chakarimetla
-
చాకరిమెట్లలో భక్తుల పూజలు
శివ్వంపేట : జిల్లాలో ప్రసిద్ధి చెందిన చాకరిమట్లె శ్రీసహకార ఆంజనేయస్వామి, సత్యనారాయణస్వామి ఆలయాల్లో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. జంట నగరాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. దంపతులు సత్యనారాయణస్వామి మంటపంలో సామూహిక వ్రతాలు ఆచరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, పౌండర్ ఆంజనేయశర్మ, ఈఓ సారశ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
చాకరిమెట్లలో బన్వర్‌లాల్ పూజలు
శివ్వంపేట: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్‌లాల్ కుటుంబ సమేతంగా ప్రసిద్ధి చెందిన చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయస్వామిని గురువారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ ఫౌండర్, చైర్మన్ ఆంజనేయశర్మ పూర్ణకుంభంతో బన్వర్‌లాల్ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా బన్వర్‌లాల్ విలేకరులతో మాట్లాడుతూ.. ఆంజనేయస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే ఓటరు నమోదు కార్యక్రమం నిర్వమిస్తామన్నారు. కార్యక్రమంలో అర్చకులు రాధాకిషన్‌రావు శర్మ, సిబ్బంది రామకృష్ణ ఉన్నారు.