Charanjit Singh Channi
-
పాక్‌పై భారత్ దాడికి సాక్ష్యం ఏది?.. కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి తరుణంలో 2016లో పాకిస్తాన్‌పై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ విషయమై కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి రుజువు చూపించాలని అడగటం తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతకు మరోసారి బీజేపీ కౌంటరిచ్చింది.వివరాల ప్రకారం.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం తర్వాత పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్ సింగ్ చన్నీ మీడియాతో మాట్లాడుతూ..‘పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మేము కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. దాడి వెనుక ఉన్న వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్ హస్తం ఉంటే వారికి తగిన బుద్ది చెప్పాలని కోరుతున్నాం. కానీ, 2016లో పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ వైమానిక దాడులకు సంబంధించి మాత్రం మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ దాడుల విషయంలో గందరగోళం కనిపిస్తోంది. మన దేశంపై బాంబు వేస్తే మనకు తెలియదా?. పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించామని వారు అంటున్నారు. కానీ, అక్కడ ఇలాంటిదేమీ జరగలేదు. ఎవరూ దీని గురించి మాట్లాడలేదు. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. దీనిపై నేను మొదటి నుండి డిమాండ్ చేస్తున్నాను. మన దేశ ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి’ అని కామెంట్స్ చేశారు.SICK!Rahul Gandhi's Congress continues to defend Pakistani terror!Now Charanjeet Singh Channi questions our forces.Why is Congress demoralising our forces at this critical time.Congress is taking orders directly from Pakistan!#PehalgamTerroristAttack pic.twitter.com/b2MIexdAQA— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) May 2, 2025ఇక, కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ కౌంటరిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేతలు మన దేశ సాయుధ దళాల పనితీరును ప్రశ్నిస్తున్నారని ఆరోపించింది. ఆయన వ్యాఖ్యలపై ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా స్పందిస్తూ..‘కాంగ్రెస్ మళ్లీ మన దేశ సైన్యాన్ని మరియు వైమానిక దళాన్ని ప్రశ్నించింది. సర్జికల్ స్ట్రైక్ జరిగిందని తాను నమ్మడం లేదని.. తనకు రుజువు కావాలని చన్నీ అన్నారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబం ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉందో ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. వారు భారత సైన్యం, వైమానిక దళం అబద్ధాలు చెబుతున్నారని, పాకిస్తాన్ నిజం చెబుతోందని పదే పదే ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ స్వయంగా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందని చెప్పినప్పటికీ వీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు. సర్జికల్ స్ట్రైక్‌పై మీకు నిజంగా రుజువు కావాలంటే.. రాహుల్ గాంధీతో కలిసి చన్నీ.. పాకిస్తాన్ సందర్శించి దాడి ఎక్కడ జరిగిందో తనిఖీ చేయండి అంటూ కౌంటరిచ్చారు.మరోవైపు.. సదరు కాంగ్రెస్ ఎంపీ చన్నీకి బీజేపీ నుంచి కౌంటర్ రావడంతో ఆయన మాట మార్చారు. తాను సర్జికల్ దాడుల గురించి ఆధారాలు అడగలేదని మాట మార్చారు. అనంతరం, పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తానని ప్రకటించారు. అయితే, ఆయన వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. -
Parliament Budget Session 2024: మాటల యుద్ధం
న్యూఢిల్లీ: అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలు, నినాదాలతో లోక్‌సభ గురువారం దద్దరిల్లింది. పలుమార్లు వాయిదా పడింది. కేంద్ర బడ్జెట్‌పై ప్రారంభమైన చర్చ పూర్తిగా పక్కదారి పట్టింది. తొలుత కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి రవనీత్‌సింగ్ బిట్టూ తాత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్ హత్య ఘటనను ప్రస్తావించారు. దీనిపై బిట్టూ అభ్యంతరం వ్యక్తం చేశారు. చన్నీ, బిట్టూ మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ నేత సోనియా గాం«దీతోపాటు చన్నీపై బిట్టూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. దీంతో విపక్ష ఎంపీలు ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడ్డారు. బిట్టూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యుడు అమరీందర్‌సింగ్ రాజా