సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త బలరాం రెడ్డి-మెదక్ జిల్లా ఎస్పీ చందనాదీప్తిల వివాహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. తాజ్‌కృష్ణలో జరిగిన ఈ విహహా వేడుకకు సీఎం వైఎస్ జగన్ తన సతీమణి భారతిరెడ్డితో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా, వరుడు బలరాం రెడ్డి సీఎం వైఎస్ జగన్‌కు బంధువు.
అంతకుముందు ఫోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్ష రెడ్డి - సోమ వివాహ నిశ్చితార్థానికి సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు.
బలరాం-చందనాదీప్తిల వివాహానికి హాజరైన సీఎం జగన్
Published Fri, Oct 18 2019 8:16 PM | Last Updated on Fri, Oct 18 2019 8:20 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment