Chief Operating Officer
-
టాటా ట్రస్ట్స్ తొలి సీవోవోగా అపర్ణ ఉప్పలూరి
సాక్షి,ముంబై: టాటా ట్రస్ట్స్ కొత్త సీఈవో, సీవవో లను ఎంపిక చేసింది. సిద్ధార్థ్ శర్మను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, అపర్ణ ఉప్పలూరిని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమించింది. ఈ నియామకాలు ఏప్రిల్ 1, 2023 నుండి అమల్లోకి వస్తాయని సంస్థ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపింది. టాటా ట్రస్ట్స్ తొలి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా అపర్ణ ఉప్పలూరి (48) ఎంపిక కావడం విశేషం. ప్రస్తుతం ఫోర్డ్ ఫౌండేషన్‌లో భారతదేశం, నేపాల్ శ్రీలంకలకు ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఉన్నారు ఆమె. 2018, మేలో ప్రోగ్రాం ఆఫీసర్‌గా ఫౌండేషన్‌లో చేరిన ఆమె పరోపకారం, మహిళల హక్కులు, ప్రజారోగ్యం, కళలు సాంస్కృతిక రంగాలలో వ్యూహాత్మక ప్రణాళిక కార్యక్రమాల అభివృద్ధిలో పాపులర్ అయ్యారు అపర్ణ. జెండర్ ఈక్వాలిటీ ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్లడంతోపాటు ఫోర్డ్ ఫౌండేషన్‌లో గ్రాంట్-మేకింగ్ కార్యక్రమాల నిర్వహణలో 20 ఏళ్ల లీడర్షిప్ , మేనేజ్మెంట్ అనుభవం ఆమె సొంతం. ఇక 2022లో టాటా ట్రస్ట్‌ల సీఈవో పదవికి రాజీనామా చేసిన ఎన్ శ్రీనాథ్ ప్లేస్‌లో సిద్ధార్థ్ శర్మ శర్మ ఎంపికైనారు. కాగా టాటా ట్రస్ట్స్, భారతదేశంలోని పురాతన స్వచ్ఛంద సంస్థల్లో ఒకటి, టాటా సన్స్‌లో 66 శాతం వాటాను టాటా ట్రస్ట్స్ సొంతం. -
థెరానోస్ మాజీ సీఈవో హోమ్స్ దోషిగా నిర్ధారణ
శాన్‌జోస్ (అమెరికా): వివాదాస్పద స్టార్టప్ సంస్థ థెరానోస్ మాజీ సీఈవో ఎలిజబెత్ హోమ్స్‌ను (37) మోసం, కుట్ర కేసులకు సంబంధించిన కేసుల్లో దోషిగా అమెరికా కోర్టు నిర్ధారించింది. కొన్ని రక్తపు చుక్కల పరీక్షతో వ్యాధులను గుర్తించే వైద్యపరికరాన్ని కనుగొన్నామంటూ పలువురు ఇన్వెస్టర్లను నమ్మించి, మోసం చేశారని ఆమెపై మొత్తం 11 అభియోగాలు నమోదయ్యాయి. వీటిల్లో నాలుగు ఆరోపణల్లో ఆమెను దోషిగా కోర్టు నిర్ధారించింది. మరో నాలుగు అభియోగాలను కొట్టివేసింది. మిగతా మూడు ఆరోపణలపై జ్యూరీ ఇంకా తేల్చాల్సి ఉంది. దోషిగా నిర్ధారణ అయిన కేసుల్లో శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. ఒక్కో కేసులో ఆమెకు 20 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని లీగల్ నిపుణులు భావిస్తున్నారు. ఆమెతో పాటు మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న థెరానోస్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రమేష్ బల్వానీపై విచారణ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఆ కేసు విచారణ పూర్తయ్యే దాకా హోమ్స్ శిక్ష ఖరారు విషయంలో న్యాయమూర్తి వేచి చూసే యోచనలో ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. సంచలన స్టార్టప్‌లకు ఈ ఉదంతం ఒక గుణపాఠంగా ఉండగలదని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. వివరాల్లోకి వెడితే, హోమ్స్ తన 19వ యేట 2003లో థెరానోస్‌ను నెలకొల్పారు. కొద్ది చుక్కల రక్తంతో చౌకగా బ్లడ్ టెస్ట్ నిర్వహించుకునే సెల్ఫ్ సర్వీస్ మెషీన్లను రూపొందించినట్లు కొన్నాళ్లకు ప్రకటించారు. దీంతో సంస్థలో పలువురు బడా ఇన్వెస్టర్లు, ప్రముఖులు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలో హోమ్స్ బిలియనీర్ అయిపోయారు. థెరానోస్ టెక్నాలజీ, ఉత్పత్తులు లోపభూయిష్టమైనవంటూ 2015లో ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత 2018లో ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. -
సీఎం జగన్‌పై అరబిందో సీఓఓ ప్రశంసలు
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో అంబులెన్స్ వాహనాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అరబిందో ఫార్మా ఫౌండేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) సాయిరామ్ స్వరూప్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 104, 108 అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించడం ద్వారా ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశ్యంతో 108 లు ఏర్పాటు చేశామని అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. 2015లో స్థాపించిన ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేసిందన్నారు. ప్రతి గ్రామంలో అంబులెన్స్ సేవలు అందేలా ఏర్పాటు చేశామన్నారు. (దేశం మొత్తం చూసేలా చాటి చెప్పాం : సీఎం జగన్) 108 ద్వారా 3558 మందికి అంబులెన్స్‌లో ఉద్యోగాలు ముఖ్యమంత్రి కల్పించారని సాయిరామ్ స్వరూప్ అన్నారు. జిల్లాలలో శిశు మరణాలు తగించడానికి ప్రణాళిక కూడ పెట్టామని, అత్యాధునిక పరిజ్ఞానంతో అంబులెన్సు ద్వారా అందరికి మెరుగైన వైద్యం అందిచవచ్చన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కరోనాకు ప్రత్యేక అంబులెన్స్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. 108,104 సర్వీసుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వైద్యపరంగా కొత్త విప్లవాన్ని చూస్తారన్నారు.(‘చంద్రబాబు.. ఇలా అయినా సంతోషించు’) -
అందాల రాణి
ఫేస్‌బుక్‌కి ఇప్పుడు పెద్ద కాంపిటిషన్ టిక్‌టాక్. ఫేస్‌బుక్‌ని టిక్‌టాక్ డ్రాగన్‌లా మింగేసినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే యూత్.. క్లాస్బుక్స్ని విసిరికొట్టినట్లుగా, ఫేస్‌బుక్‌ని విసిరికొట్టి టిక్‌టాక్‌తో ఆడుతున్నారు. పాడుతున్నారు. టిక్ టాక్ చైనా రాక్షసి. ఫేస్బుక్ అమెరికా అందాలరాణి. ఆ అందాల రాణి పేరు షెరిల్ శాండ్‌బర్గ్. ఫేస్ బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సి.ఓ.ఓ) ఆమె. ఎంత ఆపరేట్ చేస్తున్నా టిక్‌టాక్ పరుగుని అందుకోలేకపోతోంది ఫేస్బుక్. ‘మాకు ఆందోళనగా ఉన్నమాట వాస్తవమే. కొత్తగా మేము ఇంకా ఏదైనా చేసి, యూత్‌ని మా వైపు లాక్కోవాలి’’ అని షెరిల్ అంటున్నారు. లాక్కోడాని కన్నా ముందు.. ఆమె ఒక అస్త్రాన్ని సంధించారు. ‘‘టిక్‌టాక్ చైనా కంపెనీ కాబట్టి యూజర్లకు ప్రైవసీ ఉండదు’’ అని అన్నారు. చెప్పలేం ఒక్కోసారి ఇలాంటి చిన్నమాట కూడా పెద్ద ఇన్నొవేషన్లా పనిచేసి ప్రత్యర్థుల దూకుడును తగ్గించవచ్చు. -
ఫ్లిప్‌కార్ట్‌కు టాప్ ఎగ్జిక్యూటివ్ గుడ్ బై
ముంబై: బెంగళూరుకు చెందిన ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్‌కు టాప్ ఎగ్జిక్యూటివ్ గుడ్ బై చెప్పారు. కంపెనీలో టాప్ ర్యాంకింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్, సీవోవో(చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) నితిన్ సేథ్,రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మార్కెట్ వర్గాల విశ్వసనీయ సమాచారం. లాజిస్టిక్స్ యూనిట్ ఎకార్టుకు బాధ్యత వహిస్తున్న సేథ్, హెచ్ఆర్ విధులను కూడా నిర్వహిస్తున్నారు. దీంతో ఇటీవల సీఈవో గా బాధ్యతలు చేపట్టి కల్యాణ్ కృష్ణమూర్తి సంస్థపై మరింత పట్టు సాధించినట్టు అయిందని విశ్లేషకులు బావిస్తున్నారు. మరోవైపు గత వారమే హెచ్ఆర్ బాధ్యతలను కల్యాణ్ చేపట్టినట్టు తెలుస్తోంది. అలాగే సేథ్ రాజీనామాతో ఇకపై ఈ బాధ్యతలను కూడా సీఈవో నిర్వహించనున్నారని సమచారం. అయితే ఈ వార్తలపై ఫ్లిప్‌కార్ట్ ఇంకా అధికారికంగా స్పందించాల్సింది ఉంది. 2016, ఫిబ్రవరి లో చీఫ్ పీపుల్స్ ఆఫీసర్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో చేరిన అతి తక్కువ సమయంలోనే సీవోవోగా నియమితులయ్యారు. -
గ్లోబల్ హాస్పిటల్స్ సీవోవోగా గుజ్రాల్
హైదరాబాద్, సాక్షి : హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ హాస్పిటల్స్ కార్యకలాపాలకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా జగ్ప్రాగ్ సింగ్ గుజ్రాల్ నియమితులయ్యారు. గ్లోబల్ హాస్పిటల్స్‌లో మెజారిటీ వాటాలున్న పార్క్‌వే పంటాయ్ సంస్థ ఈ విషయం వెల్లడించింది. హైదరాబాద్‌లోని తమ కార్పొరేట్ కార్యాలయం కేంద్రంగా గుజ్రాల్ పనిచేస్తారని తెలిపింది. గ్లోబల్కుహైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో ఎనిమిది ఆసుపత్రులున్నాయి. హెల్త్‌కేర్ రంగంలో గుజ్రాల్‌కు దాదాపు 18 సంవత్సరాల పైగా అనుభవం ఉంది. ఆయన నియామకాన్ని స్వాగతిస్తున్నట్లు గ్లోబల్ హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్ కె. రవీంద్ర నాథ్ తెలిపారు.