chennareddy
-
విదేశాలకు తరలిపోయిన శ్రీవారి ఆభరణాలు
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆభరణాలు ఎప్పుడో ఇతర దేశాలకు తరలిపోయాయని పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ చెన్నారెడ్డి బాంబు పేల్చారు. శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించిన అనేక ఆభరణాలు, నాణేలు కూడా ఇప్పుడు లేవని తెలిపారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. శ్రీకృష్ణదేవరాయలు స్వామి వారికి సమర్పించిన ఆభరణాలు ఎంతవరకు భద్రంగా ఉన్నాయన్న దానిపై పురావస్తు శాఖ గతంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. కమిటీ సభ్యులు నెల రోజులపాటు పరిశీలించి చాలా ఆభరణాలు, నాణేలు లేనట్టు గుర్తించారని చెప్పారు. చాలా ఆభరణాలు, నాణేలను కరగబెట్టినట్టు కమిటీ సభ్యులు తేల్చారని వివరించారు. ‘పాత మిరాశీదారీ వ్యవస్థ సమయంలోనో.. అంతకుముందో చాలా నాణేలు కరగబెట్టారు. శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు సతీసమేతంగా తిరుమల పర్యటనకు వచ్చి ఎన్నో ఆభరణాలు, నాణేలు స్వామివారికి కానుకగా ఇచ్చారు. విచారణ చేస్తే వాటికి సరైన రికార్డులు కూడా లేవని తేలింది’అని తెలిపారు. వివిధ శాసనాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. శ్రీకృష్ణదేవరాయలు స్వామి వారికి సమర్పించిన ఆభరణాల గురించి పురావస్తు శాఖ ‘గిఫ్ట్స్ అండ్ గ్రాంట్స్ డొనేట్ బై కృష్ణదేవరాయల్ టూ ఆంధ్రా టెంపుల్స్’పేరుతో ఒక పుస్తకం ప్రచురించినట్టు చెప్పారు. రాయల వారు ఏ సమయంలో పర్యటించారు? ఏ కానుకలు సమర్పించారన్నది శాసనాల్లో స్పష్టంగా పేర్కొన్నారని.. వాటి వివరాలతో పుస్తకం ప్రచురించినట్టు వెల్లడించారు. శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి ఎంతో విలువైన నాణేలు, వజ్రవైడూర్యాలు సమర్పించారని వీటిలో కొన్ని పర్షియన్ దేశాలకు, మరికొన్ని అరబ్ దేశాలకు తరలిపోయాయని పేర్కొన్నారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎన్నో ముత్యాలను ఇంగ్లండ్‌కు తరలించుకుపోయిందని, అవన్నీ అక్కడ భద్రంగా ఉన్నాయన్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీ విడిపోయినప్పుడు ఎన్నో ఆభరణాలు ఆ ప్రాంతంలో ఉండిపోయాయని, వాటిని అక్కడ నుంచి రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరగలేదని చెప్పారు. రోమన్, శాతవాహన కాలం నాటి కొన్ని నాణేలు ఇప్పటికీ టీటీడీ మ్యూజియంలో ఉన్నాయని వెల్లడించారు. -
శ్రీవారి ఆభరణాల మాయం నిజమే: చెన్నారెడ్డి
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) పై జరుగుతున్న పరిణామాలపై తాజాగా పురావస్తుశాఖ మాజీ డైరెక్టర్ పెద్దారపు చెన్నారెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీకి శ్రీ కృష్ణ దేవరాయులు ఇచ్చిన అనేక వజ్రాలు, ఆభరణాలు మాయమయ్యాయని వెల్లడించారు. వెంకన్న స్వామిని కృష్ణ దేవరాయులు ఏడు సార్లు దర్శించుకున్నారన్నారు. ఆసమయంలో ఆయన ఇచ్చిన అభరణాలను చాలావరకు కరిగించారని, పలు వజ్రాలు విదేశాలకు తరలిపోయాయని పేర్కొన్నారు. కృష్ణ దేవరాయలు ఇచ్చిన ఆభరణాలు, వజ్రాలు పదిశాతం కూడా లేవని తెలిపారు. తాను డైరెక్టర్‌గా ఉన్నప్పుడు భక్తులు ఇచ్చిన అభరణాలపై 2012 లో ఓ కమిటి వేశామని, సదరు కమిటీ విచారణలో ఈ విషయాలు బయటపడ్డాయని స్పష్టం చేశారు. మరోవైపు టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం ఈవో మాట్లాడుతూ...టీటీడీ నిధులు ఎక్కడా దుర్వినియోగం కాలేదని తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారమే పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని అంశాలపై చట్టప్రకారం ముందుకు వెళతామని చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించినట్లు ఈవో తెలిపారు. స్వామివారి ఆభరణాలన్నీ సురక్షితంగా ఉన్నాయని, వాటికి సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రికి అందచేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
నేను చూసిన ముఖ్యమంత్రుల్లో ఆయన బెస్ట్..
