హైదరాబాద్: బాధ్యతగా విధులు నిర్వహించాల్సిన కానిస్టేబుల్ చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసి వారిని భయాంధోళనలకు గురిచేస్తున్నాడు. ఈ సంఘటన సరూర్‌నగర్‌లో సోమవారం వెలుగుచూసింది. వివరాలు.. ఆబిడ్స్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ హెడ్‌కానిస్టేబుల్ చిట్టీలు నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే సరూర్‌నగర్‌లోని గ్రీన్‌పార్క్ కాలనీలో చిట్‌ఫండ్స్ సంస్థను ఏర్పాటుచేసి నిర్వహిస్తున్నాడు. ప్రజల దగ్గర నుంచి కోట్ల రూపాయలను చిట్టీల పేరుతో వసూల్ చేశాడు. తీరా ప్రజలకు డబ్బు తిరిగివ్వాల్సిన సమయం రావడంతో వారిని బెదిరిస్తున్నాడు. దీంతో మోసపోయిన ప్రజలు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.
సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లోని ఒక ఎస్సై ఈ విషయంపై సరిగా స్పందించకపోగా, తన సర్వీస్ రివాల్వర్‌తో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిని బెదిరించాడు. దీంతో బాధితులు న్యాయం కోసం ముందుకు వచ్చి ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నట్లు సమాచారం.