వెల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయతి్నంచారు. రాహుల్ గాంధీ ఆయనను ఆపేశారు. బిట్టూతోపాటు పలువురు బీజేపీ ఎంపీలు వెల్‌లోకి ప్రవేశించేందుకు ప్రయతి్నంచగా స్పీకర్ స్థానంలో ఉన్న సంధ్యా రే సభను వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. సభ సజావుగా జరిగేలా చూడాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. సభ్యులంతా సభ గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ అన్నారు. నిబంధనలు అతిక్రమించకూడదని చెప్పారు. తర్వాత చన్నీ తన ప్రసంగం కొనసాగించారు. రైతులకు ఇచి్చన హామీలను మోదీ ప్రభుత్వం నిటబెట్టుకోలేదని విమర్శించారు. రైతులను ఖలిస్తానీలు చిత్రీకరించారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. సభను చన్నీ తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. చన్నీ మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ చన్నీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆయనపై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని అన్నారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మళ్లీ వాగ్వాదం కొనసాగింది. తర్వాత సభ రెండుసార్లు వాయిదా పడింది. పార్లమెంట్ బయట బిట్టూ మీడియాతో మాట్లాడారు. చన్నీ జాతి వ్యతిరేక శక్తిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇండియా నుంచి పంజాబ్‌ను విడదీయాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ: చన్నీ దేశంలో నరేంద్ర మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని చరణ్‌జిత్ సింగ్ చన్నీ మండిపడ్డారు. 20 లక్షల మంది ప్రజలు ఎన్నుకున్న ఎంపీని(అమృత్‌పాల్ సింగ్) జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసిన ప్రజల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించే అవకాశం ఆయనకు ఇవ్వడం లేదని, ఇది ఎమర్జెన్సీ కాక మరేమిటని ప్రశ్నించారు. చన్నీ లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. అయితే, అమృత్‌పాల్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్‌సాహిబ్ నియోజకవర్గం నుంచి వివాదాస్పద సిక్కు మత బోధకుడు, ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ స్వతంత్ర అభ్యరి్థగా 2 లక్షల మెజారీ్టతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆంధ్రా–బిహార్ బడ్జెట్: సౌగతా రాయ్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ లోక్‌సభలో విమర్శలు గుప్పించారు. అది ఆంధ్రా–బిహార్ బడ్జెట్ అని ఆక్షేపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శిక్షణ పొందిన ఆర్థికవేత్త కాదని అన్నారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా కేవలం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచి్చన సూచనల ఆధారంగా బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. గతంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, పి.చిదంబరం హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారని, నిర్మలా సీతారామన్ మాత్రం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకున్నారని సౌగతా రాయ్ వ్యాఖ్యానించారు. -
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
చండీగఢ్: జమ్ము-కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో చోటు చేసుకున్న ఉగ్రదాడి.. లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ చేస్తున్న స్టంట్ అని పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జలంధర్‌లో నిర్వహించన ఎన్నికల ప్రచారంలో చన్నీ బీజేపీపై ఘాటుగా విమర్శలు చేశారు. ‘‘ఎన్నికల ముందు ఇవన్నీ బీజేపీ చేస్తున్న స్టంట్లు తప్ప ఉగ్రదాడులు కాదు. వాటిల్లో అసలు నిజమే లేదు. బీజేపీ ప్రజలు, శవాలతో ఆటలాడుతోంది. ఈ దాడులు నిజంగా జరిగినవి కావు. కేవలం బీజేపీకి ప్రయాజనం చేసేవి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. గతంలో లాగా బీజేపీ ఇలాంటి చిల్లర స్టంట్లు చేస్తుంది’’ అని చన్నీ దుయ్యబట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే చన్నీ వ్యాఖ్యలపై బీజేపీ కేంద్ర మంత్రి స్పందించారు. ‘‘చన్నీ ఉగ్రదాడిపై సైతం చాలా దిగజారిన వ్యాఖ్యలు చేశారు. అది ఆయన మనస్తత్వానికి నిదర్శనం’’ అని మండిపడ్డారు. శనివారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాహనంపై జరిగిన ఉగ్రదాడిలో ఎయిర్ ఫోర్స్‌కు చెందిన విక్కీ పహాడే సైనికుడు మరణించగా.. నాలుగురు సైనికులు గాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 25న జరగనున్న అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పూంఛ్ ఉంది.