ఫేస్‌బుక్‌కి ఇప్పుడు పెద్ద కాంపిటిషన్ టిక్‌టాక్. ఫేస్‌బుక్‌ని టిక్‌టాక్ డ్రాగన్‌లా మింగేసినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే యూత్.. క్లాస్‌బుక్స్‌ని విసిరికొట్టినట్లుగా, ఫేస్‌బుక్‌ని విసిరికొట్టి టిక్‌టాక్‌తో ఆడుతున్నారు. పాడుతున్నారు. టిక్ టాక్ చైనా రాక్షసి. ఫేస్‌బుక్ అమెరికా అందాలరాణి. ఆ అందాల రాణి పేరు షెరిల్ శాండ్‌బర్గ్. ఫేస్ బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సి.ఓ.ఓ) ఆమె. ఎంత ఆపరేట్ చేస్తున్నా టిక్‌టాక్ పరుగుని అందుకోలేకపోతోంది ఫేస్‌బుక్. ‘మాకు ఆందోళనగా ఉన్నమాట వాస్తవమే. కొత్తగా మేము ఇంకా ఏదైనా చేసి, యూత్‌ని మా వైపు లాక్కోవాలి’’ అని షెరిల్ అంటున్నారు. లాక్కోడాని కన్నా ముందు.. ఆమె ఒక అస్త్రాన్ని సంధించారు. ‘‘టిక్‌టాక్ చైనా కంపెనీ కాబట్టి యూజర్‌లకు ప్రైవసీ ఉండదు’’ అని అన్నారు. చెప్పలేం ఒక్కోసారి ఇలాంటి చిన్నమాట కూడా పెద్ద ఇన్నొవేషన్‌లా పనిచేసి ప్రత్యర్థుల దూకుడును తగ్గించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment