మొక్కలను పిల్లల్లా కాపాడుకోవాలి
చెన్నారావుపేట : మొక్కలను అప్పుడే పుట్టిన చిన్న పిల్లల మాదిరిగా కాపాడుకోవాలని రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. హరితహారం కార్యక్రమాన్ని పురస్కరించుకుని మండలంలోని మగ్దుంపురం జయముఖి ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం చెన్నారావుపేట పోలీసుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్పీ మొక్కలు నాటి మా ట్లాడారు. మొక్కలతోనే మానవ మనుగడ ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రూరల్ సీఐ బోనాల కిషన్, ఎస్సైలు పులి వెంకట్‌గౌడ్, నారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజ మౌళి, పీఎస్సై నరేందర్‌రెడ్డి, ఏఎస్సై ఆకుల కుమారస్వామి, కళాశాల సంయుక్త కార్యదర్శి టీవీఆర్‌ఎన్.రెడ్డి, ప్రిన్సిపాల్ లోక్‌నాథ్‌రావు, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ సతీష్, కళాశాల అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.