China economic crisis
-
అమ్మకాలను కట్టడి చేసేందుకే చైనా కఠిన నిర్ణయాలు..
స్టాక్మార్కెట్లో ఒడిదొడుకులు సహజం. ఏదైనా అనిశ్చిత పరిస్థితుల్లో మార్కెట్లు మరింత ఎక్కువగా ఊగిసలాడుతాయి. అయితే మార్కెట్లో నిత్యం భారీగా అమ్మకాలపర్వం కొనసాగితే ఆ దేశ ఆర్థికవ్యవస్థకు నష్టం జరుగుతుంది. దాంతో ఎక్స్ఛేంజ్ రెగ్యులేటరీలు కొత్త నిబంధనలు తీసుకొస్తాయి. ఫలితంగా కొంత నష్టాన్ని అరికట్టేలా చర్యలు తీసుకుంటాయి. తాజాగా చైనా మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు స్టాక్ మార్కెట్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. చైనా వరుస అమ్మకాల ఒత్తిడిని కట్టడి చేసేందుకు ఏర్పాట్లు చేసింది. కొవిడ్ అనంతరం అక్కడి మార్కెట్ వెళ్లిన జీవనకాల గరిష్ఠాల నుంచి క్రమంగా చైనా, హాంకాంగ్ మార్కెట్లలో ఆరు ట్రిలియన్ డాలర్ల సంపదను మదుపర్లు విక్రయించి దేశానికి షాక్ ఇచ్చారు. ఈ తరుణంలో దేశంలోని ఆర్థిక నిపుణులు సలహా మేరకు అక్కడి మార్కెట్ రెగ్యులేటర్లు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నాయి. ఇందులో భాగంగా చైనా కొత్త నిబంధనలు అమలు చేయనుంది. షార్ట్ సెల్లింగ్‌కు సంబంధించి ‘చైనా సెక్యూరిటీస్ రెగ్యులేటరీ కమిషన్ (సీఎస్ఆర్సీ)’ పరిమితులు విధించింది. ఈ నిబంధనలు ఈరోజు నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ‘రెస్ట్రిక్టెడ్ స్టాక్స్’ లిస్ట్‌లో ఉన్న షేర్లను ఇతరులకు అప్పుగా ఇచ్చేలా గతంలో ఉన్న నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు సీఎస్ఆర్సీ తెలిపింది. దీనిపై మరిన్ని షరతులను మార్చి మూడోవారంలో తెలియజేయనున్నట్లు ప్రకటించింది. ఇదీ చదవండి: అమెరికా వార్నింగ్ ఇచ్చినా ఒకేసారి మూడు ఉపగ్రహాలు ప్రయోగించిన దేశం..! చైనా వృద్ధి రేటు చాలా ఏళ్లపాటు నెమ్మదిగా ఉంటుందనే అంచనాలు వస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఆ దేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించిన స్థిరాస్తి రంగం ప్రస్తుతం దారుణ పరిస్థితుల్లో ఉన్నట్లు తెలిసింది. అక్కడి స్టాక్ మార్కెట్ మదుపర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థను ఎలాగైనా పటిష్ట పరుచుకోవాలని భావించిన ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకున్నట్లు తెలిసింది. -
25 ఏళ్లలో తొలిసారి.. చైనాలో ఏం జరుగుతుందంటే.. నివేదికలో ఆసక్తికర అంశాలు
ప్రపంచ కర్మాగారమని చెప్పుకునే చైనా కథ కీలకమైన మలుపు తిరిగిందా? ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెలాయిస్తున్న పెత్తనానికి బ్రేకులు పడనున్నాయా? అవునంటున్నాయి తాజా నివేదికలు. పాతికేళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తొలిసారి తగ్గుముఖం పట్టడాన్ని దీనికి నిదర్శనంగా చూపుతున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా విదేశీ పెట్టుబడులు తగ్గిన సమాచారం బయటకొచ్చింది. 1998 తరువాత మొట్టమొదటిసారి 2023 మూడో త్రైమాసికంలో చైనాలోని విదేశీ సంస్థాగత పెట్టుబడులు రూ.98 కోట్ల వరకూ తగ్గినట్లు తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ తాజా నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ యాజమాన్య సంస్థల నుంచి డబ్బు ఇతర దేశాలకు ప్రవహించడం మొదలైంది. చైనాలోని విదేశీ సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తగ్గడానికి పశ్చిమ దేశాలతో ఆ దేశ సంబంధాలు బెడిసికొట్టడం, ఇతర దేశాల్లో అధిక వడ్డీ రేట్లు కారణంగా ఎఫ్‌డీఐలు తరలిపోతున్నట్లు నివేదిక తెలిపింది. అమెరికాతోపాటు ఇతర దేశాలకు చెందిన సెంట్రల్బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. అందుకు విరుద్ధంగా మందగిస్తున్న తన ఆర్థిక వ్యవస్థను పెంచడానికి చైనా కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. దాంతో చైనాలో కంటే వడ్డీ ఎక్కువగా ఉన్న ఇతర దేశాల్లోకి పెట్టుబడులు పెట్టడంతో లాభం చేకూరుతుందని విదేశీ పెట్టుబడిదారులు యోచిస్తున్నారు. ఫలితంగా చైనాలో ఎఫ్‌డీఐలు తగ్గిపోతున్నాయి. అయితే గతంలో పరిస్థితులు మెరుగ్గా ఉన్న సమయంలో విదేశీ కంపెనీలు చైనాలో ఆర్జించిన లాభాలను దేశంలో తిరిగి పెట్టుబడి పెట్టేందుకు సుముఖత చూపలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దాంతో ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడుతుందన్నారు. ఈ సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 920 బిలియన్ యువాన్లకు (రూ.10లక్షల కోట్లు) చేరుకున్నాయి. ఇది 2022లో ఇదే కాలంతో పోలిస్తే 8.4 శాతం తక్కువ. ఈ ఏడాది యూఎస్ డాలర్‌తో పోలిస్తే చైనా కరెన్సీ విలువ క్షీణించింది. పెరుగుతున్న నిరుద్యోగం, రియల్ ఎస్టేట్ సంక్షోభం కారణంగా డిమాండ్ మందగించడంతో చైనా ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడినట్లు సర్వే తెలిపింది. చైనాలోని రెండో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ ఎవర్‌గ్రాండే ఈ సంవత్సరం ప్రారంభంలో దివాలా కోసం దాఖలు చేసింది. ప్రస్తుతం మరో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ కంట్రీ గార్డెన్ పతనం అంచున ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎగుమతి ఆధారిత, పారిశ్రామిక రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ కంపెనీల లాభాలు ఈ ఏడాది క్షీణించాయని నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి: నోట్ల రద్దు తర్వాత రెట్టింపైన నగదు చలామణి! కారణం ఇదేనా.. చైనా బ్యాంకింగ్ రంగంలో విదేశీ సంస్థాగత పెట్టుబడులు 2021లో రికార్డు స్థాయిలో 4 ట్రిలియన్ యువాన్లు ఉండేవి. అయితే సెప్టెంబర్ చివరి నాటికి 3.19 ట్రిలియన్ యువాన్లకు పడిపోయాయని చైనా సెంట్రల్ బ్యాంక్ డేటాను ఉటంకిస్తూ సర్వే తెలిపింది. ఐఎంఎఫ్ తన తాజా అంచనా నివేదికలో ప్రాపర్టీ సెక్టార్లో కొనసాగుతున్న బలహీనత, మార్కెట్లో డిమాండ్ తగ్గుదల కారణంగా చైనా వాస్తవ జీడీపీ 2023లో 5.4 శాతానికి పెరుగుతుందని, 2024లో 4.6 శాతానికి మందగించవచ్చని చెప్పింది. అక్కడి జనాభా అధికంగా వృద్ధాప్యంతో బాధపడుతుండడంతో పరిశ్రమల్లో ఉత్పాదకత తగ్గి 2028 నాటికి వృద్ధిరేటు క్రమంగా 3.5 శాతానికి పడిపోతుందని అంచనా. -
ఫెడ్ ఆశలతో మార్కెట్ పైకి..
సెన్సెక్స్ 258 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్లు అప్ చైనా ఆర్థిక సంక్షోభం దరిమిలా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచకపోవచ్చన్న ఆశలతో బుధవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో తదితర బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లతో బీఎస్ఈ సెన్సెక్స్ 258 పాయింట్లు ఎగిసి 25,964 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ మరోసారి కీలకమైన 7,900 పాయింట్ల స్థాయిని అధిగమించే ప్రయత్నం చేసింది. చివరికి 70 పాయింట్ల లాభంతో 7,899 వద్ద ముగిసింది. ఆగస్టు 31 తర్వాత రెండు సూచీలు ఇంత అధిక స్థాయిలో క్లోజవడం ఇదే ప్రథమం. మరోవైపు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నెల 29న జరిగే పాలసీ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ మరోసారి కీలక పాలసీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంటు సానుకూలంగా ఉండేలా చేస్తున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. విద్యుత్, బ్యాంకింగ్ షేర్లు వెలుగులో.. బ్యాంకింగ్, విద్యుత్, హెల్త్‌కేర్, టెక్నాలజీ, ఆటోమొబైల్, ఐటీ రంగాల షేర్లు లాభపడగా.. కన్జూమర్ డ్యూరబుల్, రిఫైనరీ, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ రంగాలు నష్టపోయాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 26 స్క్రిప్స్ లాభాల్లో ముగిశాయి. బుధవారం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో 26,007 పాయింట్లకు ఎగిసింది. కానీ గరిష్ట స్థాయుల్లో లాభాల స్వీకరణ జరగడంతో 25,816 స్థాయికి తగ్గింది.