Child health
-
చిన్నారుల్లో సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇలా చేయండి
చిన్నారుల ఆరోగ్యం ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఓ వైపు తల్లిదండ్రుల్లో అవగాహన లోపం, మరోవైపు జంక్ ఫుడ్ వీర విహారం.. పాఠశాల విద్యార్ధుల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటీవలే ఏఐజీ ఆసుపత్రి నిర్వహించిన ఓ సర్వేలో శారీరకంగానే కాక మానసికంగా కూడా అనారోగ్యం పాలు జేసే శక్తి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌కు ఉందని దీనిని వినియోగిస్తున్న వారిలో చిన్నారులే అధికమని తేలింది. ఈ సందర్భంగా 8–5–1–0 పేరిట ఒక హెల్త్ ఫార్ములాను ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఫ్యూచర్ ఫుడ్ ఫౌండేషన్, కంట్రీ డిలైట్, పలు పాఠశాలల ఆధ్వర్యంలో చిన్నారుల ఆరోగ్యంపై ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఈ ఫార్ములా రూపకర్తలు మాట్లాడారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే.. కారణాలెన్నో.. నిశ్చల జీవనశైలి, పెరిగిన స్క్రీన్ సమయం శారీరక శ్రమ తగ్గిపోవడం, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరగడం, అవుట్డోర్ లో ఆటలకు దూరంగా ఉండటం వలన వ్యాయామం తగ్గిపోయింది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చక్కెరలు అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్న ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం పెరిగిపోయింది. ఇది ఊబకాయంతో మొదలై గుండె సంబంధ సమస్యల దాకా దారితీసింది. కాలుష్య కారకాలు టాక్సి¯Œ ్సతో సహా పర్యావరణ కారకాలు పిల్లలు ఎదుర్కొంటున్న ఆరోగ్య ప్రమాదాలను మరింత Mపెంచుతున్నాయి. జీవనశైలి కారకాలకు మించి, పిల్లల ఆరోగ్యం క్షీణించడంలో సామాజిక అంశాలు కూడా పాత్ర పోషిస్తాయి. సమగ్ర వికాసానికి ఈ హెల్త్ ఫార్ములా.. పాఠశాల పిల్లల్లో ఆరోగ్యాన్ని, సమగ్ర వికాసాన్ని పునర్నిర్వచించే లక్ష్యంతో ఈ 8–5–1–0 ఫార్ములా రూపొందింది. రోజుకి 8గంటల నిద్ర , 5 రకాల పండ్లు కూరగాయలు, 1 గంట వ్యాయామం, హాని కలిగించే ఆహారం, అలవాట్లను సున్నాకి చేర్చడం...అనేదే ఈ ఫార్ములా అంతరార్ధం. పోషకాహారం, వ్యాయామం, తగినంత విశ్రాంతిల మేలు కలయిక ఇది. తల్లిదండ్రులు పాఠశాలలకు ఆచరణాత్మక సాధనంగా ఉపయోగపడుతుంది. పిల్లలను సరైన ఆరోగ్యం వైపు నడిపిస్తుంది. దీని అమలులో భాగంగా జీవనశైలి మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇదొక అలవాటుగా మారడానికి కొంత వ్యవధి పడుతుంది. ఇది వారాల నుంచి నెలల వరకు ఉండవచ్చు. సాధారణంగా పెద్ద పిల్లల కంటే చిన్నారులు దీన్ని చాలా సులభంగా అలవరచుకోవచ్చు. . ఇంటి వాతావరణం తల్లిదండ్రుల ప్రమేయాన్ని బట్టి ఈ వ్యవధి ఆధారపడి ఉంటుంది. కొంతమంది పిల్లలు వారాల్లోనే అలవాటు పడతారు, మరికొందరికి నెలలు పట్టవచ్చు. ఆరోగ్య అక్షరాస్యత అవసరం... నేటి పాఠ్యాంశాల్లో ఆహార అక్షరాస్యత తప్పనిసరి అని అన్ని పాఠశాలల్లో ఏకాభిప్రాయం వచ్చింది. ఈ రౌండ్‌టేబుల్ సమావేశం 8–5–1–0 నియమాన్ని ఎలా అమలులోకి తీసుకురావాలి అనేదాన్ని చర్చించింది. దీని పట్ల పాఠశాలల నుండి స్పందన ప్రోత్సాహకరంగా ఉంది, కొన్ని పాఠశాలలు ఇప్పటికే వారి సాధారణ అభ్యాసాలు/తరగతులలో ఆరోగ్యకరమైన ఆహార సంస్కృతి పెంచేలా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆహార అక్షరాస్యతను పెంపొందించడానికి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పని చేయడానికి ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు మనకు అవసరం. ఈ సందర్భంగా కంట్రీ డిలైట్ సహ వ్యవస్థాపకులు గాదె చక్రధర్ మాట్లాడుతూ దేశ భవితకు మూల స్థంభాల్లాంటి చిన్నారుల ఆరోగ్యకరమైన భవిత విషయంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములం కావాలనే ఉద్ధేశ్యంతోనే ఈ కార్యక్రమలో చేతులు కలిపామన్నారు. ఈ హెల్త్ ఫార్ములాను స్వాగతిస్తున్నామన్నారు. ఫుడ్ ఫ్యూచర్ ఫౌండేషన్ నిర్వాహకులు పవన్ అగర్వాల్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పాఠశాలలన్నింటికీ ఈ ఫార్ములా చేరువయ్యేలా పలు కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. ఇదీ చదవండి: జస్ట్ ఈమూడు వ్యాయామాలు చేయండి! బరువు తగ్గడం ఖాయం! -
లైఫ్ స్టయిల్ మారుద్దాం..!
ఈ రోజుల్లో...ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం!? పిల్లలు ఎలా ఎదుగుతున్నారు? ఉరుకుల పరుగుల జీవనంలో ఇవన్నీ సహజమే అని వదిలేస్తే ..‘భవిష్యత్తు తరాలు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు’ అంటున్నారు లీ హెల్త్ డొమైన్ డైరెక్టర్ లీలారాణి. ఆరోగ్య విభాగంలో న్యూట్రాస్యు టికల్, ఫుడ్ సప్లిమెంట్ ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధిపై దృష్టిపెట్టే ఈ సంస్థ ద్వారా మన జీవనవిధానం వల్ల ఎదుర్కొనే సమస్యలకు మూలకారణాలేంటి అనే విషయంపై డేటా సేకరించడంతో పాటు, అవగాహనకు కృషి చేస్తున్నారు. హెల్త్ అండ్ వెల్నెస్, సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ ఏపీ చాంబర్స్, విశాఖపట్నం జోన్ చెయిర్ పర్సన్‌గానూ ఉన్న లీలారాణి మహిళలు, పిల్లల ఆరోగ్య సమస్యలపై డేటా వర్క్, బేసిక్ టెస్ట్‌లు చేస్తూ తెలుసుకుంటున్న కీలక విషయాలను ఇలా మన ముందుంచారు.. ‘‘ప్రస్తుత జీవన విధానం, తీసుకునే ఆహారం వల్ల పిల్లలకు ఎలాంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తున్నాయి అనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు స్కూళ్లవైపుగా డేటా సేకరించాలనుకున్నాం. ముందు 8–10 ఏళ్ల పిల్లలకు స్కూళ్లలో ఇటీవలప్రారంభించాం. ఊర్జాప్రాజెక్టులో భాగంగా బేసిక్ న్యూట్రిషన్ ఫోకస్డ్ ఫిజికల్ ఎగ్జామినేషన్స్ చేస్తున్నాం. ఈ టెస్ట్ ద్వారా పిల్లల్లో .. ఆహారానికి సంబంధించిన సమస్యలు ఏమన్నాయి, తల్లిదండ్రులు– కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఎంత సమయం గడుపుతున్నారు, శారీర చురుకుదనం, డిజిటల్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, నిద్ర సమస్యలు ఏంటి.. ఇలా కొన్నింటితో ఒక ప్రశ్నాపత్రం రూపొందించాం. పిల్లల దగ్గర సమాధానాలు తీసుకొని, వాటిలో ప్రధాన సమస్యలపై ఫోకస్ పెట్టాం. ఆంధ్రా, తెలంగాణలోని స్కూళ్లలో పెద్ద స్థాయిలో డేటా తీసుకోవాలని ప్రారంభించాం. ఇప్పుడైతే 200 మంది పిల్లలతో విశాఖపట్నంలో ఈ డేటా మొదలుపెట్టాం. 8–15 ఏళ్ల వయసులో .. పిల్లలతో కలిసి రోజువారి జీవనవిధానం గురించి చర్చించినప్పుడు ‘మా పేరెంట్స్ బిజీగా ఉంటారు. వాళ్లు డిజిటల్ మీడియాను చూస్తారు, మేమూ చూస్తాం.’ అని చెబుతున్నారు. ఈ వయసు పిల్లలు సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉండటమే కాకుండా, చురుకుగా ఉంటున్నారు. కారణం అడిగితే – ‘అమ్మనాన్నలను ఏదైనా విషయం గురించి అడిగితే చెప్పరు. అందుకని డిజిటల్లో షేర్ చేసుకొని తెలుసుకుంటాం’ అంటున్నారు. తెలియని వ్యక్తులతో పరిచయాలు ఈ విధంగా పెంచుకుంటూ సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి స్కూళ్లలో ఎలాంటి గేమ్స్ ఉన్నాయి, ఇంటి బయట ఎలా ఉంటున్నారు,.. అనేది కూడా ఒక డేటా తీసుకుంటున్నాం. 8–15 ఏళ్ల లోపు పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోవడం వల్ల వారు యంగేజ్కు వచ్చేసరికి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తించాం. ఊబకాయమూ సమస్యే ఎగువ మధ్యతరగతి పిల్లల్లో ఊబకాయం అనేది ప్రధాన సమస్యగా ఉంది. డబ్యూహెచ్ఓ సూచించిన టెస్ట్‌లు చేసినప్పుడు ఈ విషయాలు గుర్తించాం. వాటిలో శారీరక చురుకుదనం లోపించడమే ప్రధానంగా కారణంగా తెలుసుకున్నాం. బయట జంక్ ఫుడ్ నెలలో ఎన్ని సార్లు తీసుకుంటున్నారు అనేదానిపైన రిపోర్ట్ తయారుచేశాం. పిల్లల నుంచి సేకరించిన రిపోర్ట్‌ను ఆ స్కూళ్లకు ప్రజెంట్ చేస్తున్నాం. ఆ రిపోర్ట్‌లో ‘మీ స్కూల్ కరిక్యులమ్‌లో చేర్చదగిన అంశాలు అని ఓ లిస్ట్ ఇస్తున్నాం. వాటిలో, చురుకుదనం పెంచే గేమ్స్‌తో పాటు న్యూట్రిషన్ కిచెన్, గార్డెనింగ్.. వంటివి ఒకప్రాక్టీస్గా చేయించాలని సూచిస్తున్నాం. ముందుగా 40 ఏళ్ల పైబడినవారితో.. రెండేళ్ల క్రితం ఒక కార్పోరేట్ సెక్టార్లో దాదాపు పది వేల మందికి (40 ఏళ్లు పైబడినవారికి) ఎన్జీవోలతో కలిసి బిఎమ్డి టెస్ట్ చేశాం. వీరిలో బోన్డెన్సిటీ తక్కువగా ఉండటమే కాకుండా, మానసిక ప్రవర్తనలు, నెగిటివ్ ఆలోచనలు, స్ట్రెస్ ఇండెక్స్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్.. వంటివి దేని వల్ల వస్తున్నాయి అనేది తెలుసుకున్నాం. నిజానికి 60 ఏళ్ల పైబడి న వారి బోన్ డెన్సిటీ బాగుంది. కారణం, ఆ రోజుల్లో వారు చేసే శారీరక శ్రమయే కారణం. ఇప్పుడది తగ్గిపోయింది. పరిష్కారాలూ సూచిస్తున్నాం.. ఎక్కడైతే టెస్ట్‌లు చేశామో, వారి జీనవవిధానికి తగిన సూచనలూ చేస్తున్నాం. ఆరోగ్య సమస్యలు ఏవి అధికంగా వస్తున్నాయో తెలుసుకుని, వాటిని పరిష్కరించుకునే విధానాలను సూచిస్తున్నాం. చాలావరకు ఈ వయసు వారిలోనూ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లే సమస్యలు. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్ నుంచి ఈ సమస్య అధికంగా ఉంది. పని ప్రదేశంలో శరీర కదలికలు లేకపోడం, అక్కడి వాతావరణం, స్క్రీన్ నుంచి వచ్చే సమస్యలు, డిజిటల్ ఎక్స్పోజర్.. వీటన్నింటినీ ఒక్కొక్కరి నుంచి తీసుకొని వారికి తగిన సూచనలు ఇస్తూ వచ్చాం. సమస్యలు ఎక్కువ ఉన్నవారి బాల్య దశ గురించి అడిగితే మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. బాల్య దశ కీలకం పెద్దవాళ్లలో సమస్యలు గమనించినప్పుడు వారి బాల్య దశ కీలకమైందని గుర్తించాం. దీంతో పిల్లల్లోనే ముందుగా సమస్యను పరిష్కరిస్తే మంచిదని, పిల్లల్లో పరీక్షలు చేసినప్పుడు వారిలో బోన్డెన్సిటీ సమస్య కనిపించింది. దీని గురించి డాక్టర్లతో చర్చించినప్పుడు మూల కారణం ఏంటో తెలిసింది. ఒకప్పుడు గ్రామాల్లో పిల్లలు పరిగెత్తడం, గెంతడం, దుమకడం.. వంటివి చాలా సహజసిద్ధంగా జరిగిపోయేవి. వారి ఆటపాటల్లో శారీరక వ్యాయామం చాలా బాగుండేది. అది ఈ రోజుల్లో లేదు. క్రీడలు కూడా వృత్తిపరంగా ఉన్నవే తప్ప ఆనందించడానికి లేవు. ఒక స్ట్రెస్ నుంచి రిలీవ్ అయ్యే ఫిజికల్ యాక్టివిటీ రోజులో ఇన్ని గంటలు అవసరం అనేది గుర్తించి, చెప్పాలనుకున్నాం. భవిష్యత్తులో రాబోయే ఆరోగ్యసమస్యలను భరించడం కన్నా ముందే జాగ్రత్తపడటం మంచిది. మధ్య తరగతే కీలకం మధ్యతరగతి, దానికి ఎగువన ఉన్న పిల్లల్లో శారీరక చురుకుదనం లోపం ఎక్కువ కనిపించింది. వారి ఎముక సామర్థ్యం బలంగా లేకపోతే భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్యసమస్యలను ఎదుర్కోక తప్పదు. పిల్లలు ఎదిగే దశలో వారి ఆహారం, అలవాట్లు బాగుండేలా చూసుకోవాలి. ఈ విషయంలో కార్పొరేట్ కన్నా ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు బాగానే ఉన్నారు. ఈ అన్ని విషయాలపై ఇంకా చాలా డేటా సేకరించాల్సి ఉంది. ముందు మానసిక సమస్యలు అనుకోలేదు. కానీ, సైకలాజికల్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. కుటుంబంలో ఉన్నవారితో సరైన ఇంటరాక్షన్స్ తగ్గిపోయినట్టుగా తెలుస్తోంది. ఎక్కువ డిజిటల్ మీడియాలో ఉండటం వల్ల కంటి సమస్యలు, కుటుంబంతో గ్యాప్ ఏర్పడం వంటివి జరుగుతున్నాయి. ఈ విషయాలను అవగాహన చేసుకొని, మన జీవన విధానంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది’ అని తెలియజేశారు. లీలారాణి. – నిర్మలారెడ్డి -
చిట్టితల్లికి ఆరోగ్య భరోసా.. చెల్లెమ్మ కళ్లలో ఆనందం
సాక్షి, రాజమహేంద్రవరం: చెప్పాడంటే.. చేస్తాడంతే. మాటిచ్చాడంటే నెరవేరుస్తాడంతే. అది సంక్షేమ పాలనలో అయినా.. కష్టంలో ఉన్నవాళ్లకి అందించే భరోసా విషయంలోనైనా. ఎనిమిది నెలల కిందట తన బిడ్డతో సాయం కోసం వచ్చిన ఓ చెల్లెమ్మ ముఖంలో ఇప్పుడు చిరునవ్వు పూయించారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆమెకు మానసికంగా ధైర్యం.. చిన్నారికి క్రమం తప్పకుండా చికిత్స అందుతుండడంలో సీఎం వైఎస్ జగన్ ఉదారత ఉంది. శనివారం నిడదవోలు పర్యటన సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ని చిన్నారి శాంతి కుటుంబం కలిసింది. ఈ సందర్భంగా పాప ఆరోగ్యం కోసం వాకబు చేశారాయన. గత 8 నెలల(సీఎం జగన్ భరోసా ఇచ్చినప్పటి నుంచి) సమయంలో పాప డయానా శాంతికి అందిన వైద్యం వివరాలన్నింటి గురించి కలెక్టర్ మాధవీలత వివరించారు. వైద్య పరీక్షలన్నీ పూర్తయ్యాయని, ప్రాథమిక పరీక్ష, రక్త నమూనా కోసం శాంతిని ఆరుసార్లు ఢిల్లీకి పంపామని, జెనెటిక్స్ పరీక్ష కోసం రక్త నమూనాలను నొవార్టిస్ కంపెనీ సింగపూర్, అమెరికాకు పంపినట్లు కలెక్టర్ వివరించారు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలన్నింటిలో సానుకూల ఫలితాలు రావడంతో.. మూడు వారాల్లో పాప కోసం ఇంజెక్షన్(రూ 16 కోట్ల ఖరీదు చేసేది) వచ్చే అవకాశం ఉందని ఆమె వివరించారు. డయానా శాంతి ‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్-2’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ ఏడాది జనవరి 3వ తేదీన జిల్లా పర్యటన సంద్భంగా శాంతి తల్లి సూర్యకుమారి, సీఎం జగన్‌ను కలిసి తన గోడును వెల్లబోసుకుంది. ఆ సమయంలో తక్షణ ఆర్థిక సహాయం గా రూ. లక్ష అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. అంతేకాదు.. ప్రతి నెలా రూ.5 వేల వైఎస్ఆర్ నవశకం ఆరోగ్య పింఛను సైతం అందేలా చూడాలని అధికారులకు చెప్పారు. అదే సమయంలో.. ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న ఆ కుటుంబానికి ఆసరా అందించేందుకు సూర్య కుమారికి నిడదవోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇచ్చారు. చదవండి: కాపు నేస్తంతో 4 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ది: సీఎం జగన్ -
మట్టి కాని గట్టి బొమ్మలు
బంక మట్టితో చేసిన బొమ్మలు ఎక్కువసేపు నిలబడవు. ఎండిపోగానే పగుళ్లు వచ్చేస్తాయి. అందుకే పిల్లలు రసాయనాలతో తయారైన మట్టితో బొమ్మలు చేస్తూ ఆడుకుంటారు. ఆ మట్టిలో ప్రమాదకరమైన కిరసనాయిల్, బొరాక్స్ వంటివి ఉంటాయి. అవి పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. తన యేడాది వయసున్న కొడుకు మట్టితో ఆడుతుంటే దీప్తికి భయంగా ఉండేది. పిల్లవాడి ఆరోగ్యం కోసం రసాయనాలు లేని బొమ్మలు తయారు చేయాలనుకుంది దీప్తి. ఆ ఆలోచన నుంచి వచ్చినదే పర్యావరణ హితమైన మట్టి. పిల్లల కోసం బెంగళూరుకు చెందిన దీప్తి భండారీ హాని కలిగించని కృత్రిమ మట్టిని తయారు చేయడం ద్వారా ఆ మట్టితో ఆడుకునే పిల్లలకు ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నారు.. తాను ఆర్థికంగా ఎదుగుతున్నారు దీప్తి. బయో కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన దీప్తి.. టీచింగ్ మీద ఆసక్తి పెంచుకున్నారు దీప్తి. బంధువుల పిల్లలకు పాఠాలు చెబుతూ టీచింగ్ లో అనుభవం సంపాదించారు. ఆ అనుభవంతో పిల్లల కోసం ‘మిల్క్ టీత్ యాక్టివిటీ సెంటర్’ను బెంగళూరులోని చామరాజ్‌పేట్‌లో ప్రారంభించారు. పిల్లలకు పాఠాలు చెబుతూ, వృత్తి మీద ప్రేమ పెంచుకున్నారు. ఆ సమయంలోనే ఒక తల్లి పిల్లల్ని ఎలా పెంచాలనే విషయం మీద అవగాహన ఏర్పడింది దీప్తికి. పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటూ, వాళ్లకి ఏ విధంగా చెబితే అర్థమవుతుందో తెలుసుకున్నారు దీప్తి. ‘‘పసి వయసులో నేర్చుకున్న విద్య జీవితాంతం గుర్తుండిపోతుంది. అందులో నైపుణ్యం కూడా వస్తుంది’’ అంటారు దీప్తి. ఆటల్లోనే అన్నీ... పిల్లలకు బొమ్మలతో ఆటలు నేర్పుతూ, రంగులు, ఆకారాలు, పరిమాణాల గురించి కూడా నేర్పించటం దీప్తి ప్రత్యేకత. ‘‘మా అబ్బాయి చేతి రాత బాగుండేది కాదు. కాని మట్టితో బొమ్మలు చేయడం ద్వారా అందమైన రాత అలవాటయ్యింది. అంతకుముందు పెన్సిల్ సరిగ్గా పట్టుకోలేకపోయేవాడు. ఇలా మట్టితో ఆటలు మొదలుపెట్టాక, చేతి వేళ్లు, కండరాలు బలంగా తయారు కావడంతో పెన్సిల్ చక్కగా పట్టుకోగలిగాడు. చక్కగా రాయగలుగు తున్నాడు. టీచర్‌గా నాకున్న అనుభవం మా అబ్బాయిని పెంచుకోవటానికి ఉపయోగపడింది’’ అంటారు దీప్తి. అందరూ ఆసక్తి చూపించారు ‘‘నేను పిల్లల కోసం టాడ్లర్ క్లాసులు ప్రారంభించాను. ఆ క్లాసులో పిల్లలంతా మట్టితో బొమ్మలు తయారు చేస్తారు. పిల్లలు చేసిన బొమ్మలు చూసిన తల్లిదండ్రులు ఆ మట్టి గురించి సమాచారం అడిగారు’’ అంటూ ఆనందంగా చెబుతారు దీప్తి. సాధారణంగా మార్కెట్ లో దొరికే మట్టితో చేసిన బొమ్మలు చాలా త్వర గా ఎండిపోతాయి. ఆ మట్టి ని మళ్లీ ఇంక ఉపయోగించలేం. కాని దీప్తి.. ఉప్పు, పిండి, నూనె, ఫుడ్ గ్రేడ్ కలర్స్, నీళ్లు కలిపి తయారు చేసిన మట్టి ఆరునెలల వరకు గట్టి పడకుండా ఉంటుంది. ‘‘నేను చేసిన మట్టి చూసి తల్లిదండ్రులంతా చాలా సంతోషించారు. వాళ్లకి కూడా ఈ మట్టి కావాలి అని అడిగి కొని తీసుకు వెళ్తున్నారు’’అంటున్న దీప్తి 20 వేల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు నెలకు 35 వేలు సంపాదిస్తున్నారు. పిల్లలకు ఆరోగ్యంతోపాటు, తనకు ఆదాయం వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటారు దీప్తి భండారీ. -
పిల్లలు అకస్మాత్తుగా ఎందుకు స్పృహ తప్పుతుంటారు?
పిల్లల్లో చాలామంది కొన్నిసార్లు అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోతుంటారు.ఇది చాలా మంది పిల్లల్లో కనిపించేదే. నిజానికి చాలా సందర్భాల్లో స్కూళ్లలో ప్రేయర్‌కు నిలబడ్డ సమయంలో ఇలా జరుగుతుడటం గమనించవచ్చు. ఈ సమస్యను ‘సింకోప్’ అంటారు. దీన్ని సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌గా చెప్పవచ్చు. పిల్లల్లో సింకోప్ కనిపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఆర్థోస్టాకిక్ హైపోటెన్షన్. అంటే పిల్లల పొజిషన్స్‌లో మార్పుల వల్ల వాళ్లలో రక్తపోటు తగ్గి ఇలా జరగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యూరో కార్డియోజెనిక్ మార్పులు, గుండె సమస్యలు కూడా ఇలాపడిపోడానికి కారణం కావచ్చు. కొందరు పిల్లల్లో రక్తంలో గ్లూకోజ్ పాళ్లు తగ్గడం, ఫిట్స్, మైగ్రేన్, ఊపిరి బిగబట్టడం (బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్) వంటివి ఇందుకు కారణమవుతాయి. ఇటువంటి పిల్లల్లో గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉన్నాయేమో అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. గుండెకు సంబంధించిన సమస్య లేదని నిర్ధారణ అయితే కాస్త నిశ్చింతగా ఉండవచ్చు. ఇక పైన పేర్కొన్న ఇతర కారణాలు ఏమైనా కావచ్చేమో అని తెలుసుకోవడం కూడా అవసరం. అరుదుగా ఫిట్స్‌కూడా ఈ రకంగానే కనిపించవచ్చు. సాధారణంగా చాలా ఎక్కువగా భయం కలగడం వల్ల, తీవ్రమైన నొప్పి వల్ల, భయానక దృశ్యాలు చూడటం వల్ల లేదా డీహైడ్రేషన్ వల్ల అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే కొబ్బరినీళ్ల వంటివి తాగిస్తూ ఉండటం, పిల్లలు కింద కూర్చుని పైకి లేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం వంటివి ఈ సమస్య నివారణకు బాగా ఉపయోగపడతాయి. అలా కాకుండా పిల్లలు పదే పదే ‘సింకోప్’కు లోనై పడిపోతుంటే మాత్రం డాక్టర్‌కు చూపించాల్సిందే. -
కిడ్స్‌కు.. కిడ్నీ గండం!
స్థూలకాయం, పోషకాహార లోపమే కారణం.. స్థూలకాయం, పోషకాహార లోపం, జన్యుపరమైన సమస్యలు, అనారోగ్యకరమైన ఆహారం, రసాయనాలతో నిండిన ఆహారం, శారీరక శ్రమ లోపించడం తదితర కారణాల వల్ల కిడ్నీ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. దేశంలో అత్యధికంగా కూల్‌డ్రింక్స్ వంటి వాటిని తాగేవారిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఇంట్లో తినడానికి బదులు బయట పిజ్జాలు, బర్గర్లు, ఇతరత్రా ఫాస్ట్‌ఫుడ్ వంటివి తినడం వల్ల రక్తంలో క్రియాటిన్ పెరగడానికి కారణంగా వైద్యులు విశ్లేషిస్తున్నారు. దేశంలో 10 నుంచి 19 ఏళ్ల వయస్సు వారిలో 4.9 శాతం మందికి బీపీ ఉండగా, తెలంగాణలో 6.7 శాతం మంది ఉండటం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిన్న పిల్లల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకప్పుడు పెద్దలకు మాత్రమే, అదీ బీపీ, షుగర్ అధికంగా ఉన్న వారిలోనే కనిపించే కిడ్నీ వ్యాధి ఇప్పుడు పిల్లలనూ వెంటాడుతోంది. 5 నుంచి 19 ఏళ్ల వయసు పిల్లలపై పంజా విసురుతోంది. 5 నుంచి 9 ఏళ్ల వయసు పిల్లల్లో కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశమున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉండగా, 10 నుంచి 19 ఏళ్ల వయసు వారిలో రెండో స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2016–18 సమగ్ర జాతీయ న్యూట్రిషన్ సర్వేను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం రాష్ట్రంలో దాదాపు పావు శాతం పిల్లలకు కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. అంటే ఆయా వయసు పిల్లల్లో ప్రతీ నలుగురిలో దాదాపు ఒకరికి కిడ్నీ వ్యాధి ప్రమాదం ఉన్నట్లు నివేదిక తెలిపింది. దీనిపై వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోకపోతే యువతీ యువకుల భవిష్యత్ అంధకారం కానుందని హెచ్చరిస్తున్నారు. వారి రక్తంలో సీరం క్రియాటిన్ అధికం.. కేంద్రప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వే ప్రకారం వివిధ వయçస్సు వారి ఆరోగ్య వివరాలను సేకరించింది. కిడ్నీ పనితీరును తనిఖీ చేయడానికి వైద్యులు సాధారణంగా బ్లడ్ క్రియాటిన్ స్థాయిని కొలుస్తారు. ఇది మూత్రపిండాల పనితీరును సూచిస్తుంది. సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 5 నుంచి 9 ఏళ్ల వయసు పిల్లల్లో సరాసరి 7 శాతం మందిలో సీరం క్రియాటిన్ అధికంగా ఉన్నట్లు తేలింది. అందులో తెలంగాణలో 23.6 శాతం పిల్లల్లో అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. అలాగే 10 నుంచి 19 ఏళ్ల వయసు పిల్లల్లో దేశవ్యాప్తంగా 6.6 శాతం మందిలో సీరం క్రియాటిన్ అధికంగా ఉన్నట్లు గుర్తించగా, తెలంగాణలో 24.3 శాతం మందికి అధికంగా ఉన్నట్లు నిర్ధారించారు. దేశ సగటు కంటే మూడు నాలుగు రెట్ల వరకు క్రియాటిన్ అధికంగా ఉండటం మరింత ఆందోళన కలిగించే పరిణామం. అయితే సీరం క్రియాటిన్ అధికంగా ఉన్నా, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సాధారణ పరిస్థితికి రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. మూత్రాశయ సమస్యలు లేదా పుట్టుకతో వచ్చే రుగ్మతల కారణంగా ఒక్కోసారి సీరన్ క్రియాటిన్ అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పూర్తిస్థాయిలో కిడ్నీలు ఏర్పడకపోవడం, లేదా జన్యుపరమైన సమస్యలు, పర్యావరణం, కాలుష్యం వంటివి కారణాలుగా ఉంటున్నాయని చెబుతున్నారు. పుట్టుకతో వచ్చే కిడ్నీ సమస్యలను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రారంభ దశలోనే గుర్తించడానికి వీలుంటుందని అంటున్నారు. అయితే రాష్ట్రంలో ఇంత అధికంగా ఆయా వయసు పిల్లల్లో క్రియాటిన్ అధికంగా ఉండటానికి కారణాలపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు. మాంసాహారుల్లోనే అధికం.. 10 నుంచి 19ఏళ్ల వయసున్న వారిలో బాలికల కంటే బాలురుల్లోనే అధికంగా క్రియాటిన్ సమస్యలున్నాయని నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ఈ వయసు పిల్లల్లో 8.3% మంది బాలురు, 4.9% మంది బాలికల్లో కిడ్నీ సంబంధిత సమస్యలున్నాయని తెలిపింది. మాంసాహారుల్లోనే అధికంగా క్రియాటిన్ కని పిస్తోంది. దేశంలో మాంసాహారం తినే ఈ వయసు పిల్లల్లో 9% మందిలో సీరం క్రియాటిన్ అధికంగా ఉండగా, కేవలం గుడ్డు తినే వారిలో 6% ఉంది. శాకాహారుల్లో 5.4% మందిలోనే క్రియాటిన్ కనిపించి నట్లు నివేదిక తెలిపింది. మతపరంగా చూస్తే ఈ వయసు పిల్లల్లో అత్యధికంగా క్రిస్టియన్లలో 18.4% మందిలో క్రియాటిన్ ఎక్కువ గా ఉండగా, ముస్లింల్లో 11.2% ఉంది. హిందువుల్లో 5.6% ఉం డగా, సిక్కుల్లో 3.8% ఉన్నట్లు నిర్ధారించారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే ఈ వయసు గల వారిలో ఎస్సీల్లో 6.3%, ఎస్టీల్లో 7.2%, బీసీల్లో 5.1%, ఇతరుల్లో 9.2% క్రియాటిన్ ఉన్నట్లు నిర్ధారించారు. ఇదే వయసున్న పట్ట ణపిల్లల్లో 4.3% సీరం క్రియాటిన్ ఉండగా, గ్రామీణ ప్రాంత పిల్లల్లో అది 7.4‘% ఉండటం గమనార్హం. నిరుపేదలైన ఈ వయసు పిల్లల్లో 8.9 శాతం సీరం క్రియాటిన్ ఉండగా, పేదల్లో 7.4 శాతం, మధ్యతరగతి పిల్లల్లో 7.5 శాతం, ధనికుల్లో 5 శాతం, అత్యంత ధనికుల్లో 4.6 శాతం ఉన్నట్లు నివేదిక తెలిపింది. తల్లిదండ్రులు మేల్కొనాలి.. కేంద్ర సర్వే నివేదిక ప్రకారం తెలంగాణలో కిడ్నీ సమస్యలు రావడానికి అవకాశాలెక్కువ. స్థూలకా యం, శారీరక శ్రమ లేకపోవడం, జన్యుపరమైన కారణాలతో ఈ ముప్పు వస్తుంది. ప్రస్తుత నివేదిక హెచ్చరికలాంటింది. పిల్లల తల్లి దండ్రులు జాగ్రత్తలు తీసుకోకుంటే మరింత ప్రమాదం జరగొచ్చు. – డాక్టర్ గంగాధర్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్, హైదరాబాద్ ఆహారం, తాగునీటి లోపాల వల్లే..: అనారోగ్యకరమైన ఆహారం, శుద్ధమైన తాగునీరు లేకపోవడంతో కిడ్నీ సమస్యలు వస్తుంటాయి. పోషకాహార లోపం రాష్ట్రంలో అధికం. ఇది కూడా ఓ కారణమే. తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. మిషన్ భగీరథ నీటితో కిడ్నీ వ్యాధులు తగ్గుతాయి. – డా.కిరణ్ మాదల, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నిజామాబాద్ -
చిన్నారి గొంతులో ఇరుక్కున్న వాచ్ బ్యాటరీ
సాక్షి, కొత్తగూడెం: ఓ చిన్నారి గొంతులో వాచ్ బ్యాటరీ ఇరుక్కుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం తడికలపూడికి చెందిన తేజావత్ హర్యా కూతురు (10 నెలలు) శుక్రవారం ఉదయం ఇంట్లో ఆడుకుంటోంది. ఈ క్రమంలో పాడైపోయిన చేతి గడియారం బ్యాటరీని మింగగా అది గొంతులో ఇరుక్కుంది. శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులు కొత్తగూడెంలోని సురక్ష ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్ రవిబాబు నాయక్ ఎక్స్‌రే తీసి గొంతులో బ్యాటరీ ఇరుక్కున్నట్లు గుర్తించారు. వెంటనే చిన్నారికి ఆపరేషన్ చేసి తొలగించి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ రవిబాబు తెలిపారు. -
కల్తీ తిండి.. ఆరోగ్యానికి గండి
