Chennaiyin FC
-
చెన్నైయిన్తో హైదరాబాద్ మ్యాచ్ ‘డ్రా’
ఇండియన్ సూపర్ లీగ్లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) పాయింట్ల ఖాతా తెరిచింది. చెన్నైయిన్ ఎఫ్సీ జట్టుతో గచ్చి»ౌలి స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ను హైదరాబాద్ జట్టు 0–0తో ‘డ్రా’ చేసుకుంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ రెండు మ్యాచ్ల్లో ఓడి, ఒక మ్యాచ్ను ‘డ్రా’ చేసుకొని ఒక పాయింట్తో 12వ స్థానంలో ఉంది. -
చెన్నై, హైదరాబాద్ మ్యాచ్ డ్రా
ISL 2021-2022: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో గురువారం హైదరాబాద్ ఎఫ్సీ, చెన్నైయిన్ ఎఫ్సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1 స్కోరుతో డ్రా అయింది. మ్యాచ్ ఆరంభమైన 13 నిమిషాలకే చెన్నై ఆధిక్యంలోకి వెళ్లింది. డిఫెండర్ మొహమ్మద్ సాజిద్ ధోత్ గోల్ చేయడంతో 1–0తో పైచేయి సాధించింది. హైదరాబాద్ ఫార్వర్డ్ ఆటగాడు జేవియర్ సివేరియో (45వ ని.) గోల్ చేసి స్కోరును 1–1తో సమం చేశాడు. చదవండి: అదే తీరు.. ఈసారి పంత్తో పెట్టుకున్నాడు -
చెన్నైయిన్ కెప్టెన్ ఎలనో అరెస్ట్, విడుదల
పణజి: ఐఎస్ఎల్ రెండో సీజన్లో విజేతగా నిలిచిన అనంతరం చెన్నైయిన్ ఎఫ్సీ ఆటగాళ్ల విజయోత్సవాలు స్ట్రయికర్ ఎలనో బ్లమ్మర్కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఆదివారం జరిగిన ఫైనల్లో ఎఫ్సీ గోవాను 3-2తో ఓడించిన అనంతరం ఆటగాళ్లు సంబరాల్లో మునిగారు. అయితే కాస్త అతిగా స్పందించిన ఎలనో... ఎఫ్సీ గోవా సహ యజమాని దత్తరాజ్ సాల్గావ్కర్ను తన మోచేతితో గుద్దాడు. దీన్ని సీరియస్గా తీసుకున్న సాల్గావ్కర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఎలనోను అదే రోజు రాత్రి అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే జట్టు ఆటగాళ్లతో పాటు రిలయన్స్ స్పోర్ట్స్ అధికారులు అతడికి బెయిల్ ఇప్పించారు. వెంటనే సోమవారం ఉదయం 5 గంటలకు తను బ్రెజిల్ వెళ్లిపోయినట్టు న్యాయవాది రాజీవ్ గోమ్స్ తెలిపారు. ఎలనో వ్యవహారంపై ఐఎస్ఎల్ సీరియస్ అయ్యింది. ఇలాంటి ఘటనలు లీగ్ ఇమేజిని దెబ్బతీస్తాయని అభిప్రాయపడింది. ఇలాంటివి సహించేది లేదని, అందుకే విషయాన్ని క్రమశిక్షణ కమిటీకి రిఫర్ చేసినట్టు తెలిపింది. -
అక్టోబర్ 3 నుంచి ఐఎస్ఎల్
న్యూఢిల్లీ : రెండో అంచె ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ షెడ్యూల్ను విడుదల చేశారు. అక్టోబర్ 3 నుంచి డిసెంబర్ 20 వరకు పోటీలు జరుగుతాయి. ఇంటా, బయటా పద్ధతిలో మొత్తం 61 మ్యాచ్లు ఆడనున్నారు. చెన్నైలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్కతా... చెన్నైయిన్ ఎఫ్సీతో తలపడుతుంది.