The childs future
-
చుక్ చుక్ డమ్ డమ్
డమ్ డమ్ రైల్వేస్టేషన్‌కి చుక్ చుక్ బండ్లు ఎన్నో వస్తాయి. చీదరించుకున్నా, చికాకుపడ్డా, ఛీ కొట్టినా, ఛ ఛ అన్నా... బండి వస్తుంది. అంతేకాదండోయ్... బుర్ర బద్దలు కొట్టినా, ప్రాణం తీస్తామన్నా ఆగక సాగే చదువుల బండీ వస్తోంది! ఒకప్పుడు రిజర్వేషన్ లేకుండా వెయిటింగ్ లిస్టులో ఉన్న పిల్లల భవిష్యత్తు... రిజర్వుడు కంపార్ట్మెంటులో చక్కటి ప్రయాణం చేస్తోంది. డం డం రైల్వే ప్లాట్‌ఫామ్ మీ చుక్ చుక్మంటున్న బండి ఇది. మన బడికైతే గంట మోగుతుంది. ఇక్కడ సరస్వతీదేవి కూతపెట్టింది. ఛీ కొట్టండి.. చదవకుండా ఉండండి చూద్దాం. ఎప్పటిలాగే స్కూల్ అయిపోగానే ఇంటికెళ్లడం కోసం డమ్ డమ్ స్టేషన్‌కు చేరుకుంది కాంతాచక్రవర్తి. బెడియపారా లోకల్ ట్రైన్ కదలడానికి సిద్ధంగా ఉంది. దాన్ని అందుకోవడం కోసం ప్లాట్‌ఫామ్‌వైపు పరుగెత్తుతోంది కాంత. అంతలోపే అంతే వేగంగా పది, పదకొండేళ్ల ఆడపిల్లలిద్దరు ఆమె దారికి అడ్డం పడుతూ.. చేయి చాచారు. వాళ్లకేసి చిరాగ్గా చూసింది కాంత. ‘ఛల్ హట్... మీతోటి పిల్లలంతా స్కూళ్లకెళుతుంటే మీరిట్లా రైల్వేస్టేషన్లలో, బస్టాండుల్లో అడుక్కోవడానికి సిగ్గేయట్లేదా? డబ్బులివ్వను.. చదువు చెప్తా... చదువుకుంటారా?’ అంది కాంత కోపం, విసుగు కలగలిసిన గొంతుతో. ‘సరే... చదువుకుంటాం’ అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తారు వాళ్లు. ‘చదువనగానే పారిపోయారు..’ అనుకుంటూ బెడియపారా ట్రైన్ ఎక్కేసింది కాంత. కాంతాచక్రవర్తి కోల్‌కతా, డమ్‌డమ్ రైల్వేస్టేషన్ దగ్గర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్. ప్రతిరోజూ బెడియపారా నుంచి డమ్డమ్కు లోకల్ ట్రైన్లోనే వెళ్తుంది. బెడియపారా, డమ్ డమ్ స్టేషన్లలో భిక్షాటన చేస్తున్న ఇలాంటి పిల్లల్ని చూసి జాలి పడుతుంది. ఆ జాలి లోంచి వచ్చిన అసహనమే అది. కానీ జరిగింది వేరు! ఆ మర్నాటి నుంచి వరుసగా నాలుగు రోజులు... సాయంత్రం అయిదు గంటల సమయంలో కాంతాచక్రవర్తికోసం ఎదురు చూశారు ఆ ఇద్దరు పిల్లలు. ఆమె కనిపించలేదు. అయిదో రోజూ.. ఎప్పటిలా ఆశగా టీచరమ్మకోసం డమ్‌డమ్ రైల్వేస్టేషన్ చేరుకున్నారు. ప్లాట్‌ఫామ్ మీదికి వచ్చేవాళ్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. చిలకాకుపచ్చ రంగు బెంగాలీ కాటన్ చీరలో, నల్లరంగు హ్యాండ్‌బ్యాగ్‌తో అదే హడావిడితో వస్తున్న ఓ అమ్మ కనిపించింది. పోల్చుకోవడానికి ఒక్క క్షణమే పట్టింది ఆ పిల్లలకు. అంతే... పరుగున ఆమె దగ్గరకు చేరారు. చెరోపక్క నిలబడ్డారు. ‘చదువు చెప్తానని ఈ నాలుగు రోజులు రాలేదే.. నీ కోసం ఎంత ఎదురుచూశామో’ అంటూ మెరిసే కళ్లతో అడిగారు. వాళ్లేం మాట్లాడుతున్నారో కాంతకు అర్థంకాలేదు. ‘ఎవరు మీరు?’ అన్నట్లుగా చూసింది. ఆ చూపు అర్థమైన పిల్లలు.. ‘నాలుగు రోజుల కిందట.. ఇక్కడే.. మేం డబ్బులడిగితే.. అడుక్కోవడానికి సిగ్గులేదా? చదువు చెప్తా.. చదువుకుంటారా?’ అని కోప్పడ్డారు కదమా.. మా ఇద్దర్నే.. గుర్తులేదా?’ అన్నారు గుర్తుకుతెచ్చే ప్రయత్నం చేస్తూ! గుర్తొచ్చింది కాంతాకు. ‘ఆ.. అవును. అయితే ఇప్పుడేంటి?’ అంది అంతే చిరాగ్గా. ‘చదువుకుంటాం.. చెప్పు. నువ్వు ఆ మాట అన్నప్పటి నుంచి అడుక్కోవడం మానేశాం’ అన్నారిద్దరూ. అప్పుడు చూసింది వాళ్లను నిశితంగా. అప్పుడు గమనించింది.. ఆ పసిబుగ్గల మీది గాయాలను.. చేతులకు ఉన్న గాట్లను! కాంత మనసు చివుక్కుమంది. ‘ఈ దెబ్బలేంటి?’ అంది ఆ అమ్మాయిల బుగ్గలను తడుముతూ. ‘అడుక్కొని డబ్బులు తేవట్లేదని మావాళ్లు కొట్టారు’ అన్నారిద్దరూ... ఇది మాకు అలవాటే అన్నట్లుగా. కాంత కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్రయత్నంగా ఇద్దరినీ దగ్గరకు తీసుకుంది. ‘ఇప్పుడే మొదలుపెడ్దామా?’ అంది. ‘ఊ’ అంటూ తలాడించారు ఇద్దరూ! అక్కడే.. ఆ ప్లాట్‌ఫామ్ మీదే.. ఓ వారగా కూర్చోని వాళ్లకు అక్షరాభ్యాసం చేసింది కాంతాచక్రవర్తి.ఇది 2007 నాటి సంఘటన. ఇద్దరు వీధిపిల్లలతో మొదలైన ప్లాట్‌ఫామ్ మీద ఆ టీచరమ్మ బడి ఈ ఎనిమిదేళ్లలో 20 మందికి చేరింది. ఏడు నుంచి పదిహేనేళ్లలోపు ఆడపిల్లలే అంతా. మొదట్లో నలుగురు పిల్లలే ఉన్నప్పుడు బెంగాలీ ఒక్కటే నేర్పేది కాంత. ఎప్పుడైతే వాళ్ల సంఖ్య అయిదుకు మించిందో అప్పటి నుంచి బెంగాలీతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలనూ చేర్చింది. తర్వాత వాళ్ల ఆసక్తిని పసిగట్టి లెక్కలు, సైన్స్ కలిపింది. అయితే.. ఇది అంత తేలిగ్గా జరగలేదు! ఇద్దరు నుంచి నలుగురు అమ్మాయిలు కాంత దగ్గర చేరాక వాళ్ల తల్లిదండ్రుల నుంచి కాంతకు బెదిరింపులు ఎదురయ్యాయి. పట్టించుకోలేదు. ఒకరోజు బెడియపారాలో ట్రైన్ దిగిన కాంత మీద దాడి జరిగింది. తలపగల గొట్టారు. ఆమె బ్యాగ్‌లో ఉన్న పుస్తకాలను చించేశారు. పర్సులో ఉన్న డబ్బుల్ని ఎత్తుకుపోయారు. మెడలో ఉన్న గొలుసూ పోయింది. స్పృహతప్పి పడిపోయిన కాంతను ఆ ప్రాంత వాసులు గుర్తించి ఆమె భర్తకు కబురుపంపారు. కాంతను హాస్పిటల్ తీసుకెళ్లాడు ఆమె భర్త. గాయం తగ్గాక ‘మేలు చేయాలనుకుంటే కీడు జరుగుతోంది. వద్దులే ఆపేయ్’ అన్నాడు భర్త. అయితే కాంత ఒప్పుకోలేదు. ‘వాళ్లంతా మన బిడ్డలు అన్నావ్.. బిడ్డలు చెడిపోతుంటే చూస్తూ ఊరుకుందామా? వాళ్లు నన్ను