chinthapally
-
మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు.. ఏవోబీలో రెడ్ అలర్ట్
సాక్షి, పాడేరు/ముంచంగిపుట్టు/కొయ్యూరు: ఏజెన్సీలో మావోయిస్టులు జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు 50వ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏవోబీ వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కొద్ది రోజుల కిందట ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ పేరిట విడుదలైన లేఖలో వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాలతో పాటు అల్లూరి జిల్లాలోని పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, చింతూరు పోలీసు సబ్ డివిజన్ల పరిధిలోని పోలీసు బలగాలు వారం రోజుల నుంచి కూంబింగ్ చేపడుతున్నాయి. చింతూరుకు సరిహద్దులో ఉన్న చత్తీస్‌గఢ్ ప్రాంతంలో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మావోయిస్టుల వారోత్సవాలను భగ్నం చేసేలా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సీఆర్పీఎఫ్తో పాటు ఇతర పోలీసు బలగాలు అటవీ ప్రాంతాల్లో మకాం వేశాయి. మండల కేంద్రాలు, ప్రధాన జంక్షన్లలో ఆయా పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో కూడా తనిఖీలు జరిపారు. ముంచంగిపుట్టులో ఎస్ఐ కె.రవీంద్ర ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. సీఆర్పీఎఫ్ పోలీసులు ముంచంగిపుట్టు నుంచి రాముల గ్రామం వరకు కల్వర్టులు, వంతెనలను బాంబు స్క్వాడ్‌తో పరిశీలించారు. జోలాపుట్టు, మాచ్‌ఖండ్, ఒనకఢిల్లీల్లో బీఎస్ఎఫ్ బలగాలు నిఘా పెంచాయి. నాయకులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ఎక్కడికి వెళ్లినా తమకు సమాచారం అందించాలని పోలీసులు నోటీసులను జారీ చేశారు. కొయ్యూరు మండలంలోనూ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఏడాది కాలంలో ఏవోబీ పరిధిలో 12 మంది మావోయిస్టులు మరణించారు. అలా మరణించిన వారికి వారోత్సవాల్లో మావోయిస్టులు నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా యాక్షన్టీంలను రంగంలోకి దించే అవకాశం ఉండడంతో పోలీసులు నిఘా పెంచారు. పాడేరు, చింతలవీధి, గబ్బంగి, కరకపుట్టు తదితర ప్రాంతాల్లో ఎస్ఐలు లక్ష్మణ్‌రావు, రంజిత్‌లు తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులలో రాకపోకలు సాగిస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. (క్లిక్: ఆంధ్రాలోనే ఉంటాం.. భద్రాచలాన్ని ఆంధ్రాలో కలపాలి) -
సాగుకు సమయమిదే
చింతపల్లి: మన్యంలో గిరిజన రైతులు పొద్దు తిరుగుడును సాగు చేసేందుకు ఇదే సరైన సమయమని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ అనురాధ తెలిపారు. ఆరోగ్యవంతమైన నూనె పంటల్లో పొద్దుతిరుగుడు ప్రధానమైనది. వార్నిష్, సబ్బుల తయారీలో కూడా పొద్దుతిరుగుడును వినియోగిస్తారు. అన్నిరకాల భూముల్లో ఈ పంటను సాగుచేయవచ్చు. ఏజెన్సీ ప్రాంతానికి మోర్డారు రకం అత్యంత అనుకూలంగా ఉన్నట్టు వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. ఖరీఫ్ సీజన్లో జూన్ రెండవ వారు నుంచి ఆగస్టు రెండవ వారం వరకు సాగుకు అనుకూల వాతావరణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏడీఆర్ డాక్టర్ అనురాధ అందించిన వివరాలు.. సాగు పద్దతి పొద్దు తిరుగుడు సాగుకు ముందుగా భూమిని నాలుగైదు సార్లు బాగా దున్ని మెత్తగా తయారు చేయాలి. హెక్టారుకు 12 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనాలను ఒకటిన్నర అంగుళాల లోతులో నాగలి చాళ్లలో వేసుకోవాలి. అంతకన్నా లోతులో వేసుకుంటే మొలక సరిగా రాదు. చాళ్ల మధ్య దూరము 2 అడుగులు, మొక్కల మధ్య 12 అంగుళాల దూరం వేసుకోవాలి. హెక్టారుకు 60 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేయాలి. పొద్దు తిరుగుడును వేరుశనగలో మిశ్రమ పంటగా 8 నుంచి 12 వరసలకు రెండేసి వరుసల చొప్పున వేసుకోవాలి. భాస్వరం, పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలోను, నత్రజని ఎరువులో సగం విత్తుకునేటప్పుడు, మిగిలింది పంట మొగ్గ మీద ఉన్నప్పుడు వేసేకోవాలి. విత్తిన నెల రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. వేరుశనగలో మిశ్రమ పంటగా వేస్తే వరుసలు తూర్పు, పడమర దిక్కున వేయాలి. లేకుంటే పొద్దుతిరుగుడు వరుసల నీడ వేరుశనగపై పడి పంటకు నష్టం జరుగుతుంది. ఈ పంటకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు నిలువ ఉండకూడదు. ఈ పంట పరస్పరాగ సంపర్కము మూలంగా గింజకడుతంది. పంట పూత దశలో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య పువ్వు మీద చేతితో గాని, మెత్తని గుడ్డతో గాని సున్నితంగా రుద్దినట్లయితే పరాగ సంపర్కము బాగుండి గింజ బాగా కట్టి దిగుబడి పెరుగుతుంది. సాధారణంగా క్రిమి కీటకాలు, తెగుళ్లు ఆశించవు. పచ్చగొంగళి పురుగు ఆశించినట్లయితే దీని నివారణకు 35 ఈసీ మందు రెండు మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పంట చివరి దశలో పిట్టల భారీ నుంచి కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలి. వర్షాధార పంటగా ఎకరాకు ఆరు క్వింటాళ్ల వరకు దిగుబడి పెరుగుతుంది. పొద్దుతిరుగుడు సాగుతో గిరిజనులు మంచి లాభాలు పొందవచ్చని ఏడీఆర్ తెలిపారు. -
తలలేని మొండం.. 3 రోజులుగా పోలీసులకు ముచ్చెమటలు.. అయినా!
సాక్షి, దేవరకొండ/చింతపల్లి : నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలో ఇటీవల వెలుగుచూసిన మతిస్థిమితం లేని జహేందర్ హత్యోదంతం కేసు పోలీసులకు జటిలంగా మారింది. కిరాతకులు జహేందర్ తలను తెగ్గోసి మహంకాళి అమ్మవారి పాదాల వద్ద పెట్టి మొండెం ఆచూకీ లేకుండా చేసిన విషయం విదితమే. కాగా, గడిచిన మూడు రోజులుగా ప్రత్యేక పోలీసు బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నా బుధవారం నాటికి కూడా మొండెం ఆచూకీ లభ్యం కాలేదు. అయితే, హత్యోదంతం వెలుగుచూసిన నాటి నుంచి జహేందర్ తలను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచారు. మొండెం ఆచూకీ లభించేంత వరకు అతడి తలను కుటుంబ సభ్యుల కు ఇవ్వకూడదని, కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ పరిసరాల్లో నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలానికి చెందిన మాజీ నక్సలైట్ శ్రీనివాస్‌రెడ్డి దారుణ హత్యనే ఇందుకు ఉదాహరణ అని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో బాధిత కుటుంబానికి జహేందర్ తల ఇవ్వలేక.. అతడి మొండేన్ని కనుకొనలేక ఆ శాఖ యంత్రాంగం తల పట్టుకుంది. చింతపల్లి : సిబ్బందికి సూచనలు చేస్తున్న ఎస్పీ 9 బృందాలు.. 170మంది పోలీసులు కిరాతకుల సవాల్‌ను చాలెంజ్‌గా తీసుకున్న పోలీస్ శాఖ ఉన్నతాధికారులు జహేందర్‌నాయక్ కేసును ఛేదించేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. హతుడి మొండెం ఆచూకీ కనుగొనేందుకు 170మంది పోలీసులు తొమ్మిది బృందాలుగా విడిపోయి గాలిస్తున్నాయి. ఇబ్రంహీంపట్నం, తుర్కయాంజల్ మొదలుకుని చింతపల్లి మండల పరిసరప్రాంతాల్లోని చెట్టూపుట్ట వెతుకుతున్నా ఎలాంటి పురోగతి కనిపించలేదు. కాగా, గత శనివారం 10గంటల సమయంలో దేవరకొండ నుంచి శేరిపల్లి వెళ్లే దారి పక్కన నిలిపి ఉంచిన కారు ఎవరిదన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సంప్రదాయం ప్రకారం జహేందర్ అంత్యక్రియలు నిర్వహించుకుంటామని, అతడి మొండేన్ని కనుగొని పూర్తి మృతదేహాన్ని అప్పగించాలని బాధిత కుటుంబం పోలీసు అధికారులను వేడుకుంటోంది. త్వరలోనే ఛేదిస్తాం.. సహకరించండి జహేందర్ నాయక్ హత్య కేసును ఛేదించేందుకు తమకు సహకరించాలని ఎస్పీ రెమా రాజేశ్వరి బాధిత కుటుంబ సభ్యులను కోరారు. జహేందర్‌నాయక్ తల లభ్యమైన చింతపల్లి మండలం విరాట్‌నగర్ సమీపంలోని శ్రీ మెట్టు మహంకాళి దేవాలయాన్ని బుధవారం ఎస్పీ పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను విచారించారు. కేసు సంక్లిష్టంగా ఉందని, నిందితులు చిన్న క్లూ కూడా వదలేదు అన్నట్లు తెలిసింది. కేసు ఛేదనకు అనునిత్యం శ్రమిస్తున్నామని, మీకు ఎవరిమీదైనా అనుమానం ఉన్నా, గతంలో అనుకోని ఘటనలు జరిగి ఉంటే చెప్పాలని కోరినట్లు సమాచారం. ‘‘ఒకటి రెండు రోజుల్లో కేసును కొలిక్కి తెస్తామని.. సహకరించాలని ఎస్పీ కోరినట్లు తెలిసింది. ఎస్పీ వెంట సీసీఎస్ డీఎస్పీ మొగి లయ్య, నాంపల్లి సీఐ సత్యం, ఎస్ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు. -
ఆత్మహత్యలు ఆగాలి .. అభివృద్ధి జరగాలి
చింతపల్లి: ‘రాష్ట్రంలో ఆత్మహత్యలు ఆగాలి.. అభివృద్ధి జరగాలి. రాజన్న రాజ్యం రావాలి..’అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆకాంక్షించారు. ఉద్యమకారులను నమ్మి అధికారం ఇస్తే నట్టేట ముంచారని విమర్శించారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర బుధవారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని సమైక్యనగర్ కాలనీ, కుర్రంపల్లి ఎక్స్‌రోడ్డు, సాయిరెడ్డిగూడెం, మోద్గుల మల్లేపల్లి, పి.కె. మల్లేపల్లి, కిష్టరాయినిపల్లి గ్రామాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా పి.కె.మల్లేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మాట ముచ్చట కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు. ధాన్యం కొనకపోవడంతో రైతుల్లో ఆందోళన రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ఇంతవరకు రైతులకు రుణమాఫీ చేయలేదని, ఇప్పుడు చేసినా అధిక వడ్డీకే సరిపోని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. వరికోతలు నడుస్తున్నా ఇంతవరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదని, అసలు కొంటారో..కొనరో అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు. రాష్ట్రాన్ని బార్ల తెలంగాణగా మార్చారని ధ్వజమెత్తారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కుల వృత్తులకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మాట ముచ్చటలో భాగంగా పలువురు మహిళలు వైఎస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పడం తప్ప ఎవరికీ ఇవ్వలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పిట్టా రాంరెడ్డి, సురేష్‌రెడ్డి, ఏపూరి సోమన్న తదితరులు పాల్గొన్నారు. షర్మిలను కలిసిన విజయమ్మ పాదయాత్రలో ఉన్న షర్మిలను వైఎస్ విజయమ్మ కలిశారు. బుధవారం మధ్యాహ్నం మోద్గుల మల్లేపల్లి గ్రామానికి చేరుకున్న విజయమ్మ సుమారు మూడు గంటల పాటు ఆమెతో ఉన్నారు. -
దేవుడి ముసుగులో.. పర్యాటక స్థలం ఆక్రమణ
పూసపాటిరేగ: ఆడ పిల్ల.. అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ.. అయితే ఇప్పుడు అధికార పార్టీ నాయకులు కూడా దీనినే అనుసరిస్తున్నారు. ఆక్రమించేందుకు ఏదైతే ఏం అన్న రీతిలో బరితెగిస్తున్నారు. చింతపల్లి సముద్రతీరంలో గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు పర్యాటక స్థలానికి నిర్మించి ఆక్రమించాడు. తొలుత పర్యాటక స్థలానికి ఆనుకొని గుడితో పాటు ప్రహరీ కూడా నిర్మించాడు. ఆ తరువాత పర్యాటకంగా ఆ ప్రదేశం అంతా అభివృద్ధి చెందడంతో గుడి చుట్టూ ఉన్న సుమారు 50 సెంట్లు స్థలంపై ఆయన కన్నుపడింది. వెంటనే స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి గేటు కూడా ఎత్తేశాడు. చింతపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 115లో వున్న పర్యాటక శాఖ స్థలానికి ఆనుకొని ఉన్న స్థలంలోనే ప్రహరీ నిర్మించాడు. ఈ నిర్మాణం జరిగి నెలలు గడుస్తున్నా పర్యాటక శాఖ అధికారుల్లో ఎటువంటి చలనం లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికారులకు తెలిసే నిర్మాణాలు జరిగా యా అని చర్చించుకొంటున్నారు. చింతపల్లి బీచ్‌కు వచ్చే పర్యాటకులు వాహనాలు పార్కింగ్‌కు ఉంచే స్థలంలో ని ర్మాణాల జరిగినా పట్టించుకోవడం లేదు. చింతపల్లి పం చాయతీలో అధికార పార్టీకి చెందిన కీలకనేత కావడంతో ప్రజలు అడిగే సాహసం చేయలేపోతున్నారు. పర్యాటకశాఖ అధికారులు నిర్లక్ష్యం తేటతెల్లం అవడంతో కన్ను పడిందే తడువుగా స్థలాన్ని కబ్జా చేశారు. విచారణ ఆదేశించాలని మత్స్యకార నాయకులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమించిన వ్యక్తి అధికార పార్టీకి చెందిన వారు కావడంతో అధికారులు నోరు మెదపలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పర్యాటకశాఖకు చెందిన స్థలాన్ని అధికారపార్టీ నాయకుడు నుంచి కాపాడాలని పలువురు పర్యాటకులు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ రామారావును వివరణ కోరగా, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చేయాలి చింతపల్లిని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. పర్యాటకశాఖ స్థలాన్ని కబ్జాచేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. రెవెన్యూ, పర్యాటకశాఖ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడంతో ఆక్రమణలు జరుగుతున్నాయి. దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలి. – ఎం.శ్రీనువాసురావు, సామాజిక కార్యకర్త పర్యాటక భవనాలు ప్రారంభించాలి సుమారు కోటి రుపాయల నిధులతో నిర్మించిన పర్యాటక భవనాలు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. అధికారులు స్పందించి టూరిజం భవనాలు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలి. – మహంతి జనార్దనరావు, పూసపాటిరేగ -
కొనసాగుతున్న ‘పుష్కర పార్కింగ్’ పనులు
చింతపల్లి : ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న కష్ణా పుష్కరాల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని అజ్మాపురం, పెద్దమునిగల్, కాచరాజుపల్లి పుష్కర ఘాట్లతో పాటు నాగార్జునసాగర్‌కు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లోభాగంగా హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారి మీదుగా వెళ్లే ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు వింజమూరు సమీపంలో 70 ఎకరాలలో పార్కింగ్ స్థలంతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలు తదితర సదుపాయాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్, ఆర్డీఓ గంగాధర్, నాంపల్లి సీఐ బాలగంగిరెడ్డిలు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. గురువారం పార్కింగ్ స్థలం వద్ద చెట్ల తొలగింపుతో రోడ్లు, మూత్రశాలలకు సంబంధించిన పనులు ముమ్మరంగా కొనసాగాయి. -
కొనసాగుతున్న ‘పుష్కర పార్కింగ్’ పనులు
చింతపల్లి : ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న కష్ణా పుష్కరాల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని అజ్మాపురం, పెద్దమునిగల్, కాచరాజుపల్లి పుష్కర ఘాట్లతో పాటు నాగార్జునసాగర్‌కు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లోభాగంగా హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారి మీదుగా వెళ్లే ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు వింజమూరు సమీపంలో 70 ఎకరాలలో పార్కింగ్ స్థలంతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలు తదితర సదుపాయాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్, ఆర్డీఓ గంగాధర్, నాంపల్లి సీఐ బాలగంగిరెడ్డిలు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. గురువారం పార్కింగ్ స్థలం వద్ద చెట్ల తొలగింపుతో రోడ్లు, మూత్రశాలలకు సంబంధించిన పనులు ముమ్మరంగా కొనసాగాయి. -
మిలీషియా సభ్యులు ఇద్దరి అరెస్టు
చింతపల్లి(విశాఖపట్టణం): విశాఖపట్టణం జిల్లాలో ఇద్దరు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని చింతపల్లి మండలం లగడంపల్లి, దాని సరిహద్దు గ్రామానికి చెందిన సూరిబాబు, నారాయణరావులు మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నారు. అయితే ఈ రోజు మండలంలోని లోతుగడ్డ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా వీరు అనుమనాస్పదంగా వ్యవహరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో వీరు మిలీషియా సభ్యులని తేలినట్లు పోలీసులు వివరించారు. -
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
చింతపల్లె: నల్లగొండ జిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లె మండలంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. మండలంలోని మల్లారెడ్డిపల్లెకి చెందిన కిట్టయ్య(40)కు వ్యవసాయంలోగత ఏడాది నష్టాలు వచ్చాయి. దీనికి తోడు ఈ ఏడాది పంట సరిగా లేకపోవడంతో మనస్థాపానికి గురైన కిట్టయ్య పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు.