chandana deepti
-
రేషన్ బియ్యం దందా.. 8మంది అరెస్ట్
నల్లగొండ క్రైం: జిల్లాలోని పలు రైస్ మిల్లుల నిర్వాహకులు ప్రభుత్వ గోదాం నుంచి రేషన్ బియ్యాన్ని నేరుగా మిల్లులకు తరలించి వాటిని ఇతర బ్యాగుల్లోకి మార్చి తిరిగి అవే బియ్యాన్ని ప్రభుత్వానికి సీఎంఆర్ బియ్యంగా సరఫరా చేస్తున్నారని నల్ల గొండ ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. ఈ దందా కొనసాగిస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేయడంతో పాటు 600 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసు వివరాలను సోమవారం ఏఎస్పీ రాములునాయక్‌తో కలిసి ఎస్పీ నల్లగొండలోని తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలంలోని తెప్పలమడుగు గ్రామ స్టేజీ వద్ద గల అమ్మ రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినట్లు అందిన సమాచారం మేరకు జిల్లా టాస్క్‌ఫోర్స్, పెద్దవూర పోలీస్ స్టేషన్ సిబ్బంది మిల్లులో తనిఖీలు చేయగా.. 600 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. ఐకేపీ సెంటర్ ద్వారా ప్రభుత్వ గుర్తింపు పొందిన రైస్ మిల్లులకు ధాన్యం సరఫరా చేసి, ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి వేర్‌హౌజ్ కార్పొరేషన్ స్టేజీ–1 గోదాంలోకి సప్లయ్ చేస్తారు. ఈ గోదాం నుంచి మండలస్థాయి స్టాక్ పాయింట్‌కు పీడీఎస్ బియ్యం పంపి అక్కడ నుంచి గ్రామాల్లోని రేషన్ డీలర్లకు సరఫరా చేస్తారు. బియ్యం సరఫరా సమయంలో లారీలకు జీపీఎస్‌తో పాటు ట్రక్ రసీదులు డీలర్‌కు అందజేస్తారు. డీలర్ నుంచి లబ్ధిదారులు బియ్యం తీసుకోవాల్సి ఉంటుంది. కొందరు డీలర్లు లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా డబ్బులు, ఇతర వస్తువులు ఇచ్చి బియ్యాన్ని తమ వద్దనే నిల్వ చేసుకుంటున్నారు. డీలర్లు మండలస్థాయి స్టాక్ పాయింట్ వద్ద నుంచి ప్రతినెలా తీసుకోవాల్సిన బియ్యంలో తక్కువ తీసుకొని కాగితాలపై మాత్రం మొత్తం తీసుకున్నట్లు రాయించి డబ్బులు తీసుకుంటున్నారు. మండలస్థాయి స్టాక్ పాయింట్ వారు కూడా వేర్‌హౌజ్ కార్పొరేషన్ గోదాం నుంచి బియ్యాన్ని తీసుకోకుండా కాగితాలపై తీసుకున్నట్లు రాయించి డబ్బులు తీసుకుంటున్నట్లు గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. వేర్‌హౌజ్ కార్పొరేషన్ గోదాంలో పనిచేస్తున్న కొందరు అక్రమార్కులు రైస్ మిల్లర్లతో కుమ్మకై ్క ప్రభుత్వ గోదాం నుంచి రేషన్ బియ్యాన్ని నేరుగా ఇతర మిల్లులకు తరలిస్తున్నారని, వాటిని మిల్లర్లు ఇతర బ్యాగుల్లో ప్యాక్ చేసి తిరిగి అవే బియ్యాన్ని ప్రభుత్వానికి సీఎంఆర్ రైస్‌గా సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ బియ్యాన్ని ఏపీలోని కాకినాడ పోర్టు ద్వారా ఇతర ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు.అరెస్టయ్యింది వీరే..ఈ దందాకు సంబంధించి ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అమ్మ రైస్ మిల్లు యజమాని మల్గిరెడ్డి రామానుజరెడ్డి, అనుముల మండలం హాలియాకు చెందిన సివిల్ సప్లయ్ స్టేజ్–2 కాంట్రాక్టర్ బూరుగు శ్రీనివాసులు, హాలియాలోని హనుమాన్ రెసిడెన్సీ కాలనీకి చెందిన కుక్కడపు రమేష్, నల్లగొండ పట్టణ సమీపంలోని మర్రిగూడకు చెందిన పేర్ల శ్రీకాంత్, అదే గ్రామానికి చెందిన లింగాల మల్లేష్, పెద్దవూర మండలం తెప్పలమడుగుకు చెందిన వెంపటి సంతోష్‌కుమార్, అదే గ్రామానికి చెందిన లింగంపల్లి సైదులు, హాలియాలోని ప్రతాప్‌నగర్‌కు చెందిన ఎడ్ల ఆంజనేయులును అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి ప్రభుత్వాన్ని మోసం చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమన్నారు. ప్రభుత్వ పథకాల్లో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై సమగ్ర విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
నల్లగొండ ఎస్పీగా చందనాదీప్తి
నల్లగొండ క్రైం: జిల్లా ఎస్పీ అపూర్వరావు బదిలీ అయ్యారు. ఆమెను ప్రభుత్వం సీఐడీ ఉమెన్ ప్రొటక్షన్ ఎస్పీగా బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అపూర్వరావు 2023, జనవరి 26న నల్లగొండలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండ జిల్లా నూతన ఎస్పీగా ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న చందనాదీప్తిని ప్రభుత్వం నియమించింది. 2012 బ్యాచ్‌కు చెందిన చందనా దీప్తి ట్రెయినీ ఐపీఎస్‌గా నల్లగొండ జిల్లాలో విధులు నిర్వహించారు. ఇక్కడి రాజకీయ, ఆర్థిక, సామాజిక, నేరాలపై ఆమెకు పూర్తి అవగాహన ఉంది. ట్రెయినీ ఐపీఎస్‌గా నల్లగొండలో విధులు చందనాదీప్తి 1983లో వరంగల్‌లో జన్మించారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆమె విద్యాభ్యాసం వివిధ ప్రాంతాల్లో సాగింది. ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సు పూర్తి చేశారు. సివిల్స్ వైపు దృష్టి సారించి హైదరాబాద్‌లోని కోచింగ్ తీసుకుని రెండో ప్రయత్నంలో ఐపీఎస్ ర్యాంకు సాధించారు. ఐపీఎస్‌గా సెలక్ట్ అయ్యాక నల్లగొండలో ట్రెయినీ ఐపీఎస్‌గా విధులు నిర్వహించారు. తర్వాత తాండూరు ఏఎస్పీగా, నిజామాబాద్ ఓఎస్డీగా, మెదక్ ఎస్పీగా, నార్త్ జోన్ డీసీపీగా విధులు నిర్వహించారు. మెదక్ ఎస్పీగా ఉన్న సమయంలో ‘ఆస్క్ మెదక్ ఎస్పీ’ పేరుతో ఫేస్బుక్ పేజీని క్రియేట్ చేసుకుని ఆ జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. చిట్యాల పోలీస్స్టేషన్లోనూ.. చిట్యాల : నల్లగొండ జిల్లా నూతన ఎస్పీగా బదిలీపై వచ్చిన చందనాదీప్తి మూడు నెలల పాటు చిట్యాల పోలీస్‌స్టేషన్‌లో కొంతకాలం ఐపీఎస్ ట్రెయినీ విధుల్లో భాగంగా ఎస్ఐగా విధులను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓ ముఠా సమాచార కమిషనర్ ఫేక్ ఐడీకార్డులు సృష్టించి కార్ల నంబర్ ప్లేట్లపై సమాచార కమిషనర్‌గా పేర్లతో రాసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టోల్గేట్ల వద్ద ఉచితంగా వెళ్తున్న వాహనాలను అప్పట్లో ఆమె పట్టి వేశారు. అనంతరం ఫేక్ ఐడీ కార్డులు సృష్టించిన ముఠా సభ్యులను పట్టుకుని కేసులు నమోదు చేశారు. -
శ్రీనివాస్ హత్యకు రూ.కోటిన్నర వ్యవహారమే కారణం
-
Medak: కారు డిక్కీలో శవం.. ప్రధాన నిందితుడు అరెస్ట్