సాక్షి, బీబీపేట(నిజామాబాద్) : రంగు రంగుల ప్యాకెట్లలో ఆకట్టుకునే తినుబండారాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపు తున్నాయి. విషతుల్యమైన రసాయనాలతో తయారు చేసిన ఆయా ఆహార పదార్థాలు పిల్లల ఆరోగ్యం పై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎలాంటి అనుమతి లేకుండా రకరకాల పేర్లతో కొందరు వ్యాపారులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో విరివిగా హోల్‌సేల్ షాపుల్లో తినుబండారాల ప్యాకెట్లను జోరుగా విక్రయిస్తున్నారు. ప్రతీ రోజు రూ.వేలల్లో వ్యాపారం పట్టణాలతో పాటు పల్లెల్లోనూ ఈ ప్యాకెట్ల విక్రయం జోరుగా సాగుతోంది. నిత్యం రూ.వేలల్లో వ్యాపారం కొనసాగుతోంది. నాసిరకమైన ఉత్పత్తులను నగరాల నుంచి దిగుమతి చేసుకొని జోరుగా వ్యాపారం చేస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి మారుమూల గ్రామాల వరకు సైతం కల్తీ ఆహార పదార్థాల రంగు రంగుల ప్యాకెట్లు విస్తరించాయి. ప్రభుత్వ పాఠశాలల ఎదుట ఏర్పాటు చేసిన చిల్లర దుకాణాల్లో కేవలం ఒకటి రెండు రూపాయలకే ఆయా ప్యాకెట్లు లభిస్తున్నాయి. మార్కెట్లో బ్రాండ్ కంపెనీలను తలపించేలా రంగురంగుల బొమ్మలతో ప్యాకింగ్ చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తినుబండారాలకు రంగులు, చాట్ మాసాలా వేసి రంగులు రుచిని జోడిస్తున్నారు. ఈ కల్తీ ఆహార పదార్థాలు తింటున్న పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. పట్టించుకోని ఆరోగ్యశాఖ.. కల్తీ ఆహార పదార్థాల విక్రయాలు జోరుగా జరుగుతున్నా సంబంధిత ఆహార కల్తీ నియంత్రణ, ఆరోగ్యశాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోడంతో చిన్నారుల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మారుమూల గ్రామాలకు సంబంధిత అధికారులు రాకపోవడంతో వ్యాపారం జోరుగా సాగుతోంది. గ్రామాల్లో ఏ షాపులో చూసినా రంగురంగుల ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. సంబంధిత అధికారులు ఒకటి ఆరా తనిఖీలతో సరిపెడుతున్నారు. ఇక, పల్లెల వైపు అయితే కన్నెత్తి చూడడం లేదు. దీంతో గ్రామాలల్లోకి విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఆరోగ్యానికి హానికరం.. మార్కెట్లో లభించే తినుబండారాలు చిన్నారులకు ఎంతో హాని కలిగిస్తున్నాయి. రంగు రంగుల ప్యాకింగ్లతో చిన్నారులను ఆకర్షించేలా ప్యాకెట్లు రూపొందించి వ్యాపారులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నాసిరకం వస్తువులతో కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తుండడంతో ఆరోగ్యాలపై పెను ప్రభావం చూపుతోంది. కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల చిన్నారులకు రకరాకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై కొరడా ఝళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీర్ణ వ్యవస్థపై ప్రభావం.. కల్తీ తినుబండారాలు తినడంతో ఆకలి సరిగా కాకపోవడం, కడుపులో నట్టలు తయారు కావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. పిల్లలకు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి ఆహార పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచాలి. రంగు రంగుల ప్యాకెట్లతో ఆకర్షించే కల్తీ పదార్థాలను కొనివ్వకూడదు. పిల్లలకు పోషక ఆహారాలను అందించాలి. – డా.ప్రవీణ్‌కుమార్, బీబీపేట -
చిన్నారుల ఆరోగ్యంతోనే నవభారతం
బృందావన్: చిన్నారులు ఆరోగ్యంగా లేకుంటే శక్తివంతమైన నవ భారత నిర్మాణం సాధ్యం కాదని ప్రధాని మోదీ అన్నారు. అందుకే పోషకాహారం, టీకాలు, పారిశుధ్యం వంటి అంశాలపై తమ ప్రభుత్వం దృష్టిపెట్టిందని వివరించారు. ‘అక్షయపాత్ర’ 300 కోట్ల మందికి అన్నదానం చేసిన సందర్భంగా సోమవారం బృందావన్‌లోని చంద్రోదయ మందిర్ ఆవరణలో ఏర్పాటైన కార్యక్రమానికి ప్రధాని హాజరై చిన్నారులకు భోజనం వడ్డించారు. స్వర్గీయ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా మొదటి అన్నదానం ప్రారంభించగా 300 కోట్లవ అన్నదానం తాను చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దాదాపు అరగంటపాటు ప్రసంగించిన ఆయన.. అర్హులైన వారికి ఆలోచించకుండా ఇచ్చేదే నిజమైన దానమనీ, అక్షయపాత్ర అటువంటి దానమే చేస్తోందని కొనియాడారు. దేశవాసుల ఆకలిని తీర్చేందుకు అక్షయపాత్ర చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం 20 మంది చిన్నారులకు స్వయంగా భోజనం వడ్డించారు. కొందరు చిన్నారులకు స్పూన్‌తో తినిపించి, ఆశీర్వదించారు. అంతర్జాతీయ కృష్ణ భక్తుల సంఘం(ఇస్కాన్) నిధులతో నడుస్తున్న ఈ సంస్థ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 14,702 పాఠశాలల్లో బాలలకు మధ్యాహ్నం భోజనం అందజేస్తోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు బృందావన్‌లో అత్యంత ఆధునిక వంటశాల ఉంది. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, మథుర ఎంపీ హేమమాలిని పాల్గొన్నారు. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో 2004లో ఆ రాష్ట్రంలో తమ సంస్థ మొదటి వంటశాలను ప్రారంభించారని అక్షయపాత్ర ప్రతినిధి తెలిపారు. -
కదిలించిన చిన్నారుల కథనం
నల్లగొండ: శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న అనాథ చిన్నారులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు చేపడ తామని నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. బుధ వారం ‘సాక్షి’ మెయిన్‌లో ప్రచురితమైన ‘చిన్నారుల మృత్యు ఘోష’ కథనంపై జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. డీఆర్వో, ఆర్డీవో, సంక్షేమ శాఖల అధికారులతో కూడిన కమిటీ శిశుగృహను సందర్శించి ప్రాథమికవిచారణ జరిపారు. సాయంత్రం జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, డీఎంహెచ్‌వో భానుప్రసాద్, జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్, ప్రభుత్వ వైద్యులతోపాటు మహిళా శిశు కో–ఆర్డినేటర్ మాలె శరణ్యారెడ్డి శిశుగృహను సందర్శించారు. సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలకు ఆదేశించారు. పిల్లల ఆరోగ్యం, శిశుగృహ అభివృద్ధి కోసం మహిళా అధికారులతో కమిటీ వేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. పౌష్టికాహారం, శానిటేషన్‌కు సూచనలిచ్చేందుకు ఐదుగురు వైద్యులతో మరో కమిటీని నియమి స్తున్నట్లు తెలిపారు. శిశువుల ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు శాశ్వతంగా వైద్యుడిని ముగ్గురు స్టాఫ్ నర్సులను నియమిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నిలోఫర్ ఆసుపత్రికి తరలించే పిల్లలపై శ్రద్ధ తీసుకునేలా సూపరిం టెండెంట్‌తో మాట్లాడతానని చెప్పారు. నిలోఫర్, కామినేని ఆసుపత్రులకు తరలించే చిన్నారుల ఆరోగ్యంపై వైద్యులు, అధికారులతో మాట్లాడేందుకు ఐదుగురు వైద్యుల కమిటీ పనిచేస్తుందని కలెక్టర్ తెలిపారు. పిల్లల ఆరోగ్యంపై ఎంత ఖర్చయినా భరిస్తామని చెప్పారు. చిన్నారుల నివేదికలు పరిశీలించి, అందుకు గల కారణాలను తెలుసుకున్న తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. -
చిన్న వయస్సులో పెద్ద కష్టం..
ఆదుకోవాలని దాతలకు తల్లిదండ్రుల విజ్ఞప్తి కె.గంగవరం : పేద కుటుంబంలో పుట్టిన దివ్యభారతిని వారి స్థితికి మించి, వారు వైద్యం చేయించలేని అనారోగ్యం పీడిస్తోంది. ఆమెను ఆదుకోవాలని ఆమె తల్లిదండ్రులు దాతలను కోరుతున్నారు. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి శనివారపు శ్రీనివాస్, బేబి లావణ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఎనిమిదేళ్ల పెద్ద కుమార్తె దివ్యభారతి లివర్ సంబంధ సమస్యతో బాధప డుతోంది. వయస్సు పెరిగే కొద్ది లివర్ పెరగడం వల్ల ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. తల్లిదండ్రులు దాచుకున్న సొమ్ముతో సహా అందినచోట అప్పు చేసి కాకినాడ, రాజమండ్రిలో పలు ఆస్పత్రుల్లో రూ.6 లక్షలు ఖర్చుచేసి వైద్యం అందించారు. అయినా నయమవకపోవడంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా లివర్‌మార్పిడి చేయాలని దీని కి రూ.18 లక్షలు ఖర్చు అవుతాయని సూచించనట్లు శ్రీనివాస్ తెలి పారు. దీంతో పాటు ప రీక్షలు, మందుల ఖర్చుల కు మరో పెద్దమొత్తం అవసరం అవుతాయని వైద్యులు సూచించినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. తమ కుటుంబం ఇంత పెద్దమొత్తంలో ఖర్చు చేయలేమని, దాతలు ఆదుకుని తమ చిన్నారి ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. దాతలు కె.గంగవరం చైతన్య గ్రామీణ గోదావరి బ్యాంకు అకౌంట్ నెంబర్ 715510100023655కు జమ చేసి దివ్యభారతికి ప్రాణభిక్షపెట్టాలని తల్లిదండ్రుల ప్రాధేయపడుతున్నారు. -
తల్లి ఆరోగ్యమే బిడ్డకు రక్ష
పాలకోడేరు రూరల్ : తల్లి ఆరోగ్యమే బిడ్డకు రక్ష. గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు పాటిస్తే పుట్టే/పుట్టిన బిడ్డతోపాటు వారూ ఆరోగ్యంగా ఉంటారు. భవిష్యత్తులో తలెత్తబోయే సమస్యలనూ నియంత్రించగలుగుతారు. ఈ నేపథ్యంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు ఓ సారి తెలుసుకుందాం.. గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గర్భిణి అని తెలియగానే అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలి. అక్కడ ఇచ్చే పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. రోజులో కొద్దికొద్దిగా ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి. అయోడైజ్డ్ ఉప్పునే వాడాలి. రక్తహీనత నివారణకు ఐ.ఎఫ్.ఎ. వూత్రలు వాడాలి. ధనుర్వాత నివారణకు రెండు టీటీ ఇంజక్షన్లు చేయించుకోవాలి. గర్భిణిగా ఉన్న సమయంలో కనీసం ఐదుసార్లు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. , రక్తపోటు, రక్తపరీక్షలు చేయించుకోవాలి. ఎలాంటి బరువు పనులూ చేయురాదు. ఆఖరి మూడు నెలలు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఎప్పుటికప్పుడు స్కానింగ్ చేయించుకుని శిశువు బరువు తెలుసుకోవాలి. ఆస్పత్రిలోనే ప్రసవం చేయించుకోవాలి. పాలు, గుడ్లు రోజూ తీసుకోవాలి. పండ్లు, ఆకు కూరలు ఎక్కువగా తినాలి. వేరుశేనగ, బెల్లం ఉండలు తీసుకుంటే మంచిది. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి.