Changes in food habits
-
సరె సర్లే ఎన్నెన్నో అనుకుంటాం..
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఏడాది నుంచి సిగరెట్ ముట్టనే ముట్టను.. మందు మొహమే చూడను.. చికెన్ మానేస్తా.. మటన్ మానేస్తా.. ఎక్సర్సైజ్ చేసేస్తా.. మంచోడిగా మారిపోతా.. ఇలా కొత్త ఏడాది వచ్చినప్పుడల్లా చాలా అనుకుంటాం.. మనసులో ఒట్టు పెట్టేసుకుంటాం.. అయితే.. ఈ కొత్త ఏడాదులు వచ్చిపోతూనే ఉంటాయి.. ఒట్లు తీసి గట్ల మీద పెట్టేస్తునే ఉంటాం.. ఇక ఈ ఏడాది సంగతి చెప్పనక్కర్లేదు.. అనుకున్నదానికంతా రివర్స్ అయింది. మరికొన్ని రోజుల్లో 2021 వచ్చేస్తోంది.. మన దగ్గర మొదలైందో లేదో గానీ.. అమెరికావోళ్లు మాత్రం అప్పుడే అది చేయాలి ఇది చేయాలి అని ప్రతిజ్ఞలు మొదలుపెట్టేశారు. ఎక్కువగా ఈ ఏడాది ఇంట్లోనే ఉండటం.. సోషల్ డిస్టెన్స్.. దీనికితోడు జంక్ ఫుడ్ వంటివి బాగా లాగించేసి.. బొజ్జలు పెంచిన నేపథ్యంలో కొత్త సంవత్సరంలో దాన్ని తగ్గించే దిశగానే అలా చేస్తాం.. ఇలా చేస్తాం అని అనుకున్నారట..కొందరు రెండు మూడు గోల్స్ పెట్టుకున్నారంట.. దీనికి సంబంధించిన వివరాలను స్టాటిస్టా గ్లోబల్ కన్జ్యూమర్ సర్వే వెల్లడించింది. 1. ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తాం 2. హెల్దీఫుడ్తింటాం.. 3. బంధుమిత్రులతో ఎక్కువ సమయం గడుపుతాం.. 4. బరువును తగ్గిస్తాం 5.పొదుపుగా జీవిస్తాం 6. సోషల్ మీడియాను చూడటం తగ్గిస్తాం.. 7. ఉద్యోగంలో సామర్థ్యాన్ని పెంచుకుంటాం 8. జాబ్లో పని ఒత్తిడిని తగ్గించుకుంటాం.. 9. సిగరెట్ మానేస్తాం 10. మందు తగ్గిస్తాం ఇంతకీ మీరేమనుకుంటున్నారు.. ఒకవేళ అనుకున్నా.. చేసే అలవాటు మీకుందా.. లేకుంటే.. ఎప్పట్లాగే.. ఇదే డైలాగ్ కొడతారా.. : సరె సర్లే చాలా అనుకుంటాం.. ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తాం -
బ్లాక్ మ్యాజిక్
ఆరోగ్య సమస్యలను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు ఇప్పుడంతా. అలా తయారైన కొత్త ఆహారప పదార్థాల లిస్టులోకి బ్లాక్ టీ కూడా చేరింది. ఈ మార్పు ఎంతో మంచిదంటోంది అమెరికన్ హార్ట్ అసోసియేషన్. ఈ సంస్థ నిర్వహించిన ఓ పరిశోధనా ఫలితాలు బ్లాక్ టీ ప్రయోజనాల్ని బయటపెట్టాయి. అవేమిటంటే... బ్లాక్ టీ ‘కరొనరీ ఆర్టరీ డిస్ఫంక్షన్’ని తగ్గిస్తుందట. అందువల్ల గుండె జబ్బులతో బాధపడేవారు రోజూ కచ్చితంగా ఒక కప్పు బ్లాక్ టీ తాగటం మంచిదంటున్నారు. బ్లాక్ టీలో ఉండే రసాయనాలు జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. వీటిలో విస్తారంగా ఉంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, జీర్ణక్రియా వ్యవస్థకు హాని కలిగించే పదార్థాలతో పోరాడుతుందట. బ్లాక్ టీలో ఉండే టానిన్స్... డయేరియాను తగ్గిస్తాయి. శరీరంలో ఉండే చెడు కొవ్వును కరిగిస్తుంది. ఫాటల్ అటాక్స్ బారిన పడకుండా రక్షిస్తుంది. రోజుకు మామూలు టీ తాగే వారితో పోలిస్తే బ్లాక్ టీ తాగేవారిలో గుండెనొప్పి వచ్చే అవకాశం 21 శాతం తక్కువ. ఆస్థమా రోగుల శ్వాసక్రియను మెరుగు పర్చడంలో బ్లాక్ టీ పెద్ద పాత్రే పోషిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి కోరలకు చిక్కకుండా బ్లాక్ టీ కాపాడుతుంది. బ్లాక్ టీ కొన్ని రకాల క్యాన్సర్ కారకాలతో పోరాడుతుందని పరిశోధనలో తేటతెల్లమయ్యింది. ముఖ్యంగా ఇది తాగే మహిళల్లో ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటోందట. ఇందులో ఉండే పాలిఫినాల్స్ పేగులను ఇన్ఫ్లమేషన్ నుంచి కాపాడతాయి. అందువల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, పేగుల వ్యాధులు రాకుండా ఉంటాయి.దీనిలో ఉండే ఫైటోకెమికల్స్ ఎముకలను గట్టిపరుస్తాయి. జుట్టు కుదుళ్లు బలపడటానికి, చర్మం ఆరోగ్యకరంగా ఉండటానికి కూడా బ్లాక్ టీ సహాయపడుతుంది.