Chennaraopet
-
అమ్మానాన్న.. నన్ను క్షమించండి..!
చెన్నారావుపేట: అమ్మా, నాన్నా నన్ను క్షమించండి.. మీ ఆశలు నెరవేర్చలేకపోతున్నాను.. అని సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటనకు సంబంధించి, స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన చీర మల్లేశం– కళావతిలకు కుమార్తె, కుమారుడు రంజిత్(25) ఉన్నారు. కుమార్తెకు వివాహం జరిపించారు. కుమారుడు అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి ఉన్నత చదువులు చదువుతూ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాస్తున్నాడు. ఇటీవల ఓ పోటీ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో ఉద్యోగం రాలేదని మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో స్నేహితుడు ప్రశాంత్ అక్క వివాహానికి మూడు రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. పట్టణంలోని ఎర్రముక్కలపల్లి రోడ్డు వద్ద ఓ ప్రముఖ లాడ్జీని అద్దెకు తీసుకున్నారు. గురువారం తన స్నేహితులు టిఫిన్ చేయడానికి వెళ్లారు. రంజిత్ రాకపోవడంతో స్నేహితులు గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉన్నాడు. పోలీసులకు తెలియజేసి, రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రంజిత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్ట్‌మార్టం అనంతరం రంజిత్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. చేతికొచ్చిన కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురి కంటతడి పెట్టించింది. -
దీన స్థితి: ఎంఏ, బీఈడీ చదివి మేస్త్రీ పనికి యువతి
ఈమె పేరు కన్నం వరలక్ష్మి. ఎంఏ బీఈడీ పూర్తి చేసి 2018లో విద్యావలంటీర్‌గా చెన్నారావుపేట మండలం బోజెర్వు పాఠశాలలో విధుల్లో చేరింది. వరలక్ష్మికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కరోనా మహమ్మారి వల్ల 20 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. కనీసం రెన్యూవల్ చేయడంలోనూ జాప్యం జరుగుతోంది. దీంతో కుటుంబ పోషణ కోసం సుతారి పనికి వెళ్తున్నా. ప్రభుత్వం స్పందించి నాలుగు నెలల పాత వేతనాలు అందించి.. కరోనా కాలంలో ఆపత్కాలపు భృతి ఇచ్చి, రెన్యూవల్ చేయాలని వేడుకుంది. నర్సంపేట రూరల్: కరోనా మహమ్మారి వల్ల కూలీలుగా మారారు. పాఠశాలలకు వెళ్లి పాఠాలు బోధించాల్సిన విద్యా వలంటీర్లు తీరొక్క పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. ప్రస్తుతానికి పాఠశాలలు తెరిచినా వీరిని రెన్యూవల్ చేయకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అలాగే 2019 విద్యాసంవత్సరానికి సంబంధించి నాలుగు నెలల పెండింగ్ వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. చదవండి: కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు కరోనా కాలంలో ప్రైవేట్ టీచర్లకు భృతి కల్పించిన ప్రభుత్వం.. విద్యావలంటీర్లను మరవడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక కుమిలిపోతున్నారు. ఉన్నత విద్యాభ్యాసం చేసినా ప్రభుత్వ కొలువు రాకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావలంటీర్లుగా చేరారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా బోధిస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 3,749 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. హనుమకొండ జిల్లాలో 94, వరంగల్ 44, జనగామ 120, జయశంకర్ భూపాలపల్లి, ములుగులో 931, మహబూబాబాద్ జిల్లాలో 340 చొప్పున మొత్తం 1,529 మంది విద్యావలంటీర్లు విధులు నిర్వర్తించేవారు. అయితే కరోనా మహమ్మారి వీరి ఉపాధిని దెబ్బతీసింది. ప్రస్తుత విద్యాసంవత్సరం రెన్యూవల్ కూడా చేయకపోవడంతో కుటుంబ పోషణ కోసం కూలీ పనులు చేసుకుంటున్నారు. చదవండి: తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పాలమూరు బుడ్డోడు పట్టించుకోలేదని ఆవేదన.. 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం తమను çపట్టించుకోలేదని పలువురు వలంటీర్లు వాపోతున్నారు. పల్లె ప్రాంత విద్యార్థులకు సమాచార మాధ్యమాలు అందుబాటులో లేనప్పుడు కీలకంగా వ్యవహరించిన వీరిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో 30 శాతం ఫిట్మెంట్ వలంటీర్లకు వర్తింపజేస్తామన్నారు. గురుకులాల్లోని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, గెస్టు టీచర్లు, సీఆరీ్పలకు విధులు అప్పగించి జీతాలు ఇస్తున్న ప్రభుత్వం అదే విద్యార్హతలున్న తమపై కనికరం చూపడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రెండు వేల కోళ్ల సజీవ సమాధి
చెన్నారావుపేట: వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన చాపర్తి రాజు 25 రోజుల క్రితం సహకార సంఘం పరిధిలోని కోళ్ల షెడ్డు కిరాయికి తీసుకొని బ్రాయిలర్ కోళ్లను పెంచుతున్నాడు. కోవిడ్ దెబ్బకు కోడి మాంసానికి డిమాండ్ పడిపోయింది. దీంతో రాజు మంగళవారం ప్రజలకు ఉచితంగా కోళ్లను పంపిణీ చేశాడు. మరో 2వేలకు పైగా కోళ్లను బతికుండగానే పూడ్చిపెట్టాడు. -
హెల్మెట్ పెట్టుకుని పాఠాలు..
