challa chandraiah
-
ఆర్టీసీకి ఆక్సిజన్ వైఎస్ కుటుంబం
తిరుపతి అర్బన్: వెంటిలేటర్‌పై ఉన్న ఆర్టీసీకి ఆక్సిజన్ అందించింది వైఎస్ కుటుంబమేనని ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య తెలిపారు. తిరుపతిలో బుధవారం వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో చల్లా చంద్రయ్య మాట్లాడుతూ.. డిసెంబర్ 14న జరుగనున్న ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికల్లో అసోసియేషన్ విజయ పతాకాన్ని ఎగురవేయాలని చెప్పారు. 1999లో అప్పటి నేతలు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేశారని చెప్పారు. అయితే 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న 27వేల మందిని ఆర్టీసీలో భాగస్వాములు చేశారని చెప్పారు. అదేవిధంగా ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ పోరాటం చేయకపోయినా.. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం హర్షణీయమన్నారు. ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర, జోనల్, రీజనల్‌కు చెందిన లతారెడ్డి, టీవీ మురళీధరన్, అర్జున్, ఎంటీఆర్ రెడ్డి, రాంబాబు, పరంధామయ్య, మణితోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన డిపో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం
► ఆర్టీసీ యాజమాన్యంపై ఎన్‌ఏంయూ నేతల ధ్వజం బస్‌స్టేషన్ (విజయవాడ తూర్పు) : ఆర్టీసీ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా ఉందని ఎన్‌ఏంయూ (నేషనల్ మజ్దూర్ యూనియన్) గ్యారేజి వర్క్‌షాపు నేతలు ధ్వజమెత్తారు. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లోని ఎన్‌ఏంయూ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం గ్యారేజీ వర్క్‌షాపు నేతలతో రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. బస్సుల పనితీరును పరిశీలించే విభాగంపై యాజమాన్యం వహిస్తున్న నిర్లక్ష్య ధోరణితో వస్తున్న సమస్యల్ని రాష్ట్ర వ్యాప్తంగా హాజరైన జోనల్ నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు చల్లాచంద్రయ్యకు వివరించారు. చల్లాచంద్రయ్య మాట్లాడుతూ కనీసం కారుకు తీసుకున్న జాగ్రత్తల్ని సైతం బస్సుకు తీసుకోకపోవడం దారుణమన్నారు. మానవశక్తి, విడిభాగాలు అందించడంలో యాజమాన్యం విఫలమయ్యిందన్నారు. అవి లేక గ్యారేజీల్లో కార్మికులు పనులు చేయలేకపోతున్నారన్నారు. మారుతున్న కాలనుగుణంగా విడిభాగాల్ని అందించలేకపోతున్నారన్నారు. దశబ్దాలుగా గ్యారేజీలో బస్సు పరిశీలన విభాగంలో ఉన్న 4 షెడ్డుల్ని కుదించేందుకు అధికారులు ఆలోచిస్తున్నారన్నారు. ఈ సమస్యల్ని యాజమాన్యం పరిష్కరించకపోతే ప్రభుత్వం జోక్యం చేసుకుని కొత్త బస్సులు వస్తేనే సమస్యలకు పరిష్కారమన్నారు. చల్లా చంద్రయ్య మాట్లాడుతూ ఈ సమస్యలపై యాజమాన్యంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు రావి సుబ్బారావు, తోట వెంకటేశ్వరరావు, శ్రీనివాసులు, జోన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.