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మండల పరిధిలో కారు డిక్కీలో మృతదేహాన్ని ఉంచి దగ్ధం చేసిన కేసును జిల్లా పోలీసులు చేధించారు. మృతుడిని రియల్టర్ శ్రీనివాస్‌గా గుర్తించారు. గొంతు కోసి శ్రీనివాస్‌ను చంపేసినట్లు తెలిపారు పోలీసులు. ఈ సందర్భంగా మెదక్ ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 10న యశ్వంత్ రావ్పేట గ్రామంలో మృతదేహం దొరికింది. ఆగస్టు 9 రాత్రి దగ్దం చేయడం జరిగింది. మృతదేహాన్ని రియల్టర్ శ్రీనివాస్‌దిగా గుర్తించాము. శ్రీనివాస్ భార్య మాకు ఫిర్యాదు ఇచ్చింది. ముగ్గురు నిందితులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ప్రధాన నిందితుడు శివను అరెస్ట్ చేసాం. ఏ-2 పవన్, ఏ-3 నిఖిల్‌లు పరారీలో ఉన్నారు’’ అని తెలిపారు. ‘‘మృతుడు శ్రీనివాస్ మెదక్ నుంచి ఆగస్టు 9 న ఇంటి నుండి బయటకు వచ్చాడు. శివ, నిఖిల్ ఇద్దరు కార్లో శ్రీనివాస్‌ను ఎక్కించుకుని వెళ్లారు. కార్ దగ్దం చేసిన ప్రాంతంలోనే శ్రీనివాస్‌ను హత్య చేశారు. హత్య కు ప్రధాన కారణం వ్యాపార లావాదేవీలు. టెక్నీకల్ ఏవిడెన్స్, సయింటిఫిక్ ఏవిడెన్స్ ఆధారంగా కేసును ఛేదించాము. ఈ కేసులో ప్రధాన నిందితుడు శివను పోలీసు కస్టడీకి తీసుకుంటాము. గతంలో శివపై రౌడీ షీట్ ఓపెన్ అయ్యింది. ప్రస్తుతం కేసు విచారణ సాగుతోంది’’ అని తెలిపారు. -
బలరాం-చందనాదీప్తిని ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త బలరాం రెడ్డి-మెదక్ జిల్లా ఎస్పీ చందనాదీప్తిల వివాహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. తాజ్‌కృష్ణలో జరిగిన ఈ విహహా వేడుకకు సీఎం వైఎస్ జగన్ తన సతీమణి భారతిరెడ్డితో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా, వరుడు బలరాం రెడ్డి సీఎం వైఎస్ జగన్‌కు బంధువు. అంతకుముందు ఫోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్ష రెడ్డి - సోమ వివాహ నిశ్చితార్థానికి సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. -
మెదక్ చర్చి నిర్మాణం అద్భుతం..
సాక్షి, మెదక్: వాహ్.. వండర్ఫుల్.. ఈ నిర్మాణం ప్రపంచలోనే అద్భుతం. ఆకలితో అలమటించే ప్రజల కడుపునింపి పరలోక ప్రభువు ఆలయ నిర్మాణం కావడం మహా అద్భుతమని ఇంగ్లాండ్ కాంటర్బరి ఆర్చ్ బిషప్ డాక్టర్ జస్టిన్ వెల్‌బి పేర్కొన్నారు. తన యాత్రలో భాగంగా గురువారం ఆయన మెదక్ పట్టణంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సీఎస్ఐ చర్చ్‌ను సందర్శించారు. స్థానిక బిషప్ రెవరెండ్ సాల్మాన్రాజ్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. మెదక్ పట్టణంలోని ప్రధాన తపాల కార్యాలయం నుంచి సీఎస్ఐ చర్చ్ వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణలోని వివిధ సంస్కృతుల కళాకారులు ఆయనకు తమ ఆహ్వానం పలికారు. ఇందులో గోండు, కోయ, లంబాడ, కోలాటం, చిరుతలు తదితర కళాకారులు నృత్యాలు చేస్తూ ఆయనకు ఆహ్వానం పలికారు. చర్చ్ ప్రాంగణంలోని క్రైస్తవ మతాన్ని సూచించే జెండాలను జస్టిన్ వెల్‌బి దంపతులు ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ–ఆంధ్రా రాష్ట్రాల్లోని చర్చ్‌ల పాస్టర్లు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆచారంలో భాగంగా సిలువతో చర్చ్ చుట్టూ ప్రదక్షణ కొనసాగించారు. అనంతరం చర్చ్‌లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన దేవుని సందేశాన్నిస్తూ.. ప్రేమ, సమాధానం, సమానత్వం, ఒకరినొకరు ప్రేమతో గౌరవించడం దేవుని చూపిన మార్గమని, వీటిని ప్రతి వ్యక్తి అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. దేవుని ముందు మోకరిల్లుతూ ప్రార్థనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మెదక్ అధ్యక్ష మండలం వారు తనను ఆహ్వానించిన తీరు జీవితంలో మరిచిపోలేనిదన్నారు. తెలంగాణ కల్చర్ వివిధ నృత్యాలు, లంబాడ, గోండు, చిరుతలు, కోయ, కోలాటం, తదితర సంస్కృతులను వెలిబుచ్చిన తీరు అద్భుతమన్నారు. ఇక్కడి వేడుకలు ఇంగ్లాండ్‌కు వెళ్లి చెబితే అంతా మంత్రముగ్ధులవుతారన్నారు. ఇలాంటి గొప్ప ఆహ్వానం నా హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. భారత దేశంలోని కేరళ, కర్ణాటక, శ్రీలంకతోపాటు మెదక్చర్చ్లను సందర్శించడం సంతోషదాయకమన్నారు. అంతకు ముందు జుస్టిన్‌వెల్‌బి ఒక చేపకథను వివరించారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి రోజంతా కష్టపడిన వలలో చేపలు పడలేవంటా. ఇది గమనించిన పరలోక దేవుడు ఓ మత్స్యకారుడా! నీవున్న చోట నుంచి కుడివైపునకు వల విసరాలని చెప్పడంతో మత్స్యకారుడు అటువైపు వల విసరడంతో అనేక చేపలు చిక్కాయని చెప్పారు. పరలోక ప్రభువు మాట వింటే అంతా మంచే జరుగుతుందని ఆయన వివరించారు. అనంతరం మెదక్ సీఎస్ఐ అధ్యక్ష మండలి బిషప్ సాల్మాన్రాజ్ మాట్లాడుతూ ఈ చర్చ్ నిర్మించిన చార్లెస్ పాస్నెట్ వాకర్ 150వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. చర్చ్ నిర్మించి నేటికి 96 సంవత్సరాలు కావస్తుందన్నారు. ఈ చర్చ్ నిర్మించేందుకు వినియోగించిన ముడిసరుకు గురించి జస్టిన్వెల్బికి వివరించారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు ఇంగ్లాండ్ కాంటర్బరి ఆర్చ్ బిషప్ డాక్టర్ జస్టిన్ వెల్‌బి రాకతో గురువారం మెదక్‌పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది. ఆయన రాక తెలుసుకొని తెలంగాణ–ఆంధ్రా రాష్ట్రాల నుంచి చర్చ్‌ల పాస్టర్లు, భక్తులు భారీగా తరలిరావడంతో చర్చ్ ప్రాంగణం కిటకిటలాడింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే నృత్య ప్రదర్శనలు ఊరేగింపులో నిర్వహించడంతో ఆందరిని ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గోండుల నృత్యాలు, చిరుతలు, కోలాటం, లంబాడ నృత్యాలు సంస్కృతికి అద్దం పట్టాయి. భారీ బందోబస్తు: మతగురువు జుస్టిన్‌వెల్‌బి మెదక్‌కు రాక సందర్భంగా పట్టణంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ చందనాదీప్తి ఆధ్వర్యంలో పట్టణంలో అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 4గంటలపాటు పట్టణంలోని చర్చ్ ప్రాంగణంలో ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమంలో మెదక్ అధ్యక్ష మండల బిషప్ ఏసీ సాల్మన్‌రాజ్, కరీంనగర్ బిషప్ రుబిన్మార్క్, సౌత్ ఇండియన్ డిప్యూటీ కమిషనర్ థామస్ కే ఉమన్, డిప్యూటి మోడ్రన్ డోర్నాక బిషప్, నంద్యాల బిషప్ పుష్పలలిత, కృష్ణ, గోదావరి బిషప్ జార్జ్ పెర్నాండెజ్, తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలకు చెందిన 13 జిల్లాల గురువులతోపాటు స్థానిక గురువులు అండ్రూస్ ప్రేమ్ కుమార్, సహాయక గురువులు విజయ్‌కుమార్, దయానంద్, రాజశేఖర్, ఐవాండ్, ఒలెన్పాల్, జయరాజ్, శాంతకుమార్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
స్టూడెంట్ పోలీస్తో దురాచారాలకు చెక్!
సాక్షి, మెదక్: మున్సిపాలిటీ: సమాజంలో దురాచారాలను పారదోలేందుకే స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. మెదక్ పట్టణంలోని వేంకటేశ్వర గార్డెన్లో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరైతే కష్టాల్లో ఉంటారో వారిని ఆదుకోవడం పోలీస్ శాఖ మొదటి కర్తవ్యమన్నారు. పోలీస్ శాఖకు కుల, మత, వర్ణ, వర్గ, ధనిక, పేద లింగ బేధం తేడా ఉండవని, అందరికి సమన్యాయం చేస్తూ పని చేసేదే వ్యవస్థ అని వివరించారు. ఈ వ్యవస్థలో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్‌ను భాగస్వాములను చేస్తూ సమాజంలో పాతుకుపోయిన దురాచారాలను పారద్రోలే విధంగా వీరిని తయారు చేస్తామన్నారు. అలాగే పోలీస్ శాఖలో ఒక వినూత్న ప్రయోగానికి మెదక్ జిల్లా వేదికయ్యిందన్నారు. ఇప్పటి వరకు లా అండ్ ఆర్డర్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, ఎక్సైజ్ పోలీస్ ఇలా వివిధ రకాల పోలీసులను చూశామని, ఇప్పటి వరకు చూడని ఒక కొత్త పోలీస్‌ను మెదక్ జిల్లాలో చూడబోతున్నారని తెలిపారు. అతడే స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ అన్నారు. పోలీస్ శాఖపై ప్రజల్లో ఉన్న ప్రతికూల అంశాలకు సంబంధించి వారి దృక్పథంలో మార్పు తెచ్చేందుకు స్టూడెంట్ పోలీస్ క్యాడెట్‌ను రూపుదిద్దుతున్నామని చెప్పారు. ఇది పోలీస్, విద్యా శాఖ సంయుక్తంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం ఎంపిక చేసిన 440 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ సిబ్బందితో ప్రతి శుక్ర, శనివారాల్లో శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, విద్యాశాఖ నోడల్ అధికారి మధుమోహన్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, మెదక్ పట్టణ సీఐ వెంకటయ్య, ఎస్బీఎస్ఐ రాంబాబు, ఏఎస్ఐ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
సకల హంగులతో పోలీస్ కార్యాలయం
మెదక్ మున్సిపాలిటీ : జిల్లాలో నూతన పోలీస్ కార్యాలయం భవన నిర్మాణానికి ఎస్పీ చందనాదీప్తి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ చందనాదీప్తి మాట్లాడుతూ ఔరంగాబాద్ గ్రామ శివారులో నూతనంగా జిల్లా పోలీసు కార్యాలయం నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. 60 ఎకరాల్లో ఈ కార్యాలయ సముదాయం ఉంటుందన్నారు. ఈ మేరకు రూ. 25కోట్లు ప్రభుత్వం మంజూరు చేయగా.. రూ. 15కోట్లతో జిల్లా పోలీసు కార్యాలయం నిర్మిస్తున్నట్లు తెలిపారు. మిగతా నిధులతో ఇందులో ఏఆర్ హెడ్ క్వార్టర్, ఎస్పీ క్యాంప్ ఆఫీస్ అండ్ రెసిడెన్స్, పరేడ్ గ్రౌండ్, సిబ్బందికి సంబంధించిన బ్యారక్‌లు నిర్మించడం జరుగుతుందన్నా రు. ఇటీవల సీఎం కేసీఆర్ ఔరంగాబాద్ శివా రులో సమీకృత కలెక్టరెట్, జిల్లా పోలీసు కార్యాలయం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అయితే జిల్లా ఎస్పీ చందనాదీప్తి పోలీసు కార్యాలయం నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ చేయడం చర్చనీయాంశంగా మా రింది. కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, డీఈఈ టి.విశ్వనాథం, ఏఈ సంజయ్, మెదక్ అదనపు ఎస్పీ నాగరాజు, మెదక్ రూçరల్ సీఐ రామకృష్ణ, హవేళిఘణాపూర్ ఎస్సై శ్రీకాంత్ పాల్గొన్నారు. -
ఏఎస్పీ చొరవతో బతికాడు..
ఏఎస్పీ చొరవ తీసుకోవడంతో.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ప్రాణాపాయం తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సోమవారం రాత్రి 11.30 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు, బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బేగంపేటకు చెందిన శ్రీనివాస్(27) తీవ్రంగా గాయపడ్డాడు. రక్తపు మడుగులో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో స్థానికులు 108కు ఫోన్ చేశారు. అదే సమయంలో కార్పొరేటర్ల సమావేశంలో సీఎం బందోబస్తుకు వెళ్లి వస్తున్న తాండూరు ఏఎస్పీ చందన దీప్తి ప్రమాదాన్ని గుర్తించి వాహనాన్ని నిలిపి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే 108కు ఫోన్‌చేశారు. కాసేపటికే.. 108 వాహనం రాక ఆలస్యమయ్యేలా ఉందని గ్రహించారు. వెంటనే క్షతగాత్రుడిని తన కారులో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీనివాస్ వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా బంధువులకు సమాచారం అందించే ప్రయత్నం చేశారు. గంటకు పైగా అక్కడే ఉండి.. వైద్యుల సూచనల మేరకు స్వయంగా ప్రైవేట్ అంబులెన్స్‌ను పిలిపించి అతన్ని నగరంలోని ఉస్మానియాకు తరలించారు. అనంతరం అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేశారు. దీంతో శ్రీనివాస్ ప్రాణపాయ స్థితి నుంచి బయట పడ్డాడని, అతని పరిస్థితి మెరుగైందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు వికారాబాద్ సీఐ రవి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒక పోలీసు ఉన్నతాధికారి అధికారి స్వయంగా దగ్గరుండి.. ప్రమాదంలో ఉన్న వ్యక్తి ని కాపాడేందుకు కృషిచేయడం చూసి.. వికారాబాద్ వాసులు ఆశ్చర్య పోయారు. అధికారులు ఆదేశాలు జారీ చేయడం చూశాం కానీ, ఇలా దగ్గరుండి పనిచేయడం చూడలేదని అన్నారు. ఏఎస్పీ చందన దీప్తి చొరవకు సంతోషం వ్యక్తం చేశారు. -
'ఓ తండ్రి ఇలా చేస్తాడని అనుకోలేదు'
వికారాబాద్: గిరిజన బాలికపై కన్నతండ్రే అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన హృదయాన్ని కలచివేసిందని రంగారెడ్డి జిల్లా ఏఎస్పీ చందనా దీప్తి అన్నారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ఓ తండ్రి ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదని విస్మయం వ్యక్తం చేశారు. ఇది చాలా అమానుషమైన చర్య అని పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనపై మాట్లాడేందుకు మాటలు రావడం లేదన్నారు. మెగావత్ కమాల్ మృగంలా ప్రవర్తించాడని, మనిషినన్న సంగతి మర్చిపోయాడని అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మానవత్వం మీద ఒక్కసారిగా అపనమ్మకం ఏర్పడుతుందన్నారు. మగవారిని 100 శాతం నమ్మొద్దని ఆమె సూచించారు. మహిళలు, అమ్మాయిలు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించాలన్నారు. 24 గంటల్లోనే కేసును ఛేదించినందుకు గర్వంగా ఉందని చందనా దీప్తి చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే సమాజంలో మార్పు రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి తండాకు చెందిన గిరిజన బాలిక సిమ్రాన్(14)పై కన్నతండ్రే అత్యాచారం చేసి, హత్య చేసినట్టు తేలడం పోలీసులతో పాటు అందరినీ దిగ్బ్రాంతికి గురిచేసింది. -
'ఓ తండ్రి ఇలా చేస్తాడని అనుకోలేదు'