Cesarean Operation
-
సిజేరియన్ ప్రసవాలపై ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు
-
సిజేరియన్లు వద్దు
సాక్షి, హైదరాబాద్: సిజేరియన్ల ద్వారా డెలివరీలు వద్దని, సాధారణ ప్రసవాలు చేసేందుకే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు, సిబ్బందికి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో, తల్లీబిడ్డలకు ప్రమాదం ఉందని గ్రహిస్తే మాత్రమే సిజేరియన్ల జోలికిపోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య పెంచాలని.. గర్భిణులు ప్రైవేటు ఆస్పత్రులకు కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరుపై మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలతో మంత్రి హరీశ్‌రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. మెదక్, ములుగు జిల్లాల్లో 80శాతం డెలివరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని, అలా ఇతర జిల్లాల్లో ఎందుకు జరగడం లేదని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత స్థానిక అధికారులు, సిబ్బందిదేనని స్పష్టం చేశారు. డెలివరీ తేదీని ముందే గుర్తించి 104 వాహనంలో దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో జాయిన్ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ జిల్లాల్లో ఎక్కువగా సిజేరియన్లు రాష్ట్రంలో సెప్టెంబర్‌లో 57.99 శాతం డెలివరీలు సిజేరియన్లు అయ్యాయని.. అత్యధికంగా హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో సిజేరియన్లు జరుగుతున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆయా జిల్లాల్లో వైద్యులు సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రయత్నించాలని ఆదేశించారు. ఇక కరోనా బూస్టర్ డోస్ పంపిణీ వంద శాతం జరిగేలా చూడాలని సూచించారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తించి, క్రమం తప్పకుండా మందులు అందించాలన్నారు. టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారి సమాచారం ఆన్లైన్లో పొందుపర్చాలని.. తద్వారా వారు డైరెక్ట్ బెనిఫిట్ స్కీంకు అర్హులవుతారని తెలిపారు. కాగా, టీబీ బారిన పడ్డవారికి సిద్దిపేట, వనపర్తిలో మాదిరిగా అన్ని జిల్లాల్లో నిక్షయ పోషకాహార కిట్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. అదే విధంగా జిల్లాల్లోని గర్భిణీలకు త్వరలో న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేయాలన్నారు. -
షాకింగ్ ఘటన.. 5 ఏళ్లుగా మహిళ పొట్టలోనే కత్తెర..!
తిరువనంతపురం: ఆపరేషన్ చేస్తూ పొట్టలోనే కత్తెర, బ్లెడ్ వంటివి వదిలేసే సంఘటనలు సినిమాల్లో చూసే ఉంటారు. అయితే, నిజ జీవితంలో అలాంటి షాకింగ్ సంఘటన కేరళలోని కోజికోడ్‌లో వెలుగు చూసింది. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 5 ఏళ్ల పాటు ఓ మహిళ పొట్టలోనే కత్తెర ఉండిపోయిన ఈ సంఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. ఐదేళ్ల తర్వాత ఆపరేషన్ చేసి మహిళ పొట్టలోంచి 11 సెంటీమీటర్ల పొడవైన కత్తెరను తొలగించారు వైద్యులు. ఐదేళ్ల క్రితం హర్షీనా అశ్రఫ్ అనే మహిళకు ఆపరేషన్ చేసిన క్రమంలో పొట్టలోనే కత్తెరను వదిలేశారు వైద్యులు. ఏం జరిగిందింటే? 2017లో మూడో కాన్పు కోసం కోజికోడ్‌లోని వైద్య కళాశాలకు వెళ్లింది బాధితురాలు హర్షీనా అశ్రఫ్. ఆపరేషన్ చేసిన తర్వాత పొట్టలో విపరీతమైన నొప్పి ఏర్పడిందని.. నొప్పి తీవ్రమవటం వల్ల మరో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంది. స్కానింగ్ తీయగా పొట్టలో కత్తెర ఉన్నట్లు తెలిసింది. ‘2017, సెప్టెంబర్ 30 ఆపరేషన్ కోసం వెళ్లాను. ఆ తర్వాత నాకు విపరీతమైన నొప్పి వచ్చింది. పలువురు వైద్యులను కలిసినా నా నొప్పికి పరిష్కారం లభించలేదు. ఆ తర్వాత సిటీ స్కాన్ చేయగా అసలు విషయం తెలిసింది. పొట్టలో ఇనుప వస్తువు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత కత్తెరగా చెప్పారు.’ అని బాధితురాలు తెలిపారు. కత్తెర ఉన్నట్లు తెలిసిన తర్వాత మళ్లీ తనకు ఎక్కడైతే ఆపరేషన్ చేశారో అదే ఆసుపత్రికి వెళ్లారు బాధితురాలు. వైద్యులకు విషయం తెలపగా.. ఆపరేషన్ చేసి కత్తెరను తొలగించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తాను అనుభవించిన నరకంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్‌లకు ఫిర్యాదు చేశారు బాధితురాలు హర్షీనా అశ్రఫ్. దీంతో ఈ అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని ఆరోగ్య శాఖ అదనపు చీఫ్ సెక్రెటరీని ఆదేశించారు ఆరోగ్య మంత్రి. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: దేశంలోనే తొలి ‘సోలార్’ గ్రామంగా మొధేరా.. ప్రధాని మోదీ ప్రకటన -
ఎమర్జెన్సీలోనూ నార్మలే..! కడుపు కోతలకు చెక్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో సాధారణ కాన్పులపై దృష్టి సారించిన వైద్యారోగ్యశాఖ అధికారులు అత్యవసర సమయాల్లోనూ నార్మల్ డెలివరీ చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. తల్లికో, బిడ్డకో ప్రాణహాని ఉంటే తప్ప సిజేరియన్ డెలివరీ చేయకూడదు. కానీ సిజేరియన్ డెలివరీతో ఎదురుకానున్న ఆరోగ్య సమస్యలపై అవగాహన లేకపోవడం, ముహూర్తాలు చూసుకుని ప్రసవాలు చేయడం వంటి కారణంగా చాలా మటుకు సిజేరియన్ డెలివరీకే మొగ్గు చూపుతుంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గర్భిణులకు మొదటి వైద్య పరీక్షల నుంచి వారిలో సాధారణ ప్రసవాల ఆవశ్యకతపై ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, ఇతర ఆరోగ్య సిబ్బంది వారిలో అవగాహన పెంచుతున్నారు. పుట్టిన బిడ్డకు మొదటి గంటలో ఇచ్చే తల్లిపాలు బిడ్డకు జీవితాంతం రోగనిరోధకశక్తిని పెంచేందుకు దోహదం చేస్తుందన్న విషయంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ చర్యలు చాలా మట్టుకు ఫలితాలిస్తోంది. వారంపాటు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనూ వైద్యారోగ్యశాఖ ముందుజాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. డెలివరీ తేదీలు దగ్గరలో ఉన్న గర్భిణులను ముందస్తుగా ప్రభుత్వాస్పత్రులకు, మాతాశిశు సంరక్షణ కేంద్రాలకు తరలించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సర్కారు దవాఖానాలో గైనకాలజీ, మత్తు డాక్టర్లు లేనందున పూర్తిగా నార్మల్ డెలివరీలే జరుగుతున్నాయి. నార్మల్ డెలివరీ కావడం సంతోషంగా ఉంది నాలుగు రోజుల క్రితం నొప్పులు రావడంతో మా కుటుంబ సభ్యులు సిద్దిపేట గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పారు. ఒక రోజు అనంతరం నార్మల్ డెలివరీతో బాబు పుట్టాడు. సంతోషంగా ఉంది. నార్మల్ డెలివరీ గురించి రెండు నెలల క్రితం ఆస్పత్రికి వచ్చిన అప్పటి నుండే వైద్యులు, సిబ్బంది అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ కావడంతో రూ.30వేల నుంచి రూ.40 వేలు ఆదా అయ్యింది. కేసీఆర్ కిట్ కూడా ఇచ్చారు. – పద్మ, బాలింత, నర్మెట నిర్మల్ ప్రభుత్వాస్పత్రిలో.. గర్భిణితో వ్యాయామం చేయిస్తున్న ఈ దృశ్యం నిర్మల్ ప్రభుత్వాస్పత్రిలోనిది. నార్మల్ డెలివరీ అయ్యేలా గర్భిణులకు ఇలా వ్యాయామంతోపాటు, కౌన్సెలింగ్ ఇస్తున్నారు. రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో గర్భిణులకు సాధారణ ప్రసవాల ఆవశ్యకతను వివరిస్తున్నారు. పడవలో వాగు దాటించారు పడవలో తీసుకొస్తున్న ఈ గర్భిణి పేరు మోర్రం పార్వతి. ములుగు జిల్లా రామచంద్రాపురం గ్రామం. గురువారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో ట్రాక్టర్లో పాత్రపురం తీసుకొచ్చి అక్కడి నుంచి పడవలో వాగు దాటించారు. అక్కడి నుంచి 108 వాహనంలో వెంకటాపురం ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి అత్యవసర సమయంలోనూ వైద్యారోగ్యశాఖ అధికారులు ఆమెకు నార్మల్ డెలివరీ చేయగలిగారు. పార్వతికి పండంటి బాబు పుట్టాడు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ముందుజాగ్రత్త చర్యగా.. భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా బీమారం గ్రామానికి చెందిన శ్రావణి అనే గర్భిణిని ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యారోగ్యశాఖ సిబ్బంది మంచిర్యాలలోని మాతాశిశుసంరక్షణ కేంద్రానికి తరలించారు. రెండు రోజుల క్రితం వైద్యులు ఆమెకు నార్మల్ డెలివరీ చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడటంతో నార్మల్ డెలివరీ అయిందని శ్రావణి తెలిపింది. చదవండి: నూతన జోనల్ విధానం ఆధారంగా గురుకులాల్లో ఉద్యోగుల కేటాయింపులు -
బిడ్డ పుట్టాలంటే తప్పని సిజేరియన్
పాలమూరు: ప్రధానంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో గర్భిణులకు సిజేరియన్ శస్త్ర చికిత్సల ద్వారానే కాన్పులు చేస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది. కొంచెం నొప్పులొస్తుండగానే భయంతో ఆస్పత్రికి పరుగులు తీస్తున్న కుటుంబాల బలహీనతే ఆసరాగా వైద్యులు కడుపుకోత పెడుతున్నారు. సాధారణ కాన్పు సులువుగా అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కాసుల వేటలో మునిగి తేలుతున్నారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితి, భవిష్యత్తును కించిత్తు దృష్టిలో ఉంచుకోకుండా ఇష్టానుసారంగా సిజేరియన్లు చేస్తున్నారు. దీంతో ఇప్పటి తల్లులకు అసలు ప్రసవ వేదనే తెలియకుండా పోతోంది. నవమాసాలు మోసిన తల్లి నొప్పులు భరించైనా తన బిడ్డకు పురుడు పోస్తుందనేది పెద్దల మాట. వైద్యులు ఆ అవకాశమే లేకుండా ధనార్జనే ధ్యేయంగా సిజేరియన్లకు పురిగొల్పుతున్నారనే ఆరోపణలున్నాయి. వైద్యుల సలహా పాటించకుంటే ఏం ప్రమాదం పొంచి ఉందోనన్న భయం బాధిత కుటుంబ సభ్యులను వెంటాడుతోంది. శస్త్రచికిత్స సమయంలో ఇచ్చే మత్తు మందు మున్ముందు వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మూడొంతులు శస్త్రచికిత్సలే జిల్లాలో 2019ఏప్రిల్‌నుంచి 2020ఫిబ్రవరి 29వరకు 15,608 మంది గర్భిణులువివిధ ఆస్పత్రుల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ఈ కాన్పులు జరుగుతున్న తీరు.. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల వ్యాపార ధోరణి విమర్శలకు తావిస్తోంది. శస్త్రచికిత్సలకు ప్రాధాన్యం ఇస్తున్న తీరు విస్తుగొలుపుతోంది. రోజురోజుకూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ కాన్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నవమాసాలు బిడ్డను ఆనందంతో మోసినా ప్రసవ సమయంలో కడుపుకోత మిగుల్చుతున్నారు. పురుడు అంటేనే పునర్జన్మ అంటారు. అలాంటిది కాన్పు అంటేనే ‘కోత’గా మారింది. శస్త్రచికిత్స కాన్పులతో చిన్నారులకు జన్మనిస్తున్న తల్లులు బిడ్డలను చూసుకుని తాత్కాలికంగా మురిసిపోతున్నారు. అనంతరం వారు వివిధ రకాల రుగ్మతలకు గురవుతున్నారు. కొంత మేర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు సాధారణ కాన్పులు చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మా త్రం దాదాపు 80శాతానికి పైగా సిజేరియన్లు జరుగుతున్నాయి. పూర్తిస్థాయి సౌకర్యాలు లేక పోవడంతో వారు సాధారణ ప్రసవం చేయడానికి సాహసించడం లేదు. దీంతో గర్భిణులకు సాంకేతిక కారణాలు చెప్పి మాయ చేస్తున్నారు. అవసరం లేకున్నా పరీక్షలు, సిజేరియన్లు చేస్తూ దండిగా డబ్బులు దండుకుంటున్నారు. పట్టించుకోని ఆరోగ్య శాఖ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇష్టారీతిన సిజేరియన్లు జరుగుతున్నా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. జిల్లాలోని చాలా ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాపారమే ధ్యేయంగా ప్రసూతి శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదులు వస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ప్రైవేట్‌లో కాసుల ప్రసూతి హవా సాగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ తమ బాధ్యతను గుర్తెరిగి ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తే తల్లి, పిల్లల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఆయా కుటుంబాలకు ఆర్థిక భారం తప్పుతుంది. జిల్లాలో సిజేరియన్ కాన్పులతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తుండటంతో ప్రజలకు ఆర్థికంగా భారమవుతోంది. పేదలకైతే మరీ నరకం, ఆస్తులు తనఖా పెట్టుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒక్కో కాన్పునకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చు అవుతోంది. ఇలా జిల్లాలో ప్రైవేట్‌లో అయిన 4,989 ప్రసవాలకు ఒక్క కేసుకు రూ.30వేలు లెక్కించినా రూ.149కోట్ల ఆదాయం వస్తుంది. సర్కార్ ఆస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే వారికి ఎలాంటి ఖర్చు ఉండదు పైగా వారే రూ.12వేలు చెల్లిచడంతో పాటు కేసీఆర్ కిట్ అందిస్తున్నారు. వైద్య వర్గాల సమాచారం మేరకు నాలుగు సందర్భాల్లోనే సిజేరియన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. సుఖ ప్రసవానికి కడుపులో బిడ్డ ఉన్న విధానం ప్రతికూలంగా ఉన్నప్పుడు, బిడ్డ బయటకు రావడానికి మాయ, కణతులు అడ్డుగా ఉండటం వంటి బలమైన కారణాలుంటేనే సిజేరియన్ చేయించాలి. దీనిపై సరైన అవగాహన లేని ప్రజలు సిజేరియన్లకు మొగ్గు చూపుతున్నారు. ప్రసవ కోతలతో దీర్ఘకాలిక నష్టాలు ♦ కడుపు కోత కారణంగా శరీర సహజత్వాన్ని కోల్పోవాల్సి వస్తోంది. ♦ మునుపటిలా శరీరం అన్ని పరిస్థితులను తట్టుకునేందుకు సహకరించదు. ♦ కనీసం ఇంట్లో పనులు చేసుకోవడంతోనూ నొప్పులు వేధిస్తుంటాయి. ♦ హెర్నియా వంటి దీర్ఘకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ♦ రెండోకాన్పు తప్పకుండా సిజేరియన్ చేయాల్సి ఉంటుంది. ♦ సిజేరియన్ జరిగే సమయంలో గర్భాశయం పక్క భాగాలపై గాయాలవడంతోపాటు ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. ♦ మత్తు మందుతో ఒక్కోసారి ప్రాణాంతక సమస్యలు తలెత్తే ప్రమాదముంటుంది. ♦ రక్తస్రావంతో అదనపు రక్తాన్ని అందించాల్సిన పరిస్థితులు వస్తాయి. ♦ రెండో కాన్పు సమయంలో తొమ్మిదో నెలలో గర్భసంచికి గతంలో వేసిన కుట్లు విడిపోయే ప్రమాదం ఉంది. ♦ గర్భసంచికి గాట్లు పెట్టి కుట్లు వేసిన ప్రాంతంలో మాయ అతక్కుపోయే అవకాశాలుంటాయి. తద్వారా భవిష్యత్‌లో అప్పుడప్పుడు తీవ్ర కడుపునొప్పి వచ్చే అవకాశాలుంటాయి. ♦ కాన్పు సమయంలో రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. రక్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్లే అవకా«శం ఉంది. దీనిని వైద్య పరిభాషలో ఎంబోలిజం అంటారు. ♦ అత్యవసరంగా ఆపరేషన్ చేస్తే ఇబ్బంది ఉండదు కానీ, అవసరం లేకున్నా చేస్తే కఠినచర్యలు తీసుకుంటాం. కేసుల వారీగా సమీక్షిస్తాం ఎక్కువ సిజేరియన్లు అవుతుంటే ఒక్కో కేసును సమీక్షించి ఎందుకు చేయాల్సి వచ్చిందో సిబ్బంది నుంచి వివరణ తీసుకుంటాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవ వైద్యసేవలు బలోపేతమయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న సిజేరియన్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఒకవేళ నార్మల్ డెలవరీ అయ్యే పరిస్థితి ఉన్నా సిజేరియన్ చేస్తే అలాంటి వారు బాధితులు ఎవరు ఉన్నా ఫిర్యాదు చేస్తే పరిశీలించి ఆస్పత్రులపై కేసులు నమోదు చేస్తాం. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులకు త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి సాధారణ ప్రసవాలపై నిబంధనలు వివరిస్తాం. – డాక్టర్ కృష్ణ,జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సాధారణ కాన్పుతో ఆరోగ్యం మెరుగు సాధారణ కాన్పు వల్ల ఆ మహిళకు ప్రయోజనం ఉంటుంది. భవిష్యత్‌లో ఎలాంటి దుష్పరిణామాలు వచ్చే అవకాశాలుండవు. పూర్తి ఆరోగ్యవంతురాలిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా శస్త్ర చికిత్సతోనే ప్రసవం చేయాల్సి ఉంటుంది. సిజేరియన్ వల్ల శరీర సహజత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. శరీరం అన్ని పరిస్థితులను తట్టుకునేందుకు సహకరించదు. కనీసం ఇంట్లో పనులు చేసుకోవడంలోనూ నొప్పులు వేధిస్తుంటాయి. మత్తు మందుతో ఒక్కోసారి ప్రాణాంతక సమస్యలు తలెత్తే ప్రమాదముంటుంది. లీటరు రక్తం వరకు వృథాగా వెళ్తుంది దీంతో అదనపు రక్తాన్ని అందించాల్సి పరిస్థితి ఏర్పడుతుంది. – రాధ, గైనిక్ హెచ్ఓడీ, జనరల్ ఆస్పత్రి -
ఒకసారి సిజేరియన్ అయితే ప్రతిసారీ అదే తప్పదా?
మొదటిసారి సిజేరియన్ అయితే రెండోసారి కూడా తప్పనిసరిగా సిజేరియనే చేయాలనే అపోహ కొందరిలో ఉంటుంది. నిజానికి అలాంటి నియమమేదీ లేదు. కాకపోతే రెండోసారి అయ్యే డెలివరీ నార్మల్‌గానే అవుతుందా లేక తప్పనిసరిగా సిజేరియన్ చేయాల్సి వస్తుందా అనే అంశం చాలా ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మొదటి ప్రెగ్నెన్సీలో సిజేరియన్ ఎందుకు చేశారు, ఎక్కడ చేశారు, ఎన్నో నెలలో చేశారు వంటి అనేక అంశాలపై రెండోసారి నార్మల్ డెలివరీయా లేక సిజేరియనా అన్నది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు... ►కొందరిలో మొదటిసారి బిడ్డ ఎదురుకాళ్లతో ఉంటే సిజేరియన్ చేసి ఉండవచ్చు. ఈసారి డెలివరీ టైమ్‌కు ఒకవేళ బిడ్డ తల కిందివైపునకు తిరిగి ఉంటే సిజేరియన్ చేయాల్సిన అవసరం ఉండదు. బిడ్డ తల కిందికే ఉంది కాబట్టి నార్మల్ డెలివరీ కోసం ఎదురు చూడవచ్చు. ►మొదటిసారి బిడ్డ చాలా బరువు ఉండి... ఆ బిడ్డ ప్రసవం అయ్యే దారిలో మామూలుగా ప్రసవం అయ్యే పరిస్థితి లేదని డాక్టర్ నిర్ధారణ చేస్తే మొదటిసారి సిజేరియన్ చేస్తారు. అదే ఈసారి బిడ్డ బరువు సాధారణంగా ఉండి, ప్యాసేజ్ నుంచి మామూలుగానే వెళ్తుందనే అంచనా ఉంటే సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించవచ్చు. అయితే కొందరిలో బిడ్డ బయటకు వచ్చే ఈ దారి చాలా సన్నగా (కాంట్రాక్టెడ్ పెల్విస్) ఉంటే మాత్రం తప్పనిసరిగా సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సిందే. ►సాధారణంగా తల్లుల ఎత్తు 135 సెం.మీ. కంటే తక్కువ ఉన్నవారికి బిడ్డ బయటకు వచ్చే దారి అయిన పెల్విక్ బోనీ క్యావిటీ సన్నగా ఉండే అవకాశం ఎక్కువ. అందుకే ఇలాంటివారిలో చాలా సార్లు సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీయాల్సివచ్చే అవకాశాలు ఎక్కువ. ►మొదటి గర్భధారణకూ, రెండో గర్భధారణకూ మధ్య వ్యవధి తప్పనిసరిగా 18 నెలలు ఉండాలి. ఎందుకంటే మొదటిసారి గర్భధారణ తర్వాత ప్రసవం జరిగాక దానికి వేసిన కుట్లు పూర్తిగా మానిపోయి, మామూలుగా మారడానికి 18 నెలల వ్యవధి అవసరం. ఒకవేళ ఈలోపే రెండోసారి గర్భం ధరిస్తే మొదటి కుట్లు అంతగా మానవు కాబట్టి అవి చిట్లే ప్రమాదం ఉంది. అలా జరిగితే బిడ్డకే కాదు... పెద్ద ప్రాణానికీ ప్రమాదం. ►మొదటిసారి సిజేరియన్ చేసే సమయంలో గర్భసంచికి నిలువుగా గాటు పెట్టి ఉంటే (క్లాసికల్ సిజేరియన్) ఇక రెండోసారి సిజేరియనే చేయక తప్పదు. (ప్రస్తుతానికి క్లాసికల్ సిజేరియన్స్ చాలా అరుదుగా చేస్తున్నారు). ఒకవేళ అప్పట్లో అడ్డంగా గాటు పెట్టి ఉంటే ఈ సారి నార్మల్ డెలివరీ కోసం అవకాశం ఇచ్చి చూడవచ్చు. పై అంశాల ఆధారంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... మొదటిసారి సిజేరియన్ అయినంత మాత్రాన రెండోసారీ తప్పనిసరిగా సిజేరియనే అవ్వాల్సిన నియమం లేదు. తల్లీ, బిడ్డా ఆరోగ్యం బాగా ఉండి, పైన పేర్కొన్న అంశాల ఆధారంగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటే దాని కోసం ప్రయత్నించవచ్చు. అయితే... మొదటిసారి సిజేరియన్ అయిన మహిళ... రెండోసారి ప్రసవాన్ని తప్పనిసరిగా ఆసుపత్రిలో (ఇన్స్టిట్యూషనల్ డెలివరీ) జరిగేలా చూసుకోవాలి. ఎందుకంటే అవసరాన్ని బట్టి అప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో డాక్టర్లు నిర్ధారణ చేసి, తగిన విధంగా చర్యలు తీసుకుంటారు. డాక్టర్ స్వప్న పుసుకూరి కన్సల్టెంట్ ఆబ్‌స్టట్రీషియన్ – గైనకాలజిస్ట్, బర్త్ రైట్ బై రెయిన్బో హాస్పిటల్స్, హైదర్‌నగర్, హైదరాబాద్ -
ఆదాయార్జనే లక్ష్యంగా ఆపరేషన్లు
అమ్మ అనే పదం అద్భుతం.. అమ్మ అనిపించుకోవడమే స్త్రీ జీవితానికి సార్థకం.. నవమోసాలు మోసి పురిటినొప్పులు భరించి శిశువును ఈ ప్రపంచానికి పరిచయం చేసే క్షణాలు ఆమెకు జన్మాంతం గుర్తుండే మధుర స్మృతులు.. ఇంతటి మహత్తర ఘట్టం కాసుల కోసం కర్కశానికి గురవుతోంది.. అమ్మా.. అనిపించుకోవడం కోసం కడుపు ‘కోత’లు మిగులుస్తోంది.. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఆదాయ ఆర్జనే లక్ష్యంగా ఇష్టారాజ్యంగా సిజేరియన్లు చేసేస్తున్నారు. తణుకు : పురిటినొప్పులతో ఆస్పత్రులకు వెళ్లే గర్భిణులకు కడుపు‘కోత’ తప్పడం లేదు. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో పలురకాలుగా మభ్యపెట్టి.. వారిచేత ఒప్పించి.. తర్వాత వేలకు వేలు గుంజు తున్నారు. ఈ వ్యాపారం జిల్లాలో యథేచ్ఛగా సాగుతోంది. అత్యధిక ఆస్పత్రులు సిజేరియన్ల ఆదాయంతోనే వృద్ధి చెందుతున్నాయన్న ప్రచారం ఉంది. కాస్తంత ప్రయత్నిస్తే సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నా బిల్లుల కోసం సిజేరియన్లు వైపు వైద్యులు మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి వంద ప్రసవాల్లో సిజేరియన్లు (ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయడం) 10 నుంచి 15 శాతం మించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబు తోంది. అయితే జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం 70 శాతం దాటుతోంది. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం సిజేరియన్లు 50 శాతానికి చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా చేయడం వల్ల తలెత్తుతున్న దుష్ఫలితాలను ఎవరూ గుర్తించడం లేదు. కేవలం కాసుల కోసమే సుఖప్రసవాలు జరిగే కేసుల్లోనూ వైద్యులు సిజేరియన్లు చేస్తున్నారు. ఇందుకు గాను అయినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చిందే తడవుగా.. ప్రైవేట్ ఆస్పత్రులకు గర్భిణి ప్రసవానికి వచ్చిందే తడవుగా కనీసం గంట కూడా నిరీక్షించకుండా సిజేరియన్ చేసేస్తున్నారు. కడుపులో బిడ్డ ఉమ్మనీరు తాగిందని అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని, లేదంటే తల్లీబిడ్డకు ప్రమాదమని చెప్పి గర్భిణుల బంధువులను భయపెట్టేస్తున్నారు. వైద్యులు చెప్పినట్టు చేయకపోతే తల్లీబిడ్డకు ఏమవుతుందోనని భయంతో వారు చెప్పినట్టు తలాడిస్తూ చేతి చము రు వదిలించుకుంటున్నారు తల్లిదండ్రులు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యులు ఒకడుగు ముందుకు వేసి ముహూర్తం పేరుతో గర్భిణులు కోరుకున్న తేదీకి సిజేరియన్ చేస్తున్నారు. ఇలా గర్భిణుల బం ధువుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. సా ధారణ ప్రసవానికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు వసూలు చేస్తుండగా సిజేరియన్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో సిజేరియన్లపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. సిజేరియన్లు తగ్గించాలని నర్సింగ్ హోమ్‌లు, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా కొన్ని ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. దుష్ఫలితాలు.. కోకొల్లలు సాధారణ ప్రసవమైనప్పుడు ఆ తల్లి మాతృత్వ అనుభూతి పొందగలుగుతుంది. ఆ అనుభూతి విలువ కట్టలేనంత గొప్పది. శస్త్రచికిత్స సమయంలో మత్తు ఇవ్వడం, ఇతరత్రా మందుల వల్ల కాన్పు అనంతరం దుష్పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఒకసారి సిజేరియన్ చేస్తే రెండో కాన్పు కూడా సిజేరియన్ తప్పనిసరిగా చేయాల్సిందే. సిజేరియన్ చేయడం వల్ల మహిళలు నడుం నొప్పి, కాళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉం టుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణ ప్రసవానికి రక్తస్రావం తక్కువగా ఉండగా సిజేరియన్‌కు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మహిళలు రక్తహీనతకు లోనయ్యే ప్రమాదం ఉంది. సిజేరియన్ కారణంగా బిడ్డకు ఉబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 20 శాతం కేసుల్లో బిడ్డకు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగాను, రోగ నిరోధిక శక్తి తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు జిల్లాలో సాధారణ ప్రసవాల కంటే సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. నిబంధనలు ప్రకారం కేవలం సాధారణ ప్రసవాలకే ప్రయత్నించాలి. అయితే జిల్లాలోని ఎ క్కువ శాతం వైద్యులు సిజేరియన్లకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇలా చేస్తే సంబంధిత ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. – వి.సుబ్రహ్మణ్యేశ్వరి, డీఎంహెచ్ఓ, ఏలూరు -
ఒకే కాన్పులో ముగ్గురి జననం
సాక్షి, సుల్తాన్‌బజార్: ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మంచిన సంఘటన శనివారం సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజ తెలిపిన వివరాల ప్రకారం... ఇబ్రహీంపట్నం ఉప్పరిపల్లి గ్రామానికి చెందిన శ్రీశైలం భార్య మల్లీశ్వరి నెలలు నిండటంతో శనివారం రెండవ కాన్పు కోసం ప్రసూతీ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేయడంతో ఆమెకు ఇద్దరు మగశిశువులు, ఆడశిశువు ఒకే కాన్పులో జన్మించారు. వారు చిన్నపిల్లల విభాగంలోని అసోలేషన్ వార్డులో వైద్యుల పర్యావేక్షణలో ఉన్నారు. -
కన్నీటి లాలి
కనురెప్పలు కూడా పూర్తిగా విప్పుకోలేదు. పేగుబంధం తడి ఆరనేలేదు. పాలు తాగాలన్న పాల పెదవుల ఆర్తి తీరనే లేదు. ఈ పసికందు తల్లిప్రేమకు దూరమైంది. పుట్టగానే కన్నప్రేమ కరువైనా.. అమ్మ పొత్తిళ్లే అనుకుని ఈ పాప తువ్వాలులో హాయిగా నిద్రపోతుంటే.. కన్నబిడ్డను కంటినిండా చూసుకోలేని ఆ అ‘మృత’మూర్తి మౌనంగానే జోలపడింది. మమతానురాగాలకు దూరమైన ఈ తల్లీకూతుళ్లకే మాట లొస్తే.. తమ దుస్థితికి కారణమైన వైద్యుల వైఫల్యాన్ని నిందిస్తారో, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తారో.. లేక.. ఇలాంటి ఎడబాటు మరే తల్లీబిడ్డకు కలిగించొద్దని దేవుడ్ని ప్రార్థిస్తారో.. (విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో బాలింత మృతి ఘటన వద్ద కనిపించిన హృదయవిదారక చిత్రమిది..) లబ్బీపేట(విజయవాడ తూర్పు): సిజేరియన్ చేయడంలో వైద్యుల నిర్లక్ష్యం బాలింత మృతికి కారణమయ్యిందని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ బంధువులు ఆదివారం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తల్లిలేని ఇద్దరు చిన్నారులను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. రెండు గంటల పాటు ఆందోళన అనంతరం గుడివాడ ఆర్డీఓ చక్రపాణి ఆస్పత్రి వద్దకు చేరుకుని బంధువులతో చర్చలు జరిపి లిఖిత పూర్వక హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా మండవల్లి మండలం గున్ననపూడి గ్రామానికి చెందిన వంగా చిట్టెమ్మ రెండో కాన్పు కోసం కలిదిండి మండలం చింతలమూరులోను పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 18న ఆమెకు పురిటి నొప్పులు రావడంతో తల్లి చాలంటి బేబీ సరోజిని ప్రసవం కోసం కైకలూరులోని కమ్యూనిటీ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో 108 వాహనంతో అక్కడి నుంచి ఏలూరు తరలించారు. అక్కడి వైద్యులూ చిట్టెమ్మకు ప్రసవం చేసేందుకు చేతులెత్తేసి.. విజయవాడ తరలించాలని సూచించారు. దీంతో మరలా అక్కడి నుంచి ఈ నెల 19న విజయవాడ పాత ఆస్పత్రిలో ప్రసూతి విభాగానికి వచ్చారు. ఒకే రోజు రెండు శస్త్రచికిత్సలు చిట్టెమ్మను విజయవాడ తరలించే సమయానికే పరిస్థితి విషమంగా మారడంతో గంటలోపే అత్యవసరంగా సిజేరియన్ నిర్వహించారు. దీంతో పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారనే ఆనందం గంటల వ్యవధిలోనే ఆవిరైంది. ఆపరేషన్ చేసిన పది గంటల తర్వాత కడుపునొప్పి తీవ్రంగా రావడంతో వైద్యులు స్కానింగ్ చేశారు. పొట్టలో ఇంట్రావాస్కులర్ సిస్టమ్(పొట్ట లోపల బ్లీడింగ్) దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీంతో మరోసారి అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి గర్భసంచిని సైతం తొలగించారు. అయితే కొన్ని పొరపాట్ల కారణంగా యూరిన్ బ్లాడర్ దెబ్బతింది. దీంతో ఇక్కడ యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలు లేక పోవడంతో గుంటూరు ఆస్పత్రికి రిఫర్ చేశారు. వారం రోజులుగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం వేకువజామున మృతి చెందింది. విజయవాడ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందంటూ బంధువులు అక్కడికి చేరుకున్నారు. చిట్టెమ్మకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌పేట పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న గుడివాడ ఆర్డీవో అక్కడికి చేరుకొని బంధువులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. -
సిజేరియన్ అయిన అమ్మలకు
చ్యూయింగ్ గమ్... సాఫీ విరేచనం! సిజేరియన్ ఆపరేషన్‌తో బిడ్డను కన్న కొత్త అమ్మలకు పేగుల కదలికలకు సంబంధించిన కొన్ని సమస్యలు చాలా సాధారణమట. అయితే తమ సమస్యను పరిష్కరించుకోవడం చాలా తేలిక అంటున్నారు శాస్త్రజ్ఞులు. వాళ్లు... జస్ట్... రోజుకు మూడుసార్లు చ్యూయింగ్ గమ్ నమిలితే పేగుల కదలికలు గణనీయంగా మెరుగుపడతాయంటున్నారు. సిజేరియన్ ద్వారా బిడ్డను కన్న కొత్త మాతృమూర్తులకు పేగు కదలికలలో ఇబ్బందులతో పాటు కడుపునొప్పి, వికారం, కింది నుంచి గ్యాస్ పోవడం, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. సిజేరియన్ ప్రసవం జరిగిన ఐదుగురిలో ఒకరు పైన పేర్కొన్న సమస్యలతో బాధపడటం మామూలే. ఇది కొందరిలో కొన్ని దుష్ప్రభావాలకు దారితీసి... ఆ తర్వాత హాస్పిటల్లో చేర్చాల్సిన పరిస్థితిని కూడా తెచ్చే ప్రమాదం ఉంది. అయితే కేవలం చ్యూయింగ్‌గమ్ నమలడం ద్వారానే ఆ సమస్య తేలిగ్గా పరిష్కారం అవుతుందంటున్నారు ఫిలడెల్ఫియాకు చెందిన పరిశోధకులు. చ్యూయింగ్ గమ్ వేసుకున్న తర్వాత అరగంట దాన్ని నములుతూ ఉండాలని వారు సూచిస్తున్నారు. ఇలా చేసే సమయంలో శరీరానికి రెండు రకాలుగా స్టిములేషన్స్ కలుగుతాయట. మొదటిది ఆ వ్యక్తి ఏదో తింటున్నందున దానికి తగినట్లుగా పేగుల కదలికలు జరిగేలా అంతర్గత అవయవాలు స్పందిస్తాయి. ఇక రెండోది చ్యూయింగ్ గమ్ నమిలే సమయంలో అంతసేపూ లాలాజలం స్రవిస్తుంది. అది లోపలికి స్రవించాక పేగులు దానికి తగినట్లుగా కదలికలు సంతరించుకుంటాయని పేర్కొంటున్నారు ఈ పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ బెర్ఘెల్లా. అయితే రోజుకు మూడుసార్లు... ప్రతిసారీ అరగంటకు మించనివ్వవద్దని కూడా సూచిస్తున్నారు. మరింత ఎక్కువగా చ్యూయింగ్‌గమ్ నమలడం వల్ల అందులోని విరేచనకారక ఔషధగుణం ఉన్న పదార్థాల వల్ల కొన్నిసార్లు విరేచనాలు అయ్యే అవకాశం కూడా ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. -
రెబెక్కాకు కలసి వచ్చే కాలం వచ్చింది
కలసివచ్చే కాలం వస్తే నడచి వచ్చే కొడుకు పుడతాడంటారు. అయితే న్యూజిలాండ్‌కు చెందిన రెబెక్కా ఓల్డమ్కు నడిచి వచ్చే కొడుకు పుట్టకపోయినా.. తాను షాక్‌కు గురయ్యేలా.. కొడుకు పుట్టేశాడు. విషయం ఏంటంటే.. 25 ఏళ్ల రెబెక్కా కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. మూడుసార్లు స్కాన్లు, రెండుసార్లు రక్త పరీక్షలు, ఆరుసార్లు ప్రెగ్నెన్సీ పరీక్షలు చేసిన తర్వాత ఆ నొప్పికి కడుపులోని ఓవరీస్ కారణమని వైద్యులు తేల్చారు. ఓవరీస్ తొలగిస్తే ఇక పిల్లలు పుట్టరని తెలిసినా నొప్పి భరించలేకపోతున్న రెబెక్కా వాటిని తొలగించాలనే నిర్ణయానికి వచ్చి ఆపరేషన్‌కు సిద్ధమైంది. శస్త్రచికిత్స మొదలుపెట్టిన వైద్యులు రెబెక్కా కడుపులో పూర్తిగా ఎదిగిన, ఆరోగ్యవంతమైన మగ బిడ్డను చూసి ఆశ్చర్యపోయారు. సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అనుకోని పుత్రోదయంతో రెబెక్కా, ఆమె భర్త జేమ్స్ టిపేన్ పట్టలేని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే వీరికి 20 నెలల హేలే ఉన్నాడు. దీనిపై ఆస్పత్రి ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రతి ఆరు వందల మంది గర్భిణుల్లో ఒకరికి తాము గర్భం ధరించామనే విషయం తెలియదన్నారు. ఇది సాధారణంగా పనిచేసే మహిళల్లో, మెనోపాజ్‌కు చేరువలో ఉన్న వాళ్లలో జరుగుతుందన్నారు. కొంతమంది గర్భవతులుగా ఉన్నా బ్లీడింగ్ జరుగుతూనే ఉంటుందన్నారు. రెబెక్కా కేసు కూడా ఇలాంటి కోవలోదేనని తేల్చేసి తమ తప్పును కప్పిపుచ్చేసున్నారు.