Chicken nuggets
-
పెరూ పుంజు.. వచ్చెనండి.. కాసులు తెచ్చెనండీ!
కోనసీమలో ఒక కొబ్బరి చెట్టునో, ఒక గేదెనో.. ఒక ఎకరం భూమినో నమ్ముకుని ఆదాయం పొందుతూ ఏదోలా బతికేద్దామని అనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ తాను అలా అనుకోలేదంటున్నారు పెన్మెత్స రామ సత్యనారాయణరాజు అలియాస్ ఈస్ట్ గోదావరి రామరాజు. నేడు భూములు, పశువులు, కొబ్బరి చెట్ల వల్ల ఆదాయం అంతగా లభించక కొంతమంది ఉన్నత చదువులతో ఉన్నత రంగాలకు వెళ్లిపోతున్నారు. కానీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం బట్టేలంక గ్రామానికి చెందిన ఈ యువకుడు కేవలం ఒక కోడిపుంజును నమ్ముకున్నాడు, తద్వారా దండిగా ఆదాయం సంపాదిస్తున్నాడు. – మలికిపురం ఈస్ట్ గోదావరి రామరాజు (32) బీటెక్ పూర్తి చేశారు. తండ్రి వేంకటేశ్వరరాజు రెండేళ్ల క్రితం కరోనాతో మృతి చెందడంతో అప్పటి నుంచి కుటుంబం కోసం ఉద్యోగం ఆలోచన విరమించుకుని రామరాజు బట్టేలంకలోనే ఉంటున్నారు. ఈయనకు ఇదే మండలం ఇరుసుమండ గ్రామంలో 15 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అదీ ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి పంచుకోగా వచ్చింది. దీని ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. దీంతో కోనసీమలో పలువురు చేస్తోన్న మాదిరిగానే రామరాజు దేశవాళీ కోడిపుంజులు పెంచుతూ సంక్రాంతి సమయంలో అమ్ముతు ఉంటారు. ఇందులోనూ అంతంత మాత్రంగానే ఆదాయం వస్తుండటంతో ఆయన సరికొత్త ఆలోచన చేశారు. పుంజుకూ వీసా..! అమెరికాలో పరిచయమున్న వారి ద్వారా రామరాజు ‘పెరూ’ జాతి కోడిపుంజును అక్కడి ధర రూ.1.40 లక్షలకు 2020 జూన్‌లో కొనుగోలు చేశారు. పెరూ నుంచి దిగుమతి చేసుకున్న కోడి పుంజులకు ప్రత్యేకంగా వీసా ఖర్చులతో పాటు విమానంలో ప్రయాణానికి అదనంగా టికెట్‌ను కొనుగోలు చేసి ఆ కోడిపుంజును అమెరికా నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా తయారైన కారులో ఇరుసుమండలోని రామరాజు కొబ్బరి తోటలోకి పుంజు చేరింది. ఈ పుంజును అన్నీ కలుపుకొని ఇక్కడకు తీసుకురావడానికి రామరాజుకు రూ.2.85 లక్షలు ఖర్చయ్యింది. అప్పటి నుంచీ ఈ పెరూ జాతి కోడిపుంజును రాజభోగాలతో రామరాజు మేపుతున్నారు. మేలు రకాలయిన దేశవాళీ పెట్టల క్రాసింగ్ ద్వారా దీని సంతానం విపరీతంగా పెరిగింది. ఈ జాతి పుంజులు పందాల్లో విశేష ప్రతిభ చూపడంతో దీని బ్రీడ్‌కు డిమాండ్ పెరిగింది. రామరాజు కోడిపుంజులను పెంచడం లేదు. వీటి పిల్లలను 3 నెలల వయసు వచ్చే వరకు మాత్రమే పెంచి అనంతరం ఒక్కో పిల్లను రూ.10,000కు పైగా విక్రయిస్తున్నారు. ఇలా ఈ రెండేళ్లలో ఇప్పటివరకు రూ.41.60 లక్షల ఆదాయం వచ్చినట్లు రామరాజు చెప్పారు. దీనిలో నెలకు రూ.25 వేల చొప్పున ఖర్చవుతుందని, రూ.35.60 లక్షలు మిగిలిందని వెల్లడించారు. దండిగా ఆదాయం ప్రస్తుతం కొబ్బరి ఆదాయం తోటల నిర్వహణకే సరిపోతోంది. దీంతో ఇలా ప్రయోగం చేసి ఈ కోడిపుంజును దింపాను. రెండేళ్లలో రూ.41.60 లక్షల షేర్ వచ్చింది. నిర్వహణ ఖర్చు నెలకు రూ.25 వేలకు పైగా ఉంటుంది. ఏడాదికి రూ.10 లక్షలు పైగా మిగులుతుంది. – పెన్మెత్స రామ సత్యనారాయణ రాజు, బట్టేలంక -
పొగలుకక్కే ఫుడ్ పెట్టినందుకు..మెక్‌డొనాల్డ్స్ రూ. 6 కోట్లు
మనం రెస్టారెంట్‌కి లేదా హోటల్‌కి వెళ్లితే..నిర్వాహకులు మంచి వేడి..వేడిగానే ఆహారం తీసుకొస్తారు. ఒకవేళ తొందరపడి తింటే..కాలినా.. అక్కడ ఉన్న సర్వర్‌పై అరవలేం. పైగా కేసు పెట్టను కూడా పెట్టం. కానీ ఓ కుటుంబం వేడిగా ఉందని మాకు చెప్పలేదు, అందువల్లే మా పాపకు కాలిపోయిందని కోర్టు మెట్లు ఎక్కింది. పైగా మెక్‌డొనాల్డ్స్ కంపెనీని ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేసింది ఓ కుటుంబం. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాలోని ఫిలానా హోమ్స్, ఆమె భర్త, తన నాలుగేళ్ల పాప ఒలివియా కారబల్లోతో కలిసి మెక్‌డొనాల్డ్స్‌కి వెళ్లారు. అప్పుడు వారు తమ చిన్నారి కోసం హాట్ చికెన్ మెక్ నగెట్ని ఆర్డర్ చేశారు. అది కాస్త తినే తొందరలో చిన్నారి తొడపై పడటంతో.. తీవ్ర గాయమైంది. దీంతో ఆ జంట ఆహరం వేడిగా ఉందని ఎందుకు చెప్పలేదంటూ గొడవ చేసింది. తమకు న్యాయం కావలంటూ..కోర్టు మెట్లు ఎక్కింది. చికెన్‌లోని సాల్మొనెల్లా విషాన్ని నివారించడానికి 160 డిగ్రీల హీట్ కంటే ఎక్కువ వేడి చేయకూడదు. కానీ మెక్‌డొనాల్డ్స్ 200 డిగ్రీ వేడితో ఉన్న చికెన్ నగ్గెట్ని ఇచ్చిందని వాదించింది. తన కూతురు ఒలివియాకు అయిన గాయాన్ని, దానివల్ల ఆమె అనుభవించిన బాధను ఆధారంగా చూపించింది. అంతేగాదు ఇప్పటికీ తన కూతురు చికెన్ నగెట్ని తింటోంది. కానీ ఇలా జరగలేదు కదా అని గట్టిగా తన వాదన వినిపించింది. దీంతో కోర్టు.. అక్కడ చిన్నారుల హక్కుల ప్రకారం ఆమెకి జరిగిన గాయానికి గానూ పరిహారంగా సదరు మెక్‌డొనాల్డ్స్ ఏకంగా ఆరు కోట్లు నష్టపరిహారం చెల్లించాలని గత బుధవారమే ఆదేశించింది. అంతేగాదు ముందుగా గత నాలుగేళ్లకు పరిహారంగా రూ. 3.27 కోట్లు చెల్లించాలని ఆ తర్వాత మిగతా డబ్బును నిర్ణిత గడువులోపల చెల్లించాలని పేర్కొంది. పాపం మెక్ డొనాల్డ్‌కి ఓ రేంజ్లో దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందిగా సదరు కుటుంబం. (చదవండి: 'గోల్డెన్ వాటర్ స్పౌట్'..ప్రకృతి అద్భుతం) -
