chemical godown
-
గుజరాత్లో అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి
అహ్మదాబాద్: కెమికల్ గోడౌన్లో పేలుడు సంభవించి భవనం కుప్పకూలిన ఘటనలో 12 మంది మరణించారు. ఈ దుర్ఘటన అహ్మదాబాద్ నగర శివారులో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. మరణించిన 9 మంది కూలీల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారులు చెప్పారు. గాయపడిన మరో 9 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కెమికల్స్ కారణంగా భారీ పేలుడు సంభవించడంతో భవనం కుప్పకూలి ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే సహాయక బలగాలు ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న 18 మందిని వెలికితీసి అంబులెన్సుల ద్వారా హుటాహుటిన ఆస్పత్రికి తరలించాయి. అయితే అందులో 12 మంది మరణించారని వైద్యులు తెలిపారు. శిథిలాల కింద అణువణువూ గాలిస్తున్నామని, ప్రమాదంపై విచారణ సాగిస్తున్నామని డీసీపీ అశోక్ మునియా చెప్పారు. కెమికల్ గోడౌన్‌లోని బాయిలర్ వల్ల పేలుడు జరిగి ఉండవచ్చని స్థానిక ఫ్యాక్టరీల యజమానులు అభిప్రాయపడుతున్నారు. పేలుడు తీవ్రత భారీగా ఉండటంతో గోడలు పగిలి స్లాబ్ కూలిందని గోడౌన్ పక్కన భవనాల్లో పనిచేస్తున్న కూలీలు చెప్పారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు. బాధితులను ఆదుకోవడానికి అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారని ట్వీట్ చేశారు. -
కెమికల్ గోడౌన్లో అగ్నిప్రమాదం
-
మాధవరంలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, చెన్నై: మాధవరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉవ్వెత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ అగ్నిజ్వాల పక్కనే ఉన్న మరో గోడౌన్‌ను సైతం చుట్టుముట్టింది. ఆ పరిసరాల్లో ఆగి ఉన్న పది లారీలు దగ్ధమయ్యాయి. దట్టమైన పొగతో ఆ పరిసరాలు నిండడంతో శ్వాస సమస్యతో జనం తల్లడిల్లాల్సిన పరిస్థితి. ఈ మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది వీరోచితంగా శ్రమిస్తున్నారు. చెన్నై శివార్లలోని మాధవరం పరిసరాలు గోడౌన్లు, పలు చిన్న తరహా పరిశ్రమతో నిండి ఉంటాయి. ఇక్కడే ఇటీవల సబర్బన్ బస్ టెర్మినల్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ వైపుగా వెళ్లే అన్ని బస్సులు ఇక్కడి నుంచి బయలుదేరుతాయి. మాధవరం జంక్షన్లో సబర్బన్ బస్ టెర్మినల్ ఉండగా, దానికి వెనుక కూత వేటు దూరంలో ఉన్న రసాయన పరిశ్రమలో హఠాత్తుగా శనివారం సాయంత్రం మూడున్నర గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడడంతో ఆ పరిసర వాసుల్లో ఆందోళన బయలు దేరింది. సమచారం అందుకున్న మాధవరం, తిరువొత్తియూరు, చెన్నై, తిరువళ్లూరుల నుంచి పదికి పైగా అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పే పనిలో పడ్డాయి. ఐదు వందల మంది మేరకు అగ్నిమాపక సిబ్బంది వీరోచితంగా శ్రమిస్తున్నారు. నీళ్లు ఎంతగా చల్లుతున్నా, మంటలు అదుపులోకి రాక పోవగా, ఉవ్వెత్తున ఎగసి పడతుండడంతో ఆందోళన తప్పలేదు. ఆ గోడౌన్‌కు రెండు వందల మీటర్ల వరకు వేడి సెగ తాకడంతో సమీపంలోకి వెళ్లలేని పరిస్థితిల్లో అగ్నిమాపక సిబ్బంది వెనక్కి రావాల్సిన వచ్చింది. చివరకు మెట్రో వాటర్ బోర్డుకు చెందిన పది లారీల ద్వారా నీటిని తరలించారు. ఆ పరిసరాల్లో వేడిసెగ మరింతగా బయలుదేరకుండా, పక్కనే ఉన్న భవనాలకు మంటలు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అయినా, ఆ గోడౌన్‌కు పక్కనే ఉన్న మరో గోడౌన్‌కు మంటలు వ్యాపించాయి. అక్కడున్న పది లారీలు దగ్ధమయ్యాయి. ఆ గోడౌన్లో ఉన్న వస్తువులు దగ్ధమయ్యాయి. ఈ రసాయన పరిశ్రమలో ఎంతకు మంటలు అదుపులోకి రాక పోవడంతో రెస్క్యూ కొనసాగుతోంది. ఓ దశలో మట్టిని పెద్ద ఎత్తున తీసుకొచ్చి వేయాల్సిన అవశ్యం తప్పదన్నట్టుగా పరిస్థితి మారింది. అయితే, అందుకు అవకాశాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలతో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు వీరోచితంగా శ్రమిస్తున్నారు. చదవండి: గ్యాస్ సిలిండర్ పేలుడు; నలుగురికి గాయాలు వంద కోట్ల విలువగల రసాయనాలు... మాధవరంలో అగ్ని ప్రమాదం జరిగిన గోడౌన్లో వంద కోట్లు విలువగల రసాయనలు ఉన్నట్టు తేలింది. ఈ రసాయనాల మూడి పదార్థాలు వైద్య సంబంధిత మందుల తయారీలో ఉపయోగించనున్నారు. ఇక్కడ మూడు గోడౌన్లు ఉండగా, తొలి గోడౌన్, రెండో గోడౌన్లలో తొమ్మిదిన్నర గంటల సమయంలో మంటల్ని అదుపులోకి తెచ్చారు. అయితే, మూడో గోడౌన్లోనేఅ త్యధికంగా మందులు ఉండటంతో, మంటల్ని అదుపు చేయడానికి తీ›వ్రంగా శ్రమిస్తున్నారు. ఆ గౌడౌన్ యజమాని రంజిత్ సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఆయన వద్ద పోలీసులు విచారిస్తున్నారు. కమిషనర్ ఏకే విశ్వనాథన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టెట్రా కార్బన్, డై సల్పయిడ్ వంటి 24 రకాల రసాయానాలు వందలాది బేరల్స్‌లో ఇక్కడ ఉన్నట్టు విచారనలో తేలిందని అగ్నిమాపక శాఖ డీజీపీ శైలేంద్ర బాబు తెలిపారు. అందుకే మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు వీరోచితంగా శ్రమిస్తున్నట్టు తెలిపారు. స్కై లిఫ్ట్ వాహనాల్ని రంగంలోకి దించడం ద్వారా రెండు గోడౌన్లలో మంటలు అదుపులోకి వచ్చాయని, మరో గోడౌన్లో మంటలు అర్థరాత్రి లేదా ఆదివారం వేకువ జామున అదుపులోకి తెస్తామన్నారు. ఎల్ఈడీ విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసి, అగ్ని జ్వాల ఎక్కడి నుంచి ఎ గసి పడుతున్నదో గుర్తించి, దానిని ఆర్పే యత్నం చేస్తున్నామన్నారు. చదవండి: నటి 'శ్రుతి' లీలలు మామూలుగా లేవుగా..! జనం అవస్థలు... ఉవ్వెత్తున ఎగసి పడుతున్న మంటలకు తోడుగా, దట్టమైన పొగ ఆ పరిసరాల్ని చుట్టుముట్టింది. దీంతో ఆ గౌడౌన్‌కు సమీపంలో ఉన్న వాళ్లందర్నీ ఖాళీచేయించారు. అయినా, పొగ క్రమంగా వ్యాపించడంతో ఆ పరిసర వాసులు ఊపిరి పీల్చుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అలాగే, కళ్లు మంటలు పెరగడంతో ఆందోళన తప్పలేదు. ఆగమేఘాలమీద వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లను సైతం సిద్ధం చేశారు. ఈ ప్రమాదం కారణంగా సమీపంలో ఉన్న బస్ టెర్మినల్ ఉన్న బస్సుల్ని అక్కడి నుంచి అప్రమత్తం చేశారు. ప్రయాణికుల్లో సైతం ఆందోళన బయలుదేరడంతో పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. అలాగే, ఆపరిసర మార్గాలన్నీ ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ డీజీపీ శైలేంద్రబాబు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సిబ్బందికి తగిన సూచనలు ఇస్తూ మంటల్ని ఆర్పేందుకు వీరోచితంగా శ్రమిస్తున్నారు. అదే సమయంలో ప్రమాద జరిగినప్పుడు ఆ రసాయన గోడౌన్లో ఎవరైనా ఉన్నారా అన్న ఆందోళన బయలుదేరడంతో ఉత్కంఠ తప్పడం లేదు. #WATCH Tamil Nadu: Fire breaks out at an oil warehouse in Madhavaram area in Chennai. 12 fire tenders present at the spot. Fire-fighting operation is underway. pic.twitter.com/kHKmM0LBXY — ANI (@ANI) February 29, 2020 -
స్క్రాప్ గోదాంలో పేలుడు
సాక్షి, రాజేంద్రనగర్: కెమికల్ డబ్బాల పేలుడుతో సీఐ, ఎస్సైతో పాటు మరో నలుగురు గాయపడ్డారు. రాజేంద్రనగర్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి.. శాస్త్రీపురంలో యాకత్పురా ప్రాంతానికి చెందిన మహ్మద్ మోహిద్ స్క్రాప్ గోదాం నిర్వహిస్తున్నాడు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కెమికల్ డబ్బాలను సేకరించి ఈ గోదాంలో శుభ్రపరుస్తుంటారు. శుభ్రపరిచిన ఈ డబ్బాలను తిరిగి విక్రయిస్తారు. 5, 10, 20, 25 లీటర్ల డబ్బాలతో పాటు ప్లాస్టిక్ డ్రమ్ములను శుభ్రపరిచి విక్రయించడం ఇతడి వ్యాపారం. ఇందులో పది మంది యువకులు పనిచేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక కెమికల్ డబ్బా పెలింది. ఈ సంఘటనలో హసన్‌నగర్‌కు చెందిన అప్రోజ్(25)కు తీవ్ర గాయాలయ్యాయి. ఎడమ కాలు మోకాళ్ల వరకు నుజ్జునుజ్జయింది. ఈ సంఘటన జరిగిన వెంటనే యజమాని పారిపోయాడు. స్థానికులు, తోటి కార్మికులు అప్రోజ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియాలో అప్రోజ్ కాలును శాస్త్ర చికిత్స చేసి తొలగించారు. ఈ విషయమై స్థానికులలు ఎంఐఎం నాయకుడు రహమత్‌బేగ్, శాస్త్రీపురం కార్పొరేటర్ మిస్బావుద్దీన్లకు సమాచారం అందించారు. స్థానికులంతా కలిసి గోదాం ఎదుట గురువారం ఉదయం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో కార్పొరేటర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ సత్తయ్యగౌడ్, ఎస్సై నదీమ్ సిబ్బందితో గోదాం వద్దకు చేరుకుని లోపల పరిశీలిస్తుండగా ఆ సమయంలో మరో కెమికల్ డబ్బా పేలింది. దీంతో సీఐ, ఎస్సై, కార్పొరేటర్‌తో పాటు రహమత్‌బేగ్, సయ్యద్ హబీబ్లకు గాయాలయ్యాయి. వీరిని వెంటనే అపోలోతో పాటు అస్రా ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వీరు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటన స్థలాన్ని శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి, రాజేంద్రనగర్ డివిజన్ ఏసీపీ ఆశోకచక్రవర్తి పరిశీలించారు. గోదాంను సీజ్ చేశారు. కాగా, గోదాం పరిశీలించేందుకు వెళ్లిన సీఐతో పాటు నలుగురి కర్ణబేరీలకు దెబ్బతిన్నాయి. వారికి వినికిడి శక్తి తగ్గిపోయినట్టు తెలిసింది. గోదాములను తొలగించాలి శాస్త్రీపురంలో పలు గోదాంలు అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయని స్థానికులు పోలీసులకు మొరపెట్టుకున్నారు. జీహెచ్ఎంసీ అధికారులతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. దాదాపు 25కు పైగా గోదాములు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రధాన రహదారిపైనే భారీ ప్లాస్టిక్ పరిశ్రమలు కొనసాగుతున్నాయని, అనుకోని ప్రమాదం జరిగితే చుట్టూ ఉన్న ప్రజల ప్రాణాలకు నష్టం వాట్టిల్లే ప్రమాదం ఉందన్నారు. -
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం..
-
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం..
సాక్షి, జీడిమెట్ల : నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాంరెడ్డి నగర్‌లోని స్యూటిక్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అనూహ్యంగా భారీ పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో దాదాపు ఐదుగురు సిబ్బందికి మంటలు అంటుకున్నాయి. అయితే, వెంటనే స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి మొత్తం ఎనిమిది అగ్నిమాపక వాహనాల్లో వచ్చిన సిబ్బంది రంగంలోకి దిగి మంటలు అంటుకున్న ఐదుగురుని రక్షించారు. వారిని వెంటనే సమీప ఆస్పత్రి తరలించారు. ఈ ఘటన ధాటికి ఆ ప్రాంతం నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల భారీగా పొగలు అలుముకున్నాయి. ఇంకొందరు కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది మంటల్లో చిక్కుకున్నారని సమాచారం. ఈ ప్రమాదంలో పెద్ద మొత్తంలో ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు భయందోళనకు గురయ్యారు. ఫైర్ కంట్రోల్లోకి వచ్చింది ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బంది అధికారులు స్పందించారు. 'ఫైర్ అంతా కంట్రోల్లోకి వచ్చింది. మొత్తం 8 వాహనాలతో కంట్రోల్ చేస్తున్నాం. ప్రస్తుతం ఫైర్ ఫైటింగ్ మాత్రమే చేస్తున్నాం. ఐదుగురుని కాపాడి వారిని ఆస్పత్రికి తరలించాం. ప్రమాదానికి కారణాలపై తర్వాత వివరాలు అందిస్తాం. ప్రస్తుతం ఓ ట్రక్కు మంటలు మాత్రమే అదుపులోకి రావాల్సి ఉంది. అది ఓ అరగంటలో అదుపులోకి వస్తుంది. అందులో హెచ్‌సీఎల్ ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, అది పెద్ద ప్రమాదమేమి కాదు' అని వారు తెలిపారు. ఫార్మాకంపెనీలో లోపాలు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న స్యూటిక్ ఫార్మా కంపెనీలో పలు లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ ప్రమాదం జరిగితే కనీసం మంటలను నియంత్రించేందుకు కూడా సరిపడా నీరు లేనట్లు స్పష్టమవుతోంది. అందులో పనిచేసే సిబ్బంది భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు కూడా కంపెనీ తీసుకోవడం లేదని ప్రస్తుతం ఘటన చూస్తే తెలుస్తోంది. కెమికల్స్‌ను భద్రపరిచే విషయంలో కూడా కంపెనీ నిర్లక్ష్యంగా ఉందని అక్కడ పరిస్థితులను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కెమికల్ గోడౌన్లో అగ్నిప్రమాదం
శంషాబాద్(రంగారెడ్డి): కెమికల్ గోడౌన్లో ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు ఎగిసిపడటంతో.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద గంగాపహాడ్ శివారులో ఉన్న కెమికల్ గోడౌన్లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు.