chit fund company
-
చిట్‌ఫండ్ మోసాలకు కళ్లెం
సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి’ వంటి కంపెనీల మోసాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటికి కళ్లెం వేస్తోంది. చిట్‌ఫండ్ వ్యవహారాలను కట్టుదిట్టం చేసేందుకు.. ఈ సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. సదరు కంపెనీలు నిర్వహించే చిట్ల వివరాలన్నీ ప్రజలకు తెలిసేలా ఆన్లైన్ విధానాన్ని రూపొందించి ‘ఈ–చిట్స్’ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. వివిధ చిట్‌ఫండ్ కంపెనీల్లో చిట్లు కట్టే చందాదారుల భద్రతే ప్రధాన లక్ష్యంగా దీన్ని అమలుచేస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఆప్షన్ ఇచ్చింది. ఇకపై చిట్‌ఫండ్ కంపెనీలు తమ చిట్స్ వివరాలన్నింటినీ ఈ అప్లికేషన్లో నమోదు చేయాల్సిందే. మొన్నటివరకు చిట్స్ రిజిస్ట్రార్ల అనుమతితో ఆ కంపెనీలు రికార్డులు నిర్వహించేవి. గ్రూపుల వారీగా అనుమతి తెచ్చుకుని వాటి రిజిస్టర్లను తమ ఇష్టానుసారం మార్చుకుంటున్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ రిజిస్టర్లకు నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోకపోవడం, తీసుకున్నా వాటిని సరిగ్గా నిర్వహించకపోవడం, ఆ వివరాలను చందాదారులకు తెలియకుండా దాచడం వంటి అనేక ఉల్లంఘనలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల ఆ కంపెనీల్లో ఏం జరుగుతుందో బయటకు తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పలు చిట్‌ఫండ్ కంపెనీలు బోర్డు తిప్పేయడం, లక్షలాది మంది చందాదారులు తమ శ్రమను ధారపోసి కట్టిన సొమ్మును నష్టపోవడం చాలా సందర్భాల్లో జరిగాయి. ఇలాంటి చిట్‌ఫండ్ కంపెనీల మోసాలకు సంబంధించి ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. మోసాలు అరికట్టడమే లక్ష్యం.. దీంతో.. రాష్ట్రంలో చిట్‌ఫండ్ మోసాలను అరికట్టే లక్ష్యంతో ఆన్లైన్ చిట్స్ పర్యవేక్షణ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ నిర్వహించే ఈ నూతన ఎలక్ట్రానిక్ విధానాన్ని రాష్ట్రంలోని చిట్‌ఫండ్ కంపెనీలన్నీ తప్పనిసరిగా అనుసరించాల్సిందేనని స్పష్టంచేశారు. చిట్‌ఫండ్ కంపెనీలు తమ లావాదేవీలను ఈ అప్లికేషన్ ద్వారా ఆన్లైన్లోనే నిర్వహించాల్సి వుంటుంది. ఏదైనా చిట్‌ఫండ్ కంపెనీ తమ చిట్లకు అనుమతులను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. వాటిని చిట్ రిజిస్ట్రార్లు ఆన్లైన్లోనే పరిశీలించి ఆమోదిస్తారు. ప్రతి చిట్కు సంబంధించిన గ్రూపు వివరాలు, మార్పులు, చేర్పులు, ప్రతినెలా జరిగే వేలం పాటలు వంటివన్నీ ఆన్లైన్లోనే పొందుపరుస్తారు. ఈ వివరాలన్నింటినీ చందాదారులు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ప్రతినెలా తాను కట్టే చిట్ వివరాలను ఆన్లైన్లోనే చూసి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. చిట్‌ఫండ్ కంపెనీల మోసాలను అరికట్టడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. చిట్‌ఫండ్ కంపెనీలను సమర్థవంతంగా నియంత్రించడంలోనూ వ్యాపారంలో పారదర్శకత తీసుకురావడంలోనూ ఈ నూతన విధానం ఎంతగానో దోహదపడుతుందంటున్నారు. ఇప్పటికే ఉన్న చిట్ గ్రూపుల వివరాలను కూడా త్వరలో ఈ ఆన్లైన్ అప్లికేషన్లో నమోదు చేయనున్నారు. చందాదారులు తమ అనుమానాలను దీనిద్వారానే నివృత్తి చేసుకోవచ్చు. ఏవైనా సమస్యలున్నా ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. -
చందాదారుల భద్రతే లక్ష్యంగా ‘ఈ–చిట్స్’
సాక్షి, అమరావతి: చందాదారుల భద్రతే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో ‘ఈ–చిట్స్’ సేవలను అమల్లోకి తీసుకొస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేస్టేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ అప్లికేషన్‌ను వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. చిట్‌ఫండ్ కంపెనీల మోసాలకు సంబంధించి ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ఇటువంటి మోసాలకు గురికాకుండా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ–చిట్స్ సేవలను అమల్లోకి తెచ్చిందన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేస్టేషన్ల శాఖ రూపొందించిన ఈ నూతన ఎల్రక్టానిక్ విధానాన్ని ఇకపై రాష్ట్రంలోని చిట్‌ఫండ్ కంపెనీలన్నీ తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుందన్నారు. చిట్‌ఫండ్ లావాదేవీలను ఆన్లైన్ ద్వారానే నిర్వహించాల్సి ఉందని, రిజిస్ట్రేస్టేషన్ శాఖ అధికారులు కూడా ఆన్లైన్ విధానంలోనే సంబంధిత లావాదేవీలను పరిశీలించి ఆమోదిస్తారని తెలిపారు. ‘ఈ–చిట్స్’ విధానంవల్ల చిట్‌ఫండ్ కంపెనీల మోసాలను అరికట్టడమే కాక చందాదారులు నష్టపోకుండా సహకరిస్తుందని మంత్రి చెప్పారు. చిట్‌ఫండ్ కంపెనీల విషయంలో చందాదారులు కూడా ఎంతో అప్రమత్తంగా ఉంటూ తమ ప్రాంతాల్లో నడుస్తున్న చిట్‌ఫండ్ సంస్థలు రిజిస్టర్ అయ్యాయా? లేదా? అనే విషయాన్ని ముందుగా ఈ విధానంలో తెలుసుకోవచ్చన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఉండే అసిస్టెంట్ రిజిస్ట్రేస్టార్ ఆఫ్ చిట్స్ని కూడా ఈ విషయంలో సంప్రదించవచ్చన్నారు. అదే విధంగా చిట్‌ఫండ్ కంపెనీల నుండి ఎదుర్కొనే ఎటువంటి సమస్యలలైనా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందని, ఆ సమస్యలను సత్వరమే అధికారులు పరిష్కరించే అవకాశం ఈ నూతన విధానం ద్వారా అమల్లోకి వచ్చిందన్నారు. ఇంకా అదనపు వివరాలను https:// echits.rs. ap.gov.in నుండి తెలుసుకోవచ్చని మంత్రి ధర్మాన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాంపులు, రిజిస్ట్రేస్టేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ, అడిషనల్ ఐజీ ఉదయభాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బయటపడిన మార్గదర్శి మోసాలు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీలో మోసాలు బట్టబయలయ్యాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) బృందాలు మూడు రోజులపాటు చేసిన తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణయ్యాయి. రాష్ట్రంలోని పలు చిట్‌ఫండ్ కంపెనీల్లో అధికారులు మూడు విడతలుగా తనిఖీలు చేశారు. మూడో విడతలో మార్గదర్శి సంస్థల్లో మూడురోజులు తనిఖీలు నిర్వహించారు. 1982 చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా ఉన్న రికార్డులు, మెటీరియల్‌ను అధికారులు సీజ్ చేశారు. చిట్ల రూపంలో కట్టిన నిధులను మళ్లించడం, జీఎస్టీ ఎగవేయడం, కంపెనీ పాడిన చిట్లకు గ్యారెంటీ చూపకపోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించారు. గురువారం నిర్వహించిన తనిఖీల్లో వాటిపై పూర్తి ఆధారాలను సేకరించారు. ఈ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల చిట్స్ డిప్యూటీ రిజిస్టార్లను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ అండ్ కమిషనర్ రామకృష్ణ ఆదేశించారు. కాగా తనిఖీల సందర్భంగా మార్గదర్శి అన్ని బ్రాంచీలలోనూ తమ గ్రూపు సంస్థలకు చెందిన మీడియా ప్రతినిధులను మోహరించారు. సాధారణంగా ఇలా దాడులు జరిగే సమయంలో అధికారులే వీడియో సాక్ష్యాలను చిత్రీకరిస్తుంటారు. కానీ మార్గదర్శి బ్రాంచీలలో ఈ మీడియా ప్రతినిధులు కూడా వీడియోలు తీస్తూ అధికారులను బెదిరించే ధోరణిలో హల్చల్ చేసినట్లు తెలిసింది. అంతేకాదు తనిఖీల సందర్భంగా జరిపే పంచనామా పత్రాలపై సంతకాలు చేయడానికి కూడా మార్గదర్శి సిబ్బంది నిరాకరించారని అధికారులు తెలిపారు. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే వారు అలా సంతకాలకు నిరాకరించి ఉంటారని, తమకు తెలియకుండానే పంచనామా తతంగాన్ని పూర్తి చేశారని ఆరోపించేందుకే అలా చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. -
చిట్‌ఫండ్ కంపెనీల్లో కొనసాగుతున్న తనిఖీలు
సాక్షి, అమరావతి/తణుకు/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలోని చిట్‌ఫండ్ సంస్థల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు మార్గదర్శి చిట్‌ఫండ్ కార్యాలయాల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. చిట్ల రిజిస్టర్లు, అకౌంట్ పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ పలు వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ కంపెనీల ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉండడంతో వెంటనే సమాచారం రావడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో అనుమానాల నివృత్తి, ఉల్లంఘనలు తెలుసుకునేందుకు తనిఖీ అధికారులకు ఎక్కువ సమయం పడుతోంది. చిట్స్ ద్వారా వసూలు చేసిన డబ్బును ఇతర కార్యకలాపాలకు మళ్లించిన తీరుపై లోతుగా వివరాలు సేకరిస్తున్నారు. చిట్లు పాడిన తర్వాత, గ్యారెంటీల ప్రక్రియ ముగిసేలోపు ఆ డబ్బును ప్రత్యేక బ్యాంకు ఖాతాలకు కాకుండా వేరే రకంగా వినియోగించుకున్నట్లు ఈ తనిఖీల్లో స్పష్టమైనట్లు తెలిసింది. గ్యారెంటీ చూపించలేని చందాదారులుఎ పాడుకున్న సొమ్మును ప్రత్యేక ఖాతాల్లో ఉంచి అదే రోజు వెనక్కి తీసుకున్న సందర్భాలు తనిఖీల్లో వెలుగులోకి వచ్చాయి. అలాగే తాము నిర్వహిస్తున్న చిట్లపై ప్రభుత్వానికి తప్పుడు ఓచర్లు సమర్పిస్తున్నట్టుగా తేలింది. ఈ కంపెనీల నగదు నిర్వహణలో తీవ్ర ఉల్లంఘనలు జరిగాయి. చిట్ల డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయకపోవడం, ఆ డబ్బుకు సంబంధించి నగదు రశీదులు, ఓచర్లు ఇవ్వకపోవడాన్ని తనిఖీ అధికారులు నిర్థారించుకున్నట్లు తెలిసింది. జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలడంతో జీఎస్టీ అధికారులు సైతం తనిఖీల్లో పాల్గొని వివరాలు సేకరిస్తున్నారు. ఎంత సొమ్ము దారి మళ్లింది, ప్రభుత్వ ఆదాయానికి ఎంత మేర నష్టం కలిగిందనే అంశాలను పూర్తిగా అంచనా వేస్తున్నారు. తనిఖీల్లో అధికారులకు అవసరమైన సమాచారం ఇంకా రావాల్సి ఉండడంతో గురువారం కూడా తనిఖీలు జరిగే అవకాశం ఉంది. చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని మార్గదర్శి చిట్‌ఫండ్ కార్యాలయంలో బుధవారం కూడా తనిఖీలు కొనసాగాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. రెండ్రోజులుగా కార్యాలయంలో జరుగుతున్న ఈ తనిఖీల్లో పలు అవకతవకలు గుర్తించినట్లు సమాచారం. చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా వేలానికి ముందే చందాదారుల నుంచి చిట్ సొమ్ములు కట్టించుకుంటూ దానికి 5 శాతం వడ్డీను చెల్లిస్తున్నట్లుగా గుర్తించారు. మరోవైపు డిపాజిట్‌దారుల నుంచి సేకరించిన మొత్తానికి జీఎస్టీ ఎగవేస్తున్నట్లుగా గుర్తించారు. పెనాల్టీల పేరుతో చందాదారుల నుంచి అధిక మొత్తంలో సొమ్ములు వసూలు చేస్తున్నట్టు తేలింది. అలాగే ఏలూరు నగరంలోని నరసింహరావుపేటలో ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో చిట్స్ సబ్ రిజిస్ట్రార్, ఇతర సిబ్బంది, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. ఉదయం నుంచి ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకూ కొనసాగాయి. -
వెలుగులోకి ‘చీట్’ ఫండ్స్
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/తిరుపతి: చిట్‌ఫండ్ కంపెనీల్లో పెద్దఎత్తున అక్రమాలు బయటపడుతున్నాయి. ప్రజల నుంచి వస్తున్న వరుస ఫిర్యాదుల నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కొద్దిరోజులుగా రాష్ట్రంలోని చిట్‌ఫండ్ కంపెనీల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. అక్టోబర్ 21, 31 తేదీల్లో డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులతో కలిసి రెండు విడతలుగా తనిఖీలు చేసి పలు అవకతవకలను గుర్తించింది. దానికి కొనసాగింపుగా మంగళవారం రాష్ట్రంలోని 18 సంస్థల్లో తనిఖీలు చేసింది. ప్రాథమిక పరిశీలనలో ఆయా కంపెనీల 2021–22 బ్యాలెన్స్ షీట్లను పరిశీలించినప్పుడు పెద్దఎత్తున నిధులు దారి మళ్లినట్టు గుర్తించారు. చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా వేలానికి ముందే చందాదారుల నుంచి చిట్ సొమ్మును కట్టించుకుంటూ దానికి 5 శాతం వడ్డీని చెల్లిస్తున్నట్టు తేలింది. చిట్ పాడుకున్న చందాదారుల నుంచి గ్యారంటీ తీసుకుంటున్న కంపెనీలు, తాము చిట్‌ను పాడినప్పుడు మాత్రం ప్రభుత్వానికి గ్యారంటీ చూపించడంలేదని స్పష్టమైంది. చందాదారులు ఆలస్యంగా చిట్ సొమ్ము కట్టారనే సాకు చూపించి పెనాల్టీలు వసూలు చేసి దానికి జీఎస్టీ చెల్లించకపోవడం, పెనాల్టీల పేరుతో చందాదారుల నుంచి ఎక్కువ సొమ్మును వసూలు చేయడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఉల్లంఘనలెన్నో! పలు చిట్ కంపెనీలు 1982 చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టు తనిఖీల్లో స్పష్టమైంది. చిట్ల సొమ్మును ఇతర కార్యకలాపాలకు మళ్లించినట్టు గుర్తించారు. చిట్ల సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం, రుణాలు ఇవ్వడం ద్వారా ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. ఈ సొమ్ముతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా చెందిన చిట్ల సొమ్మును అనుబంధంగా కంపెనీలకు మళ్లించి వాడుకుంటున్నాయి. అకౌంట్ల నిర్వహణ, వ్యాపార రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. మార్గదర్శిలోనూ సోదాలు విశాఖ జిల్లాలోని మార్గదర్శితో పాటు ఇతర చిట్‌ఫండ్ కంపెనీల్లో రికార్డులను అధికారులు పరిశీలించారు. నిధుల మళ్లింపుపై ఆరా తీశారు. తిరుపతిలోని మార్గదర్శి కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించి చిట్స్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించుకుంటున్నారని, ఆ సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేస్తున్నారని తేల్చారు. -
చిట్టీ డబ్బులు అడిగినందుకు .. ఒంటిపై పెట్రోల్ పోసి..
నయీంనగర్: ‘చిట్టీ డబ్బులు ఎందుకు ఇవ్వరు’.. అని నిలదీసినందుకు చిట్‌ఫండ్ యాజమాన్యం మనుషులు ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం గ్రేటర్ వరంగల్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. హనుమకొండకు చెందిన పిట్టల రాజు(30) అచల చిట్‌ఫండ్ కంపెనీలో రూ.5 లక్షల చీటీ వేసి ఇటీవల పాడుకున్నాడు. అయితే యాజమాన్యం డబ్బులు ఇవ్వకుండా రాజును తిప్పించుకుంటోంది. ఈ క్రమంలో అతను గురువారం చిట్‌ఫండ్ కార్యాలయానికి వెళ్లి తన డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో యాజమాన్యం.. రాజుపై దాడిచేసేందుకు తమ కంపెనీలోని ఏజెంట్ గణేశ్, అతని భార్య కావ్యలను పురమాయించింది. శుక్రవారం సాయంత్రం రాజు, అతని భార్య సిరి తమ సెల్‌ఫోన్ దుకాణంలో ఉండగా కావ్య, గణేశ్ బైక్‌పై వచ్చారు. బాటిల్లో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను రాజుపై కావ్య పోయగా గణేశ్ లైటర్‌తో నిప్పంటించాడు. మంటలు చుట్టుముట్టడంతో రాజు దుకాణంనుంచి బయటకు పరుగెత్తుకుని వచ్చాడు. మంటలను ఆర్పేందుకు సిరి ప్రయత్నిస్తుండగా గణేశ్, కావ్యలు మరోసారి రాజుపై పెట్రోల్ పోసి పరారయ్యారు. ఈ క్రమంలో సెల్‌షాపు ఎదురుగా ఉన్న పాన్‌షాప్ రంగయ్యకు కూడా మంటలు అంటుకుని గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రాజు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ దారుణానికి పాల్పడ్డ కావ్య, గణేశ్‌లపై రాజు భార్య సిరి హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
సికింద్రాబాద్‌లో బోర్డు తిప్పేసిన చిట్‌ఫండ్ కంపెనీ, కోట్లు హాంఫట్!
-
సికింద్రాబాద్‌లో బోర్డు తిప్పేసిన చిట్‌ఫండ్ కంపెనీ, కోట్లు హాంఫట్!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో ఓ చిట్‌ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. మారేడుపల్లిలో భవానీ ఎంటర్ప్రైజెస్ పేరుతో చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయలు చిట్టీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో ఎర వేసిన శ్రావణ్‌కుమార్ అనే వ్యక్తి రూ.30 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. బాధితుల్లో వైద్యులు, రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. వారం రోజులుగా నిర్వాహకుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బాధితులు మారేడుపల్లిలోని చిట్‌ఫండ్ కంపెనీ నిర్వాహకుడి ఇంటికి వచ్చారు. సీసీఎస్‌లో ఫిర్యాదు చేయాలని మారేడ్‌పల్లి పోలీసులు సూచించారు. ఇవీ చదవండి: సినిమా స్టైల్లో అదిరిపోయే ట్విస్ట్: నిన్న షాక్.. నేడు ప్రేమపెళ్లి పాలగుమ్మిలో అరుదైన నీటికుక్కల సందడి -
నగరంలో హడలెత్తించిన జీఎస్టీ దాడులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తోపాటు నగరంలోని 23 ప్రాంతాల్లో జీఎస్టీ అధికారులు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. రూ.కోట్లలో సర్వీస్ ట్యాక్స్, జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు జూబ్లీహిల్స్‌లోని ఓ వర్ధమాన సినీనటి నివాసంపై దాడులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న సదరు హీరోయిన్ షూటింగ్ రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్నారు. ఆ నటి రూ.20 లక్షల వరకు ట్యాక్స్ చెల్లించాల్సి ఉందని సమాచారం. చిట్‌ఫండ్, కోల్డ్ స్టోరేజీ యూనిట్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు, కన్స్ట్రక్షన్ కంపెనీలతోపాటు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు, తదితర ఆఫీసుల్లో ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. ఎంబీబీఎస్ సీట్ల కోసం విద్యార్థులను విదేశాలకు పంపే కన్సల్టెన్సీలు భారీగా జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించారు. బుధవారం నుంచి జీఎస్టీ అధికారులు జంటనగరాల్లో దాడులు జరుపుతున్నారు. వీటిలో ఓ సినీనటుడి వ్యాపార సంస్థలతోపాటుగా పలు మౌలిక సదుపాయాల కంపెనీలు, ఇంటర్నేషనల్ స్కూళ్లు, స్టీలు వ్యాపారాలపై బుధవారం చేసిన దాడుల్లో దాదాపు రూ.40 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్లుగా గుర్తించారు. -
చిట్‌ఫండ్ సంస్థలపై నిఘా పెట్టండి: ఎంపీ ప్రభాకర్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చిట్‌ఫండ్ సంస్థల మోసాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిందిగా టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో చిట్‌ఫండ్స్ చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం చిన్నచిన్న మొత్తాలు దాచుకున్న ప్రజలను పలు సంస్థలు సులువుగా మోసం చేస్తున్నాయని, డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్థలపై నిఘా ఉండేలా నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. మోసపూరిత సంస్థల నుంచి తిరిగి డబ్బు వసూలుకు ఇప్పటివరకు ప్రత్యేక చట్టమే లేకుండాపోయిందన్నారు. మోసాలు జరిగిన తరువాతే చట్టాలు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. చిట్‌ఫండ్ సంస్థల మోసాలు దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావాన్ని చూపే అవకాశం ఉండటంతో, ఇలాంటి మోసాలకు తావివ్వకుండా పటిష్ట వ్యవస్థ ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. -
చీట్స్‌కు చెక్
సాక్షి,సిటీబ్యూరో: సమాజంలో జరుగుతున్న చిట్ ఫండ్ కంపెనీల మోసాలను కళ్లెం వేసేందుకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ చర్యలు చేపట్టింది. చిట్çఫండ్ కంపెనీల వ్యవహారాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తెలుసుకునేందుకు దేశంలోనే మొదటిసారి బ్లాక్ చైన్ సిస్టంను అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం ప్రత్యేక ‘టీ–చిట్’ యాప్‌ను రూపొందించింది. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్–మేడ్చల్– రంగారెడ్డి జిల్లాలో అమలుకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లో నాలుగు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఆరు చిట్ సబ్ రిజిస్ట్రార్ అఫీసుల్లో కార్యకలాపాలను ప్రారంభించింది. వాస్తవానికి చిట్ఫండ్లపై నియంత్రణ చాలా అవసరం. అది లేకపోవంతో ఆయా సంస్థలు మోసాలకు పాల్పడటం, బోర్డు తీప్పేయడం పరిపాటిగా మారింది. కొన్ని చిట్‌ఫండ్స్ సంస్థలు రూ.వందల కోట్లకు ప్రజలను ముంచి బిచాణా ఎత్తేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరోవైపు ప్రైజ్ బిడ్డర్‌కు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం, ప్రజల సొమ్మును ఇతర అవసరాలకు వాడుకోవడం సర్వసాధారణమైంది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ చిట్‌ఫండ్స్‌పై దృష్టి సారించింది. చిట్‌ఫండ్ కంపెనీలన్నింటీని రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోకి తెచ్చి వాటి ఆటలను కట్టడి చేసేందుకు చర్యలు ప్రారంభించింది. 15 వేల కోట్లపైనే లావాదేవీలు హైదరాబాద్ మహానగర పరిధిలో సుమారు రూ.15 వేల కోట్ల వరకు చిట్ లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా. నగరం మొత్తం మీద 300 చిట్‌ఫండ్ కంపెనీలు ఉండగా, వాటికి మరో 845 శాఖలు ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు రెండువేలకు పైగా గ్రూపులను నిర్వహిస్తున్నారు. చిట్‌ఫండ్ వ్యవహారాలు ఎప్పటికప్పుడు ఖాతాదారులు తెలుసుకునేందుకు వీలుగా పారదర్శకంగా ఉండాలి. కానీ కంపెనీలు మాత్రం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా వ్యవహరిస్తూన్నాయనే ఆరోపణలుకు జరుగుతున్న సంఘటనలు బలం చేకూర్చుతున్నాయి. తాజగా రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోకి తెస్తున్నకారణంగా చిట్స్ కంపెనీ పూర్తి వివరాలు, డైరెకర్టర్లు, బ్యాంక్ ఖాతాలు, చిట్స్ గ్రూపులు, ఖాతాదారుల వివరాలు, ప్రతిని ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు రిజిస్ట్రేషన్ శాఖకు ఆన్లైన్లో పంపించి ఆమోదం పొందాలి. దీంతో చిట్స్‌ఫండ్ కంపెనీలు మోసాలకు పాల్పడేందుకు వీలుండదని సంబంధిత అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
‘చిట్‌ఫండ్’లో రూ.4.5 లక్షల నగదు చోరీ
కాజీపేట: వరంగల్ నగరంలోని దర్గాకాజీపేట చౌరస్తాకు కూతవేటు దూరంలో ఉన్న భద్రం చిట్‌ఫండ్ కంపెనీలో శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.4.5 లక్షల నగదు అపహరించారు. కంపెనీ ప్రతినిధుల ఫిర్యా దు మేరకు స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దర్గాకాజీపేకు చెందిన 8 మంది మిత్రులు కలిసి భద్రం చిట్‌ఫండ్‌తోపాటు ఎస్ఆర్ఆర్ ఎంటర్ ప్రైజేస్ ఏర్పాటు చేశారు. గురువారం వినాయక చవితికావడంతో కంపెనీలో పార్ట్నర్లు పూజలు చేసి ఎప్పటిలాగే తాళాలు వేసి ఇళ్లకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం కార్యాలయం శుభ్రం చేయడానికి వచ్చిన స్వీపర్ తాళాలు తీసి ఉండడం గమనించి యజమానులకు తెలియజేయగా దొంగతనం జరిగినట్లుగా నిర్థారించారు. కంపెనీ ఎండీ బండి సాంబయ్యతో కలిసి సభ్యులు రూ.4.5లక్షల నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ వెంకటరెడ్డి, సీఐ అజయ్ తోపాటు క్రైమ్ పోలీసుల బృందం, మడికొండ సీఐ సంతోష్ ఘటన స్థలాన్ని సందర్శించారు. క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించగా డాగ్‌స్క్వాడ్ సిబ్బంది చుట్టుపక్కల గాలించారు. కంపెనీలో చొరబడిన దొంగలు నగదుతోపాటు లోపల ఏర్పా టు చేసిన సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ను పట్టుకు వెళ్లారు. పోలీసు జాగాలాలు భవనం వెనుక నుంచి ఫాతిమానగర్ ప్రధాన రహదారి సమీపానికి వచ్చి ఆగిపోయాయి. విభిన్న కోణాల్లో విచారణ.. చిట్‌ఫండ్‌లో జరిగిన దొంగతనం కేసు విచారణలో భాగంగా పోలీసులు కార్యాలయంలో పనిచేసే సిబ్బందితోపాటు కంపెనీ డైరెక్టర్లు, నిత్యం వచ్చి పోయే వారిని వేర్వేరుగా పిలిపించి విచారణ జరుపుతున్నారు. కార్యాలయంలో ఇంత మొత్తం డబ్బు ఉన్నట్లుగా తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉండొచ్చని.. లేదా ప్రొఫెషనల్ దొంగలు ఎవరైనా ఈ పని చేశారా అనే కోణంలో డీసీపీ వెంకటరెడ్డి పర్యవేక్షణలో విచారణ జరుగుతోంది. -
‘ఉదయతార’ నిర్వాహకుల అరెస్ట్..
సాక్షి, విజయవాడ: ఉదయతార చిట్‌ఫండ్ నిర్వాహకులను శనివారం విజయవాడలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ చిట్‌ఫండ్ సంస్థ 2003లో బోర్డు తిప్పేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థ నిర్వహకులైన విష్ణుమోహన్, కనదుర్గను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో రూ. 3కోట్ల మేర మోసం జరిగినట్లు కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలను రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రూ.70కోట్లతో ఉడాయించిన చిట్‌ఫండ్ వ్యాపారి
-
డీఎస్పీ హుకుం!
అన్నదమ్ముల మధ్య అప్పు చిచ్చు - చిట్‌ఫండ్ కంపెనీలో తమ్ముడి అప్పు తీర్చిన అన్న - తిరిగి డబ్బులు ఇవ్వని తమ్ముడు.. కోర్టును ఆశ్రయించిన అన్న - తమ్ముడి తరఫున అన్నను పిలిచి మందలించిన డీఎస్పీ - పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న అన్న సాక్షి, మహబూబాబాద్: అన్నదమ్ముల మధ్య అప్పు చిచ్చు పెట్టింది. అప్పు కట్టలేనంటూ తమ్ముడు డీఎస్పీని ఆశ్రయించడంతో పెద్ద మనుషులతో కూర్చొని మాట్లాడుకొమ్మని చెప్పారు. లేదంటే, అనేక ఇబ్బందులు పడతావంటూ డీఎస్పీ దూషించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పెద్దమనుషుల్లో పంచాయితీ ఉండగా, చేతి నుంచి డబ్బులు పోయే.. పోలీసులతో వేధింపులాయే.. అని మనస్తాపం చెందిన అన్న పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలకేంద్రానికి చెందిన బొల్లం సాంబశివయ్య(52), విశ్వేశ్వరయ్య అన్నదమ్ములు. సాంబశివయ్య ఎరువులు, పురుగు మందుల దుకాణం, మెడికల్ షాపు, విశ్వేశ్వరయ్య కిరాణ దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విశ్వేశ్వరయ్య ఓ చిట్‌ఫండ్ కంపెనీలో అప్పు తీసు కోగా సాంబశివయ్య జమానతుగా సంతకం పెట్టాడు. విశ్వేశ్వరయ్య చిట్ ఫండ్ కంపెనీలో అప్పుకట్టకపోవడంతో, జమానతుగా ఉన్న సాంబశివయ్య రూ.4.50 లక్షలు చెల్లించాడు. విశ్వేశ్వరయ్య ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆ అప్పు మొత్తా న్ని విశ్వేశ్వరయ్య చెల్లించాల్సిందేనని సాంబశివయ్యకు అనుకూలంగా డిక్రీ ఇచ్చింది. విశ్వేశ్వరయ్య తనకున్న ‘పరిచయం’తో.. విశ్వేశ్వరయ్య గుట్టుగా గుట్కాల దందా కూడా నడిపిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నెల్లికుదురు పోలీసు అధికారులతో ఎంతోకాలంగా సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్టు స్థానికంగా చెబుతున్నారు. గతంలో తొర్రూరులో సీఐగా పనిచేసిన ప్రస్తుత డీఎస్పీతోనూ మంచి పరిచయమే ఉన్నట్టు భోగట్టా. దీంతో విశ్వేశ్వరయ్య తనకున్న చనువుమేరకు అప్పు చెల్లించలేనంటూ 15రోజుల క్రితం తొర్రూరు డీఎస్పీ రాజారత్నంను ఆశ్రయించాడు. సదరు డీఎస్పీ అన్న సాంబశివయ్యను పిలిపించి, అంత డబ్బు ఇవ్వలేడని పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొమ్మని గట్టిగానే చెప్పి, అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరగాల్సి ఉంది. తెల్లవారుజామున సాంబశివయ్య ఇంట్లోనే క్రిమిసంహారక మందుతాగాడు. కుటుంబ సభ్యులు గమనించి, మహబూబాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఆసుపత్రి వద్ద హైడ్రామా మహబూబాబాద్ ప్రభుత్వాసుప్రతిలో శుక్రవారం రోజంతా హైడ్రామా నడిచింది. డీఎస్పీ వేధింపుల వల్లే విశ్వేశ్వరయ్య ఆత్మహత్య చేసుకున్నాడంటూ దావానలంలా వ్యాపించి, జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డీఎస్పీ వేధింపులవల్లే అంటూ మీడియాలోనూ వార్తలొచ్చాయి. అంతసేపూ డీఎస్పీ వేధింపుల వల్లే విశ్వేశ్వరయ్య ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పిన కుటుంబసభ్యులు, ఆ తర్వాత మాటమార్చారు. డీఎస్పీ తరఫున కొంతమంది పెద్ద మనుషులు వచ్చి అక్కడున్నవారితో, కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆ డబ్బులు ఇప్పిస్తామని, డీఎస్పీతో ఎలాంటి ఇబ్బంది ఉండవని నమ్మబలికారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ కోటిరెడ్డిని వివరణ కోరగా విచారణ జరిపిస్తున్నామన్నారు. డీఎస్పీ వేధింపుల వల్లే... మాకు, మా బాబాయికి డబ్బుల విషయమై గొడవ నడుస్తోంది. మా బాబాయి రూ.4.5 లక్షలు ఇవ్వాలె. ఇవ్వకుండా తొర్రూరు డీఎస్పీని ఆశ్రయించగా 15 రోజుల క్రితం డీఎస్పీ మా నాన్నను రెండుసార్లు పిలిపించిండు. నేను కూడా వెంట వెళ్లా. ఒక్క తల్లికి పుట్టలేదా?’అంటూ పరుష పదజాలం తో మాట్లాడిండు. అంత డబ్బు కట్టలేడు. లేకుంటే దుకాణాలపై నిఘా పెడితే ఇబ్బందులు పడతామంటూ భయభ్రాంతులకు గురిచేసిండు. అప్పటి నుంచే ముభావంగా ఉండు. –బొల్లం ప్రవీణ్, మృతుడి కొడుకు నెల రోజుల క్రితం వచ్చారు ఈ విషయమై తొర్రూరు డీఎస్పీ కె. రాజారత్నంని వివరణ కోరగా, నెల క్రితం అన్నదమ్ములిద్దరూ పెద్ద మనుషులతో కలిసి తన వద్దకు వచ్చారని తెలిపారు. పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకొమ్మని చెప్పానే తప్పా తానేమీ అనలేదన్నారు. ‘నేను చెప్పిన రెండు రోజులకో, మూడు రోజులకో ఆత్మహత్య చేసుకుంటే నన్ను అనాలి. నెల తర్వాత ఆత్మహత్య చేసుకుంటే నాకేం సంబంధం. అతడి కొడుకు నాపై ఆరోపణలు ఎందుకు చేస్తుండో అర్థం కావడం లేదు’ అని చెప్పారు. -
చిట్ కంపెనీపై సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: ఇన్ ఫినిటి రియల్ కాన్ అనే చిట్ కంపెనీకి సంబంధించిన పలు ప్రాంగణాల్లో సీబీఐ బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఆ సంస్థకు ఉన్న 19 ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది. చిట్ కంపెనీల డైరెక్టర్లు ప్రణబ్ ముఖర్జీ, సర్బారి ముఖర్జీ, ప్రబీర్ ముఖర్జీ, సుమేన్ మెల్లిక్ పార్థా ప్రతిమ్ ముఖర్జీ నివాస ప్రాంగణాల్లో కూడా సీబీఐ గాలింపులు చేపట్టింది. ఒడిశాలో రెండు ప్రాంతాల్లో పశ్చిమ బెంగాల్‌లోని 17 ప్రాంతాల్లో సీబీఐ ఈ దాడులు నిర్వహించింది. -
స్క్రూటినీ అసెస్మెంట్లో బ్యాంక్ వ్యవహారాలూ కీలకమే..
స్క్రూటినీ అసెస్మెంట్ సమయంలో అధికారులకు ఎన్నో వివరాలు అందించాల్సి ఉంటుంది. అధికారులు ముఖ్యంగా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు వివరాలను అడుగుతారు. అందులో ముఖ్యంగా జీతం ద్వారా వచ్చే ఆదాయం, ఇంటి మీద వచ్చే అద్దె, వ్యాపారం/ వృత్తి మీద వచ్చే లాభనష్టాలు, మూలధన లాభాలు, ఇతర ఆదాయాలు అనే ఐదు అంశాలు ఉంటాయి. ఇవి కాకుండా పన్నుకి సంబంధం లేని అంశాల వివరాలను కూడా అడగొచ్చు. వీటిల్లో వ్యవసాయం మీద వచ్చే ఆదాయం, డివిడెండ్లు, భవిష్య నిధి వసూళ్లు, ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ సందర్భంలో వచ్చే ప్రయోజనాలు, జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ, బహుమతులు వంటి అంశాలు ఉంటాయి. ఆదాయానికి సంబంధించని వివరాలను కూడా అడగొచ్చు. ఇందులో రుణాల వసూళ్లు, విదేశాల నుంచి మీ కుటుంబ సభ్యులు పంపిన మొత్తం, అప్పులు, రుణాలు, చిట్‌ఫండ్ కంపెనీల్లో పాడగా వచ్చిన మొత్తం ఇలా ఎన్నో ఉంటాయి. అందుకనే అధికారులు మీ బ్యాంకు అకౌంట్ వివరాలను అడుగుతారు. ఆర్థిక సంవత్సరం మొదలు చివరి వరకు అన్ని రోజుల్లో జరిగిన వ్యవహారాలకు మీరు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అధికారుల దగ్గరకు వెళ్లేసరికి మీరు ఏ ఏ బ్యాంకుల్లో మీకు అకౌంట్లు ఉన్నాయి, వాటి నంబర్లు, బ్యాంక్ పేరు, బ్రాంచ్ పేరు, జరిగిన ట్రాన్సాక్షన్లు వంటి అంశాలపై కసరత్తు చేయాలి. ఒక్కో బ్యాంక్ అకౌంట్లోని ట్రాన్సాక్షన్లను విశ్లేషించండి. ప్రతి దానికి వివరణ తయారు చేసుకోండి. అది ఆదాయం అయితే ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో చెప్పండి. ఇది వరకే ఆదాయాన్ని డిక్లేర్ చేసి ఉంటే పర్లేదు. లేకపోతే ఇప్పుడు వివరణ ఇవ్వండి. ఆదాయంలో కలపండి. పన్ను భారం చెల్లించండి. వడ్డీ పడొచ్చు. సాధారణంగా చాలా మంది వారి బ్యాంక్ అకౌంట్లలో వడ్డీని పరిగణనలోకి తీసుకోరు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న వడ్డీకి రూ.10,000 వరకు పన్ను మినహాయింపు ఉంది. అన్ని బ్యాంక్ అకౌంట్లలో వచ్చిన వడ్డీని కూడా ఆదాయం కింద ప్రకటించండి. ప్రతి ట్రాన్సాక్షన్‌కి వివరణ ఇవ్వాలి. అది జమ అయినా.. చెల్లింపు అయినా. సరైన వివరణ ఇవ్వకపోతే ఆ మొత్తాన్ని ఆదాయంగా పరిగణించే ప్రమాదం ఉంది. జమ విషయంలో వ్యవహారం జరిగి ఉండాలి. అలాగే ఇచ్చిన వ్యక్తి నిజమైన వ్యక్తి అయి ఉండాలి. ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చే సామర్థ్యం ఉండాలి. ఇక చెల్లింపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అబద్దపు చెల్లింపులను ఖర్చులుగా పరిగణించరు. ఈ మేరకు ఆదాయం పెరిగినట్లే. లాభం తగ్గించుకోవడానికి లేనిపోని ఖర్చులను రాసుకోవద్దు. వాటిని అధికారులు ఒప్పుకోరు. జమల విషయంలో పన్ను చెల్లిస్తాం కదా అని సరిపెట్టుకుంటే సరిపోదు. డెబిట్ల విషయంలో ఆదాయం ఏర్పడవచ్చు. ఉదాహరణకు లక్ష రూపాయల జమకి సరైన వివరణ ఇచ్చారనుకోండి. సరిపోతుంది. అలా కాకుండా ఆ లక్ష రూపాయలు డెబిట్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్లకు వెళ్లిందనుకోండి. దీని మీద ఆదాయం పన్నుకి గురి అవుతుంది. మీరు ఉదాహరణకు మీ అబ్బాయి అమెరికా నుంచి పంపిన కోటి రూపాయలతో ఇల్లు కొన్నారనుకోండి. ఆ ఇళ్లు అద్దెకిస్తే ఆదాయం వస్తుంది కదా... ఇలా బ్యాంక్ ఖాతాలోని ప్రతి ట్రాన్సాక్షన్‌కి ఆలోచించి వివరణ ఇవ్వండి. స్క్రూటినీ వ్యవహారాల్లో బ్యాంక్ వ్యవహారాలు ముఖ్యమైనవి. -
కదిరిలో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ!
-
చిట్టీల పేరుతో కానిస్టేబుల్ దందా
హైదరాబాద్: బాధ్యతగా విధులు నిర్వహించాల్సిన కానిస్టేబుల్ చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసి వారిని భయాంధోళనలకు గురిచేస్తున్నాడు. ఈ సంఘటన సరూర్‌నగర్‌లో సోమవారం వెలుగుచూసింది. వివరాలు.. ఆబిడ్స్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ హెడ్‌కానిస్టేబుల్ చిట్టీలు నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే సరూర్‌నగర్‌లోని గ్రీన్‌పార్క్ కాలనీలో చిట్‌ఫండ్స్ సంస్థను ఏర్పాటుచేసి నిర్వహిస్తున్నాడు. ప్రజల దగ్గర నుంచి కోట్ల రూపాయలను చిట్టీల పేరుతో వసూల్ చేశాడు. తీరా ప్రజలకు డబ్బు తిరిగివ్వాల్సిన సమయం రావడంతో వారిని బెదిరిస్తున్నాడు. దీంతో మోసపోయిన ప్రజలు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లోని ఒక ఎస్సై ఈ విషయంపై సరిగా స్పందించకపోగా, తన సర్వీస్ రివాల్వర్‌తో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిని బెదిరించాడు. దీంతో బాధితులు న్యాయం కోసం ముందుకు వచ్చి ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నట్లు సమాచారం.