chaild labour
-
‘ఆపరేషన్ స్మైల్’ ఐదో దఫా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తప్పిపోయిన చిన్నారులు, బాల కార్మిక వ్యవస్థలో నిర్బంధంగా పనిచేస్తున్న మైనర్లు, వ్యభిచార కూపాల్లో బాల్యాన్ని బంధీగా చేయబడ్డ బాలికలను రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ స్మైల్ ఐదో దఫా కార్యక్రమం సోమవారం ప్రారంభమైం ది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్, మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ సుమతి, మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి ప్రారంభించారు. 22 వేల మంది రెస్క్యూ.. గత 4 దఫాల ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 22 వేల మంది చిన్నారులను పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థలు రెస్క్యూ చేశాయి. వీరిలో 60% మందిని తల్లిదండ్రులకు అప్పగించగా, మిగతా వారి ని స్టేట్ హోమ్స్‌కు తరలించి విద్య, వసతి కల్పిస్తున్నారు. ఈసారీ అదే రీతిలో పారిశ్రామిక వాడల్లో బాల కార్మికులుగా ఉన్న వారిని గుర్తించడం, బెగ్గింగ్ మాఫియా కింద భిక్షాటనలో నలిగిపోతున్న చిన్నారులను రెస్క్యూ చేయడం, వ్యభిచారంలో మగ్గుతున్న మైనర్లను బయటపడేసేందుకు కృషి చేయనున్నట్టు ఐజీ స్వాతి లక్రా తెలిపారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 174 మంది అధికారులను ప్రత్యేకంగా ఆపరేషన్ స్మైల్ కోసం రంగంలోకి దించుతున్నామని చెప్పారు. వీరందరికి సోమవారం అవగాహన, రెస్క్యూ ఆపరేషన్ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పించినట్టు తెలిపారు. ఫేసియల్ రికగ్నైజేషన్.. రెస్క్యూ సందర్భంగా గుర్తించిన చిన్నారులు, మైనర్లు వారి వారి వివరాలు చెప్పేందుకు భయపడటం లేదా తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు ఇబ్బంది పడతారని, ఇలాంటి సందర్భంలో రాష్ట్ర పోలీస్ శాఖ రూపొం దించిన ‘దర్పన్’ ఫేసియల్ రికగ్నైజేషన్ యాప్‌ను విస్తృతంగా ఉపయోగించుకోవాలని శిక్షణలో అధికారులకు సూచించారు. దేశవ్యాప్తంగా అదృశ్యమైన వారి వివరాల డేటా బేస్ అందుబాటులో ఉంటుం దని, చిన్నారుల ఫొటోలను సరిపోల్చి అడ్రస్, ఇతర వివరాలు గుర్తించనున్నట్లు చెప్పారు. దీని వల్ల ఆయా ప్రాంతాల్లోని పోలీసులను అలర్ట్ చేసి తల్లిదం డ్రులకు పిల్లలను అందజేయడం సులభంగా ఉం టుందని శిక్షణలో ఉన్నతాధికారులు సూచించారు. నెల రోజులపాటు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం కొనసాగుతుందని, ఎలాంటి సమాచారం ఉన్నా పోలీస్ శాఖకు తెలిపేందుకు ప్రజలు ముందుకు రావాలని సీఐడీ ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు. -
బాల కార్మికులు లేని సమాజం కోసం..
‘ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐ.ఎల్.ఓ.) జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినంగా జరపాలని తీర్మానించింది. పిల్లలను దొంగ తనంగా రవాణా చెయ్యడాన్ని ఆపడం, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం బాలకార్మికులు బడిబాట పట్టేలా చూడటం ఈ దినోత్సవ లక్ష్యం. 2002 నుంచి ప్రతియేటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అభి వృద్ధి చెందిన దేశాలలో కూడా బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 27.6 కోట్ల మంది పిల్లలు బాలకార్మికులుగా ఉన్నారని సర్వేలు, గణాంకాలతో సహా వెల్లడిస్తున్నాయి. తల్లిదండ్రులు అనాధలు కావడం, కుటుంబ పేదరికం, నిరక్షరాస్యత తదితర కారణాలవల్ల బాలలు కార్మికులుగా మారుతున్నారు. కర్మాగారాలలో, హోటల్స్‌లో, రైల్వే, బస్సు స్టేషన్లు, వీధులలో బాల కార్మికులు కని పిస్తున్నారు. చాలీ చాలని జీతాలతో పనులు చేస్తూ బతుకు బండిని లాగుతున్నారు. బాల కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడు తున్నా ఫలితాలు శూన్యం. సరైన సమయానికి తిండి దొరకక పస్తులు ఉంటూ రోగాలపాలవుతున్నారు బాల కార్మికులు. వీధులలో తిరుగుతూ పడేసిన వాటర్ బాటిళ్లు, చిత్తు కాగితాలు, కవర్లు ఏరుకుంటూ జీవితం గడుపుతు న్నారు. గ్రామాలలో బడి ఈడు గల పిల్లలు బడికి వెళ్లకుండా పశువులను మేపడానికి వెళ్లడం, లారీలు, ట్రాక్టర్లు, ప్రైవేటు బస్సులలో క్లీనర్లుగా పనిచేస్తూ బాల కార్మికుల సంఖ్య పెరగడానికి కారణాలుగా నిలుస్తున్నారు. చట్టాలను అమలు చేస్తున్న నాయ కుల ఇళ్లలో బాల కార్మికులు పనిచేస్తున్నట్లు పత్రిక లలో కథనాలు కూడా గతంలో వచ్చాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా, వివిధ దేశాలలో బాల కార్మి కుల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సమా జంలో భాగస్వాములైన మనమందరం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు నడుం బిగిద్దాం. బాల కార్మి కులతో మాట్లాడి పాఠశాలల్లో చేర్పిద్దాం. అనాథ లైన బాల కార్మికులను ప్రభుత్వ వసతి గృహాలలో ఉండేలా ప్రవేశం కల్పిద్దాం. దేశ అభివృద్ధికి అవరో ధంగా నిలుస్తున్న బాలకార్మిక వ్యవస్థను తరిమి కొట్ట డానికి ప్రతి ఒక్కరం ముందుకు వద్దాం. (నేడు ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం) కామిడి సతీష్ రెడ్డి, జెడలపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ‘ మొబైల్ : 98484 45134 -
చైల్డ్‌లైన్‌కు పట్టుబడ్డ బాల కార్మికులు
పలాస : కాశీబుగ్గ రైల్వే గేట్ సమీపంలోని సంతోషిమాత గుడి వద్ద యాచక వృత్తి చేస్తూ కనిపించిన ఐదుగురు బాల కార్మికులను చైల్డ్‌లైన్ సిబ్బంది గుర్తించి కాశీబుగ్గ పోలీసుల సహకారంతో శుక్రవారం మధ్యాహ్నం పట్టుకున్నారు. హర్యానా రాష్ట్రం పానిపట్ జిల్లా సమాలికా గ్రామానికి చెందిన ప్రియాంక(4), సోను(10), జగన్(7), రాహుల్(5), సకీనా(2) పిల్లలను చైల్డ్‌లైన్ టీము లీడర్ బమ్మిడి అరుణ పట్టుకున్నారు. చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ జె.భాగ్యలక్ష్మి, ప్రతినిధి పి.కామేష్‌లు కలిసి కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు పిల్లలను తీసుకెళ్లి అక్కడ నుంచి పోలీసుల సహకారంతో శ్రీకాకుళం బాలల సంరక్షణ సంఘానికి అప్పగించడానికి వెళ్లారు. పిల్లల చేత యాచక వృత్తి చేయిస్తూ తండ్రిగా చెప్పుకుంటున్న కర్తార్‌సింగ్‌ను కూడా వెంట తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ చిన్నారుల చేత యాచక వృత్తి చేయడంగానీ, బాలకార్మికులుగా ఇతర పనులు చేయించినా చట్టరీత్యా నేరమని, అందుకు బాలల సంక్షేమ సంఘానికి అప్పగిస్తున్నట్టు చెప్పారు.