దరఖాస్తులు పరిష్కరించడంలో జిల్లా ముందంజ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పౌర సేవలు ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘మీసేవ’ సేవల్లో ఆదిలాబాద్ జిల్లా తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలిచిం ది. వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల జారీ, ఇతర అన్ని సేవలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు పరిష్కరించి నిర్ణీత వ్యవధిలో ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో ఇతర జిల్లాలతో పోల్చితే ఆదిలాబాద్ జిల్లా ముందంజలో ఉంది.
ఆ యా సేవలకు సంబంధించి కాలపరిమితి దాటినా దరఖాస్తులను పరిష్కరించడంలో జాప్యం చేస్తున్న జిల్లాల్లో రంగారెడ్డి మొదటి స్థానంలో ఉండగా, ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ప్రస్తుతానికి తె లంగాణలోని పది జిల్లాల్లో 1.71లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 52,025 దరఖాస్తులు గడువు దాటినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇలా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కేవలం 4,550 దరఖాస్తులే ఉన్నాయని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు.
163 కేంద్రాలు.. 280 సేవలు..
జిల్లా వ్యాప్తంగా 163 మీసేవ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, మున్సిపల్, పౌర సరఫరాల, పోలీసు, ఆర్టీఏ, ఎన్‌పీడీసీఎల్, విద్య, ఎన్నికల సంఘం, మున్సిపల్, ఆధార్, ఇండస్ట్రీస్, కార్మిక శాఖ, సోషల్ వెల్ఫేర్, కో-ఆపరేటీవ్ వంటి ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవలను అందిస్తున్నారు. ఆదాయ, కుల వంటి ధ్రువీకరణ పత్రాలతోపాటు, భూములకు సంబంధించిన సర్టిఫికేట్లు జారీ వంటి సేవలతో పాటు, విద్యుత్, నీటి బిల్లులు, ఆస్తి పన్ను, టెలిఫోన్, ఆర్టీఏ బిల్లుల వసూలు వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మీసేవ ద్వారా 342 రకాల సేవలు అందిస్తుండగా, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సుమారు 280 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.
18.20 లక్షలకు పైగా దరఖాస్తులు..
మీసేవ కేంద్రాల ద్వారా అందించే సేవలను ఏ,బీ కేటగిరీలు గా విభజించారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే జారీ చేసే ధ్రువీకరణ పత్రాలు ఏ కేటగిరీ పరిధిలోకి రాగా, నిర్ణీత కాలపరిమితిలో జారీ చేసే ధ్రువీకరణ పత్రాలు, ఇతర సేవలు బీ-కేటగిరీ పరిధిలోకి వస్తాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వర కు మీసేవ కేంద్రాలకు మొత్తం 18.20 లక్షల దరఖాస్తులు వ చ్చాయి. ఇందులో 7.90 లక్షల దరఖాస్తులు ఏ-కేటగిరీకి సం బంధించినవి రాగా, బీ- కేటగిరీకి సంబంధించి 10.30 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 9.57 లక్షల దరఖాస్తులను అప్రూవల్ చేయగా, 52,612 దరఖాస్తులను తిరస్కరించారు.
మీసేవలో ఫస్ట్
Published Wed, Jun 18 2014 1:51 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement