chitram cheppina katha
-
ఉదయ్‌కిరణ్ సినిమా విడుదలపై కోర్టు స్టే
దివంగత టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ నటించిన చిట్టచివరి సినిమా 'చిత్రం చెప్పిన కథ'కు కోర్టు చిక్కులు ఎదురయ్యాయి. సినిమా విడుదలను ఆపాలంటూ సిటీ సివిల్ కోర్టు స్టే ఇచ్చింది. 'నువ్వునేను' సినిమా హీరోయిన్ అనిత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. మోహన్ ఎల్లార్కే దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మున్నా నిర్మాత. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. ఈ సినిమాను పెద్ద హిట్ చేసి ఉదయ్ కిరణ్‌కి నివాళి ఇవ్వాలనుకుంటున్నట్లు ఆ టీజర్ విడుదల సందర్భంగా దర్శకుడు అన్నారు. వాస్తవానికి ఏప్రిల్ నెలలోనే ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర నిర్మాత, దర్శకుడు భావించారు. కానీ అనుకోని పరిస్థితుల్లో దీనికి కోర్టు చిక్కులు ఎదురయ్యాయి. ఇప్పుడు చిత్ర విడుదల అనుమానంలో పడింది. -
ఉదయ్‌కిరణ్ ఆఖరి కథ!
‘చిత్రం’ సినిమాతో కథానాయకునిగా రంగప్రవేశం చేసిన ఉదయ్‌కిరణ్ నటించిన చివరి చిత్రం ‘చిత్రం చెప్పిన ప్రేమకథ’. ఉదయ్ నటించిన తొలి చిత్రం జూన్‌లోనే విడుదల కాగా, ఈ చివరి చిత్రం కూడా ఇదే నెలలోనే విడుదల కానుంది. ఈ నెల 26న ఉదయ్‌కిరణ్ జయంతి. ఆ సందర్భంగా ఉదయ్ అభిమానుల కోసం ‘చిత్రం చెప్పిన కథ’ను విడుదల చేయాలని ఆ చిత్రనిర్మాత మున్నా చాంద్‌గారి అనుకుంటున్నారు. ఉదయ్ కిరణ్ హీరోగా డింపుల్, మదాలసా శర్మ, గరిమ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి మోహన్ ఎ.యల్.ఆర్.కె. దర్శకుడు. మున్నా కాశీ పాటలు స్వరపరిచారు. నిర్మాతగా తన మొదటి సినిమా ఉదయ్ కిరణ్‌కి చివరి సినిమా అవుతుందనుకోలేదని మున్నా అన్నారు. ఆయన గతంలో ఉదయ్‌కి మేనేజర్‌గా వ్యవహరించేవారు. ఉదయ్ కిరణ్‌తో సినిమా చేసిన అనుభవాన్ని మర్చిపోలేనని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: అమరనేని నరేశ్. -
‘చిత్రం చెప్పిన కథ’ స్టిల్స్
-
ఉదయ్‌కిరణ్ ఆఖరి చిత్రం ఇదే అంటే బాధగా ఉంది : విషిత
‘‘ఉదయ్‌కిరణ్ హీరోగా 14 చిత్రాల్లో నటిస్తే, నేను 9 సినిమాలకు పాటలు స్వరపరిచాను. ‘చిత్రం’ సినిమాతో మొదలైన తన సినీ ప్రస్థానం ‘చిత్రం చెప్పిన ప్రేమకథ’తో ముగియడం బాధాకరం. ఈ చిత్రానికి మున్నా కాశీ మంచి పాటలు ఇచ్చి ఉంటారని ఊహిస్తున్నా’’ అని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చెప్పారు. ఉదయ్‌కిరణ్ హీరోగా ఆయన మేనేజర్ మున్నా నిర్మించిన సినిమా ‘చిత్రం చెప్పిన ప్రేమకథ’. డింపుల్, మదాలసా శర్మ, గరిమ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి మోహన్ ఎ.యల్.ఆర్.కె. దర్శకుడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న మల్టీ డైమన్షన్ వాసు సీడీని ఆవిష్కరించి ఉదయ్‌కిరణ్ భార్య విషితకు అందజేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు విజయం చేకూర్చి, ఉదయ్‌కి ఘన నివాళి ఇవ్వాలని కోరుకుంటున్నానని వాసు అన్నారు. ఉదయ్ ఆఖరి చిత్రం ఇదేనంటే చాలా బాధగా ఉందని, నిజజీవితంలోనూ తను హీరో అని విషిత చెప్పారు. ఉదయ్ నటించిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్‌గా నిలిచాయని, ఈ చిత్రం కూడా ఆ కోవలోకి చేరాలనే తపనతో మంచి పాటలు ఇవ్వడానికి ప్రయత్నం చేశానని మున్నా కాశీ అన్నారు. నిర్మాతగా తన మొదటి సినిమా ఉదయ్‌కి చివరి సినిమా అవుతుందనుకోలేదని మున్నా అన్నారు. ఉదయ్‌తో సినిమా చేసిన అనుభవాన్ని మర్చిపోలేనని దర్శకుడు తెలిపారు. ఈ ఆడియో వేడుకలో ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి, బావ ప్రసన్న కుమార్, వారి కుమారుడు తేజ, కుమార్తె మంజు కూడా పాల్గొన్నారు. -
'ఉదయ్ కిరణ్' చిత్రం చెప్పిన కథ ఆడియో ఆవిష్కరణ
-
చిత్రం చెప్పిన కథ ఆడియో విడుదల
-
ఉదయ్‌కిరణ్ చివరి సినిమా చిత్రం చెప్పిన కథ
చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని, నీ స్నేహం... ఉదయ్‌కిరణ్‌ని నటునిగా ప్రేక్షకులకు చేరువ చేసిన సినిమాలివి. సముద్రపు అలలా ఉవ్వెత్తున పైకిలేచాడు. తోకచుక్క మాదిరి ఒక్కసారిగా నేల రాలాడు. నిజంగా ఉదయ్ జీవితమే ఒక చిత్రం. తను నటించిన చివరి సినిమా ‘చిత్రం చెప్పిన కథ’. మోహన్ ఏఎల్ఆర్కే దర్శకుడు. సీహెచ్ మున్నా నిర్మాత. ‘నువ్వు-నేను’ ఫేం అనిత ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గరిమ, డింపుల్, మదాలస శర్మ కథానాయికలు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ ఉదయ్ మనకు దూరమయ్యారు. తనకు కావల్సినట్టుగా అహర్నిశలూ కష్టపడి ఈ కథను మలుచుకున్నాడు ఉదయ్. ఆయనలోని కొత్తకోణం ఇందులో చూస్తారు. ఒక ప్రత్యేకగీతం, చిన్నప్పటి సన్నివేశాల చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే వాటిని పూర్తి చేస్తాం. ఈ నెలాఖరున పాటల్ని, ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఉదయ్‌కిరణ్‌లో ఇప్పటివరకూ చూడని కొత్తకోణం ఇందులో కనిపిస్తుందని, ఆయన అభిమానులకు ఇది గొప్ప కానుకని దర్శకుడు చెప్పారు. ఇది థ్రిల్లర్ చిత్రం కాబట్టి నేపథ్య సంగీతం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోమని ఉదయ్ సూచించారని సంగీత దర్శకుడు మున్నా కాశీ గుర్తు చేసుకున్నారు. ఇంకా మల్టీడైమన్షన్స్ వాసు, టి.ప్రసన్నకుమార్, కొడాలి వెంకటేశ్వరరావు, కాదంబరి కిరణ్, మాటల రచయిత నరేష్ అమరనేని తదితరులు మాట్లాడారు.