chita
-
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ చితా...
-
చిత్తూరు జిల్లాలో చిరుత కలకలం
-
చిరుత కాదు.. అడవి పిల్లులే
సాక్షి,/హైదరాబాద్/శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో చిరుతపులి సంచరించిన ఆనవాళ్లు లేవని, చుట్టుపక్కల ప్రజలు, విమానాశ్రయ సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని అటవీ శాఖ స్పష్టం చేసింది. కెమెరాల్లో కేవలం ఊర కుక్కలు, అడవి పిల్లులు, పందులు మాత్రమే కనిపించాయన్నారు. చిరుతపులి కదలికలున్నాయని, అడవి పందులను చంపుతోందని విమానాశ్రయం అధికారుల ఫిర్యాదుతో వాటిని పరిశీలించగా వాటిని కుక్కలు చంపినట్లుగా ఆధారాలు లభించినట్టు పేర్కొంది. అధికారులు విజ్ఞప్తితో ముందు జాగ్రత్తగా 10 ట్రాప్ కెమెరాలు కూడా పెట్టగా, వాటిలో చిరుతపులి కదలికలేవీ కనిపించలేదని తెలిపింది. విమానాశ్రయం ప్రహరీ దూకినట్లుగా గతంలో సీసీ కెమెరాలకు లభించిన ఆధారాలు సివిట్ క్యాట్ వి (మానుపిల్లి) అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎయిర్‌పోర్టు అధికారుల విజ్ఞప్తి మేరకు మరొక 10 ట్రాప్ కెమెరాలు, (మొత్తం 20), రెండు బోనులు (ట్రాప్ కేజెస్) కూడా పెట్టినట్టు తెలియజేశారు. (చదవండి: అది చిరుతేనా?) -
శంషాబాద్‌లో తిష్టవేసిన చిరుత
శంషాబాద్, పహాడీషరీఫ్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాల్లో చిరుత సంచరిస్తోందనే ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది. సోమవారం అర్ధరాత్రి ఎయిరో డ్రమ్స్ టవర్ సమీపంలో చిరుత కనిపించిందని విమానాశ్రయ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాశ్రయ రక్షణ సిబ్బంది పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. విమానాశ్రయంలోని అమెజాన్ గోదాం, మామిడిపల్లి రహదారి వైపు వెళ్లే ఎయిరో డ్రమ్ టవర్ ప్రాంతాలను సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు అటవీశాఖ అధికారు లు, పోలీసులు గాలించారు. ఎయిరో డ్రమ్ టవర్ ప్రాంతంలో చిరుత సంచరించిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. అందులో కనిపిస్తున్న జంతువును చిరు తగా నిర్ధారించలేమని శంషాబాద్ ఎఫ్ఆర్వో శ్యామ్‌కుమార్ స్పష్టం చేశారు. అది అడవి పిల్లిలా కనిపిస్తోందన్నారు. చిరుత పాదముద్రలు కూడా ఎక్కడా లభించలేదని తెలిపారు. చిరుత ఎటువైపు నుంచి వచ్చిందనే విషయంలోనూ సందేహాలు వ్యక్తమవుతుండగా.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జల్పల్లిలో కనిపించిన చిరుత రెండ్రోజుల కిందట శంషాబాద్ విమానాశ్రయ పరిసరాల్లో కనిపించిన చిరుతపులి తాజాగా జల్పల్లి పరిసరాల్లో కనిపించింది. సోమవారం అర్ధరాత్రి జల్పల్లి కార్గో రోడ్డుతో పాటు మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల వెనుక భాగంలో చిరుత సంచరిస్తుండగా పోలీసులతో పాటు స్థానికులు గమనించారు. శంషాబాద్ నుంచి జల్పల్లి గరిగుట్ట అడవి ద్వారా చిరుత రోడ్డుపైకి వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రాత్రిపూట ప్రజలు బయటికి రాకుండా జాగ్రత్త పడాలని ఈ సందర్భంగా పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి సూచించారు. -
చిరుత సంచారం.. ఎయిర్‌పోర్ట్‌లో కలకలం
సాక్షి, రంగారెడ్డి: తెలంగాణలో పులి సంచారం వార్తలు కలకలం రేపుతున్నాయి. పులుల సంఖ్య పెరగడంతో ఆ వన్యమృగాలు జనసంద్రంలోకి వస్తున్నాయి. గతంలో రాజేంద్రనగర్, శంషాబాద్ పరిసరాల్లో అలజడి రేపిన చిరుత మళ్లీ ఆదివారం రాత్రి సంచరించిందనే వార్త ఉలిక్కిపడేలా చేసింది. శంషాబాద్ బహదూర్‌గూడలో చిరుత సంచరించినట్లు స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో అర్ధరాత్రి పులి పది నిమిషాల పాటు సంచరించిందని గుర్తించారు. అనంతరం అక్కడి నుంచి గొల్లపల్లి రోడ్డులో ఎయిర్పోర్ట్ గోడ దూకి చిరుత వెళ్లింది. పులి సంచరించిందనే వార్తతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఈ మేరకు చిరుత కోసం అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. గతంలో శంషాబాద్, రాజేంద్రనగర్ పరిసరాల్లో పులి కలకలం రేపిన విషయం తెలిసిందే. రహదారిపై దర్జాగా కూర్చుని అనంతరం జనాల రద్దీతో భయాందోళన చెంది వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిసరాల్లోని అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. అప్పుడప్పుడు కనిపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఎయిర్ పోర్ట్ సమీపంలో కనిపించడం అధికారులు సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. -
’గోళ్లు’మాల్
వివాదాస్పదంగా చిరుతపులి చర్మం కేసు పులిగోళ్లను కొన్న టీడీపీ నేతలు కేసు మాఫీకి యత్నాలు రంగంలోకి జిల్లా ఎంపీ నోరుమెదపని అటవీ అధికారులు జంగారెడ్డిగూడెం : ఇటీవల జంగారెడ్డిగూడెంలో అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న చిరుతపులి చర్మం కేసు వివాదాస్పదమైంది. ఈ కేసులో టీడీపీ నాయకుల హస్తం ఉందన్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ కేసులో చిరుత పులి గోళ్లు ఏమయ్యాయో అటవీశాఖాధికారులు వెల్లడించలేదు. దీనికి కారణం ఆ గోళ్లను స్థానిక టీడీపీ నాయకులు కొనుగోలు చేయడమే. దీనిని అటవీ అధికారులు గోప్యంగా ఉంచారు. విషయం బయటకు పొక్కకుండా జిల్లాకు చెందిన ఓ ఎంపీ రంగప్రవేశం చేశారు. అటవీశాఖాధికారులపై ఒత్తిడి తెచ్చి విషయం బయటకు రాకుండా చేశారు. స్థానిక టీడీపీ నాయకులు చిరుతపులి గోళ్లను కొని పైస్థాయి నాయకులకు బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాక చిరుతపులి గోళ్లను ఎవరి నుంచి కొన్నారో ఆ వ్యక్తిని బయటకు రాకుండా ఏలూరు ఆసుపత్రిలో చేర్చి వైద్యం నెపంతో దాచారు. అసలు జరిగిందేమిటంటే..! దొరమామిడికి చెందిన బవిరిశెట్టి పవన్‌కుమార్ తన వద్ద చిరుత చర్మం ఉందని, అమ్మతానని ఫేస్బుక్లో పెట్టడంతో అటవీశాఖాధికారులు వలపన్ని చర్మం కొనుగోలుదారులుగా మారి ఈనెల 1న స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో పట్టుకున్నారు. అతని వద్ద చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతనిని విచారించగా బుట్టాయగూడెం మండలం మోతుగూడెం అటవీ ప్రాంతంలో గిరిజనుల నుంచి రూ. 50వేలకు కొన్నట్టు చెప్పాడు. దీంతో అధికారులు మోతుగూడెంకు చెందిన కెచ్చెల రాంబాబు, గోగుల సోమిరెడ్డి, కెచ్చెల సోమిరెడ్డి, గూగుంట్ల పండయ్య, గూగుండ్ల చిన్నారెడ్డి, గోగుల శ్రీను, కోర్సావారిగూడెంకు చెందిన పూనెం నాగేశ్వరరావులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన గిరిజనులు గత ఏడాది ఆగస్టులో పాతమోతుగూడెం అడవిలో పశువుల పాక వద్ద ఆవుపై చిరుతపులి దాడి చేయడంతో బాణాలతో చిరుతను కొట్టి చంపి చర్మాన్ని , గోళ్లను వేరుచేసి మృతదేహాన్ని మరికొయ్యబాట వద్ద ఖననం చేసినట్లు వెల్లడించారు. చిరుతపులి చర్మం బవిరిశెట్టి పవన్‌కుమార్ కొనగా, గోళ్లను మరొక వ్యక్తి కొన్నారని వివరించారు. గోళ్లను కొన్న వ్యక్తి మధ్యవర్తుల ద్వారా జంగారెడ్డిగూడెంలో టీడీపీ నాయకులకు 18 గోళ్లను రూ.2లక్షలకు అమ్మినట్టు సమాచారం. స్థానిక నాయకులు ఆ గోళ్లను పైస్థాయి టీడీపీ నాయకులకు బహుమతిగా పంపారని తెలిసింది. వాస్తవానికి పులిగోళ్లను మాత్రమే బంగారు గొలుసుల్లో వేసి ధరిస్తారు. చిరుతపులి గోళ్లను వాడరు. స్థానిక నాయకులు పులిగోళ్లు అని పైస్థాయి నాయకులకు బహుమతి ఇచ్చి బురిడీ కొట్టించారని సమాచారం. అధికారుల మౌనం ఇదిలా ఉంటే అటవీశాఖాధికారులు మాత్రం చిరుతపులి గోళ్లు వివరాలపై నోరు మెదపడం లేదు. చిరుతపులి గోళ్లను అమ్మిన వ్యక్తిని ఏలూరు ఆసుపత్రిలో చికిత్స నెపంతో చేర్చి రహస్యంగా దాచారు. గోళ్లు కొన్న విషయం బయటకు పొక్కకుండా జిల్లా ఎంపీ రంగప్రవేశం చేసి అటవీశాఖాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. 1972 వన్య ప్రాణి సంరక్షణ చట్ట ప్రకారం ఘటనలో కారకులైన అందరిపైనా చర్యలు తీసుకోవాలి. అయితే ఆవుపై దాడిచేసిన చిరుతను చంపిన ఏడుగురు గిరిజనులు, చర్మం అమ్మేందుకు యత్నించిన వ్యక్తిని మాత్రమే అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు. గోళ్లు ఏమయ్యాయి. ఎవరు కొని ఎవరికి అమ్మారు అనేది అధికారులు చెప్పడం లేదు. అయితే గిరిజనులు మాత్రం గోళ్లను ఎవరికి అమ్మింది అధికారులకు చెప్పినా ఆ వ్యక్తి వివరాలు వెల్లడించడం లేదు. ఆ వ్యక్తినే టీడీపీ నాయకులు దాచిపెట్టి కేసు మాఫీకి పెద్ద ఎత్తున యత్నిస్తున్నారని తెలుస్తోంది. విచారిస్తున్నాం: చిరుతపులి గోళ్లు ఏమయ్యాయనేది విచారిస్తున్నాం. గోళ్లను గిరిజనులు ఏం చేశారనేది తేలాల్సి ఉంది. వాస్తవానికి పులి గోళ్లను మాత్రమే బంగారు గొలుసుల్లో పెట్టి ధరిస్తారు. చిరుతపులి గోళ్లను ధరించరు. ఒకవేళ ఆ గోళ్లను ఎవరైనా కొంటే వాళ్లు పిచ్చివాళ్లే. రవికుమార్, కన్జర్వేటర్, అటవీశాఖ