వింత ఘటన: కోడి పుంజుకి దశదిన కర్మ... ఏకంగా 500 మందికి భోజనాలు
ఇటీవల కాలంలో వింతవింత ఆచారాలను చూస్తున్నాం. కొంతమంది తమ పెంపుడు జంతువులు చనిపోతే వాటికి అంత్యక్రియలు నిర్వహించడం వంటివి చేస్తుండటం విన్నాం. కొంతమంది వాటిపై ప్రేమకొద్ది సమాధులు కట్టించడం వంటివి చేయడం కూడా చూశాం. ఏదో మనుషులు చనిపోతే చేసే తతంగాలన్నింటికి చేయడమే కాక భోజనాలు పెట్టడం గురించి విన్నమా? లేదుకదా! కానీ ఇక్కడోక కుటుంబం అలానే చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....ఉత్తరప్రదేశ్‌లోని ఒక కుటుంబం తమ పెంపుడు కోడి పుంజు చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా మనుషులు చనిపోతే చేసినట్లు అన్ని తతంగాలు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే ఆ కోడి పుంజు ఆ కుటుంబం పెంచుకుంటున్న ఒక నెల వయసున్న గొర్రెపిల్లను వీధి కుక్కల భారి నుంచి ప్రాణాలకు తెగించి మరీ కాపాడింది. ఐతే ఆ క్రమంలో ఆ కోడిపుంజు తీవ్రంగా గాయపడటంతో వెంటనే చనిపోయింది. దీంతో ఆ కోడి పుంజుకి మనిషి చనిపోతే ఎలా చేస్తారో అలా అంత్యక్రియలు నిర్వహించాడు. మన కుటుంబంలోని మనిషి మాదిరిగా మన కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టింది కాబట్టి మనుషులకు చేసే విధంగా ఆచారాలన్నింటిని ఈ కోడి పుంజుకి నిర్వహిద్దాం అని తన తండ్రి చెప్పడంతో ఇలా చేశాం అని చెబుతున్నాడు అభిషేక్. ఆ కోడిపుంజు ఆత్మకు శాంతి చేకూరాలంటూ పెద్ద ఎత్తున దశదిన కర్మ నిర్వహించింది ఆ కుటుంబం. పైగా ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది దాక హాజరవ్వడం విశేషం. (చదవండి: రోబోటిక్ డాగ్ ... సైనికుడిలా కాల్పులు జరుపుతోంది) -
సాస్ ఇవ్వలేదని రెస్టారెంట్‌ను బాంబులతో పేల్చేస్తానన్నాడు.. చివరికి
ఆహారం విషయంలో కొంతమంది భోజన ప్రియులు కచ్చితంగా ఉంటారు. అలాగే వారికి నచ్చిన ఆహారం కోసం గతంలో కొందరు వందల కిలోమీటర్లు వెళ్లిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇంత వరకు ఓకే గానీ ఏదైనా సృతి మించకూడదని అంటారు. కాగా ఓ వ్యక్తి ఆ విషయంలో చాలా దూరం వెళ్లాడు. ఎంతంటే ఏకంగా రెస్టారెంట్‌ను బాంబులతో పేల్చేస్తానంటూ ఆ యజమానికే కాల్ చేసి బెదిరిస్తూ రెచ్చిపోయాడు. అసలు అతనికి అంతలా ఆగ్రహానికి గల కారణం తెలిస్తే షాక్ అవుతారు. మరేమీ లేదండీ.. సాస్ ఇవ్వడం మరిచిపోయాడని అతను అంత రచ్చ చేశాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని లోవాలో నివసిస్తున్న రోబర్ట్ గాల్విట్జెర్ ఫుడ్ రెస్టారెంట్ సంస్థ మెక్ డొనాల్డ్స్‌కు ఫోన్ చేసి చికెన్ నగ్గెట్స్ ఆర్డర్ చేశాడు. మెక్‌డొనాల అంటేనే చికెన్ నగ్గెట్స్, బర్గర్స్కి ప్రత్యేకమని అందరికీ తెలిసిన విషయమే. ఇంకేముంది రుచికరమైన వంటకం వస్తోంది, ఓ పట్టు పట్టాలి అని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇంతలో అతనికి చికెన్ నగ్గెట్స్ అందాయి. కానీ, అవి డిప్ చేసి తినేందుకు అందులో సాస్ ఇవ్వడం ఆ రెస్టారెంట్ సిబ్బంది మరిచిపోయారు. అసలు సాస్ లేకుండా ఎలా డెలివరీ చేస్తారని మనోడికి కోపం వచ్చింది. వెంటనే డెలివరీ సిబ్బందిని కొట్టడమే కాకుండా, రెస్టారెంట్‌కు ఫోన్ చేసి.. బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు. దీంతో రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా గాల్విట్జెర్‌ను అరెస్టు చేశారు. చదవండి: వాంటెడ్ క్రిమినల్‌గా ‘మార్క్ జుకర్‌బర్గ్’.. పట్టిస్తే రూ.22కోట్లు -
చికెన్ కోసం ట్వీట్ చేస్తే గిన్నిస్ రికార్డొచ్చింది!
ఫ్రీగా చికెన్ తినాలనే కోరికతో ఓ కుర్రాడు చేసిన ట్వీట్లు ఏకంగా గిన్నిస్ రికార్డునే బద్దలుకొట్టాయి. అమెరికాలో ఫేమస్ అయిన చికెన్ నగ్గట్స్ అంటే కార్టర్ విల్కర్సన్కు చచ్చేంత ఇష్టం. అయితే ఏడాదిపాటు వాటిని ఉచితంగా తినాలంటే ఏం చేయాలంటూ ఓ రెస్టారెంట్‌కు ట్వీటర్ సందేశాన్ని పంపాడు. దీంతో ’నీకు చికెన్ అంటే అంతగా ఇష్టమనే విషయాన్ని మేం అంగీకరించాలంటే నువ్వు కనీసం 18 మిలియన్ల సార్లు ట్వీట్లు చేయాలి’ అని చెప్పారు. దీంతో వెంటనే ఆ పనిని మొదలుపెట్టిన కార్టర్.. సదరు రెస్టారెంట్ తరఫున చికెన్ నగ్గట్స్ గురించి ప్రచారం చేయడం, ఎదుటివారి నుంచి వచ్చిన ట్వీటర్ సందేశాలకు రీట్వీట్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా తనకు తెలియకుండానే 34,30,500 ట్వీటర్ సందేశాలకు తిరిగి సమాధానమిచ్చాడు. అయితే ప్రపంచంలో ట్వీటర్ సందేశాలకు ఇన్నిసార్లు సమాధానమిచ్చినవారు (రీట్వీట్లు చేసినవారు) ఇంకెవరూ లేరట. ఇప్పటిదాకా ఈ రికార్డు డీజెనరస్ వ్యక్తి పేరిట ఉండగా.. కార్టర్ దానిని అధిగమించాడు. చికెన్ మీద వల్లమాలిన ఆశతో ఇప్పటికీ రీట్వీట్లు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక తాను గిన్నిస్ రికార్డును సాధించానని తెలుసుకున్న కార్టర్ ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించి, దాని ద్వారా టీషర్టులు విక్రయిస్తూ వచ్చిన సొమ్మును సేవా కార్యక్రమాలకు వినియోగిస్తానని చెబుతున్నాడు.