ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలని రైతుల నిరసన
ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరిన రైతులతో ఏఈ దురుసుగా ప్రవర్తించడంతో కోపోద్రిక్తులైన అన్నదాతలు ఆయనపై దాడికి యత్నించారు. అనంతపురం జిల్లా చిలమత్తూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం రైతులు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు కోసం వినతి పత్రం అందిస్తుండగా.. ఏఈ చెన్నకృష్ణ రైతులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆగ్రహించిన అన్నదాత లు ఏఈపై దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు ఇది గుర్తించి రైతులను అడ్డుకున్నారు. దాడికి యత్నించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.