు నోటరీ అఫిడవిట్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో జత చేయాలి. దరఖాస్తును 30 రోజుల్లోపు కచ్చితంగా క్లియర్ చేస్తారు. రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండే అర్హులైన అగ్రవర్ణ పేదలకు నిబంధనల ప్రకారం వీటిని జారీ చేస్తారు. వాస్తవాలు ఇలా ఉండగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీకి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలుకు నోచుకోవడంలేదని, దరఖాస్తుదారులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఈనాడు దిగజారుడు కథనాన్ని ప్రచురించింది. -
కుమారుడి సర్టిఫికెట్ కోసం.. తండ్రి ఆత్మహత్యాయత్నం
♦ సర్టిఫికెట్ల జారీలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపణ ♦ తహసీల్దార్ కార్యాలయం ఎదుట చెట్టుకు తాడుతో ఉరేసుకునేందుకు యత్నం ♦ స్థానికులు గమనించి.. వారించిన వైనం నిడమనూరు : కుమారుడికి ఆదాయ, స్థానికతకు సంబంధించిన సర్టిఫికెట్ల జారీలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ ఓ తండ్రి తహసీల్దార్ కార్యాలయం ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిడమనూరు మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని నారమ్మగూడేనికి చెందిన బెరైడ్డి నాగార్జునరెడ్డి కుమారుడు ప్రవీణ్‌రెడ్డి ఎంసెట్ ఎంట్రన్స్ రాశాడు. ఎంసెట్ కౌన్సెలింగ్ గురువారం నుంచి మొదలవుతున్నది. నాగార్జునరెడ్డి రెండు రోజులుగా నిడమనూరు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా సర్గిఫికెట్లు మంజూరు చేయలేదు. ఇదే సమయంలో అధికారులంతా మిర్యాలగూడలో హరితహారంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఉన్నారు. విసిగిన ఆయన బుధవారం మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న చెట్టుకు తన వెంట తెచ్చుకున్న తాడుతో ఉరివేసుకునే ప్రయత్నం చేస్తుండగా అక్కడ ఉన్నవారు చూసి వారించారు. తహసీల్దార్ సిబ్బంది స్పందించి మ్యాన్యువల్ సర్టిఫికెట్ ఇస్తామనగా, వాటిని కౌన్సెలింగ్‌లో అనుమతించరని నిరాకరించారు. కారణం ఏమిటంటే.. నిడమనూరు తహసీల్దార్ అంబేద్కర్ బదిలీ కావడం, బదిలీపై వచ్చిన తహసీల్దార్ బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఆన్లైన్ సర్టిఫికెట్ల జారీ జరగడం లేదు. దీంతో సర్గిఫికెట్ల కోసం వస్తున్న వారికి సిబ్బంది సమాధానం చెప్పలేకపోతున్నారు. చివరికి ఇన్చార్జ్ తహసీల్దార్ ఆనంద్‌కుమార్ మాన్యువల్ సర్టిఫికెట్లపై సంతకాలు పెట్టించారు. దీంతో కథ సుకాంతం అయ్యింది. -
మీసేవలో ఫస్ట్
దరఖాస్తులు పరిష్కరించడంలో జిల్లా ముందంజ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పౌర సేవలు ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘మీసేవ’ సేవల్లో ఆదిలాబాద్ జిల్లా తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలిచిం ది. వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల జారీ, ఇతర అన్ని సేవలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు పరిష్కరించి నిర్ణీత వ్యవధిలో ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో ఇతర జిల్లాలతో పోల్చితే ఆదిలాబాద్ జిల్లా ముందంజలో ఉంది. ఆ యా సేవలకు సంబంధించి కాలపరిమితి దాటినా దరఖాస్తులను పరిష్కరించడంలో జాప్యం చేస్తున్న జిల్లాల్లో రంగారెడ్డి మొదటి స్థానంలో ఉండగా, ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ప్రస్తుతానికి తె లంగాణలోని పది జిల్లాల్లో 1.71లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 52,025 దరఖాస్తులు గడువు దాటినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇలా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కేవలం 4,550 దరఖాస్తులే ఉన్నాయని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. 163 కేంద్రాలు.. 280 సేవలు.. జిల్లా వ్యాప్తంగా 163 మీసేవ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, మున్సిపల్, పౌర సరఫరాల, పోలీసు, ఆర్టీఏ, ఎన్పీడీసీఎల్, విద్య, ఎన్నికల సంఘం, మున్సిపల్, ఆధార్, ఇండస్ట్రీస్, కార్మిక శాఖ, సోషల్ వెల్ఫేర్, కో-ఆపరేటీవ్ వంటి ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవలను అందిస్తున్నారు. ఆదాయ, కుల వంటి ధ్రువీకరణ పత్రాలతోపాటు, భూములకు సంబంధించిన సర్టిఫికేట్లు జారీ వంటి సేవలతో పాటు, విద్యుత్, నీటి బిల్లులు, ఆస్తి పన్ను, టెలిఫోన్, ఆర్టీఏ బిల్లుల వసూలు వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మీసేవ ద్వారా 342 రకాల సేవలు అందిస్తుండగా, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సుమారు 280 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. 18.20 లక్షలకు పైగా దరఖాస్తులు.. మీసేవ కేంద్రాల ద్వారా అందించే సేవలను ఏ,బీ కేటగిరీలు గా విభజించారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే జారీ చేసే ధ్రువీకరణ పత్రాలు ఏ కేటగిరీ పరిధిలోకి రాగా, నిర్ణీత కాలపరిమితిలో జారీ చేసే ధ్రువీకరణ పత్రాలు, ఇతర సేవలు బీ-కేటగిరీ పరిధిలోకి వస్తాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వర కు మీసేవ కేంద్రాలకు మొత్తం 18.20 లక్షల దరఖాస్తులు వ చ్చాయి. ఇందులో 7.90 లక్షల దరఖాస్తులు ఏ-కేటగిరీకి సం బంధించినవి రాగా, బీ- కేటగిరీకి సంబంధించి 10.30 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 9.57 లక్షల దరఖాస్తులను అప్రూవల్ చేయగా, 52,612 దరఖాస్తులను తిరస్కరించారు.