Check bounce cases
-
చెక్ బౌన్స్ కేసుల సత్వర విచారణపై సుప్రీం దృష్టి
న్యూఢిల్లీ: చెక్ బౌన్స్ కేసులు కోర్టుల్లో భారీగా పేరుకుపోతున్న నేపథ్యంలో ఈ కేసుల సత్వర పరిష్కారంపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ (ఎన్ఐ యాక్ట్) కేసులను సత్వరం పరిష్కరించడానికి అదనపు కోర్టుల ఏర్పాటుపై అభిప్రాయాన్ని తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపు 35 లక్షల ఎన్ఐ యాక్ట్ కేసులు (జిల్లా కోర్టుల్లో పెండింగులో ఉన్న మొత్తం క్రిమినల్ కేసుల్లో 15 శాతం పైగా) పెండింగులో ఉన్న నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, ఆర్. రవీంద్ర భట్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం ఈ ఆదేశాలు ఇచ్చింది. 247వ అధికరణ కింద (అదనపు కోర్టుల ఏర్పాటుకు పార్లమెంటుకు అధికారాన్ని ఇస్తున్న అధికరణం) ఎన్ఐ యాక్ట్ కేసుల సత్వర పరిష్కారానికి అదనపు కోర్టుల ఏర్పాటుపై కేంద్రం అభిప్రాయాన్ని వచ్చే వారంలో తెలియజేయాలని ధర్మాసనం అడిషనల్ సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జిత్ బెనర్జీని ఆదేశించింది. చెక్‌బౌన్స్‌లు వివిధ కోర్టుల్లో భారీగా పేరుకుపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసు గత ఏడాది విచారణకు చేపట్టింది. 2005కు ముందు ఒక కేసు విచారణ సందర్భంగా ఈ సమస్య (కోర్టుల్లో చెక్ బౌన్స్ కేసుల దీర్ఘకాలిక విచారణ అంశం) అత్యున్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. ఈ అంశంపై ధర్మాసనానికి సలహాలు ఇవ్వడానికి సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ లుథ్రా, అడ్వొకేట్ కే. పరమేశ్వర్లు నియమితులయ్యారు. -
చెక్కు బౌన్స్ కేసుల సత్వర పరిష్కారం
న్యూఢిల్లీ: చెక్కు బౌన్స్ కేసుల సత్వర విచారణకు వీలుకల్పిస్తున్న బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. నెగోషియబుల్ ఇన్స్ట్రమెంట్స్ (సవరణ) బిల్లు, 2018కి లోక్‌సభ ఈ నెల 23న ఆమోదముద్రవేయగా, గురువారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీనితో బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర లభించినట్లుయ్యింది. తక్షణం ఫిర్యాదుదారుకు 20 శాతం పరిహారం తాజా ఎన్ఐ యాక్ట్ చట్ట సవరణ (సెక్షన్ 143ఏ, సెక్షన్ 148) ప్రకారం– ఫిర్యాదుదారుకు మధ్యంతర పరిహారంగా చెక్కు మొత్తంలో కనీసం 20 శాతం చెల్లించాలని సెక్షన్ 138 కింద కేసును విచారిస్తున్న ఒక కోర్టు– చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఆదేశాలు జారీ చేయవచ్చు. విచారణ కోర్టు ఆదేశాలు వెలువరించిన 60 రోజుల లోపు చెక్కు జారీ చేసిన వ్యక్తి ఈ 20 శాతం మొత్తాన్ని ఫిర్యాదుదారుకు చెల్లించాలి. ఒకవేళ దీనిపై చెక్కు జారీ చేసిన వ్యక్తి అప్పీల్‌కు వెళ్లదలిస్తే, అదనంగా మరో 20 శాతాన్ని మధ్యంతర పరిహారంగా చెల్లించాలి. ఒకవేళ చెక్కు జారీచేసిన వ్యక్తి నిర్దోషిగా కేసు నుంచి బయటపడితే, పరిహారంగా చెల్లించిన మొత్తాన్ని అతనికి తిరిగి ఫిర్యాదుదారు వడ్డీతోసహా చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వవచ్చు. -
బండ్ల గణేష్ కు ఆరునెలల జైలు శిక్ష
-
బండ్ల గణేష్ కు ఆరునెలల జైలు శిక్ష
ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న గణేష్ కు షరతులతో కూడిన బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది. ఎన్టీఆర్, కాజల్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాను బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. చిన్న చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్, రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారాడు. తరువాత వరుసగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి బ్లాక్ బస్టర్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. -
చెక్ బౌన్స్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు వద్దు
ఏలూరు(ఆర్ఆర్ పేట) : జిల్లాలోని వివిధ కోర్టుల్లో ఎన్ఐ యాక్ట్ సెక్షన్ 138 కింద ఉన్న చెక్ బౌన్స్ తదితర కేసుల విచారణను కేంద్రీకరిస్తూ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడాన్ని నిలిపివేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్(ఐలు) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఐలు జిల్లా కార్యవర్గ సమావేశం ఏలూరులో ఆదివారం నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.రాజగోపాల్, కేసిరెడ్డి భాస్కరరావు మాట్లాడుతూ ప్రత్యేక కోర్టు ఏర్పాటు వల్ల న్యాయవాదులకు, కక్షిదారులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. ఈ ప్రత్యేక కోర్టును భీమవరంలో ఏర్పాటు చేయాలనే ప్రయత్నాన్ని హైకోర్టు విరమించుకోవాలని కోరారు. జిల్లా కోర్టు విచారణ పరిధిని వికేంద్రీకరిస్తూ వివిధ ప్రాంతాల్లో జిల్లా కోర్టులు, కొత్తగా మున్సిఫ్ కోర్టులు ఏర్పాటు చేయటంవల్ల ఆయా ప్రాంతాలకు న్యాయం అందుబాటులోకి వస్తుందన్నారు. కేవలం చెక్ బౌన్స్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ నిర్ణయం కారణంగా ఆయా కోర్టుల పరిధిలోగల న్యాయవాదులు వృత్తిపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని వివరించారు. ఐలు జిల్లా కార్యదర్శి ఎస్ఎన్ కట్టా, కోశాధికారి వి.శైలజ, సభ్యులు పి.వేణుగోపాలచౌదరి తదితరులు పాల్గొన్నారు.