Chinnakoduru
-
సెల్ఫీ తీసుకుంటూ ఫోన్‌తో నీటిలోకి కొట్టుకుపోయిన బాలుడు
చిన్నకోడూరు (సిద్దిపేట): సెల్ఫీ సరదా ఓ బాలుడి ప్రాణం మీదకు తెచ్చింది. నీటి ప్రాజెక్ట్ చూడడానికి వెళ్లిన బాలుడు అక్కడ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు ప్రాజెక్ట్ నీటిలో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ వద్ద జరిగింది. దీంతో సిద్దిపేటలో విషాదం నిండింది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు. సిద్దిపేటకు చెందిన వెగ్గలం కార్తీక్ (15) తన మిత్రులు చరణ్, హేమంత్‌చారి, సాయిచరణ్‌లతో కలిసి చంద్లాపూర్ శివారులో ఉన్న రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ చూసేందుకు శుక్రవారం వెళ్లాడు. అక్కడ మొత్తం ప్రాంతం కలియతిరిగి సరదాగా గడుపుతున్నారు. ఈక్రమంలో స్నేహితులతో కలిసి కార్తీక్ ఫొటోలు దిగుతున్నాడు. అనంతరం సెల్ఫీ ఫొటో కోసం ప్రయత్నాలు చేశాడు. పంపింగ్ చేసే స్థలంలో కార్తీక్, చరణ్ కలిసి సెల్ఫీ దిగుతుండగా ఒక్కసారిగా కింద ఉన్న మట్టిపెళ్లలు నీటిలోకి జారాయి. దానిపైన నిలబడ్డ కార్తీక్, చరణ్ ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనతో తోటి మిత్రులు షాక్‌కు గురయ్యారు. అయితే చరణ్ ఓ కట్టె సాయంతో నీటిలో నుంచి బయటపడగా కార్తీక్ నీటిలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి కార్తీక్ కోసం గాలించారు. గత ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో కార్తీక్ మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం కోసం వెతుకుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: డబ్బుల్లేక భార్యతో గొడవ.. కూతుళ్లతో విషం తాగి -
కొడుకుని చంపిన తండ్రి
భార్యను పుట్టింటి నుంచి తీసుకురావాలని తండ్రితో వాగ్వాదం రోకలితో బాదిన తండ్రి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి సిద్దిపేట రూరల్: మద్యం మత్తులో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో కొడుకు మృతి చెందాడు. ఈ సంఘటన చిన్నకోడూరులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు వివరాలు... చిన్నకోడూరుకు చెందిన వేల్పుల నరేశ్(21) రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మౌనికను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే నరేష్ నిత్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం నరేష్ భార్య మౌనికతో గొడవ పడడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో నరేష్ రోజు మద్యం తాగి రాత్రి ఇంటికి వస్తున్నాడు. శుక్రవారం రాత్రి నరేష్ మద్యం తాగి ఇంటికి వచ్చి, తండ్రి నాగరాజుతో గొడవకు దిగాడు. పుట్టింటికి వెళ్లిన భార్యను ఇంటికి తీసుకురావాలని తండ్రితో నరేష్ గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య నెలకొన్న వాగ్వాదం కొట్లాటకు దారి తీసింది. దీంతో ఇంట్లో పక్కనే ఉన్న రోకలితో నాగరాజు కొడుకు మెడపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో నరేష్ స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. ఇది గమనించి కుటుంబ సభ్యులు నరేష్‌ను ఓ ఆటోలో సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న రూరల్ సీఐ సైదులు, ఎస్ఐ అశోక్‌లు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించారు. దీనికి కారణమైన మృతుడి తండ్రి నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సైదులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ప్రేమ పేరుతో వంచన
►గర్భం దాల్చిన బాలిక.. ఆలస్యంగా వెలుగులోకి.. ►పోలీసుల అదుపులో నిందితుడు చిన్నకోడూరు: ప్రేమ, పెళ్లి అని చెప్పి బాలికను లొంగదీసుకున్న ఓ యువకుడు చివరకు మొహం చాటేశాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం బహిర్గతమైంది. బాలిక కుటుంబసభ్యల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితునిపై బుధవారం కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి మెదక్ జిల్లా సిద్దిపేట రూరల్ సీఐ వెంకటయ్య, ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాలు.. చిన్నకోడూరు గ్రామానికి చెందిన బాలిక (16) ఇటీవల చిన్నకోడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసింది. ఏడు నెలల కిందట పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించినప్పడు సిద్దిపేటకు చెందిన యువకుడు సాబేర్‌తో పరిచయం ఏర్పడింది. తన ఫోన్ నంబర్ బాలికకు ఇచ్చాడు. ఫోన్ మాటలు కాస్త ప్రేమగా మారింది. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికకు నమ్మబలికిలిన సాబేర్‌తో ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. తీరా బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు ఆమెను నిలదీశాడు. దీంతో వారు సాబేర్‌ను నిలదీయగా అతను మొహం చాటేశాడు. అప్పటికే బాలిక నాలుగు నెలల గర్భిణి కావడంతో బాధితులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని అదులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు నిజం ఏంటి? చిన్నకోడూరుకు చెందిన బాలికపై ఐదురుగు వ్యక్తులు కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడడంతో ఆమె గర్భం దాల్చిందంటూ బుధవారం పలు చానెళ్లలో జోరుగా ప్రచారం జరిగింది. వాస్తవానికి బాధిత బాలిక మానసిక వైకల్యాన్ని అలుసుగా తీసుకొని ఐదుగురు కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడినట్లు గ్రామంలోనూ చెప్పుకుంటున్నారు. దీంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఒక్కరే ప్రేమ పేరుతో అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పడంతో కేసుపై కొంత సందిగ్ధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తనతో పాటు మరికొందరున్నారని నిందితుడు చెప్పడం కొసమెరుపు! -
యువతిపై సామూహిక అత్యాచారం
మెదక్: యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా చిన్నకోడూరుకు చెందిన యువతి(20)పై గత నాలుగు నెలలుగా అదే ప్రాంతానికి చెందిన 5గురు యువకులు లైంగిక దాడికి పాల్పడుతున్నారు. విషయం ఎవరికైనా చెప్తే.. కుటుంబ సభ్యులందర్ని చంపుతామని బెదిరించి యువతిపై పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ క్రమంలో యువతి గర్భవతి కావడంతో విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయిదుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
క్షుద్ర పూజలతోనే వివాహిత మృతి
బాధితుల ఆరోపణ, మాంత్రికుడితో వాగ్వాదం.. పోలీసుల అదుపులో లక్ష్మీనారాయణ చిన్నకోడూరు : చేతబడి చేయడం వల్లే మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ మండలం చౌడారం గ్రామానికి చెందిన బాధిత కుటుంబీకులు బుధవారం రాత్రి మంత్రాలు వేసే వ్యక్తితో గొడవకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి.. చౌడారం గ్రామానికి చెందిన పండుగ రజిత (24) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. పలు ఆస్పత్రులు తిరిగినా జబ్బు నయం కాలేదు. అయితే రజితకు ఎవరో చేతబడి చేశారని, తనకు కొంత డబ్బులు ఇస్తే పూజలు చేసి నయం చేస్తానని అదే గ్రామానికి చెందిన కట్కోజుల లక్ష్మీనారాయణ నమ్మించాడు. దీంతో రజిత కుటుంబసభ్యులు లక్ష్మీనారాయణకు రూ. 