చంపినా పాఠం ఆపను’ అంది నిశ్చయంగా. ఆ రోజు నుంచి కాంత, వాళ్లాయనా చదువు చెప్పడం మొదలుపెట్టారు. ఈ పిల్లలను నన్ను టీచరమ్మను మాత్రమే కాదు అమ్మను కూడా చేశారు. నాకు దేవుడిచ్చిన బిడ్డలయ్యారు’ అంటుంది పిల్లలు లేని కాంతాచక్రవర్తి. కాంత తపన చూసి రైల్వే అధికారులు, డమ్‌డమ్ హాకర్స్ యూనియన్ వాళ్లు స్టేషన్‌లోని ఓ గదిని క్లాస్‌రూమ్‌గా కేటాయించారు. స్థానికంగా ఉన్న కొన్ని ఎన్జీవోలు కలిసి ఈ పిల్లల కోసం ఓ వ్యాన్ని ఏర్పాటు చేసి, ఓ డ్రైవర్నీ నియమించారు. ఇంకొంత మంది పుస్తకాలను డొనేట్ చేస్తున్నారు. అలా ఇప్పుడు ఆ పిల్లలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా చదువుకుంటున్నారు. ‘ఇదంతా టీచరమ్మ భిక్ష’ అని ఆ పిల్లలు అంటే.. ‘కాదు ఇది ఈ పిల్లల హక్కు’ అని ఆ టీచరమ్మ అంటుంది. -
భవితకు చక్కని ప్లానింగ్..
పిల్లల భవిష్యత్తు అవసరాలకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడటమే ప్రతి తల్లిదండ్రుల ముందుండే అతిపెద్ద లక్ష్యం. చక్కగా ప్రణాళికాబద్ధంగా వెళితే ఇలాంటి దీర్ఘకాలిక లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. పిల్లల ఆర్థిక ప్రణాళిక కోసం తల్లిదండ్రులు అనుసరించాల్సిన విధానంపై అవగాహన కల్పించేదే ఈ వారం ప్రాఫిట్ లీడ్ స్టోరీ... పిల్లలు పుట్టినప్పటి నుంచి వారి బంగారు భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటుంటారు. వారిని జీవితంలో ఉన్నత శిఖరాల్లో నిలపడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. పిల్లల్లో ఉంటే సృజనాత్మక శక్తిని గ్రహించి వారిని ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేర్చడానికి శిల్పిలాగా కృషి చేస్తారంటే అతిశయోక్తి కాదేమో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ వారి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. దీనికి అనుగుణంగానే ఆర్థిక ప్రణాళికలను కూడా రచించుకోవాలి. పిల్లల భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి బీమా పథకాలు అనువుగా ఉంటాయి. ముఖ్యంగా స్థిరమైన ఆదాయం ఉన్న వారు వారి ఫ్యామిలీ బడ్జెట్లో చిన్నారుల కోసం ప్రతీ నెలా కొంత కేటాయించే విధంగా చూసుకోవాలి. చదువు, విదేశాల్లో ఉన్నత విద్య, పెళ్ళి వంటి ప్రధాన అవసరాలే కాకుండా వ్యాపారం ప్రారంభించడానికి కొంత మూల ధనం సమకూర్చడం తదితర అనేక అవసరాలు ఉంటాయి. వీటన్నింటికీ నగదు భారీగానే అవసరం అవుతుంది. ఈ కలల లక్ష్యాలను చేరుకోవడానికి బీమా కంపెనీలు వివిధ పథకాలను అందిస్తున్నాయి. ఒకవేళ అనుకోని సంఘటన ఏదైనా జరిగితే... పిల్లల