Chettinad Group
-
చెట్టినాడు గ్రూప్ ఆఫ్ కంపెనీపై ఐటీ దాడులు
చెట్టినాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద నేటి ఉదయం నుండి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చెన్నై, ఆంధ్ర, తెలంగాణ కలిపి మొత్తం 50 ప్రాంతాల్లో 100 టీమ్స్ తో కలిసి ఐటీ బృందం సోదాలు జరుపుతుంది. చెట్టినాడు గ్రూప్ ఫై చెన్నైలో సీబీఐ కేసు నమోదు అయింది. నేటి ఉదయం నుండి కంపెనీల మీద, చెట్టినాడ్ ఛైర్మెన్ ముత్తయ్యా ఇంటితో పాటు బంధువుల ఇళ్లలోను సోదాలు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేతకు సంబంధించి ఈ ఐటి దాడులు జరుగుతున్నట్లు సమాచారం. నిర్మాణం, సిమెంట్, పవర్, స్టీల్ బిజినెస్ లో చెట్టినాడ్ గ్రూప్ వ్యాపారాలు చేస్తోంది. చెన్నైలో ఉన్న చెట్టినాడ్ హెడ్ ఆఫీస్ లో ఐటి సోదాలు జరగగా, అలాగే హైదరాబాద్ లో ఉన్న చెట్టినాడ్ కార్యాలయంలో కూడా ఐటి సోదాలు జరుగుతూన్నాయి. 2015లోనూ భారీగా పన్ను ఎగువేతకు సంబందించి దాడులు చేసిన ఐటి అప్పుడు పన్ను ఎగవేతకు సంబంధించి ఎటువంటి అధరాలు చూపలేకపోయింది. తమిళనాడు, తెలంగాణ, ఏపీ ఈ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.(చదవండి: వ్యాక్సిన్ షాక్- పసిడి ధరల పతనం) -
చెట్టినాడు గ్రూప్ సంస్థలపై దాడులు
చెన్నై : చెట్టినాడు గ్రూపు మధ్య నెలకొన్న వివాదంతో ఆదాయ పన్ను శాఖ అప్రమత్తమైంది. బుధవారం చెట్టినాడు గ్రూప్ సంస్థలపై ఆదాయపన్ను శాఖ అధికారులు భారీగా దాడులు చేస్తున్నారు. సుమారు 450 మంది సభ్యులతో కూడిన బృందం ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర లోని 40 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. చెట్టినాడు సంస్థ 252 కోట్ల రూపాయల పన్ను బకాయిలను ప్రభుత్వానికి ఎగవేశారనే అనుమానంతో ఈ దాడులు చేస్తున్నట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ, చెట్టినాడు గ్రూప్ ఎండీ ఎంఎఎం రామస్వామి తన దత్తకుమారుడు ఎంఎఎంఆర్ ముత్తయ్య (అయ్యప్పన్) తో సంబంధాలు తెంచుకుంటున్నట్లు మంగళవారం చెట్టినాడు భవన్లో మీడియాకు తెలిపారు. తన ఆస్తి మొత్తం తన తదనంతరం సేవా కార్యక్రమాలకు వెళుతుందన్నారు. ఇందుకోసం డాక్టర్ ఎంఎఎం రామస్వామి చెట్టియార్ ఆఫ్ చెట్టినాడు చారిటబుల్ ట్రస్ట్, డాక్టర్ ఎంఎఎం రామస్వామి చెట్టియార్ ట్రస్ట్ అని రెండు సేవా సంస్థలను ప్రారంభించామన్నారు. తన మరణానంతరం మిగిలి ఉండే ఆస్తులన్నీ ఈ ట్రస్టులకు చెందాలని విల్లును కూడా రిజిస్టర్ చేసినట్లు రామస్వామి తెలిపారు. తన అంత్యక్రియలు, కర్మకాండలు ముత్తయ్య నిర్వహించడానికి వీల్లేదని ఆయన ప్రకటించారు. అయితే కంపెనీ ఎండీ ముత్తయ్య మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. రామస్వామికి చెట్టినాడు కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని ముత్తయ్య తేల్చి చెప్పారు. కంపెనీకి సంబంధంలేని బయటి వ్యక్తి ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తమ సంస్థ ప్రతి నెలా విధిగా ఆదాయ పన్నులు చెల్లిస్తోందన్నారు. -
చెట్టినాడ్ గ్రూప్‌లో కుటుంబపోరు
చెన్నై: దక్షిణాదికి చెందిన ప్రముఖ పారిశ్రామిక గ్రూప్‌ల్లో ఒకటైన చెట్టినాడ్ గ్రూప్ ఆధిపత్యానికి కుటుంబ పోరు తారాస్థాయికి చేరింది. ప్రధానంగా సిమెంటు వ్యాపారం చేసే ఈ రూ. 4,000 కోట్ల గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ ఎంఏఎం రామస్వామిని తప్పించడంలో ఆయన దత్తపుత్రుడు కృతకృత్యులయ్యారు. ఫ్లాగ్షిప్ కంపెనీ చెట్టినాడ్ సిమెంట్ కార్పొరేషన్ డెరైక్టర్‌గా రామస్వామిని ఎంపిక చేయకుండా పక్కన పెడుతూ బుధవారం బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందుకు వాటాదారులు సైతం అంగీకరించారు. కంపెనీల చట్టం 2013లోని 152 సెక్షన్ ప్రకారం రొటేషన్ పద్ధతిలో 82ఏళ్ల రామస్వామి పదవీ విరమణ చేసినట్లు కంపెనీ పేర్కొంది. దీంతో డెరైక్టర్‌గా ఎంపిక చేయలేదని తెలిపింది. రామస్వామికి దత్త పుత్రుడు అయిన ఎంఏఎంఆర్ ముత్తయ్య కంపెనీకి ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చైర్మన్ ఎమిరిటస్‌గా...: రామస్వామిని తిరిగి డెరైక్టర్‌గా ఎంపిక చేయలేదని, అయితే చైర్మన్ ఎమిరిటస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారని ముత్తయ్య వాటాదారులకు వివరించారు. లోక్‌సభ మాజీ సభ్యులైన రామస్వామి గుండె సంబంధ నొప్పితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా ఏజీఎంకు హాజరుకాలేకపోయారు. కాగా, ఈ గ్రూప్ ఇటీవలే 0.8 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంగల ఆంధ్రప్రదేశ్‌లోని అంజనీ పోర్ట్లాండ్ సిమెంట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సీబీఐ అరెస్ట్‌ల నేపథ్యం: రూ. 10 లక్షలు లంచం తీసుకున్న కేసులో చెన్నై రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అయిన ఎం.మను నీతి చోలన్ను సీబీఐ అరెస్ట్ చేసిన ఒక రోజు తరువాత కంపెనీ ఏజీఎంలో రామస్వామిని డెరైక్టర్‌గా ఎంపిక చేయకుండా పక్కనపెట్టడంతో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కంపెనీ అజమాయిషీపై పట్టుకోసం ప్రయత్నిస్తున్న ప్రత్యర్థి వర్గానికి చెక్‌పెట్టేందుకు వీలుగా బుధవారంనాటి ఏజీఎంను రద్దు చేయమంటూ చోలన్కు రామస్వామి లంచం ఇవ్వజూసినట్లు సీబీఐ పేర్కొంది. రామస్వామి స్వల్పకాలంపాటు జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ద్వారా లోకసభలో సభ్యులయ్యారు. కర్ణాటక తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అన్నామలై యూనివర్శిటీకి ప్రోచాన్సలర్గా వ్యవహరించారు. ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయన్న కారణంగా తమిళనాడు ప్రభుత్వం యూనివర్శిటీని చేజిక్కించుకుంది.