50 వేలు ఇచ్చారు. అతను నెల రోజులుగా క్షుద్ర పూజలు చేస్తూ, వివిధ మందును రజితకు తాపించాడు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించి బుధవారం సాయంత్రం మృతి చెందింది. దీంతో భర్త రమేష్‌తో పాటు కుటుంబీకులు లక్ష్మినారాయణతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ సీఐ ప్రసన్నకుమార్, ఎస్ఐ ఆనంద్గౌడ్లు అక్కడికి చేరుకున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో లక్ష్మీనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై ఎస్ఐను వివరణ అడగగా లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్నామని, అయితే కేసు నమోదు చేయలేదని తెలిపారు. -
కోతలపై భగ్గు
చిన్నకోడూరు: విద్యుత్ సమస్యతో పంటలకు నీరందడం లేదంటూ ఆగ్రహించిన రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. అల్లీపూర్, ఎల్లాయపల్లి, మైలారం గ్రామాలకు చెందిన రైతులు ఎల్లాయపల్లి సబ్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించకపోవండతో రోడ్డుపై ముళ్లకంప వేసి, సీఎం దిష్టిబొమ్మతో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సరఫరాలో తరచూ బ్రేక్‌డౌన్ అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విద్యుత్ అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కదిలేది లేదని రోడ్డుపై భీష్మించుకు కూర్చున్నారు. ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఆనంద్‌గౌడ్, విద్యుత్ సబ్ ఇంజినీర్ కనకయ్యలు అక్కడకు చేరుకుని రైతులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయినా వారు వినకపోవడంతో సమస్యను ఉన్నతాధికారులకు వివరించారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అట్టుడికిన రామాయంపేట రామాయంపేట: రాస్తారోకోలు, ఆందోళనలతో మండలం అట్టుడికిపోయింది. విద్యుత్ కోతలపై రైతులు కన్నెర్రజేశారు. మండలంలోని కోనాపూర్, లక్ష్మాపూర్, రామాయంపేట, తొనిగండ్ల, పర్వతాపూర్, ఢి.ధర్మారం గ్రామాలకు చెందిన అన్నదాతలు పెద్దసంఖ్యలో రోడ్లెక్కారు. రెండు రోజులుగా వ్యవసాయానికి రెండు గంటలపాటు కూడా సరఫరా అందడం లేదన్నారు. భారీ సంఖ్యలో వచ్చి ఆందోళన చేపట్టిన వీరిని సముదాయించడానికి పోలీసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. లక్ష్మాపూర్ సబ్ స్టేషన్‌కు చేరుకున్న కర్షకులు రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపైన పడుకుని గంటకుపైగా నిరసన చేశారు. తొనిగండ్ల, ల క్ష్మాపూర్ గ్రామాలకు చెందిన రైతులు లక్ష్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద రామాయంపేట-మెదక్ రహదారిని స్తంభింపజేశారు. రెండు గంటలకుపైగా కొనసాగిన వీరి ఆందోళనతో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ఈ సమయంలో ప్రయాణికులు, ఆందోళనకారులకు మధ్య స్వల్ప వాగ్వా దం జరిగింది. పోలీసులు జోక్యంతో రోడ్డుపై ఆందోళన విరమించిన రైతులు సబ్‌స్టేషన్ వద్ద బైఠాయించారు. అక్కన్నపేట, రామాయంపేటకు చెందిన రైతులు స్థానిక బస్టాండ్ వద్ద రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. పర్వతాపూర్‌కు రైతులు లక్ష్మాపూర్ రోడ్డు వద్ద రాస్తారోకో చేశారు. ఢి.ధర్మారం రైతులు రామాయంపేట సబ్‌స్టేషన్ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆ శాఖకు చెందిన అధికారులు ఎవరూ అందుబాటులో లేకుండాపోయారు. సబ్ స్టేషన్‌లోని ఫర్నిచర్ ధ్వంసం విద్యుత్ కోతలను నిరసిస్తూ అన్నదాతలు ఆగ్రహం చెందారు. ఆదివారం దొంగలధర్మారం సబ్‌స్టేషన్‌లోని ఫర్నిచర్‌ను దహనం చేశారు. రోడ్డుకు అడ్డంగా స్తంభాలు వేసి రాస్తారోకో నిర్వహించారు. పోలీసులకు రైతులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.