లక్ష్యాలు ఆగకుండా, ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా కొనసాగించడానికి బీమా పథకాలు అక్కరకు వస్తాయి. కాబట్టి పిల్లల కోసం చేసుకునే ప్లానింగ్‌లో బీమా తప్పకుండా ఉండే విధంగా చూసుకోవాలి. చిన్నారుల భవిష్యత్తు కోసం నిర్దేశించిన బీమా పథకాలు దీర్ఘకాలానికి సంబంధించినవే ఉంటాయి. కాబట్టి వీటిల్లో క్రమం తప్పకుండా దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. పెరుగుతున్న విద్యావ్యయం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలకు ఈ బీమా పథకాలు చక్కటి పరిష్కారాన్ని చూపుతాయి. పిల్లల కోసం బీమా పథకాలను తీసుకునేటప్పుడు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి... పిల్లల కోసం చేసే ఆర్థిక ప్రణాళికల్లో జాప్యం వద్దు. ఎంత తొందరగా మొదలు పెడితే అంత ప్రయోజనం ఉంటుంది. చాలా బీమా పథకాల్లో మెచ్యూర్టీ లేదా క్రమానుగత చెల్లింపులు పిల్లల వయసు 18 ఏళ్ళు రాగానే మొదలవుతాయి. కాబట్టి ఈ దీర్ఘకాలిక పథకాలను ఎంత తొందరగా ప్రారంభిస్తే అంత ఎక్కువ నిధిని సమకూర్చుకోవచ్చు. ఒకవేళ ఏ పథకం తీసుకోవాలో అర్థం కాకపోతే గుర్తింపు పొందిన ఆర్థిక ప్రణాళిక నిపుణులను సంప్రదించి మీ అవసరాలకు అనువైన పథకాన్ని ఎంచుకోండి. ప్రధాన పాలసీకి అనుబంధంగా ప్రీమియం వైవర్ అనే రైడర్‌ను అందిస్తుంటాయి. పిల్లల పథకాలతో పాటు తప్పకుండా తీసుకోవాల్సిన రైడర్లలో ఇది అత్యంత ముఖ్యమైనది. ప్రీమియం చెల్లించే పాలసీదారుడు మరణిస్తే... భవిష్యత్తు ప్రీమియంలు కట్టనవసరం లేకుండా పాలసీ కొనసాగడానికి ఈ రైడర్ దోహదం చేస్తుంది. అంటే పాలసీదారుడు మరణించినా... ఆ వ్యక్తిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఎటువంటి ఆర్థిక భారం లేకుండానే లక్ష్యాలను చేరుకోవచ్చు. దీర్ఘకాలంలో ఈక్విటీలకు అధిక లాభాలను ఇచ్చే శక్తి ఉండటంతో యులిప్స్ పథకాలను తీసుకోవచ్చు. అత్యధికంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే గ్రోత్ ఫండ్‌ను ఎంచుకొని లక్ష్యాన్ని చేరుతున్నప్పుడు వచ్చిన లాభాలను కాపాడుకోవడానికి ఈ మొత్తాన్ని క్రమానుగతంగా డెట్ పథకాల్లోకి మార్చుకోండి. లేకపోతే అటు వృద్ధికి అవకాశం ఉంటూ, ఇటు అసలుకు ఢోకా లేకుండా ఉండే విధంగా బ్యాలెన్స్డ్ పథకాలను ఎంచుకోండి. వీటితో పాటు ప్రీమియం చెల్లించే వ్యక్తికి తగినంత బీమా రక్షణ ఉండే విధంగా చూసుకోండి. పన్ను ప్రయోజనాలపరంగా చూసినా బీమా పథకాలు రెండిందాల ప్రయోజనాన్ని కలిగిస్తాయి. చెల్లిస్తున్న ప్రీమియంపై సెక్షన్ 80సీ ప్రకారం పన్ను ప్రయోజనంతోపాటు, సెక్షన్ 10 (10డీ) ప్రకారం మెచ్యూర్టీ ద్వారా అందుకునే మొత్తాన్ని కూడా పన్ను భారం లేని ఆదాయంగా పరిగణిస్తారు. పాలసీ తీసుకునే ముందు అందులో పొందుపర్చిన నిబంధనలు, ఆ పథకం మీ అవసరాలకు తగినట్లుగా ఉందా లేదా అన్న విషయాలను ఒకసారి పరిశీలించాలి. అలాగే మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ కంపెనీల బీమా పథకాలతో పోల్చి చూసి మేలైనదాన్ని ఎంచుకోండి. -
కార్పొ‘రేటు’ చదువు కొంటున్నారు..!
సార్.. మీ అబ్బాయి టెన్త్ కంప్లీట్ అయింది కదా.. మా కాలేజీలో జాయిన్ చేయించండి.. క్యాంపస్ బాగుంటుంది.. సౌకర్యాలు బాగుంటాయి.. అన్నింటికీ మించి అత్యుత్తమంగా బోధించే అధ్యాపకులు ఉన్నారు. ఇవీ బందరులోని ఓ ప్రయివేటు కాలేజీ పీఆర్వో విద్యార్థుల తల్లిదండ్రులతో చెబుతున్న మాటలు ఏమండీ, మన వాడు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ వాడి భవిష్యత్ గురించి బెంగలేకుండా ఉండేలా ఇప్పట్నుంచే మంచి కాలేజీలో చేర్పించే ఆలోచన చేయండి.. మీరు మరీ పిసినారిలా డబ్బుల గురించి ఆలోచించకండి.. ఇది ఓ సగటు గృహిణి ఆవేదన మీ పీఆర్వో చెప్పిన మాటలకు.. ఇక్కడ జరుగుతున్నదానికి పొంతనలేదు.. రకరకాల సాకులతో వేలాది రూపాయలు లాగేస్తున్నారు.. ఇలాగైతే మా అబ్బాయి చదువు కోసం మేం అప్పులపాలవ్వాల్సిందే..ఇది ఓ ప్రయివేటు కాలేజీ యాజమాన్యం వద్ద సాధారణ ఉద్యోగి ఆందోళన. ప్రయివేటు విద్యా సంస్థల్లో పెరిగిన ఫీజులు రంగంలోకి పీఆర్వోలు పిల్లల చదువుల కోసం పెద్దల జేబులు గుల్ల సాక్షి, మచిలీపట్నం : ఇదీ విద్యా వ్యాపారం మూడు పాఠ్యపుస్తకాలు.. ఆరు నోట్ పుస్తకాలు.. మాదిరిగా వర్థిల్లుతోందని చెప్పడానికి నిదర్శనం. ఈ పరిస్థితి బందరులోనే కాదు.. జిల్లా అంతటా ఉంది. ప్రతిచోటా తమ పిల్లలు చదువు‘కొనేందుకు’ తల్లిదండ్రులు పడుతున్న పాట్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రవేయివేటు విద్యా సంస్థలు మాత్రం మరో రెండు, మూడు రోజుల్లోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇందుకు అనుగుణంగా పలు ప్రయివేటు విద్యా సంస్థలు వీనంత ఎక్కువ మంది విద్యార్థులను చేర్చుకుని అదనపు ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. పీఆర్వోల పేరుతో ప్రత్యేక ఏజెంట్లు..! ప్రయివేటు విద్యా సంస్థలు విద్యార్థులను చేర్చించేందుకు పీఆర్వోల పేరుతో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రతి గ్రామంలోనూ వాళ్లు తిరుగుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను చల్లని మాటలతో ఆకట్టుకుని ప్రయివేటు విద్యా సంస్థల్లో చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎల్కేజీ నుంచి ఇంటర్, డీగ్రీ వరకు విద్యార్థులను రాబట్టేందుకు తమదైన వాక్చాతుర్యం ప్రదర్శిస్తున్నారు. ఒక్కో విద్యార్థిని తమ విద్యాసంస్థలో చేర్పించినందుకు ఆ పీఆర్వోలకు ప్రయివేటు విద్యా సంస్థలు ప్రత్యేకంగా నగదు పారితోషికాలను ముట్టజెబుతున్నాయి. ఆ మొత్తాలను కూడా విద్యార్థులపై ఫీజుల రూపంలో భారం మోపుతున్నాయి. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది 25 శాతం పైగా ఫీజుల భారం పెరిగిందని విద్యార్థులు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, హాస్టల్ వసతి, రవాణా సౌకర్యం వంటి కారణాలతో ఫీజుల భారం తడిసిమోపడవుతోంది. ఐదో తరగతి పీజు రూ.25వేలు ఐదో తరగతి విద్యార్థులకు స్కూళ్లను బట్టి రూ.6,500 నుంచి రూ.25వేల వరకు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు రూ.20 వేల నుంచి రూ.40వేల వరకు వసూలు చేస్తున్నారు. జూనియర్ కాలేజీల్లో అయితే రూ.70 వేల నుంచి రూ.1.75 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది. పిల్లల భవిష్యత్తు కోసం.... ఒకప్పుడు సంపన్న వర్గానికి చెందిన విద్యార్థులు మాత్రమే ప్రయివేటు విద్యాసంస్థల్లో చేరేవారు. రానురానూ పేద, మధ్య తరగతి ప్రజలు సైతం తమ పిల్లలు బాగా చదివి ప్రయోజకులు అవుతారనే ఉద్దేశంతో ప్రయివేటు విద్యా సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఇలా ఒక్కో కుటుంబంలో హైస్కూలు స్థాయిలో చదువుకునే ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉంటే వారి కోసం ఏడాదికి రూ.40 వేల నుంచి రూ.70వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇంటర్మీడియెట్ చదివే పిల్లలు ఇద్దరు ఉంటే రూ.1.20 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆదరణ లేని కోర్సులకు బ్రేక్ ఇంటర్లో సీఈసీ (కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్), హెచ్ఈసీ (హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్) వంటి గ్రూపుల్లో విద్యార్థులు చేరే అవకాశం లేకపోవడంతో ప్రయివేటు కాలేజీల్లో ఆ గ్రూపులను రద్దు చేస్తున్నారు. ఎంపీసీ, బైపీసీలకు క్రేజ్ పెరగడంతో కార్పొరేట్ కాలేజీలు వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇంజినీరింగ్, మెడికల్ వైపు వెళ్లే విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లోనే ఎక్కువగా చేరుతున్నారు. ఆ కోర్సులకు డిమాండ్ ఉండటంతో ప్రయివేటు విద్యా సంస్థలు వాటిపైనే దృష్టిపెట్టి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి.