Chief Engineers
-
రబీ సీజన్‌కు యాక్షన్ ప్లాన్
-
జలయజ్ఞం వేగవంతం చేయండి
అనంతపురం సెంట్రల్ : జలయజ్ఞం పథకం ద్వారా చేపట్టిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అధికారులను పరిశీలన బృందం ఆదేశించింది. జలయజ్ఞం పనులను పరిశీలించేందుకు విశ్రాంత చీఫ్ ఇంజినీర్లు రెహ్మాన్, అబ్దుల్‌బషీర్, బీఎస్‌ఎన్‌రెడ్డిను ఓ బృందంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శనివారం అనంతపురానికి చేరుకున్న బృందం సభ్యులు హెచ్చెల్సీ కాలనీలోని సీఈ కార్యాలయంలో అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జలయజ్ఞం పనులు నత్తనడక సాగుతున్నాయని ఈ సందర్భంగా వారు అసహనం వ్యక్తం చేశారు. హంద్రీనీవా పథకానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిస్తోందని, స్టేజ్ 1, 2 పనులు త్వరితగతిన పూర్తి కావాలంటే ఏమి చేయాలని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ పనుల్లో ఎదురవుతున్న అవాంతరాలపై వెంటనే నివేదికలు తయారు చేయాలని సూచించారు. వచ్చే ఏడాదిలోగా పెండింగ్ పనులను పూర్తి చేసి నీటిని తీసుకు రావడానికి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఈ సందర్భంగా సీఈ మనోహర్ మాట్లాడుతూ... 2004, 2005 మధ్య ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకున్నారని, పెరిగిన మెటీరియల్, కూలి వలన కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయలేకపోతున్నారని వివరించారు. ఇప్పటి వరకూ చేసిన పనులను ముగించి, ఇక నుంచి చేపట్టే పనులకు కొత్త ధర వేయాల్సిన అవసరం ఉందని సూచించారు. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రెండేళ్ళ నుంచి హంద్రీనీవా ద్వారా నీటిని తీసుకుంటున్నామని, దీని వలన కొన్ని ప్యాకేజీల్లో పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ముఖ్యంగా 13, 33వ ప్యాకేజీ పనుల్లో నీటిని తోడించి మిగిలిన పనులు చేయించాల్సిన అవసరం ఉందన్నారు. హెచ్చెల్సీలో డిస్ట్రిబ్యూటరీ కాలువలను అభివృద్ది చేయాలని, దీని వలన తొలుత రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు. సమగ్ర నివేదికలను త్వరలో తయారు చేసి, అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్చెల్సీ ఎస్ఈ మురళీనాథ్‌రెడ్డి, హంద్రీనీవా ఎస్ఈ సుధాకర్‌బాబు, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. -
నీటి యుద్ధం మొదలు!
హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం మొదలైంది. కృష్ణా నదీజలాల నిర్వహణ మండలి(కెఆర్ఎంబి-కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సమావేశం వాడివేడిగా జరుగుతోంది. శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాలని ఏపి అధికారులు పట్టుబడుతున్నారు. 834 అడుగులే ఉండాలని తెలంగాణ అధికారులు వాదిస్తున్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు నీటి విడుదల ఆపాలని కూడా తెలంగాణ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమావేశానికి కెఆర్ఎంబి చైర్మన్ ఎస్కేజీ పండిత్, గోదావరి నదీజలాల నిర్వహణ మండలి చైర్మన్ అగర్వాల్, తెలంగాణ, ఏపి రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో అజెండాలోని 9 అంశాలపై చర్చిస్తున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ వద్ద విద్యుత్ ఉత్పత్తిపైన, బోర్డు అధికారులకు కార్యాలయాల కేటాయింపు, పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వలపై కూడా చర్చిస్తారు. ** -
కృష్ణా నదీజలాల నిర్వహణ మండలి సమావేశం
హైదరాబాద్: కృష్ణా నదీజలాల నిర్వహణ మండలి(కెఆర్ఎంబి-కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కెఆర్ఎంబి చైర్మన్ ఎస్కేజీ పండిత్, గోదావరి నదీజలాల నిర్వహణ మండలి చైర్మన్ అగర్వాల్, తెలంగాణ, ఏపి రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో అజెండాలోని 9 అంశాలపై చర్చిస్తారు. కృష్ణా జలాల వినియోగం, శ్రీశైలం, నాగార్జున సాగర్ వద్ద విద్యుత్ ఉత్పత్తిపై ప్రధానంగా చర్చిస్తారు. బోర్డు అధికారులకు కార్యాలయాల కేటాయింపు, పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వలపై కూడా చర్చిస్తారు. **