chamundeswari temple
-
చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించిన రామ్ చరణ్, ద్రావిడ్
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మైసూరులోని చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా వారాంతం ప్రారంభంలోనే చాముండేశ్వరిని దర్శించుకున్నారు. రామ్ చరణ్ తన 'గేమ్ ఛేంజర్' చిత్ర బృందంతో కలిసి ఆలయానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం చాముండేశ్వరి దర్శనం చేసుకున్నారు. రామ్ చరణ్ తన తదుపరి చిత్రం గేమ్ ఛేంజర్ షూటింగ్ కోసం మైసూరులో ఉంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయానికి వెళ్లారు. రాహుల్ ద్రావిడ్ తన కుమారుడి క్రికెట్ ఆట చూసేందుకు మైసూర్ వచ్చారు. ఇదే సమయంలో చాముండి కొండను ఆయన సందర్శించారు. కోచ్ రాహుల్ ద్రవిడ్ తన భార్య విజయతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అండర్-19 కూచ్ బెహార్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ కర్ణాటక, ఉత్తరాఖండ్ మధ్య మైసూరులోని మానసంగోత్రిలో ఉన్న శ్రీకాంత్ దత్తా నరసింహరాజ వడయార్ స్టేడియంలో జరుగుతోంది. ఇందులో ద్రవిడ్ కుమారుడు ఆడుతున్నాడు. అతని ఆటను చూసేందుకు ద్రావిడ్‌తో పాటు అతని భార్య మైసూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈ స్టార్స్ చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ద్రావిడ్,రామ్ చరణ్‌తో సెల్ఫీలు దిగారు. -
చాముండేశ్వరీ ఆలయంలో చోరీ
చిలప్‌చెడ్(నర్సాపూర్): చాముండేశ్వరీ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు దొంగతానానికి పాల్పడిన సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ఆలయ తలుపులు తెరిచేందుకు మోతీలాల్ శర్మ వెళ్లగా గేట్ తాళం పగులగొట్టి ఉందని, ఈ విషయం ఆలయ నిర్వహకుడు శోభన్‌కు తెలియజేయగా, అతను పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా దుండగులు ఆలయ మెయిన్ గేటు తాళం పగులగొట్టి, ప్రసాదం కౌంటర్ గ్రిల్స్ తొలగించి కౌంటర్లోని సుమారు రూ.6వేలు దొంగలించి, బీరువాలోని రికార్డులు చిందరవందర చేసినట్టు గ్రహించారు. అక్కడే ఉన్న కంప్యూటర్ మానిటర్, ఎంప్లిఫైర్ తో పాటు హోమగుండం వద్ద ఉన్న చిన్న హుండీ దొంగలించారని వారు గుర్తించారు. ఆ హుండీని ఆలయం వెనుకల పడేశారని వెల్లడించారు. అనంతరం గుడిలోని సీసీ పుటేజీలను పరిశీలించగా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వ్యక్తి హుండీని ఎత్తుకెళ్లినట్లు రికార్డు అయినప్పటికీ ఫుటేజ్ క్లారిటీ లేదని పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యమే కారణమా..? ఆలయంలో సిబ్బంది నిర్లక్ష్యంతోనే దొంగతనం జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయంలో నిద్రించాల్సిన సిబ్బంది, వాచ్మెన్లే ఆలయంలో లేరని, మొత్తం 8 సీసీ కెమెరాలు ఉన్న ఆలయంలో కేవలం ఐదు మాత్రమే ఎందుకు పనిచేస్తున్నాయని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే పనిచేస్తున్న వాటినలో రెండు మాత్రమే క్లారిటీ ఉన్నాయని. ఆలయ నిర్వహకులు సీసీ కెమెరాల నిర్వహణ కూడ సక్రమంగా నిర్వహించకపోవడం గమనార్హం. కాగా త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఎస్సై పేర్కొన్నారు. -
చాముండేశ్వరీదేవి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
గంగపట్నం(ఇందుకూరుపేట): మండలంలోని గంగపట్నంలో కొలువైన చాముండేశ్వరీదేవి అమ్మవారి నూతన సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. కొర్నా బలరామయ్య జ్ఞాపకార్థంగా కేబీఆర్ ఆర్థోపెడిక్ ఆస్పత్రి(నెల్లూరు) ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ నటులు భానుచందర్, చంద్రమోహన్, గుండు హనుమంతురావు ముఖ్యఅతిథులుగా హాజరై క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా భానుచందర్ మాట్లాడుతూ మానవ జన్మ ఉత్తమమైనదన్నారు. సమాజంలో అందరూ సమానమేనన్నారు. కోరికలు నెరవేర్చుకోవాలంటే ముందు మనిషి ఆరోగ్యాన్ని కాపడుకోవాలన్నారు. వ్యాయామం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. చంద్రమోహన్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. గుండు హునుమంతరావు మాట్లాడుతూ అమ్మవారి క్యాలెండర్ ఆవిష్కరణకు హాజరుకావడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేబీఆర్ ఆర్థోపెడిక్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ జీ సతీష్‌కుమార్ సతీమణి డాక్టర్ స్వప్న, మదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు కొర్నా నారాయణరావు ముదిరాజ్, కొనగట్ల రఘురాం ముదిరాజ్, జిల్లా నాయకులు జీ ఎల్లయ్య ముదిరాజ్, పీఎల్ రావు ముదిరాజ్, కొలపర్తి రమేష్, తదితరులు పాల్గొన్నారు.