charminar express train
-
ఉదయం నాంపల్లిలో ప్రమాదం.. సాయంత్రానికి మళ్లీ చార్మినార్ కూత
-
పట్టాలు తప్పిన రైలు..ప్రమాదం ఎక్కడ జరిగింది..?
-
రైలు ప్రమాదంలో ప్రయాణికుల పరిస్థితి..!
-
నాంపల్లి రైల్వే స్టేషన్ లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్
-
నాంపల్లి: చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం ప్రమాదానికి గురైన చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు పునరుద్ధరించారు. పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లకు మినహాయించి.. ఇతర ఏ సర్వీసులకు ఇబ్బంది కలగలేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాద రైలు కోచ్ లని టెస్టింగ్ కోసం షెడ్డుకు తరలించినట్లు తెలిపారు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు ఈ ఉదయం ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు చేరుకునే క్రమంలో.. పట్టాలు తప్పి ఫ్లాట్‌ఫామ్ సైడ్వాల్ను ఢీకొట్టింది. రైలు స్లోగా ఉండడంతోనే పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మొత్తం మూడు బోగీలు పట్టాలు తప్పగా, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో రైలు డెడ్ ఎండ్‌కు వచ్చిన తర్వాతే ప్రమాదం జరిగిందని సీపీఆర్వో రాకేష్ తెలిపారు. డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతోనే రైలు పట్టాలు తప్పిందన్నారు. ఇక దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ధనంజయులు నేతృత్వంలోని రైల్వే అధికారుల బృందం సహాయ, పునరుద్ధరణ చర్యలను చేపట్టింది. సౌత్ సెంట్రల్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ సంఘటనపై చట్టబద్దమైన విచారణను నిర్వహిస్తుందని తెలిపారు. ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు నాంపల్లి రైల్వేస్టేషన్లో సహాయక చర్యల దృష్ట్యా పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు నాంపల్లి-మేడ్చల్, మేడ్చల్-హైదరాబాద్, హైదరాబాద్ లింగంపల్లి ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అయితే నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫారమ్ 1,2 వైపు నుంచి రైళ్ల రాకపోకలు సాగాయి. ఈ రోజు షెడ్యూల్లో ఉన్న ప్యాసింజర్ రైళ్లను నడిపారు. ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. పట్టాలు కొద్దిగా పక్కకి ఒరగడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టాలని, గాయపడిన ప్రయాణికులకు సరైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు ఇదీ చదవండి: సంక్రాంతికి మరో ఆరు ప్రత్యేక రైళ్లు -
ఏసీ రైలు ఎక్కేవారేరీ?
సామాన్యుడి చౌక ప్రయాణ సాధనం రైలుబండికి కొన్ని వర్గాల ప్రయాణికులు మాత్రం క్రమంగా దూరమవుతున్నారు. ప్రత్యేకంగా ఏసీ బోగీల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య తగ్గుముఖం పడుతోంది. దేశం నలువైపులా అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం, కేవలం ఒకటి, రెండు గంటల్లోనే గమ్యస్థానానికి చేరే అవకాశం ఉండడంతో విమాన ప్రయాణానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ ట్రైన్ చార్జీల కంటే విమాన చార్జీలు కొద్దిగా ఎక్కువే అయినా ప్రయాణ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్లైట్ జర్నీ వైపు మళ్లుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో మారిన ప్రయాణికుల ధోరణి కారణంగా..పండుగలు, వరుస సెలవులు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే డొమెస్టిక్ విమానాలు 80 శాతం ఆక్యుపెన్సీతో రాకపోకలు సాగిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని రైళ్లలో ఖాళీగా ఏసీ బెర్తులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని సువిధ రైళ్లలో విమానాల తరహాలో చార్జీలను పెంచుతున్నారు.కానీ పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. ఇంచుమించు అదే చార్జీల్లో ఫ్లైట్ టిక్కెట్ వచ్చేస్తుంది. పైగా కొన్ని ఆన్లైన్ బుకింగ్ ఏజెన్సీలు ప్రయాణికులకు రకరకాల ఆఫర్లను అందజేస్తున్నాయి. దీంతో చాలా మంది విమాన ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారని ఐఆర్సీటీసీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఎక్కువ సమయమే కారణమా... హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ, ముంబయి, చెన్నై, విశాఖ, తిరుపతి, భువనేశ్వర్, పటా్న, ధానాపూర్, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లు 12 గంటల నుంచి 18 గంటల వరకు ప్రయాణం చేస్తాయి. ఇప్పటికీ చాలా రైళ్లు గంటకు 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతోనే నడస్తున్నాయి.కొన్ని రూట్లలో రైళ్ల వేగాన్ని పెంచేందుకు పట్టాల సామర్ధ్య పెంపునకు చర్యలు చేపట్టారు. కానీ పెద్దగా రైళ్ల వేగం పెరగలేదు. దీంతో రూ.2500 నుంచి సుమారు రూ.4000 వరకు చార్జీలు చెల్లించి గంటల తరబడి ప్రయాణం చేసేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. అత్యవసర ప్రయాణాలు చేయవలసిన వాళ్లు ఫ్లైట్‌నే ఎంపిక చేసుకుంటున్నారు. ‘ఇంటిల్లిపాది వెళ్లవలసినప్పుడు ట్రైన్లోనే వెళ్తున్నాం. కానీ ఒక్కరు, ఇద్దరు వెళ్లవలసినప్పుడు మాత్రం ఫ్లైట్‌లోనే వెళ్తున్నాం.’ అని హైటెక్‌సిటీకి చెందిన కృష్ణ తెలిపారు. తాము తరచుగా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నట్లు పేర్కొన్నారు. నగరం నుంచి తిరుపతి, వైజాగ్ వంటి ప్రాంతాలకు ప్రతి రోజు 5 నుంచి 10 వరకు విమానాలు నడుస్తుండగా ముంబ యి, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ నగరాలకు హైదరాబాద్ మీదుగా 15 నుంచి 20 ఫ్లైట్లు అందుబాటులో ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. చలో ఎయిర్టూర్... మరోవైపు ఐఆర్సీటీసీ, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేట్ ఆపరేటర్లు ఏర్పాటు చేసే ఎయిర్ టూర్లకు సైతం ప్రాధాన్యం పెరిగింది. ప్రతి సంవత్సరం ఉత్తర, దక్షిణభారత యాత్రలు నిర్వహించే ఐఆర్సీటీసీ రైళ్లతో పాటు విమాన సర్వీసుల్లోనూ ప్రయాణ సదుపాయం కల్పిస్తుంది . జైపూర్, శ్రీనగర్, తదితర ప్రాంతాలకు ఎయిర్టూర్లు ఉన్నాయి. ఏసీ బెర్తులు ఖాళీ... ♦ హైదరాబాద్ నుంచి పలు మార్గాల్లో రాకపోకలు సాగించే కొన్ని రైళ్లలో ఈ నెల 23వ తేదీన ఏసీ బెర్తులు కిందివిధంగా అందుబాటులో ఉన్నాయి. ♦ హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి రాకపోకలు సాగించే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 23వ తేదీన ఫస్ట్ ఏసీలో 8 బెర్తులు, సెకెండ్ ఏసీలో 15, థర్డ్ ఏసీలో ఏకంగా 101 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ♦ హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి ఫస్ట్ ఏసీ చార్జీ రూ.4460, సెకెండ్ ఏసీ చార్జీ రూ.2625 ఉంది. ఈ చార్జీలకు కొద్దిగా అటు ఇటుగా విమానచార్జీలు ఉన్నాయి. ♦ హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లే చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 23వ తేదీన సెకెండ్ ఏసీలో 99, థర్డ్ ఏసీలో 226 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి చెన్నైకు ఫస్ట్ ఏసీ చార్జీ రూ.2760, సెకెండ్ ఏసీ రూ.1645 చొప్పున ఉంది. -
దురంతో కోచ్‌లు దారి మళ్లించేశారు..!!
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వే జోన్ ప్రకటించినప్పటి నుంచి ఈ పేరంటే అటు దక్షిణ మధ్య రైల్వేకు, ఇటు తూర్పు కోస్తా రైల్వేకు మింగుడు పడటం లేదు. అందుకే ఈ స్టేషన్ ప్రతిష్టని దిగజార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొత్తగా ఏ స్పెషల్ ట్రైన్ వేసినా విశాఖ స్టేషన్ ముఖం కూడా చూడనివ్వకుండా బైపాస్‌లో పంపించేస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ నుంచి విశాఖకు వచ్చే దురంతో ఎక్స్‌ప్రెస్ కోచ్‌లను కూడా మాయం చేసేసి చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు దారి మళ్లించెయ్యడంతో ప్రయాణికులు సామాజిక మాధ్యమాల్లో యుద్ధం చేస్తున్నారు. దురంతో ఎక్స్‌ప్రెస్... తక్కువ స్టేషన్లలో హాల్టులతో త్వరగా గమ్యస్థానానికి తీసుకెళ్లేందుకు ప్రారంభించిన రైలు. అన్నీ ఏసీ బోగీలతో సౌకర్యవంతమైన ప్రయాణం సాగించేలా ఈ రైలు ఉంటుంది. ఈ ట్రైన్లు ప్రధాన నగరాల మధ్య మాత్రమే పరుగులు పెడుతుంటాయి. అయితే దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య (ట్రైన్ నం.22203/22204) 2012 జూలైలో వారానికి మూడు రోజులపాటు నడిచేలా రైలుని ప్రారంభించారు. అయితే 1994 నాటి ఐసీఎఫ్ కోచ్‌లకు మరమ్మతులు, ఆధునికీకరిస్తూ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లుగా మార్చి ఇచ్చారు. అనంతరం క్రమంగా సమస్యలు మొదలయ్యాయి. పాత కోచ్‌లు కావడంతో ఏసీ నుంచి లీకేజీలు రావడం, బెర్తులు వంగిపోవడం మొదలైన ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో 2017లో దురంతోకి కొత్త రేక్ మంజూరు చేస్తామంటూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఎట్టకేలకు నెల రోజుల క్రితం ఒక రేక్ (14 బోగీలు)ని దక్షిణ మధ్య రైల్వేకి కేటాయించారు. ట్విటర్లో ఫిర్యాదు చేసిన ప్రయాణికుడు 12 కోచ్‌లు పక్కదారి... ఈ రేక్ని చెన్నైలోని పెరంబూర్ ఐసీఎఫ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. దీన్ని కేవలం సికింద్రాబాద్ – విశాఖపట్నం దురంతో ఎక్స్‌ప్రెస్ కోసం కేటాయించాలంటూ బోగీలపై ట్రైన్ నబర్ కూడా ముద్రించారు. అయితే సౌత్ సెట్రల్ రైల్వే అధికారులు దురంతో కోసం ఇచ్చిన బోగీలను దారి మళ్లించారు. హైదరాబాద్ – చెన్నై చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కి అప్పనంగా అప్పగించేశారు. దురంతోకి మొత్తం 14 కోచ్‌లు కేటాయిచగా అందులో హైదరాబాద్ – చెన్నై చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు 6 కోచ్‌లు, చెన్నై – హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కి మరో 6 కోచ్‌లు పెట్టారు. ఇలా దురంతోకి వచ్చిన కోచ్‌లను పక్కదారి పట్టించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో దక్షిణ మధ్య రైల్వే, రైల్వే బోర్డు, రైల్వే మంత్రిత్వ శాఖకు ట్విటర్లలో ఫిర్యాదుల రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సత్వరమే స్పందించి దురంతోకి రావాల్సిన రేక్ని తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. వాల్తేరు వైఫల్యమే కారణమంటూ ఆరోపణలు కోచ్‌లు దారి మళ్లింపుపై వచ్చిన ఫిర్యాదులపై దక్షిణ మధ్య రైల్వే కుంటి సాకులు చెబుతోంది. వాల్తేరు రైల్వే డివిజన్లో సరైన నిర్వహణ ఉండటం లేదనీ.. ఫలితంగా కొత్త కోచ్‌లు ఏర్పాటు చేసినా త్వరగా పాడైపోతున్నాయంటూ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణల్లో వాస్తవం ఉందో లేదో పక్కన పెడితే.. ఒక ట్రైన్ కోసం కేటాయించిన బోగీలను మరో ట్రైన్‌కు కేటాయించడాన్ని వాల్తేరు అధికారులు సైతం తప్పుపడుతున్నారు. మరోవైపు విశాఖ జోన్‌గా ప్రకటించినప్పటి నుంచి ఈస్ట్‌కోస్ట్, సౌత్ సెంట్రల్ జోన్లు విశాఖపట్నంపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయి. ఏ ట్రైన్నీ విశాఖకు కేటాయించకుండా బైపాస్‌లో పంపించి డీగ్రేడ్ చేసే విధంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.ప్రయాణికుల్లోనూ ఇదే అభిప్రాయం వెల్లువెత్తుతోంది. పాతికేళ్ల క్రితం ఏసీ బోగీలను వేగంగా వెళ్లే రైలుకి కేటాయిస్తే, జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. సాధారణ ఏసీ ప్రయాణం కంటే అదనపు ఛార్జీని దురంతో పేరుతో వసూలు చేసి ఇలా డొక్కు కోచ్‌లతోనే ఎన్నాళ్లు నడిపిస్తారని ప్రశ్నిస్తున్నారు. కేటాయించిన కోచ్‌లతోనే దురంతో నడిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఇక చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ‘ఎకో’ చుక్ చుక్
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ హితమైన సాంకేతిక పరిజ్ఞానంతో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ జిగేల్‌మంటోంది. తాజాగా హెడ్ ఆన్ జనరేషన్ టెక్నాలజీతో ఈ ట్రైన్‌ను అనుసంధానం చేశారు.ఇప్పటి వరకు బోగీల్లో లైట్లు, ఫ్యాన్లు, ఏసీ,తదితర సదుపాయాల కోసం డీజిల్ జనరేటర్లను వినియోగిస్తుండగా ఇక నుంచి హెడ్ ఆన్ జనరేషన్ పరిజ్ఞానం (ఇంజన్‌కు సరఫరా అయ్యే విద్యుత్‌ను బోగీలకు విస్తరించడం) వల్ల అన్ని బోగీలకు విద్యుత్ సరఫరాను ప్రవేశపెట్టారు. దీంతో డీజిల్ జనరేటర్ల అవసరం తప్పింది. చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు గతంలో ఉన్న ఐసీఎఫ్ (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) బోగీల స్థానంలో అత్యంత సురక్షితమైన ఎల్‌హెచ్‌బీ (లింక్ హాఫ్‌మెన్‌బుష్) బోగీలను ఏర్పాటు చేశారు. దీంతో హెడ్ ఆన్ జనరేషన్ వినియోగం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే కొన్ని రైళ్లలో... దక్షిణమధ్య రైల్వేలో ఇప్పటి వరకు విక్రమ్ సింహపురిఅమరావతి ఎక్స్‌ప్రెస్, తెలంగాణ, జమ్ముతావి హమ్‌సఫర్, డబుల్ డెక్కర్, నారాయణాద్రి, సికింద్రాబాద్–నాగ్‌పూర్, సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్–గుంటూరు, లింగంపల్లి–విజయవాడ ఇంటర్సిటీ, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఏర్పాటు చేశారు. దీంతో ఈ రైళ్లలో హెడ్ ఆన్ జనరేషన్ ద్వారా విద్యుత్ సదుపాయం అందజేస్తున్నారు. ఫలితంగా బోగీలకు డీజిల్ ద్వారా విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరం తప్పింది. దీనివల్ల ఏటా వినియోగమయ్యే 49.7 లక్షల డీజిల్‌పైన రూ.35 కోట్లను వెచ్చించవలసిన ఖర్చు తప్పింది. దీనిస్థానంలో విద్యుత్ వినియోగం వల్ల కేవలం రూ.5.7 కోట్ల వరకు మాత్రమే ఖర్చవుతుందని, రూ.29.3 కోట్ల మేర డబ్బు ఆదా అవుతుందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. మరోవైపు డీజిల్ స్థానంలో విద్యుత్‌ను వినియోగించడం వల్ల పర్యావరణ ప్రమాణాలు రెట్టింపైనట్లు పేర్కొన్నారు. మరోవైపు శబ్దకాలుష్యం పోయింది. ఐసీఎఫ్ కోచ్‌ల స్థానంలో ప్రవేశపెట్టిన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు పూర్తిగా సురక్షితమైనవి. ప్రమాదాల తీవ్రత తక్కువగా ఉంటుంది. రైళ్లు పట్టాలు తప్పినప్పుడు బోగీలు దేనికవే విడిపోతాయి, ఒకదానిపైకి మరొకటి రావు. అలాగే రైళ్లలో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే ఆర్పేసే అగ్నిమాపక పరికరాలు ఉంటాయి. దీనివల్ల మంటలు విస్తరించవు. అలా ఈ రైళ్ల వల్ల సురక్షితమైన ప్రయాణంతో పాటు పర్యావరణ ప్రమాణాలూ మెరుగుపడుతాయి. -
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం వేకువజామున దోపిడీ జరిగింది. ప్రకాశం జిల్లాలోని దావర- ఉప్పుగుండూరు రైల్వే స్టేషన్ల సమీపంలో గుర్తు తెలియని దుండగులు రైలును ఆపి. ఎస్ 4, ఎస్ 5, ఎస్ 6 బోగీల్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. మారణాయుధాలతో ప్రయాణికులను బెదిరించి నగదు, ఆభరణాలను దోచుకున్నారు. ఈ విషయమై బాధితులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదుచేశారు.