చాముండేశ్వరీదేవి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
గంగపట్నం(ఇందుకూరుపేట): మండలంలోని గంగపట్నంలో కొలువైన చాముండేశ్వరీదేవి అమ్మవారి నూతన సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. కొర్నా బలరామయ్య జ్ఞాపకార్థంగా కేబీఆర్ ఆర్థోపెడిక్ ఆస్పత్రి(నెల్లూరు) ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ నటులు భానుచందర్, చంద్రమోహన్, గుండు హనుమంతురావు ముఖ్యఅతిథులుగా హాజరై క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా భానుచందర్ మాట్లాడుతూ మానవ జన్మ ఉత్తమమైనదన్నారు. సమాజంలో అందరూ సమానమేనన్నారు. కోరికలు నెరవేర్చుకోవాలంటే ముందు మనిషి ఆరోగ్యాన్ని కాపడుకోవాలన్నారు. వ్యాయామం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. చంద్రమోహన్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. గుండు హునుమంతరావు మాట్లాడుతూ అమ్మవారి క్యాలెండర్ ఆవిష్కరణకు హాజరుకావడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేబీఆర్ ఆర్థోపెడిక్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ జీ సతీష్‌కుమార్ సతీమణి డాక్టర్ స్వప్న, మదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు కొర్నా నారాయణరావు ముదిరాజ్, కొనగట్ల రఘురాం ముదిరాజ్, జిల్లా నాయకులు జీ ఎల్లయ్య ముదిరాజ్, పీఎల్ రావు ముదిరాజ్, కొలపర్తి రమేష్, తదితరులు పాల్గొన్నారు.