సాక్షి, హైదరాబాద్ : ‘నేను చూసిన ముఖ్యమంత్రుల్లో చెన్నారెడ్డి బెస్ట్. ఆయన సమావేశాలకు వెళ్లాలంటే అధికారులకు ప్రిపరేషన్ తప్పనిసరిగా ఉండేది. యారోగెన్స్‌తోపాటు ఇంటెలెక్చువల్ ఉన్న సీఎం ఆయన’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. సాక్షి టీవీ స్పెషల్ లైవ్ షోలో సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుతో ఆయన మాట్లాడారు. స్విస్ చాలెంజ్ విధానంపై తాను దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఉందని, న్యాయపరిధిలో ఉండటంతో దీనిపై తాను మాట్లాడబోనని అన్నారు. ఏపీకి పరిపాలనా రాజధాని సరిపోతోందని పేర్కొన్నారు. విజయవాడతోపాటు ముఖ్య నగరాల్లో సమాంతర అభివృద్ధి జరగాల్సిన అవసరముందని చెప్పారు. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకరణ సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పరిస్థితి, ఏపీలో పరిస్థితి వేరు అని చెప్పారు. కొన్ని ప్రభుత్వ నిర్ణయాలను తాను విభేదించానని, అందుకే తనను పక్కన పెట్టారని వెల్లడించారు. చంద్రబాబు ధోరణిలో సంకుచితత్వం కనిపించిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజధాని ఎంపికలో కొందరి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. రాయలసీమలో హైకోర్టు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంత తేలిగా వస్తుందని అనుకోవడం లేదని అన్నారు. కేంద్రం దృష్టిలో టీడీపీ ఊడిపోయే ముక్కు అని, ఊడిపోయే ముక్కు బెదిరిస్తే ప్రయోజనం ఉంటుందా అని ఆయన వ్యాఖ్యానించారు. బడ్జెట్‌ను చూస్తే ఆశ్చర్యం కలిగిందని, అంచనాలకు మించి రూ. 7వేల కోట్లు వస్తాయని చూపారని, రెవెన్యూ లోటు నుంచి సడన్‌గా మిగులు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. బడ్జెట్ అంకెల్లో ఏదో వ్యూహం ఉన్నట్టు కనిపిస్తోందని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. -
వైఎస్ఆర్సీపీ నేత దారుణహత్య!
సాక్షి, ధర్మవరం: వైఎస్ఆర్ సీపీకి చెందిన క్రియాశీలక నేత చెన్నారెడ్డి దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో స్థానికంగా కలకలం రేపింది. ధర్మవరం మండలం బడనపల్లి సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పథకం ప్రకారం చెన్నారెడ్డిని వేట కొడవళ్లతో నరికి హత్యచేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. బడనపల్లి వైఎస్ఆర్ సీపీలో చెన్నారెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ సీపీతోనే కొనసాగుతున్న చెన్నారెడ్డి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తుండటాన్ని రాజకీయ ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో చెన్నారెడ్డి హత్యకు పథకం పన్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం బడనపల్లి సమీపంలోని పంట పొలాల వద్ద పనులు పర్యవేక్షిస్తుండగా కొందరు గుర్తుతెలియని దుండగులు వేటకొడవళ్లతో చెన్నారెడ్డిపై దాడి చేసి హత్యచేశారు. విషయం తెలుసుకున్న చెన్నారెడ్డి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులు జరిగినా, వారిని హత్య చేస్తున్నా పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలున్నా ఏపీ ప్రభుత్వం లెక్కచేయడం లేదు. హత్య చేసినా ప్రభుత్వ ఒత్తిళ్లతో పోలీసుల కేసులు నమోదు చేయరని, ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నేత దారుణహత్య చోటుచేసుకుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో కొనసాగిస్తోన్న ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన వస్తుండగా.. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు హత్యా రాజకీయాలకు తెరతీయడం గమనార్హం. -
ఉచిత వైద్య శిబిరాలను సద్వినిమోగం చేసుకోండి
కలసపాడు: పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఉచిత పశువైద్యశిబిరాలను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల పశువైద్యాధికారి సి.చెన్నారెడ్డి తెలిపారు. శనివారం మండల పరిధిలోని శంకవరం గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులకు రోగాలు రాకమందు అప్రమత్తమైతే పశుసంతతిని కాపాడుకోవచ్చని తెలిపారు.శంకవరం గ్రామంలో జరిగిన పశువైద్య శిబిరంలో 10 పశువులకు శస్త్రచికిత్సలు,16 పశువులకు సాధారణ చికిత్సలు, 25 దూడలకు నట్టల నివారణ మందును పంపిణీ చేసినట్లు డాక్డర్ చెన్నారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు. -
చెన్నారెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ
పులివెందుల: వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని దినేష్ మెడికల్ సెంటర్లో అనారోగ్యంతో చికిత్సపొందుతున్న సమీప బంధువు చెన్నారెడ్డిని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పరామర్శించారు. ఇడుపుల పాయలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సభలో పాల్గొని నివాళులు అర్పించిన అనంతరం జగన్ పులివెందుల వెళ్లారు. శ్వాసకోశవ్యాధితో బాధపడుతూ కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న చెన్నారెడ్డిని ఆయన పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు.