child rape case
-
రాజధానిలో మానవ మృగం...
సాక్షి, న్యూఢిల్లీ: సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన. డ్రగ్స్ మత్తులో మానవత్వం మాయమైంది.. అతడిలో మృగం నిద్రలేచింది. ఆరేళ్ల పసికందును అతికిరాతకంగా చెరచటంతో ఆ చిన్నారి ప్రాణపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దేశరాజధానిలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే... మింటో రోడ్‌లోని కాళిమందిర్ వద్ద ఉన్న ఫుట్‌పాత్‌పై ఓ రిక్షా కార్మికుడి కుటుంబం నివసిస్తోంది. భార్య గుడి దగ్గర భిక్షాటన చేస్తుండగా, వారికి ఆరేళ్ల పాప ఉంది. అదే ఫుట్‌పాత్‌పై ఓ యువకుడు కూడా జీవిస్తున్నాడు. గత కొంతకాలంగా డ్రగ్స్‌కు బానిసైన ఆ యువకుడు.. ఆ చిన్నారిపై కన్నేశాడు. ఈ నెల 14న సదరు యువకుడు ఆ చిన్నారి ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆడుకుంటున్నకూతురు కనిపించపోయేసరికి కంగారుపడ్డ ఆ తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. కాస్త దూరంలోని పొదల్లో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న చిన్నారి కనిపించటంతో షాక్‌కి గురయ్యారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా 4 గంటలపాటు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. చిన్నారి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్.. ఆ చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. చిన్నారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు రావాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను కోరుతున్నారు. రాజధానిలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆమె ఆవేదన చెందుతూ ఓ ట్వీట్ చేశారు. Visited 6 year old rape survivor in hospital. She was raped so brutally dat despite 4 hour operation, her internal organs r damaged! Father rickshaw puller, stepmom beggar & family homeless. Request courts to give death to guilty imm. Seek support frm society to help rehab girl. — Swati Maliwal (@SwatiJaiHind) 16 July 2018 -
అబ్బాయిల ఆలోచన దృక్పథం మారాలి
సాక్షి, న్యూఢిల్లీ : చిన్నారులపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పసివారిపై అత్యాచారాలకు పాల్పడటం చాలా సున్నితమైన వ్యవహారమని పేర్కొన్నారు. ప్రతి 10 అత్యాచారాల్లో 7 వరకు బాధితురాలికి తెలిసివారో, ఇంట్లోవారో, బంధువులే చేస్తున్నారన్నారు. చట్టాలు మాత్రమే ఈ ఘటనలను ఆపలేవని అన్నారు. దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై కొందరు అభ్యంతరకరంగా అమ్మాయి దుస్తులపై వ్యాఖ్యానిస్తున్నారని, ఇది సరైన ధోరణి కాదని హెచ్చరించారు. అమ్మాయి డ్రెస్సింగే అత్యాచార ఘటనలకు కారణమైతే, మరి వృద్ధులపై ఎందుకు అత్యాచారం జరుగుతున్నాయని ప్రశ్నించారు. పూర్తిస్థాయి రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ను ఫిక్కీ మహిళా విభాగం సోమవారం సన్మానించింది. ఈ సందర్భంగా లింగ హోదా సమానత్వంపై నివేదికను ఆమె విడుదల చేశారు. అనంతరం సీతారామన్ మాట్లాడుతూ.. మొదట అబ్బాయిల ఆలోచన దృక్పథం మారాలని, అమ్మాయి ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు జాగ్రత్తలు చెబుతుంటారు అలా కాకుండా.. మన ప్రధాని అన్నట్టు అబ్బాయిలు బయటికి వెళ్లినప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్పాలని సూచించారు. వ్యాపార రంగంలోనూ, మార్కెటింగ్ రంగంలోనూ మహిళలు దూసుకెళ్తున్నారని, ముద్ర బ్యాంకు ఇచ్చే రుణాల్లో 50 శాతం మహిళలకే వెళ్తున్నాయని చెప్పారు. పంచాయతీయ రాజ్ సవరణ తెచ్చాక మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని, ఇక రక్షణ రంగంలోనూ మహిళలకు సమానవకాశాల కోసం కృషి చేస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. -
పోక్సో ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదముద్ర
-
సీఎం నవీన్ గద్దె దిగు
భువనేశ్వర్: నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి గద్దె నుంచి తక్షణమే దిగాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ వర్గాలు పట్టుబడుతున్నాయి. కొరాపుట్ జిల్లా కుందులి గ్రామంలో బాలికపై సామూహిక లైంగికదాడి, ఆత్మహత్య సంఘటనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంచెలంచెలుగా ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఈ మేరకు స్థానిక మాస్టర్ క్యాంటీన్ ఛక్ నుంచి శిశు భవన్ మార్గంలో సోమవారం భారీ ఊరేగింపు నిర్వహించారు. ముఖ్యమంత్రి నవీన్ నివాస్‌ను ముట్టడించేందుకు విఫలయత్నం చేశారు. నగర కమిషనరేట్ పోలీసులు ఏర్పాటు చేసిన భద్రతా వలయాన్ని ఛేదించి నవీన్ నివాస్ వైపు దూసుకుపోయేందుకు ఆందోళనకారులు విజృంభించారు. ఈ నేపథ్యంలో పోలీసులతో కాసేపు తోపులాట జరిగింది. కుందులి బాలికపై సామూహిక లైంగికదాడితో బాధిత బాలిక నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ నేపథ్యంలో వాస్తవ ఫోరెన్సిక్ పరీక్షల నివేదికను తారుమారు చేసి రాష్ట్ర క్రైం శాఖ ఆధ్వర్యంలో బాధిత బాలిక కుటుంబానికి రూ.90 లక్షలు చెల్లించి కేసు బుట్ట దాఖలు చేసేందుకు విఫలయత్నం చేయడంతో రాష్ట్రంలో నవీన్ పట్నాయక్ సర్కారు తీరు ఏమిటో స్పష్టమైపోతోందని బీజేపీ ఆందోళనకారులు భారీ బ్యానర్లతో ఆరోపిస్తూ ప్రదర్శన నిర్వహించారు. 30 మంది ఆందోళన కారుల అరెస్ట్ లోగడ 1999వ సంవత్సరంలో అంజనా మిశ్రా కేసు తరహాలో కుందులి బాలిక కేసును కూడా భూస్థాపితం చేసే యోచనతో అధికార పక్షం బిజూ జనతా దళ్ విశ్వ ప్రయత్నాలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు నినాదాలు చేస్తూ పోలీసుల భద్రతా వలయాన్ని ఛేదించేందుకు ఆందోళనకారులు ఉద్యమించారు. ఈ పరిస్థితుల్లో 144వ సెక్షన్ విధించిన పరిధిని అతిక్రమించిన 30 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బాలికకు పూర్తి న్యాయం చేస్తాం
రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మి లైంగిక దాడి ఘటనపై విచారణ అమలాపురం టౌన్ : అమలాపురం మున్సిపల్ కాలనీలో లైంగిక దాడికి గురైన మానసిక వికలాంగ బాలికను, ఆ కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి శనివారం పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యాచారానికి ముందు మూడు రోజులుగా నా బిడ్డ మాట్లాడలేక కన్నీళ్ల పర్యంతమవుతుంటే ఆమె జబ్బు ఇబ్బంది పెడుతోందేమో అనుకున్నాను తప్ప, అప్పటికి మూడు రోజులుగా ఆమెపై లైంగిక దాడి జరుగుతుండడం వల్లే నరక యాతన అనుభవిస్తోందని తెలుసుకోలేకపోయానని ఆ తల్లి కన్నీరు మున్నీరైంది. రాజ్యలక్ష్మి విలేకర్లతో మాట్లాడుతూ బాధిత బాలికకు పూర్తి న్యాయం చేసే లా కమిషన్ ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందని, బాలికకు జరిగిన అన్యాయంపై పూర్తిస్థాయిలో నివేదిక ఇస్తానని ఆమె పేర్కొన్నారు. సీఐ వైఆర్కే శ్రీనివాస్ నుంచి కూడా నిందితుడిపై పెట్టిన కేసులు దర్యాప్తు ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ విచారణలో మున్సిపల్ కౌన్సిలర్ గంపల నాగలక్ష్మి, దండోరా నాయకుడు గంపల సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
'ఇలాంటి రాబందులను తేలిగ్గా వదలకూడదు'
బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి కింది కోర్టు విధించిన పదేళ్ల జైలుశిక్షను మద్రాసు హైకోర్టు నిర్ధారించింది. మరో అత్యాచారం కేసులో రాజీ కుదుర్చుకోవాలంటూ రెండు రోజుల క్రితం సూచించిన న్యాయమూర్తి జస్టిస్ పి. దేవదాసే ఇప్పుడు ఈ తీర్పు ఇచ్చారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో నాలుగున్నరేళ్ల బాలికపై పాతికేళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ నేరం పశుత్వంతో సమానమని జస్టిస్ దేవదాస్ వ్యాఖ్యానించారు. ఈరోజుల్లో పురుషుల కామానికి మహిళలు, పిల్లలు బలైపోతున్నారని, ఈ నేరానికి కేవలం పశువాంఛ తప్ప కారణం అంటూ ఏమీ లేదని, ఇలాంటి నేరప్రవర్తనకు సానుభూతి ఏమాత్రం అవసరం లేదని ఆయన అన్నారు. ఇలాంటి రాబందులను తేలిగ్గా వదిలిపెట్టకూడదని కూడా వ్యాఖ్యానించారు. సెంథిల్ కుమార్ అనే దోషికి సెషన్స్ కోర్టు 2010 డిసెంబర్ నెలలో విధించిన పదేళ్ల జైలుశిక్షను నిర్ధారించారు. శిక్ష తీవ్రతను తగ్గించాల్సిన అవసరం ఏమాత్రం లేదని కూడా జస్టిస్ దేవదాస్ భావించారు. నాలుగేళ్ల పాపకు తప్పుడు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.