సాక్షి, వరంగల్ : కొన్ని సార్లు సామాన్యుల నిరసనలు.. వారు చేసే పోరాటాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. అలాంటి నిరసనలు సమస్య తీవ్రతను తెలియజేయడమే కాకుండా, ఇతరుల దృష్టిని ఆకర్షిస్తాయి. వరంగల్ రూరల్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు చేపట్టిన నిరసన కూడా ఇలాంటిదే. వివరాల్లోకి వెళితే.. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. ఇంగ్లిష్ మీడియంలో బోధన సాగిస్తున్న ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 89 మంది విద్యార్థులు ఉన్నారు. ఆరుగురు ఉపాధ్యాయులు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. మూడు తరగతి గదులు ఉండగా.. అన్ని కూడా శిథిలావస్థకు చేరాయి. అలాగే ఆ పాఠశాలలో ఇతర కనీస వసతులు కూడా లేవు. ఈ పరిస్థితుల్లో స్లాబ్ పెచ్చులు ఎప్పుడూ తమపై ఊడి పడతాయనే భయంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ పాఠశాలలో కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఆ పాఠశాలలో గణితం బోధిస్తున్న దస్రు అనే ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసి వినూత్నంగా నిరసన తెలిపారు. తన తలపై హెల్మెట్ ధరించి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆ సమయంలో విద్యార్థులు కూడా తమ తలలపై పలకలు ఉంచి నిరసన తెలిపారు. విద్యార్థులతో కలిసి ఆ టీచర్ నిరసన తెలుపుతున్న ఫొటో పరిస్థితి తీవ్రతను అద్ధం పట్టేలా ఉంది. -
మొక్కలను పిల్లల్లా కాపాడుకోవాలి
చెన్నారావుపేట : మొక్కలను అప్పుడే పుట్టిన చిన్న పిల్లల మాదిరిగా కాపాడుకోవాలని రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. హరితహారం కార్యక్రమాన్ని పురస్కరించుకుని మండలంలోని మగ్దుంపురం జయముఖి ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం చెన్నారావుపేట పోలీసుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్పీ మొక్కలు నాటి మా ట్లాడారు. మొక్కలతోనే మానవ మనుగడ ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రూరల్ సీఐ బోనాల కిషన్, ఎస్సైలు పులి వెంకట్‌గౌడ్, నారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజ మౌళి, పీఎస్సై నరేందర్‌రెడ్డి, ఏఎస్సై ఆకుల కుమారస్వామి, కళాశాల సంయుక్త కార్యదర్శి టీవీఆర్‌ఎన్.రెడ్డి, ప్రిన్సిపాల్ లోక్‌నాథ్‌రావు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సతీష్, కళాశాల అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
అన్నదాత ఆత్మహత్య
చెన్నారావుపేట (వరంగల్) : అప్పులబాధ తాళలేక రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ఖల్నాయక్తండాలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన గుగులోత్ కోబ్లా(65) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా.. పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఎక్కువయ్యాయి. వాటిని తీర్చే దారి కనపడక గురువారం వ్యవసాయ బావి వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బావిలో పడి బాలుడు మృతి
చెన్నారావుపేట (వరంగల్) : వ్యవసాయ బావిలో పడి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఊరుగొండ రాజు, దివ్య దంపతుల కుమారుడు రాజశేఖర్(8)కు మతి స్థిమితం లేదు. సోమవారం అతడిని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లారు. కుటుంబసభ్యులు పనుల్లో నిమగ్నమై ఉండగా ఆడుకుంటూ బావి వద్దకు వెళ్లిన రాజశేఖర్ అందులో పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబసభ్యులు అతని కోసం వెతగ్గా నీటిపై తేలియాడుతూ విగతజీవిగా కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.