పాలకోడేరు రూరల్ : తల్లి ఆరోగ్యమే బిడ్డకు రక్ష. గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు పాటిస్తే పుట్టే/పుట్టిన బిడ్డతోపాటు వారూ ఆరోగ్యంగా ఉంటారు. భవిష్యత్తులో తలెత్తబోయే సమస్యలనూ నియంత్రించగలుగుతారు. ఈ నేపథ్యంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు ఓ సారి తెలుసుకుందాం..
గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గర్భిణి అని తెలియగానే అంగన్‌వాడీ కేంద్రంలో
పేరు నమోదు చేసుకోవాలి.
అక్కడ ఇచ్చే పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి.
రోజులో కొద్దికొద్దిగా ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి.
అయోడైజ్డ్ ఉప్పునే వాడాలి.
రక్తహీనత నివారణకు ఐ.ఎఫ్.ఎ. వూత్రలు వాడాలి.
ధనుర్వాత నివారణకు రెండు టీటీ ఇంజక్షన్‌లు చేయించుకోవాలి.
గర్భిణిగా ఉన్న సమయంలో కనీసం ఐదుసార్లు ఆరోగ్య
పరీక్షలు చేయించుకోవాలి.
, రక్తపోటు, రక్తపరీక్షలు చేయించుకోవాలి.
ఎలాంటి బరువు పనులూ చేయురాదు.
ఆఖరి మూడు నెలలు తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
ఎప్పుటికప్పుడు స్కానింగ్ చేయించుకుని శిశువు బరువు
తెలుసుకోవాలి.
ఆస్పత్రిలోనే ప్రసవం చేయించుకోవాలి.
పాలు, గుడ్లు రోజూ తీసుకోవాలి.
పండ్లు, ఆకు కూరలు ఎక్కువగా తినాలి.
వేరుశేనగ, బెల్లం ఉండలు తీసుకుంటే మంచిది.
ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
తల్లి ఆరోగ్యమే బిడ్డకు రక్ష
Published Sun, Feb 28 2016 2:10 AM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM
Advertisement
Advertisement